
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇటీవల తన ప్రియుడు, తమిళ హీరో విష్ణు విశాల్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఏప్రిల్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోనే ఎంజాయ్ చేస్తుంది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా హనీమూన్‌కి వెళ్లలేకపోయిన ఈ ప్రేమ జంట.. పరిస్థితులు చక్కబడే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తొలిసారి ఇన్‌స్టా రీల్స్ వీడియో చేసింది గుత్తా జ్వాల. అందులో విష్ణు విశాల్ బెడ్‌పై నిద్రపోయి ఉండగా.. గుత్తా జ్వాలా అతన్ని హత్తుకొని ముఖంతో ఫన్నీ హవభావాలు పలికిస్తూ ఉంది. బ్యాగ్రౌండ్‌లో లిల్‌గ్రౌండ్ బీఫ్ & గార్ఫీల్డ్ ర్యాన్’నథింగ్ టు డూ సాంగ్ ప్లే అవుతుంది. ‘నా ఫస్ట్ రీల్ ఇది చేయాల్సి వచ్చింది ’అంటూ ఈ వీడియోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది జ్వాలా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుత్తా జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment