తొలిసారి పెళ్లి వీడియో షేర్‌ చేసిన విష్ణు విశాల్‌ | Actor Vishnu Vishal Shares Marriage Video On Wife Gutta Jwala Birthday | Sakshi
Sakshi News home page

Gutta Jwala Marriage Video: పెళ్లి వీడియో షేర్‌ చేసిన హీరో

Published Tue, Sep 7 2021 7:39 PM | Last Updated on Tue, Sep 7 2021 7:48 PM

Actor Vishnu Vishal Shares Marriage Video On Wife Gutta Jwala Birthday - Sakshi

Gutta Jwala And Vishnu Vishal Marriage: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్‌ను ఏప్రిల్ 22న పెళ్లాడిన సంగతి తెలిసిందే. క‌రోనా కారణంగా ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నేడు(సెప్టెంబర్‌ 7) గుత్తా జ్వాల బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త, హీరో విశాల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కాగా వీరి వివాహం జరిగి అయిదు నెలలు గడిచింది. పెళ్లై ఇంతకాలం అవుతున్న భార్య బర్త్‌డే సందర్భంగా వారి వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా తొలిసారి పంచుకున్నాడు. 

చదవండి: పెళ్లిపై స్పందించిన రాశి ఖన్నా, కాబోయేవాడు అచ్చం తనలాగే..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. విశాల్‌ వదిలిన ఈ వీడియో  హ‌ల్దీ వేడుక‌తో పాటు పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన స‌న్నివేశాలు ఉన్నాయి. ఇక రిసెప్షన్‌ పార్టీలో విశాల్‌, జ్వాల కుటుంబ సభ్యులు చేసిన హంగామా మాములుగా లేదు. ఒకరికి మంచి మరొకరు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేశారు.  విజువల్స్‌ ఎఫెక్ట్‌తో క్రియేటివ్‌గా తీసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరికి ఇది సెకండ్‌ మ్యారేజ్‌అయినప్పటికి సెలబ్రెటీలు కావడంతో పెళ్లి చాలా గ్రాండ్‌ జరుపుకున్నట్లుగా కనిపిస్తోంది. కాగా జ్వాలా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్‌ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’

పలు కారణాలతో 2011లో ఈ జంట విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఇక విష్ణు విశాల్ కూడా 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ అనే బాబు కూడా జన్మించాడు. మనస్పర్థల వల్ల 2018లో ఈ జంట విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు విశాల్‌ సోదరి వివాహంలో వీరిద్దరకి తొలిసారిగా కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement