మెగా ఇంట పెళ్లి సందడి ముగిసింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరైన నూతనవధూవరులను ఆశీర్వదించారు.
(ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!)
అయితే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో మూడు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు మెగాస్టార్ దంపతులు, ఉపాసన- రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ జంటగా హాజరయ్యారు. కాక్ టెయిల్ పార్టీతో మొదలై.. హల్దీ, సంగీత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికి ముందే హైదరాబాద్‌లోనూ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అయితే మెగా అభిమానుల కోసం వరుణ్ తేజ్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.
ఓటీటీకి పెళ్లి వీడియో?
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి వీడియోను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకను అభిమానులందరూ చూసేలా ఓటీటీలోకి రానుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ హక్కులను దాదాపు రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ పెళ్లి వేడుకను ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. గతంలోనూ హన్సిక, నయనతార తమ పెళ్లి వీడియోలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: బిగ్‌బాస్: కన్నీళ్లతో ప్రియాంక, శోభల కాళ్లు మొక్కిన అశ్విని..)
Comments
Please login to add a commentAdd a comment