సింధుకు చుక్కెదురు | Chinese Masters: India's challenge ends with PV Sindhu, HS Prannoy's defeats | Sakshi
Sakshi News home page

సింధుకు చుక్కెదురు

Published Sat, Apr 23 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

సింధుకు చుక్కెదురు

సింధుకు చుక్కెదురు

ప్రణయ్, జ్వాల జంట కూడా చైనా మాస్టర్స్ టోర్నీ
 
జియాంగ్‌సు (చైనా): అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయిన భారత స్టార్ పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు 17-21, 19-21తో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ ఇద్దరూ పోటాపోటీగా తలపడినా... కీలకదశలో పోర్న్‌టిప్ పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంది.

పోర్న్‌టిప్ చేతిలో సింధుకిది నాలుగో పరాజయం. ఈ ఏడాది వరుసగా రెండో ఓటమి. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 10-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప ద్వయం 11-21, 14-21తో టాప్ సీడ్ లూ యింగ్-లూ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement