Pranay
-
Amrutha : ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు.. అమృత ఏమన్నారంటే
సాక్షి,హైదరాబాద్ : నల్లగొండలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు (Pranay Murder case) నిందితులకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు శిక్ష విధించింది. ప్రణయ్‌ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి అమృత కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు సంచలన తీర్పుతెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు. 👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
కొడుకుని తలుచుకొని బోరున ఏడ్చిన ప్రణయ్ తండ్రి
-
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్‌ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.ఈవీఎమ్‌లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్
షెన్జెన్: చైనా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 22–20తో ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. ఈ ఏడాది వీరిద్దరు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడగా... రెండు సార్లు ప్రణయ్, రెండుసార్లు చౌ తియెన్ గెలిచారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ (భారత్) 12–21, 14–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–10తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; షి యు కి (చైనా)తో లక్ష్య సేన్; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
‘ఒలింపిక్ సవాల్‌కు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: ‘మేం వరుస విజయాలు సాధిస్తున్నా చాలా మంది ప్రత్యర్థులు కొంత కాలం వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఆటపై అందరి దృష్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇకపై మా ఆటను విశ్లేషించి మాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు’... భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో కూడా భారత పురుషుల జట్టు రజతం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం గెలిచాడు. ఈ నేపథ్యంలో బుధవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆటగాళ్లతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు. వాళ్లని పడగొట్టగలిగాం... గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందామని, ఆ తర్వాత మరింత పట్టుదలగా సాధన చేసి ఆసియా క్రీడలకు వెళ్లినట్లు సాత్విక్ వెల్లడించాడు. చాలా కాలంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మలేసియా జోడీ సొ వుయి యిక్–ఆరోన్ చియాలను ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓడించడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతను అన్నాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం తాము అన్ని విధాలా సిద్ధమవుతామన్న సాత్విక్... అన్నింటికంటే ఫిట్నెస్ కీలకమని వ్యాఖ్యానించాడు. ‘ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు. మా శరీరమే మాకు ప్రత్యర్థి. రాబోయే రోజుల్లో గాయాలు లేకుండా పూర్తి ఫిట్‌గా ఉంటే చాలు. కోర్టులో ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌కు ముందు కొన్ని టోరీ్నలలో మేం ఓడినా పర్వాలేదు. అన్నింటిలోనూ గెలిస్తే అసలు సమయానికి సమస్య రావచ్చేమో’ అని సాత్విక్ అన్నాడు. ఇలాంటి అవకాశం రాదని... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీవ్ర గాయంతో బాధపడుతూనే ప్రణయ్ పతకం కోసం పోరాడాడు. చివరకు అతను విజయం సాధించినప్పుడు కోచ్ గోపీచంద్ సహా సహచరులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గాయం ఉన్నా ఆడేందుకు సిద్ధం కావడం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని ప్రణయ్ చెప్పాడు. ‘నా శరీరం ఎంత వరకు సహకరించగలదో ఫిజియో కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారమే కోచ్ గోపీ సర్‌తో పాటు అందరితో చర్చించాక నేను ఆడేందుకు సిద్ధమయ్యా. నొప్పి ఉన్నా సరే పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆసియా క్రీడల్లో పతకం విలువేంటో తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలతో బాధపడి కీలక సమయాల్లో అవకాశం కోల్పోయా. ఈ జీవితకాలపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావించా. అయితే గాయం తీవ్రత వల్లే టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆడలేదు’ అని ప్రణయ్ చెప్పాడు. నిజానికి తమ స్వర్ణంకంటే ప్రణయ్ కాంస్యం గెలుచుకోవడం తమకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని సాత్విక్ అన్నాడు. అతను పతకం కోసం ఎంత కష్టపడ్డాడో, కీలక సమయాల్లో వెనుకబడి పుంజుకునేందుకు ఎంత పోరాడాడో తమకు తెలుసు కాబట్టి అతను పతకం సాధించాని జట్టంతా కోరుకుందని సాత్విక్ వెల్లడించాడు. ‘వారి వల్లే ఈ ఉత్సాహమంతా’ గోపీచంద్ భారత కోచ్‌గా మారి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక చాలనుకొని తప్పుకోవాలని చాలా సార్లు భావించానని, అయితే యువ ఆటగాళ్ల విజయాలు తనకు ప్రేరణ అందిస్తున్నాయని గోపీచంద్ చెప్పారు. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పతకాలు రావడం ఎంతో ఆనందం కలిగించిందని గోపీచంద్ అన్నారు. ‘నా దృష్టిలో ఆసియా క్రీడల మెడల్ అంటే ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలతో సమానం. అందుకే ఈ ఆనందమంతా. జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. శ్రీకాంత్, లక్ష్య సేన్‌లకు ప్రత్యేక అభినందనలు. ఇక ప్రణయ్ పతకం కోసం ప్రార్థించినంతగా నేను ఎప్పుడూ ప్రార్థించలేదు. ఈ ఒక్కసారి అతడిని గెలిపించమని దేవుడిని కోరుకున్నా. ఒలింపిక్స్‌కు ఇంకా సమయముంది. అయితే దానికి తగిన విధంగా సిద్ధమవుతాం’ అని గోపీచంద్ అన్నారు. అధికారికంగా ఇప్పుడు సాత్విక్–చిరాగ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... గత ఏడాది కాలంగా వారి ఆటను చూస్తే అప్పటి నుంచే వారిని తాను నంబర్‌వన్‌గా భావించినట్లు ఆయన వెల్లడించారు. -
41 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.... భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల్లో పతకాలను ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో చివరిసారి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత్‌కు పతకాలు లభించాయి. 1982 ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్‌లో దివంగత సయ్యద్ మోడీ... పురుషుల డబుల్స్‌లో లెరాయ్ ఫ్రాన్సిస్–ప్రదీప్ గాంధె సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు ఆసియా క్రీడలు జరిగినా పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయారు. చైనా గడ్డపై ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముగింపు పలికారు. సింగిల్స్‌లో ప్రణయ్... డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కేరళకు చెందిన 31 ఏళ్ల ప్రణయ్ రెండో గేమ్‌లోనే గెలవాల్సింది. తొలి గేమ్‌ను సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 20–18తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు. స్కోరును సమం చేసిన లీ జి జియా అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు ప్రణయ్ 18–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 3–0తో లీ షి ఫెంగ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–9తో ఎన్జీ జూ జియి–జాన్ ప్రజోగో (సింగపూర్) జంటపై గెలిచి సెమీఫైనల్ చేరింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరోన్ చియా–సూ వుయ్ యిక్ (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. సింధుకు నిరాశ మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్లో ఓడి రజత పతకం సాధించిన సింధు ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 12–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. -
కాంస్యంతో సరి
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): అసాధారణ ఆటగాడు అక్సెల్సన్కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో ఈ కేరళ స్టార్ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్ ఓడిపోయా డు. శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–18, 13–21, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టులో పరుగు పెట్టిస్తూ స్కోరు సాధించాడు. నెట్‌వద్ద చురుగ్గా పాయింట్లు సాధించిన ప్రణయ్ స్మాష్‌లతో చెలరేగి... తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాత రెండో గేమ్ కూడా ప్రణయ్ ఆధిపత్యంతోనే మొదలైంది. వరుసగా 4–0తో పైచేయి సాధించాడు.ఈ దశలో చేసిన అనవసర తప్పిదాలతో భారత షట్లర్ పాయింట్లను కోల్పోయాడు. పదే పదే ఇవే తప్పిదాలు కొనసాగించడంతో ఆధిక్యాన్ని, ఆపై గేమ్నే కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ప్రణయ్ తప్పిదాలనే ఆసరాగా చేసుకొని పుంజుకున్న థాయ్ ప్రత్యర్థి చివరిదాకా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. -
ప్రణయ్... రన్నరప్‌తో సరి
సిడ్నీ: ఈ ఏడాది రెండో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో కేరళకు చెందిన ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. 90 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 9–21, 23–21, 20–22తో ప్రపంచ 24వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ ఏడాది మేలో మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన ప్రణయ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న ప్రణయ్ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్‌లో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. చివరకు స్కోరు 21–21 వద్ద వెంగ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్ బయటకు వెళ్లింది. అనంతరం ప్రణయ్ నెట్ వద్ద పాయింట్ గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ దూకుడుగా ఆడి 19–14తో ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించాడు. అయితే వెంగ్ హాంగ్ యాంగ్ అసమాన పోరాటంతో కోలుకున్నాడు. స్కోరు 19–17 వద్ద ఏకంగా 71 షాట్ల ర్యాలీ సాగింది. చివరకు ప్రణయ్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో పాయింట్ వెంగ్ ఖాతాలోకి వెళ్లింది. అనంతరం వెంగ్ డ్రాప్ షాట్‌తో పాయింట్ గెలిచి స్కోరును 19–19తో సమం చేశాడు. ఆ తర్వాత ప్రణయ్ పాయింట్ సాధించి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచాడు. కానీ పట్టువదలని వెంగ్ మళ్లీ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత వెంగ్ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజేత వెంగ్ హాంగ్ యాంగ్‌కు 31,500 డాలర్ల (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ప్రణయ్‌కు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో ప్రణయ్
సిడ్నీ: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా ఫైనల్లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత షట్లర్ల మధ్యే జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ వరుస గేముల్లో విజయం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 31 ఏళ్ల ప్రణయ్ 21–18, 21–12తో సహచరుడు ప్రియాన్షు రజావత్‌పై అలవోక విజయం సాధించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్... చైనాకు చెందిన వెంగ్ హాంగ్యంగ్తో తలపడతాడు. మరో సెమీస్‌లో 24వ ర్యాంకర్ హాంగ్యంగ్ 21–19, 13–21, 21–13తో మలేసియాకు చెందిన 17వ ర్యాంకర్ లీ జి జియాపై పోరాడి గెలిచాడు. కాగా హాంగ్యంగ్పై భారత ఆటగాడికి టైటిల్ గెలిచిన అనుభవం వుంది. గత మేలో కౌలాలంపూర్‌లో జరిగిన మలేసియన్ మాస్టర్స్ సూపర్–500 టోర్నమెంట్లో అతన్ని ఓడించే ప్రణయ్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో రెండో టైటిల్‌పై కన్నేసిన భారత షట్లర్ ఇపుడు అడుగు దూరంలో ఉన్నాడు. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్‌కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి తై జు యింగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంగరకలాన్ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్లాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి, కొంగరకలాన్‌లో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పల్లవి, క్రాంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. వండర్లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్లు, చాటింగ్ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్సాప్ చేసింది. అనంతరం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య పల్లవి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసుల అదుపులో ఇద్దరు ఇంటికి వెళ్లకుండా పల్లవి ఫోన్ స్విచ్చాఫ్ చేయడం, ఇదే చివరి మెసేజ్ అని పెట్టడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదిబట్ల పోలీసులకు తెలిపాడు. పల్లవి అత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కని పించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
Pranay Patel-Wildlife photographer: క్లికింగ్
పదమూడు సంవత్సరాల వయసులోనే కెమెరాతో స్నేహం మొదలుపెట్టిన ప్రణయ్‌కి, ఇప్పుడు ఆ కెమెరానే ప్రాణం. అరణ్యానికి సంబంధించిన అద్భుతదృశ్యాలను అమితంగా ఇష్టపడే ప్రణయ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాడు..... పదమూడు సంవత్సరాల వయసులో కెమెరాతో అనుబంధం పెంచుకున్నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రణయ్ పటేల్. అది ఆ వయసుకు మాత్రమే పరిమితమైన ఉత్సాహమై ఉంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ప్రణయ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేవాడు కాదు. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు. ఈ చిత్రాలు జాతీయ,అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. అడవిలో ఫొటోగ్రఫీ అనేది అంతా వీజీ కాదు. ‘మేము రెడీ. ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు’ అన్నట్లుగా ఉండదు అక్కడ. ఏ క్షణంలో ఏ అద్భుతం ఆవిష్కారం అవుతుందో తెలియదు. ఒళ్లంతా కెమెరా కన్నులై ఉండాలి. అడవి నాడి తెలిసిన ప్రణయ్‌కి ఈ విషయం తెలియనిదేమీ కాదు. అందుకే అడవిలోని అద్భుతదృశ్యాలను సమర్థవంతంగా పట్టుకోగలిగాడు. ‘లొకేషన్లోకి ప్రవేశించిన వెంటనే బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసి కెమెరా సెట్ చేసుకోవాలి. బోర్ కొట్టవచ్చు. అలసటగా అనిపించవచ్చు. అయితే మన లక్ష్యం...అద్భుత దృశ్యం అనే విషయాన్ని మరవకూడదు. ఓపికతో కూడిన నిరీక్షణ నన్ను ఎప్పుడూ నిరాశ పరచలేదు’ అంటాడు ప్రణయ్. ప్రణయ్ ఫొటోలతో రూపుదిద్దుకున్న ‘ది వండర్ఫుల్ వైల్డ్‌లైఫ్ ఆఫ్ గుజరాత్’ ‘ది బేర్స్ ఆఫ్ కమ్చట్క–రష్యా’ ‘ది వైల్డ్ ఎర్త్ ఆఫ్ ఆఫ్రికా’... మొదలైన క్యాలెండర్లకు ఎంతో పేరు వచ్చింది. గుజరాత్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే నియమించబడ్డాడు. ‘ఫొటోగ్రాఫర్‌కు దృశ్యజ్ఞానమే కాదు శబ్దజ్ఞానం కూడా ఉండాలి’ అంటున్న ప్రణయ్ శబ్దాల ద్వారా కూడా దృశ్యాలను ఊహించగలడు. వాటిని అందంగా ఛాయాచిత్రాలలోకి తీసుకురాగలడు. తన వెబ్సైట్ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రణయ్ అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో జరిగిన ఫొటోఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. ‘వర్తమానం నుంచే కాదు గతం నుంచి కూడా ఎన్నో అద్భుత విషయాలను నేర్చుకోవచ్చు’ అంటున్న ప్రణయ్ అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలలోని అద్భుతాలను ఆసక్తిగా విశ్లేషిస్తుంటాడు. ‘ప్రతి ఫొటో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది’ అంటాడు ప్రణయ్. స్కూల్‌బ్యాగ్ మోసుకెళ్లాల్సిన వయసులో కెమెరా బ్యాగు మోసుకెళుతున్న ప్రణయ్‌కి వెక్కిరింపులు ఎదురయ్యాయి. ‘ఇక నీకు చదువు ఏం వస్తుంది!’ అని ముఖం మీదే అన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ మాటలు విని తాను ఎప్పుడూ బాధపడలేదు. వెనక్కి తగ్గలేదు. కెమెరాతో స్నేహం వీడలేదు. దేశవిదేశాలలో ప్రణయ్ చేసిన ఫొటోగ్రఫీ టూర్లు వంద దాటాయి. ‘ప్రతి టూర్‌కు సంబంధించిన అనుభవాలను ఒక పుస్తకంగా రాసుకోవచ్చు’ అని మురిసిపోతుంటాడు ప్రణయ్. ‘కెమెరా పట్టుకోగానే అద్భుతాలు చోటుచేసుకోవు. పర్ఫెక్ట్ షాట్ కోసం రోజులే కాదు సంవత్సరం పాటు ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటాడు ప్రణయ్. ఫొటోగ్రఫీ గురించి ఓనమాలు తెలియని వారే కాదు, ఆ విద్యలో కొమ్ములు తిరిగిన ఫొటోగ్రాఫర్లు కూడా ప్రణయ్‌ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. 25 సంవత్సరాల ప్రణయ్ పటేల్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు ప్రణయ్. ఈ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. -
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్‌కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్‌లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్‌ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ
సాక్షి, యాదగిరిగుట్ట/వలిగొండ : ఉమ్మడి జిల్లాలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. నాడు నరేశ్, ప్రణయ్‌లు పరువుకు బలి కాగా అదే తరహాలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎరుకల రామకృష్ణను దారుణంగా మట్టుబెట్టారు. ఆరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు యువకులు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ ఇంటి వద్ద చదువుకుని.. సిద్దిపేట జిల్లా లకుడారంలో పరువు హత్య కాబడిన రామకృష్ణ వలిగొండ మండలం లిగంరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముండేవాడు. ఇతడి స్వస్థలం హుజూర్నగర్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఊరైన లింగరాజుపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.రామకృష్ణకు తల్లి కలమ్మ, చెల్లి నాగలక్ష్మి, తమ్ముడు రమేష్ ఉన్నారు. రామకృష్ణ ఇంటర్ వరకు వలిగొండలో చదువుకున్నాడు. 2016వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించి కొంతకాలం వలిగొండలోనే విధులు నిర్వహించారు. 2019లో యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఎవరీ వెంకటేశ్ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వెంకటేష్ ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటగా పల్లెపాటి వెంకటేష్ సొంత గ్రామమైన గౌరాయపల్లిలో మస్కూరిగా విధులు నిర్వహించాడు. వెంకటేష్ 10వ తరగతి పూర్తి కాకపోవడంతో గ్రామంలోనే వీఆర్ఏగా పని చేశాడు. ఈ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి వీఆర్ఓగా ఉద్యోగం సాధించాడు. అనంతరం రాజాపేట తహసీల్దార్ కార్యాలయంలో కాల్వపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. సొంత గ్రామమైన గౌరాయపల్లి నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు వచ్చి ఇల్లు నిర్మించుకున్నాడు. ఐదేళ్లుగా వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె భార్గవి ఉన్నారు. భార్గవి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెంకటేష్, ఆయన భార్య, కుమారులు గుట్టలో ఉంటున్నారు. వెంకటేష్ వీఆర్ఓ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గుప్త నిధుల తవ్వకాల్లో.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా ఉంటూ పోలీస్ వాహనం నడుపుతున్న సమయంలో రామకృష్ణకు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో గుప్త నిధులు తవ్వకాల సమయంలో కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో గుప్త నిధులు తవ్వకాలు జరిగే బృందంలో హోంగార్డు రామకృష్ణపై కేసు నమోదు కాగా.. ఆ కేసులో ని«ంధితుడుగా ఉన్న వీఆర్ఓ వెంకటేష్‌ను ఆ కేసులో నుంచి అప్పట్లో పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల కేసులోనే రామకృష్ణను హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటర్ నుంచే.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు భార్గవి ఇంటర్ మొద టి సంవత్సరం చదువుతున్న క్రమంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో రామకృష్ణ స్థానికంగా ఉండే పోలీస్ క్వాటర్స్‌లో ఉండే వాడు. ఆ తర్వాత పోలీస్ క్వాటర్స్‌లో గదిని ఖాళీ చేసిన రామకృష్ణ ప్రేమించిన భార్గవితో మరింత దగ్గర అయ్యేందుకు శ్రీరాంనగర్‌లో భార్గవి తండ్రి వీఆర్ఓ వెంకటేష్ నిర్మించుకున్న ఇంటికి ముందు ఉన్న ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ తరుణంలోనే వెంకటేష్, రామకృష్ణలు ఇ ద్దరు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. ఒప్పుకోకున్నా.. రామకృష్ణ, భార్గవిల వివాహం 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో జరిగింది. అంతకు నెల రోజుల ముందే భార్గవి, రామకృష్ణల ప్రేమ వ్యవహారం వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో వెంకటేష్ తన కూతురు భార్గవిని మందలించాడు. ఈ సమయంలో తనకు రామకృష్ణ అంటే ఇష్టమని తండ్రి వెంకటేష్‌తో భార్గవి చెప్పింది. కళాశాలకు వెళ్లనివ్వకుండా వెంకటేష్ కుమార్తె భార్గవిని ఇంట్లోనే ఉండమన్నాడు. రామకృష్ణపై ఉన్న ప్రేమతో భార్గవి 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో వివాహం చేసుకున్నారు. 10రోజుల క్రితం గుట్టలోనే.. రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భువనగిరితో పాటు యాదగిరిగుట్టలో భూములు అమ్మకా లు, కొనుగోలు చేసేందుకు వచ్చేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. 10రోజుల క్రితం ఎకరం భూమి కావాలని ఓ వ్యక్తితో యాదగిరిగుట్టకు వచ్చాడని తెలిసింది. అంతే కాకుండా రెండు, మూడు రోజుల క్రితం పట్టణంలోని గాయత్రి హోటల్లో భోజనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్లుగా హోంగార్డుగా యాదగిరిగుట్టలోనే విధులు నిర్వహించిన రామకృష్ణకు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య మిర్యాలగూడ అర్బన్: 2018 సెప్టంబర్ 14న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. తిరునగరు మారుతీరావు కూతురు అమృత మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ స్కూల్లో విద్యనబ్యసించే నుంచి ప్రేమించకున్నారు. ఇద్దరూ ఒక్కటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పరువు పోయిందని భావించి అప్పటినుంచి అదును కోసం వేచి చూశాడు. అమృత ఐదు నెలల గర్భవతి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భర్త, అత్తతో కలిసి వచ్చింది. వైద్య పరీక్షలు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన సుపారీ కిల్లర్ పదునైన కత్తితో ప్రణయ్‌ను దారుణంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీరావు కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ మందిరంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నమ్మించి.. మట్టుబెట్టి.. ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లలో రజక కులానికి చెందిన అంబోజు నరేష్, లింగరాజుపల్లిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుమ్మల స్వాతి ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో భయపడి తలదాచుకోవడానికి 2016లో ముంబాయికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు నమ్మించి ఇద్దరినీ స్వగ్రామానికి రప్పించారు. వారం రోజులకు స్వాతి తన ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన ఐదారు రోజుల్లో అంబోజు నరేష్ అదృశ్యం అయ్యాడు. దీంతో నరేష్ తల్లిదండ్రులు భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతి కుటుంబంపై అనుమానం ఉండడంతో అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాసంఘాల కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నరేష్‌ను అదే ఏడాది మే నెలలో కిడ్నాప్ చేసి లింగరాజుపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద హత్య చేసి దహనం చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించారు. పోలీసులు ఆ కోణంలో తిరిగి విచారణ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నిలబడలేదు. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
ప్రణయ్ చివరి కోరిక ఇదే: వైరల్
సాక్షి, అనంతపురం : తమ కుమారుడి మృతిపై చాలా అనుమానాలున్నాయని కెనడాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు యువకుడు ప్రణయ్ తండ్రి నారాయణ స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో అఖిల తన కొడుకును మోసగించిందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడే వద్దంటూ మాయ చేసిందని, అఖిల, ఆమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు యువతి కుటుంబంపై న్యాయ పోరాటానికి దిగుతామని చెప్పారు. కాగా, ప్రేమించిన యువతి చేసిన మోసాన్ని తట్టుకోలేక కెనడాలో అనంతపురానికి చెందిన తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడు నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణం తీసుకున్నాడు. ప్రేయసి తనను మోసం చేసిన వైనాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో ఉంచాడు. ఆమె తనకంటే ముందు మరో ఆరుగురిని మోసం చేసిందని వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్లో చివరి కోరిక కోరాడు. తన బాడీని పరిశోధనలకు వాడేలా చూడాలని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
-
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
సాక్షి, నల్గొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమాపై పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్‌టౌన్ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.(ఏడుపు కూడా రావడం లేదు: అమృతా ప్రణయ్) ఈ క్రమంలో అనేక పరిణామాలు, జైలు శిక్ష అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో జూన్ 21 ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ..‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) -
అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..
సాక్షి, హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది వివాదాలు. ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ మీడియాలో ఉండే వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేస్తూ.. 'ఓ తండ్రి తన కూతురుని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇందులో చూపించబోతున్నా. ఫాదర్స్ డే రోజున ఒక విషాదభరితుడైన నాన్న పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నా' అంటూ వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై అమృతా ప్రణయ్ స్పందించినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ‘పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్ గోపాల్ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు' అంటూ అమృత వ్యాఖ్యలు చేశారు. చదవండి: అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్ అయితే అమృత చేసిన వ్యాఖ్యలపై వర్మ తాజాగా స్పందిస్తూ.. మొదటగా నేను రిలీజ్ చేసిన పోస్టర్లో మర్డర్ ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను. కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు. నేను కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిగా చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా మరెవరైనా సరే బాధ అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నా చిత్తశుద్ధితో వారి బాధలను గౌరవిస్తూ.. మర్డర్ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తున్నట్లు' వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ వరుసపెట్టి ట్వీట్స్ చేశారు. -
అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్
ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషాదగాథకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ ఉంచారు. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much ..Launching the poster of a SAD FATHER’S film on HAPPY FATHER’S DAY #MURDERlove pic.twitter.com/t5Lwdz3zGZ — Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2020 -
ఆ తర్వాతే ప్రణయ్ గురించి తెలిసింది
నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. యం.ఎన్.ఆర్. చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాల గురించి బాలాదిత్య ఇలా ముచ్చటించారు. సినిమాలతో నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. 2009లో నటించిన ‘1940లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. తర్వాత సినిమాలకు కావాలని గ్యాప్ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ కోసం దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో నాపై చాలా అపోహలు వచ్చాయి. ఇండస్ట్రీ వదిలి సింగపూర్, మలేషియా వెళ్లిపోయానని కూడా వదంతులు వచ్చాయి. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నాను. ‘చంటిగాడు’ సినిమా టైంలో నాకు 17ఏళ్లు. తర్వాత అమ్మకిచ్చిన మాటకోసం చదవడానికి బ్రేక్ తీసుకున్నాను. ఐదేళ్ల గ్యాప్‌లో చాలామంది నన్ను మర్చిపోయారు. మళ్లీ ఇండస్ట్రీకి వచ్చానని తెలిసిన వాళ్లందరికీ తెలియజేశాను. నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకి ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించాను. తర్వాత నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనువడు’ సినిమాలో కీలక పాత్రను పోషించాను. అప్పుడు ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు మా క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. పూర్తి సినిమాటిక్‌గా చిత్రీకరించారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు. సెకండాఫ్‌లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది. పాపులారిటీ ఉన్న వ్యక్తుల బయోపిక్‌లో నటిస్తే వారిగురించి నటించే ముందు మొత్తం తెలుసుకుంటాం. కానీ ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్లో నటిస్తున్నాను. ఈటీవీలో వచ్చే ఛాంపియన్ కార్యక్రమం ద్వారా నేను మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాను. (ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతిరావు ఆత్మహత్య) తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు టీవీ, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. పెద్దవాళ్లే బుల్లితెరపై కనిపిస్తున్నారు. మనం కన్పిస్తే తప్పేముంది అనుకుని ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. చిరంజీవి, నాగార్జున లాంటి వారు సైతం టీవీ షోస్ చేస్తున్నారు. నటించేవారికి టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్, సినిమా ఏదైనా ఒకటే. ఏదైనా కెమెరా ముందు నటించాల్సిందే. ప్రస్తుతం తమిళ్లో రాసాతి అనే సీరియల్లో నటిస్తున్నాను. సన్ నెట్ వర్క్ ప్రైమ్ టైంలో ఆ సీరియల్ వస్తుంది. సీరియల్స్‌లో కూడా ప్రేక్షకులు రొటీన్ కార్యక్రమాలు చూడటం లేదు. కొత్త కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఆర్టిస్ట్‌గా ఆ సీరియల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకుంది చెన్నైలో. ఆ కారణంగా తమిళ్ కూడా నాకు వచ్చు. ఇటీవల జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సీరిస్ లో చేశాను. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు. -
మారుతీ రావు పోస్ట్‌మార్టం పూర్తి ...
-
నిందితుడు, బాధితుడు మారుతీరావే
సాక్షి, మిర్యాలగూడ : ఒక ప్రేమ వివాహం.. రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అటు కూతురు కుటుంబం.. ఇటు తన కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఈ సంఘటనలో నిందితుడు, బాధితుడు కూడా మారుతీరావే కావడం గమనార్హం. మిర్యాలగూడలో రియల్టర్‌గా, బిల్టర్‌గా పేరు సంపాదించుకున్న తిరునగరు మారుతీరావుకు ఒక్కతే కూతురు అమృత. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు యుక్తవయసు వచ్చే నాటికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకు నచ్చిన వ్యక్తి పెరుమాళ్ల ప్రణయ్‌ని 2018 జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్ మందిరంలో ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు చేసుకున్న ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో అల్లుడైన ప్రణయ్‌ని 2018 సెప్టెంబర్ 14వ తేదీన దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం.. ఏడు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. తిరిగి బెయిల్‌పై 2019 ఏప్రిల్ 28వ తేదీన మారుతీరావు మిర్యాలగూడకు వచ్చాడు. తన కూతురు అమృత భర్తను పోగొట్టుకున్న బాధలో అత్తగారింట్లోనే ఉంది. తన కుమారుడు ప్రణయ్‌ని అల్లారుమద్దుగా పెంచుకున్న పెరుమాళ్ల బాలస్వామి దంపతులు కొడుకు హత్యకు గురైన బాధ నుంచి తేరుకోలేకపోయారు. కోడలు అమృతకు పుట్టిన కుమారుడికి నిషాన్ ప్రణయ్ అని పేరుపెట్టుకొని తన కొడుకును చూసుకుంటున్నారు. అయినా ఆ కుటుంబం ప్రణయ్ లేడనే బాధ నుంచి తేరుకోలేదు. కాగా ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య ఒంటరైంది. అటు తన కూతురు అమృత కుటుంబం, ఇటు తన కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక్క ప్రేమ వివాహం రెండు కుటుంబాలను చిధ్రం చేసింది. (అదే మారుతీరావు ప్రాణాల మీదకు తెచ్చిందా?) -
అవి తిన్నందువల్లే మారుతీరావు మృతి..!
సాక్షి, మిర్యాలగూడ: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరునగరు మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక ప్రాథమిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) కాగా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాం నుంచి ఫోరెన్సిక్ వైద్యులు విస్రా శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు.. బలవన్మరణానికి పాల్పడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28న బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగించాడు. అయినా ఆమె నుంచి సానుకూల స్పందన రాలేదు.(మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?) ఇందుకు తోడు కోర్టు కేసు, ఆస్తి పంపకాలు, కూతురి కులాంతర వివాహం కారణంగా వేధింపులు తదితర ఒత్తిళ్ల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోమవారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో.. ఆయనను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఓవైపు కూతురు దూరమై.. ఇప్పుడు భర్త కూడా శాశ్వతంగా తనను వదిలిపోవడంతో మారుతీరావు భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.(మారుతీరావు ఆత్మహత్య!) -
మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?
సాక్షి, మిర్యాలగూడ: మారుతీరావు ఆత్మహత్య.. అనేక కారణాలను వెతుకుతుంది. అప్పట్లో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యాడు. మిర్యాలగూడలో తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మధ్యవర్తులను సైతం ఆమె వద్దకు పంపాడు. అయినా ఒప్పుకో ని అమృత మధ్యవర్తులతో పాటు మారుతీ రావుపై కూడా కేసు పెట్టింది. దాంతో మరోసారి జైలుకు వెళ్లాడు. కాగా ఎన్ని ఇబ్బందులు పడినా తన కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అంశం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ప్రణయ్ కేసు ఈనెల నుంచి జిల్లా కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. మూడు రోజుల పాటు వరుసగా కోర్టుకు వెళ్లిన మారుతీరావు మంచి న్యాయవాదిని పెట్టుకోవాలని భావించినట్లు తెలి సింది. అయినా ప్రణయ్ హత్య సంచలనం కలగడం వల్ల తనకు శిక్ష పడితే జైలులో చనిపోయే కంటే ముందే మరణించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆస్తి వివాదమా... మనస్తాపమా? ప్రణయ్ హత్య అనంతరం మారుతీరావుతో ఆయన తమ్ముడు శ్రవణ్‌కు ఆస్తి వివాదాలు వచ్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్యకు ముందే తన ఆస్తిలో తన తమ్ముడు శ్రవణ్ పేరున కొంత, మిగతా ట్రస్టుకు వీలునామా రాసినట్లు సమాచారం. కాగా హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత వీలునామాను మరోసారి మార్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో సంబంధం లేకున్నా తనపై కేసులు రావడం, జైలుకు వెళ్లడంపై శ్రవణ్ తన అన్న మారుతీరావుపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా మారుతీరావు స్పందించకుండా తన పని తాను చేసుకుంటుండగా కొంత కాలంగా ఇద్దరికి వివాదం కొనసాగుతుందని సమాచారం. ఆ క్రమంలోనే ఆస్తి విషయంలో మూడు నెలల క్రితం వీలునామాను తిరగరాసినట్లు తెలిసింది. రెండోసారి తిరగరాసిన వీలునామాలో శ్రవణ్ పేరు లేకుండా తన భార్య పేరున కొంత ఆస్తి, ట్రస్టుకు కొంత రాసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆస్తి వీలునామా తన ప్రాణాల మీదికి తెచ్చిందా? తన కూతురు తన వద్దకు రాలేదనే మనస్తాపమా? హత్య కేసులో శిక్ష పడుతుందనే ఆందోళనా? ప్రణయ్‌ని హత్య చేయించిన ప్రశ్చాత్తాపమా? అనే విషయాలు తేలాల్సి ఉంది. సుపారీ గ్యాంగ్ వేధింపులు కూడా కారణమేనా? ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో చేతులు కలిపిన మారుతీరావును ఆ గ్యాంగ్ సభ్యులు కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు సమాచారం. మారుతీరావుతో పాటు నిందితుల్లో ముఖ్యులుగా ఉన్న అస్గర్‌అలీ, అబ్దుల్భారీలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, ఇంకా అదనంగా ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల్లో ఏ 1 నిందితుడిగా మారుతీరావు ఉండగా ఏ 2 గా సుభాష్‌శర్మ, ఏ 3గా అస్గర్‌అలీ, ఏ 4గా అబ్దుల్ భారీ, ఏ 5గా ఎండీ. ఖరీం, ఏ 6గా తిరునగరు శ్రవణ్, ఏ 7గా శివ, ఏ 8గా నిజాం ఉన్నారు. (ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు) -
ప్రణయ్, మారుతీరావు ఇళ్ల వద్ద భారీ భద్రత
సాక్షి, మిర్యాలగూడ టౌన్: తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో మారుతీరావు పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన పేరుమళ్ల ప్రణయ్‌ను ఇస్లాంపురలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద హత్య చేయించాడు. ఈ కేసులో ఎ–1 ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లో గల ఆర్య సమాజ భవనంలో మృతి చెందడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం మిర్యాలగూడలోని పేరుమళ్ల ప్రణయ్ నివాసం వద్ద పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏఎస్ఐ గౌసు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్ కుటుంబానికి 8 మంది గన్మెన్లను ఏర్పాటు చేయగా మారుతీరావు చనిపోవడంతో మరి కొంతమంది పోలీస్‌లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు మృతదేహం పట్టణంలోని రెడ్డికాలనీలో గల నివాసానికి వస్తుండటంతో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. (‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’) -
మిస్టరీగా మారుతీరావు మరణం!
-
మిస్టరీగా మారుతీరావు మరణం!
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు నిన్నఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు. మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) కాగా సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటులో ఉన్న చేతి రాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వైపు ప్రణయ్ హత్యకేసు ట్రయల్‌కు రావడంతో మారుతీరావు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా కుటుంబంలో గొడవల కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) -
గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’ అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) మీడియా ఊహించి రాయొద్దు.. మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్ ఖండించారు. తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే ప్రణయ్ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని తెలిపారు. మీడియా ఊహించి రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్న ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. సూసైడ్ నోట్లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్ పేర్కొన్నారు. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషంతాగి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు రేపు (సోమవారం) మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మారుతీరావు నిన్నరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. (అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. మారుతీరావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. (అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) ఆ మృతదేహం ఎవరిది? తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. (అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్) -
జాబిలమ్మ ముస్తాబు
ప్రణయ్, జారాఖాన్ జంటగా శివనాగేశ్వరరావు (శివాజీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాబిలమ్మ’. కె. హరిరత్నం నిర్మిస్తున్నారు. చిత్రకథానాయకుడు ప్రణయ్ పుట్టినరోజును గురువారం సంస్థ కార్యాలయంలో జరిపారు. శివాజీ మాట్లాడుతూ– ‘‘జాబిలమ్మ’ సినిమాని దాదాపు 15రోజులు మురికివాడలో చిత్రీకరించాం. మంచి నటన కనబరిచారు ప్రణయ్. ఇందులోని 5 మెలోడి పాటలకు ఎంఎల్ రాజు చక్కని సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘115మందికి ఆడిషన్స్ చేయగా ప్రణయ్ హీరోగా ఎంపికయ్యాడు. దీపావళికి టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు హరిరత్నం. ‘‘నా పాత్ర మాస్, క్లాస్‌కు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు ప్రణయ్. -
అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఎవరూ లేని సమయంలో అమృత ఇంట్లోకి ప్రవేశించి ఓ పోస్ట్ కవర్‌ను పెట్టి వెళ్లాడు. ఆ లేఖను తెరచి చూడగా అందులో ఓ వ్యక్తి కలర్ ఫోటో, తన శరీర కొలతల వివరాలు ఉన్నాయి. అతని పుట్టిన తేది, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు లేఖలో రాసి ఉన్నాయి. సీసీ కెమెరా పుటేజీలో ఆగంతకుడు గేటు తీసి లోపలికి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ లేఖను ఇంట్లో పెట్టి వెళ్లాడు. అయితే ఎందుకు ఆ వ్యక్తి లేఖను పెట్టి వెళ్లాడు? ఆ వ్యక్తి ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
‘ప్రణయ్ పేరుతో నిరభ్యంతర చట్టం’
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు అరికట్టడానికి నిర్భయ చట్టం తెచ్చినట్లే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వారి భద్రత కోసం నిరభ్యంతర చట్టాన్ని ప్రణయ్ పేరుతో తీసుకురావాలని కుల అసమానత నిర్మూలనా పోరాట సమితి(కేఎఎన్‌పీఎస్) వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పెరుమాళ్ల ప్రణయ్ తొలి వర్థంతి కార్యక్రమం మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కుల అహంకారం కారణంగా మరణించిన పలువురికి నివాళులర్పించారు. సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మయ్య అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకున్న వారిపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టాలన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహాన్ని సహించలేని అమృత తండ్రి మారుతిరావు సుఫారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడని, ఈ దారుణ ఘటన జరిగి సెప్టెంబర్ 14 నాటికి ఏడాది గడిచిందని తెలిపారు. ప్రణయ్ వర్ధంతి సందర్భంగా పోరాట సమితిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కొమ్ము సురేందర్, కందిక కోమల, పూజ, గుమ్మడి రత్నం, శివబి.యాదయ్య, చక్రవర్తి, దేవా, లక్ష్మయ్య, గోవింద్, లక్ష్మణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాయ్’పై ప్రణయ్, సాయిప్రణీత్ ధ్వజం
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)కు తమ పేర్లను ప్రతిపాదించకపోవడంపై భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికార వర్గాలపై వారు విమర్శల దాడికి దిగారు. చైనా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మంగళవారం నుంచి జరుగనుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మలేసియా, ఇండోనేసియా నుంచి తమకంటే తక్కువ ర్యాంకు ఆటగాళ్లు టోర్నీ బరిలో దిగుతుండగా... ‘బాయ్’ ఉదాసీనత కారణంగా తా ను, సాయిప్రణీత్ అవకాశం కోల్పోయినట్లు ప్రణయ్ విమర్శించాడు. దీనిపై ‘బాయ్’ స్పందన మాత్రం వేరుగా ఉంది. బ్యాడ్మింటన్ ఆసియా (బీఏ) కోరిన మేరకు తాజా ర్యాంక్‌ల ప్రకారం పురుషుల, మహి ళల సింగిల్స్‌లో ఇద్దరేసి ఆటగాళ్లను ప్రతిపాదించా మని ‘బాయ్’ చెబుతోంది. మరోవైపు పలు టోర్నీలకు ఆటగాళ్ల ఎంట్రీలను పంపడంలో, వారి ప్రయా ణ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ‘బాయ్’ తీరు ఘోరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. -
‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట తమ పెళ్లి రోజును పురస్కరించుకుని అమృత తన ఫేస్బుక్లో ఒక ఫొటోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు. ‘నీకు (ప్రణయ్) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మన వివాహమై నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజు నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. లవ్యూ లల్లు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను‘అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం అమృత మగబిడ్డకు జన్మినిచ్చినట్లు మరో పోస్టు పెట్టారు. -
హైదరాబాద్ ఓటమి
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు 3–4తో ఢిల్లీ డాషర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రణయ్ (ఢిల్లీ) 15–10, 9–15, 15–12తో రాహుల్ యాదవ్‌పై గెలుపొందగా, డాషర్స్ ‘ట్రంప్’ అయిన పురుషుల డబుల్స్‌లో చయ్ బియావో–జొంగ్జిత్ ద్వయం 8–15, 15–9, 15–8తో అరుణ్–ఇసారా (హైదరాబాద్) జంటపై నెగ్గింది. దీంతో ఢిల్లీ 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మహిళల సింగిల్స్‌ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా సింధు 15–11, 15–9తో కొసెట్స్కయా (ఢిల్లీ)పై విజయం సాధించింది. రెండో పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో (ఢిల్లీ) 15–6, 15–11తో గాల్జౌను ఓడించడంతో 4–2తో డాషర్స్ విజయం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో కిమ్ స రంగ్–ఇయోమ్ (హైదరాబాద్) జంట 15–7, 15–12తో వాంగ్ సిజి– చియా సిన్ లీ జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 5–0తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై జయభేరి మోగించింది. 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ ఆడుతుంది. -
అమృతపై అసభ్య కామెంట్స్.. యువకుడు అరెస్ట్
సాక్షి, నల్గొండ : పరువుహత్యకు బలైన ప్రణయ్ భార్య అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్(25) అనే యువకుడు ప్రణయ్ హత్య విషయంలో ఫేస్బుక్ వేదికగా అమృత వర్షినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఈశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. -
అనుమతి లేనిదే ప్రణయ్ విగ్రహం వద్దు
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో పెరుమాళ్ల ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణయ్ భార్య అమృత వర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్ ఏవీ. శేషసాయి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రణయ్ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ సీఐ, మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా టూటౌన్ సీఐ ప్రణయ్ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోరింది. మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. మిర్యాలగూడ లోని మారుతీరావు కార్యాలయం, నాగార్జుననగర్‌లో ఉన్న సొంతింటిలో సోదాలు నిర్వహించారు. పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికారుల అండతో కోట్లాది రూపాయలు సంపాదించినట్లు వస్తున్న ఆరోపణలను నివృత్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సుపారీ గ్యాంగ్ కు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా డీఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మారుతీరావుకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు చేశారు. మారుతీరావు రాయించుకున్న ఒక వీలునామాతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. సోదాల్లో లభించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సోదాల్లో సీఐ లు ధనుంజయ్, శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కస్టడీలో ప్రణయ్ హత్యకేసు నిందితులు ప్రణయ్ హత్య కేసులోని ఏడుగురు నిందితులను శుక్రవారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసులోని నిందితులు మారుతీరావు, అస్గర్‌అలీ, బిహార్‌శర్మ, అబ్దుల్ బారి, శ్రవణ్, కరీం, శివలను విచారిస్తున్నారు. ప్రణయ్‌ని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన సభ్యులు ఎవరు? రెక్కీ ఎన్నిసార్లు నిర్వహించారు? హత్యకు డీల్ ఎవరికి ఎంత? తదితర విషయాలను రా బట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులు పాటు పోలీస్ కార్యాలయంలో విచారించనున్నట్లు సమాచారం. -
నా తండ్రికి మరణ శిక్ష పడేలా చేశా..
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త, తమిళనాడులో హత్యకు గురైన శంకర్ భార్య కౌసల్య డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత వర్షిణిని పరామర్శించిన ఆమె కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నేను ఒక దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టి నా తల్లిదండ్రులు, బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్‌ను హత్య చేశారని, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయని చెప్పారు. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశానని, అందుకు జిల్లా కోర్టు నా తండ్రితోపాటు మరో ఐదుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ కారగార శిక్ష విధించిందని చెప్పారు. జిల్లా కోర్టు నా తండ్రికి రెండుసార్లు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు. నిందితులు 58 సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని అన్నారు. ప్రభుత్వం నాకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నా తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. నాభర్త పేరున శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్టును ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతోపాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు, రక్షణ కల్పించడంతోపాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రణయ్ భార్య అమృత వర్షిణికి పూర్తి రక్షణ కల్పించాలని ఆమెడిమాండ్ చేశారు. కేవీపీఎస్ అధ్యక్షుడు కె.భాస్కర్, ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబాబు,కృపాసాగర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణయ్ కేసు: కాంగ్రెస్ నేతను సస్పెండ్ చేస్తున్నాం!
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విమలక్క పరామర్శ ప్రణయ్ భార్య అమృతను, అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం కంటే గుణం గొప్పదన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనినైనా శాంతితో జయించాలి తప్ప ద్వేషంతో కాదని హితవు పలికారు. ప్రణయ్ కుటుంబానికి సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమికులను విడదీసి చంపే హక్కు ఎవరికి లేదన్నారు. -
ప్రణయ్ అంతిమయాత్ర
-
భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత
-
ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే.
న్యూఢిల్లీ: గతేడాది పీవీ సింధు (భారత్), నొజోమి ఒకుహారా (జపాన్) మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్ బ్యాడ్మింటన్ చరిత్రలో గొప్ప మ్యాచ్‌గా నిలిచిపోయింది. 110 నిమిషాలపాటు జరిగిన ఆ సమరంలో ఒకుహారా గెలిచినప్పటికీ సింధు అద్వితీయ పోరాటంతో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంతా సాఫీగా సాగితే మూడో సీడ్ సింధు, ఎనిమిదో సీడ్ ఒకుహారా ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే తలపడతారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 5 వరకు చైనాలోని నాన్జింగ్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు... రెండో రౌండ్లో ఫిత్రియాని (ఇండోనేసియా) లేదా లిండా జెట్చిరి (బల్గేరియా)లతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) ఎదురయ్యే చాన్స్ ఉంది. మరోవైపు గతేడాది కాంస్యం నెగ్గిన భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్‌కు కూడా తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో ఆమె సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్) లేదా అలియి దెమిర్బాగ్ (టర్కీ)తో ఆడుతుంది. పదో సీడ్ సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) తారస పడే అవకాశముంది. ఈ అడ్డంకిని దాటితే సైనాకు క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఎదురుపడే చాన్స్ ఉంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ బరిలోకి దిగనున్నారు. -
ప్రణయ్ పంట పండింది!
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ కోసం జరిగిన వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్‌పాట్ కొట్టాడు. సీజన్–2లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలవడంతో పాటు గత ఏడాది కాలంలో ఉత్తమ ప్రదర్శనతో వేగంగా దూసుకొచ్చిన ప్రణయ్‌ను కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ పెద్ద మొత్తంతో సొంతం చేసుకుంది. ప్రణయ్‌కు వేలంలో రూ. 62 లక్షలు దక్కాయి. గత సీజన్లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. మరో సింగిల్స్ స్టార్ అజయ్ జయరామ్ కొత్త జట్టు నార్త్ ఈస్టర్స్ వారియర్స్‌కు (రూ.44 లక్షలు) వెళ్లాడు. గతంతో పోలిస్తే ఈ సారి అనూహ్యంగా డబుల్స్ స్పెషలిస్ట్‌లకు కూడా భారీ మొత్తం పలకడం మరో విశేషం. వేలంలో ప్రతీ జట్టు గరిష్టంగా పదేసి మంది షట్లర్లను ఎంచుకుంది. ఇందు కోసం నిర్దేశించిన రూ. 2.40 కోట్ల గరిష్ట మొత్తంలో అత్యధికంగా హైదరాబాద్ హంటర్స్ రూ. 2.39 కోట్లను ఖర్చు చేసింది. డిసెంబర్ 22నుంచి జనవరి 14 వరకు పీబీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం రూ. 6 కోట్ల ప్రైజ్‌మనీలో విజేతకు రూ. 3 కోట్లు లభిస్తాయి. సోమవారం జరిగిన వేలం కార్యక్రమంలో పీబీఎల్ డైరెక్టర్ ప్రసాద్ మంగినపూడి, ‘బాయ్’ కార్యదర్శి (టోర్నమెంట్స్) కేసీ పున్నయ్య చౌదరి, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొన్నారు. -
కశ్యప్‌పై ప్రణయ్ పైచేయి
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సొంతం కాలిఫోర్నియా: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ తన కెరీర్లో నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ప్రణయ్ చాంపియన్‌గా నిలిచాడు. తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21–15, 20–22, 21–12తో విజయం సాధించాడు. గతంలో ప్రణయ్ వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. రెండేళ్ల విరామం తర్వాత ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ ఆడిన 30 ఏళ్ల కశ్యప్ 65 నిమిషాలపాటు పోరాడినా తనకంటే మెరుగైన ఫిట్నెస్ ఉన్న ప్రణయ్ ధాటికి ఎదురు నిలువలేకపోయాడు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరూ మూడేళ్ల తర్వాత ముఖాముఖిగా తలపడ్డారు. తొలి గేమ్‌లో కశ్యప్ 7–1తో ముందంజ వేసినా ఆ తర్వాత ప్రణయ్ దూకుడుకు వెనుకబడ్డాడు. స్కోరును 15–15 వద్ద సమం చేసిన ప్రణయ్ ఈ దశలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో కశ్యప్ తేరుకొని మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఒకదశలో స్కోరు 15–15తో సమంగా నిలిచినా... కశ్యప్ నిలకడగా పాయింట్లు గెలిచి 20–18తో పైచేయి సాధించాడు. ప్రణయ్ రెండు పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసినా... కశ్యప్ మళ్లీ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో 24 ఏళ్ల ప్రణయ్ ఆరంభం నుంచే జోరు కనబరిచాడు. 13–7తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ కేరళ ఆటగాడు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
యూఎస్ ఓపెన్ మనదే
పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్, ప్రణయ్ న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ సాధించేందుకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ మరో విజయం దూరంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో కశ్యప్‌తోపాటు భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్‌కు చేరడంతో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత్ ఖాతాలో చేరడం ఖాయమైంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌లో కశ్యప్ 15–21, 21–15, 21–16తో క్వాంగ్ హీ హియో (కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్ 21–14, 21–19తో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను ఓడించాడు. ఈ ఏడాది ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్‌లో సాయిప్రణీత్, శ్రీకాంత్ టైటిల్ కోసం తలపడ్డారు. 30 ఏళ్ల కశ్యప్ తన కెరీర్లో రెండు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్ సాధించగా... ఆ రెండు టైటిల్స్ భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ టోర్నీలోనే కావడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 21–12, 20–22తో టాప్ సీడ్ లు చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ప్రణయ్ మరో అద్భుత విజయం
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్బుత విజయాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 29వ ర్యాంకర్ ప్రణయ్ 21-18, 16-21, 21-19 తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా)ను ఓడించి సెమీస్ లో కి ప్రవేశించాడు. గురువారం టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై సంచలన విజయం సాధించిన ప్రణయ్ మరొకసారి అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ రోజు పోరులో తొలి గేమ్ ను కష్టపడి గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్-చెన్ లాంగ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే కీలకసమయంలో ఒత్తిడిని అధిగమించిన ప్రణయ్ విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. మరొక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సైతం సెమీస్ కు చేరాడు. శ్రీకాంత్ 21-15, 21-14 తేడాతో జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)పై గెలిచి సెమీస్ కు చేరాడు. వరుస గేమ్‌లను చేజిక్కించుకున్న శ్రీకాంత్ ఎటువంటి తడబాటు లేకుండా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. -
ప్రణయ్ సంచలనం
∙ టాప్‌సీడ్ లీ చోంగ్‌పై నెగ్గిన భారత ప్లేయర్ ∙ క్వార్టర్స్‌లోకి ప్రవేశం ∙ శ్రీకాంత్ ఇన్.. సింధు, సైనాలకు షాక్ ∙ ఇండోనేసియా ఓపెన్ జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచనల ఆటతీరు ప్రదర్శించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–18తో ప్రపంచ మాజీ నం.1, టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ గేమ్‌లో భారత ప్లేయర్ ఆధిపత్యం కొనసాగింది. తొలిగేమ్ ఆరంభంలో 6–0తో శుభారంభం చేసిన ప్రణయ్.. క్రమంగా తన ఆధిపత్యాన్ని 10–3కి పెంచుకున్నాడు. అదేజోరులో ఏమాత్రం ఒత్తిడిలేకుండా ఆడుతూ ఆగేమ్ను తన సొంతం చేసుకున్నాడు. రెండోగేమ్‌లో తొలుత 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్‌కు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఈ దశలో వరుసగా పాయింట్లు సాధించిన లీ చోంగ్.. 13–12తో ముందంజలో నిలిచాడు. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమంగా పాయింట్లు సాధిస్తూ 17–14తో భారత ప్లేయర్ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన లీ.. 17–17తో మ్యాచ్‌ను ఉత్కంఠదిశగా నడిపించాడు. అయితే ఈ స్థితిలో రెచ్చిపోయిన ప్రణయ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్ ముంగింట నిలిచాడు. అయితే లీ పట్టుదలగా పోరాడి ఓ మ్యాచ్ పాయింట్‌ను కాచుకున్నాడు. అయితే ఈ దశలో దూకుడుగా ఆడిన ప్రణయ్ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో లీతో ముఖాముఖిపోరును 1–2తో ప్రణయ్ మెరుగుపర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 20–22, 21–16తో జాన్ జోర్గెన్సెన్ (డెన్మార్క్)పై పోరాడి విజయం సాధించాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో దూకుడుగా ఆడిన శ్రీకాంత్ గెలుపును కైవసం చేసుకున్నాడు. తొలిగేమ్‌లో ఇరువురు ధాటిగా ఆడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. స్కోరు 10–10తో సమంగా ఉన్న దశలో వరుసగా పాయింట్లు సాధిం చిన శ్రీ.. 16–12తో ముందంజ వేశాడు. ఈదశలో జోర్గెన్సన్ పుంజుకుని 15–17తో పోరాడాడు. అయితే ఈదశలో భారత ప్లేయర్ వరుసగా నాలుగుపాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండోగేమ్‌లోనూ ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. కీలకదశలో చెలరేగిన జోర్గెన్సన్ ఆ గేమ్‌ను నెగ్గాడు.మూడోగేమ్ ఆరంభంలో 0–5తో వెనుకంజలో నిలిచిన శ్రీ.. క్రమంగా పాయింట్లు సాధించి 15–12తో ముందంజ వేశాడు. ఈ దశంలో ఇదే దూకుడును కొనసాగించిన భారత ప్లేయర్ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ నం.1, ఒలింపిక్ చాంపియన్, ఎనిమిదో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్, ప్రపంచ 19వ ర్యాంకర్, జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. సైనా, సింధులు ఔట్ మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్, మూడుసార్లు చాంపియన్ సైనానెహ్వాల్‌కు షాక్ తగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్, సైనా 15–21, 21–6, 16–21తో నిచ్చన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో తడబడిన సైనా మూల్యం చెల్లించుకుంది. తొలిగేమ్ ఆరంభం నుంచి వెనుకంజలో నిలిచిన సైనా.. ఆదే స్థితిలో ఆ గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండోగేమ్‌లో రెచ్చిపోయిన సైనా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆగేమ్ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడోగేమ్‌లో 14–12తో ఆధిక్యంలో ఉన్న సైనా.. అనంతరం తడబడి వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. దీంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయింది. మరోవైపు మరో భారత నం.1 షట్లర్ పీవీ సింధు కూడా పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సింధు 21–15, 12–21, 18–21తో బీవెన్ జాంగ్ (అమెరికా)చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్ కైవసం చేసుకున్న భారత ప్లేయర్.. మిగతా రెండు గేమ్‌లలో తడబడి మూల్యం చెల్లించుకుంది. -
సాయిప్రణీత్ ఓటమి
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్ టోర్నీ మ.గం. 1.30 నుంచి సా. గం. 4.15 వరకు స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం జకార్తా: వరుసగా సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరుమీదున్న భారత యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 14–21, 18–21తో రెండో సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. అయితే భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ 21–15, 17–21, 21–16తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై, ప్రణయ్ 21–13, 21–18తో జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 19–21తో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–19, 19–21, 13–21తో దియాన్ ఫిత్రియాని–నాద్యా మెలాతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)తో ప్రణయ్; జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; నిచావోన్ (థాయ్‌లాండ్)తో సైనా; బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు తలపడతారు. -
క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ పరాజయం
బాసెల్: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌ను సాధించడంలో భారత క్రీడాకారులు విఫలమయ్యారు. 2015లో శ్రీకాంత్, 2016లో హెచ్ఎస్ ప్రణయ్ ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రణయ్ 19–21, 11–21తో షి యూచి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
ప్రణయ్ ముందంజ
బాసెల్ (స్విట్జర్లాండ్): డిఫెండింగ్ చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదో సీడ్ ప్రణయ్ 21–17, 21–19తో కిరాన్ మెరిలిస్ (స్కాట్లాండ్)పై గెలిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కియావో బిన్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. మరోవైపు భారత్‌కే చెందిన సమీర్ వర్మ రెండో రౌండ్లో 21–16, 15–21, 13–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓడిపోగా... శుభాంకర్ డే 21–17, 21–18తో ఉత్రోసా (స్లొవేనియా)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంటకు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 8–21తో ఏడో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
స్విస్ ఓపెన్ నుంచి వైదొలిగిన సైనా
నేటి నుంచి టోర్నమెంట్ బాసెల్ (స్విట్జర్లాండ్): గతంలో వరుసగా రెండుసార్లు (2011, 2012లో) స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈసారి బరిలోకి దిగడం లేదు. ఈ టోర్నీ కోసం ఎంట్రీ పంపించిన సైనాకు నిర్వాహకులు టాప్ సీడింగ్‌ను కూడా కేటాయించారు. అయితే సైనా చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తన ఎంట్రీని ఉపసంహరించుకుంది. వాస్తవానికి ఈ హైదరాబాద్ ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ముగిశాక బర్మింగ్‌హామ్ నుంచి నేరుగా ఈ టోర్నీలో బరిలోకి దిగాల్సింది. కానీ సైనా క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం... ఈ నెలాఖర్లో భారత్‌లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం కోసం స్విస్ ఓపెన్ నుంచి ఆమె వైదొలిగింది. సైనాతోపాటు భారత్ నుంచి ఎంట్రీలు పంపించిన గద్దె రుత్విక శివాని, వైదేహి చౌదరీ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురూ వైదొలగడంతో ప్రస్తుతం మెయిన్ ‘డ్రా’లో భారత్ తరఫున శ్రీకృష్ణప్రియ మాత్రమే బరిలో ఉంది. ప్రణయ్ టైటిల్ నిలబెట్టుకునేనా? టోర్నీ తొలిరోజు మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 64 మందితో కూడిన పురుషుల సింగిల్స్ ‘డ్రా’లో భారత్ తరఫున డిఫెండింగ్ చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే పోటీపడనున్నారు. 2015లో కిడాంబి శ్రీకాంత్, 2016లో ప్రణయ్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించారు. చైనా దిగ్గజం లిన్ డాన్ టాప్ సీడ్ పొందగా... అజయ్ జయరామ్‌కు మూడో సీడింగ్ దక్కింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. -
కొరియా చేతిలో ఓడినా...
క్వార్టర్స్‌లో భారత్ ► ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్ హో చి మిన్ (వియత్నాం): ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో కొరియా చేతిలో ఓడినప్పటికీ గ్రూప్ ‘డి’ విభాగంలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 24–22, 21–9తో వాన్ హో సాన్ పై గెలుపొందగా... మిగిలిన అన్ని మ్యాచ్‌లో్లనూ భారత క్రీడాకారులకు పరాజయాలే ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో యూ జంగ్ చై– సోల్గ్యు చోయ్ జోడి 21–17, 17–21, 21–17తో అశ్విని పొన్నప్ప– సుమీత్ రెడ్డి జంట పై, పురుషుల డబుల్స్‌లో జి జంగ్ కిమ్– యెన్ సియోంగ్ యూ 21–15, 28–26తో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో యె న చంగ్– సీ హీ లీ జంట 21–13, 21–19తో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీపై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లోనూ తన్వి లాడ్ 8–21, 15–21తో జి హ్యూన్ సంగ్ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్, థాయిలాండ్‌తో తలపడుతుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు 21-9, 29-27తో రుుప్ పుయ్ రుున్ (హాంకాంగ్) పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-16, 21-18తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 22-20, 10-21, 18-21తో జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. రుుప్ పుయ్ రుున్తో 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ తొలుత వెనుకబడి ఆ తర్వాత పుంజుకోవడం విశేషం. తొలి గేమ్‌లో 2-6తో వెనుకంజలో ఉన్న దశలో సింధు వరుసగా ఆరు పారుుంట్లు గెలిచి 8-6తో ముందంజ వేసింది. రుుప్ పుయ్ రుున్ ఒక పారుుంట్ సాధించిన తర్వాత సింధు మళ్లీ విజృంభించి ఈసారీ వరుసగా ఆరు పారుుంట్లు గెలిచి 14-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈసారీ రుుప్ పుయ్ రుున్ ఒక పారుుంట్ నెగ్గిన తర్వాత సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పారుుంట్లు సాధించి 20-8తో ముందంజ వేసింది. ఈ దశలో ఒక పారుుంట్ కోల్పోరుున సింధు ఆ వెంటనే మరో పారుుంట్ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో ఆధిక్యం పలుమార్లు దోబూచులాడింది. రుుప్ పుయ్ రుున్ మూడుసార్లు గేమ్ పారుుంట్లను వదులుకోగా... ఏడో ప్రయత్నంలో సింధు గేమ్ పారుుంట్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తియెన్ చున్ చూ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; బింగ్జియావో (చైనా)తో సింధు తలపడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో జయరాం, ప్రణయ్
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్‌లతో పాటు టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లంతా మూడో రౌండ్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 17-21, 21-17, 21-13తో మార్టిన్ గిఫ్రే (కెనడా)పై నెగ్గాడు. రెండో సీడ్ ప్రణయ్ 13-21, 21-11, 21-15తో మట్టియాస్ బోర్గ్ (స్వీడన్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-8, 21-6తో జొనాథన్ లాయ్ (కెనడా)పై, సాయి ప్రణీత్ 26-24, 21-16తో కన్ చావో యు (చైనీస్ తైపీ)పై, ప్రతుల్ జోషి 21-13, 21-12 అలిస్టర్ కేసేపై నెగ్గారు. మహిళల విభాగంలో రుత్విక శివాని 21-14, 21-14తో కైలీగ్ (కెనడా)పై, తన్వీ లాడ్ 21-17, 21-10తో జూలీ ఫిన్నేపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి, అశ్విని పొన్నప్ప జంట 21-13, 21-14తో బైరాన్ హోల్సెక్, ఎరిన్లపై విజయం సాధించింది. -
ఓటమితో మొదలు
► తొలి మ్యాచ్‌లో భారత్ 2-3తో థాయ్‌లాండ్ చేతిలో పరాజయం ► థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షున్ (చైనా): అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ గైర్హాజరీలో... థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21తో ప్రపంచ 26వ ర్యాంకర్ తనోంగ్సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 17-21, 6-21తో బొదిన్ ఇసారా-నిపిత్పోన్ జోడీ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21-11, 21-16తో ఖొసిత్ పెట్ప్రాదబ్పై గెలిచి భారత్ ఖాతా తెరిచాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్-అక్షయ్ దేవాల్కర్ జోడీ 15-21, 21-14, 15-21తో డెచాపోల్-కెద్రెన్ జంట చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత్‌కు 1-3తో ఓటమి ఖాయమైంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21-17, 16-21, 21-19తో అదుల్చ్ ్రనమ్కుల్పై గెలుపొందాడు. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ ఆడుతుంది. -
సింధుకు చుక్కెదురు
ప్రణయ్, జ్వాల జంట కూడా చైనా మాస్టర్స్ టోర్నీ జియాంగ్సు (చైనా): అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయిన భారత స్టార్ పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు 17-21, 19-21తో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ ఇద్దరూ పోటాపోటీగా తలపడినా... కీలకదశలో పోర్న్‌టిప్ పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంది. పోర్న్‌టిప్ చేతిలో సింధుకిది నాలుగో పరాజయం. ఈ ఏడాది వరుసగా రెండో ఓటమి. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 10-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప ద్వయం 11-21, 14-21తో టాప్ సీడ్ లూ యింగ్-లూ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
ప్రణయ్ సంచలనం
లిన్ డాన్‌పై అద్భుత విజయం సైనా, కశ్యప్ శుభారంభం ఐదో సీడ్ శ్రీకాంత్‌కు షాక్ {ఫెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పారిస్: భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్ఎస్ ప్రణయ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ఐదుసార్లు విశ్వ విజేతగా, రెండుసార్లు ఒలింపిక్స్ చాంపియన్‌గా, నాలుగుసార్లు ఆసియా క్రీడల చాంపియన్‌గా నిలిచిన ‘చైనా దిగ్గజం’ లిన్ డాన్‌ను... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ కేరళ ఆటగాడు మట్టి కరిపించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ ప్రణయ్ 14-21, 21-11, 21-17తో లిన్ డాన్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినా, రెండో గేమ్‌లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి పుంజుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రణయ్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 7-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత లిన్ డాన్ తేరుకున్నా కీలకదశలో ప్రణయ్ పైచేయి సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు. ►ఈ గెలుపుతో లిన్ డాన్‌ను ఓడించిన మూడో భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. 2002లో పుల్లెల గోపీచంద్ రెండుసార్లు లిన్ డాన్‌పై గెలుపొందగా... గతేడాది చైనా ఓపెన్‌లో శ్రీకాంత్ ఒకసారి గెలిచాడు. ►ఈ ఏడాది ఓ సూపర్ సిరీస్ టోర్నీలో లిన్ డాన్ తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), ఇండోనేసియా ఓపెన్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలోనూ లిన్ డాన్ తొలి రౌండ్లో ఓడిపోయాడు. ►ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 21-11, 22-20తో క్వాలిఫయర్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 21-13, 11-21తో ఓడిపోయాడు. ఈ ఏడాది తియాన్ హువీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్ ఓటమి చెందడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆడిన పది టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ►మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-13తో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మిచెల్లి లీ (కెనడా)పై గెలుపొందింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు 10-21, 11-21తో షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-15, 21-12తో కిటిట్హరాకుల్-రవింద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
సైనా అలవోకగా...
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం శ్రీకాంత్, ప్రణయ్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జకార్తా: ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి కచ్చితంగా పతకంతో తిరిగి రావాలని పక్కా ప్రణాళికతో సిద్ధమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ సైనా 21-13, 21-9తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో రెండుసార్లు వరుసగా ఆరేసి పాయింట్లు సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, రెండో గేమ్‌లో చెలరేగి ఒకసారి వరుసగా 10 పాయింట్లు సంపాదించడం విశేషం. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)తో పీవీ సింధు ఆడతారు. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో తకహాషిపై ఆధిక్యంలో ఉండగా... సింధు 1-2తో వెనుకంజలో ఉంది. కశ్యప్‌కు నిరాశ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పదో సీడ్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 11వ సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో సీడ్, ప్రపంచ పదో ర్యాంకర్ కశ్యప్ 21-17, 13-21, 18-21తో ప్రపంచ 34వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-14, 21-15తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21-14, 21-19తో ఎడ్విన్ ఎరికింగ్ (ఉగాండ)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్; యున్ హు (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో తన ప్రత్యర్థిపై శ్రీకాంత్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రణయ్ 0-2తో వెనుకంజలో ఉన్నాడు. జ్వాల-అశ్విని జంట ముందంజ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జ్వాల-అశ్విని ద్వయం రెండో రౌండ్లో 21-10, 21-18తో సెయి పి చెన్-వు తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) జంట 17-21, 19-21తో షిజుకా మత్సో-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జంట 16-21, 12-21తో పీటర్సన్-కోల్డింగ్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేటి మ్యాచ్‌లు ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్
ముంబై : ఇక నుంచి ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్స్యూర్కు చెందిన హ్యాచ్‌బ్యాక్ క్యాబ్స్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ముంబై, ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓలా యాప్‌లో కనిపించే టీఎఫ్ఎస్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు రూ.49 ప్రారంభ ధరతో ట్యాక్సీఫర్‌స్యూర్ క్యాబ్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ తెలిపారు. ట్యాక్సీఫర్‌స్యూర్ వాహనాలను ఓలా యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల తమ వినియోగదారులకు మరిన్ని వాహనాలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో 200 మిలియన్ డాలర్లు (రూ.1,260 కోట్లు) వెచ్చించి ట్యాక్సీఫర్స్యూర్ను ఓలా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్సీఫర్స్యూర్కు దేశవ్యాప్తంగా 24,000 వాహనాలు ఉన్నాయి. వీటిలో సగభాగం హ్యాచ్బ్యాక్స్దే. -
కశ్యప్, ప్రణయ్ సంచలనం
♦ ప్రపంచ ఐదో, రెండో ర్యాంకర్స్పై గెలుపు ♦ శ్రీకాంత్‌కు చుక్కెదురు ♦ సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ : అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సంచలనాలు సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్ ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించగా... కేరళ కుర్రాడు ప్రణయ్ ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఇంటిముఖం పట్టించాడు. మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో చుక్కెదురైంది. గతంలో సన్ వా హోతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కశ్యప్ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూశాడు. 46 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-15, 22-20తో సన్ వా హోను ఓడించాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడ్డ కశ్యప్ ఆ తర్వాత తేరుకొని 14-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో కీలకదశలో కశ్యప్ పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు రెండు వారాల వ్యవధిలో రెండోసారి ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్‌ను ప్రణయ్ ఓడించడం విశేషం. గత నెలాఖర్లో ఇండియా ఓపెన్‌లో జార్గెన్‌సన్‌పై మూడు గేముల్లో నెగ్గిన ప్రణయ్ ఈసారి రెండు గేముల్లోనే గెలిచాడు. కేవలం 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21-16, 21-8తో జార్గెన్‌సన్‌పై విజయం సాధించాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ సెన్సోమ్బూన్సుక్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 20-22తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 22-24, 18-21తో మూడో సీడ్ జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో కశ్యప్; కెంటో మొమాటా (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. -
సెమీస్‌లో సింధు, ప్రణయ్
మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ మకావు: స్థాయికి తగ్గట్టు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుతో పాటు పురుషుల విభాగంలో ప్రణయ్ కూడా మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-17, 19-21, 21-16తో ఐదో సీడ్ హాన్ లీ (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సింధుకు ఆద్యంతం గట్టిపోటీ లభించింది. అయితే కీలకదశలో పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ 21-19, 21-17తో సోనీ ద్వి కున్కురో (ఇండోనేసియా)ను ఓడించి సెమీస్‌కు చేరాడు. -
క్వార్టర్స్‌లో ప్రణయ్
బిట్ బర్గర్ ఓపెన్ సార్‌బ్రుకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకుపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడోసీడ్ ప్రణయ్ 21-19, 21-18తో 9వ సీడ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడికి ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో తన్వీ లాడ్ 17-21, 12-21తో సన్ యు (చైనా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 15-21, 22-20, 21-12తో కోల్బెర్జ్-నిక్లాస్ నోహర్ (డెన్మార్క్)లపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అక్షయ్ దివాల్కర్-ప్రద్నా గాద్రె జోడీ 13-21, 21-19, 21-17తో జాకో అరెండేస్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్)పై; అశ్విని పొన్నప్ప-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) 23-21, 21-12తో జెలీ మాస్-ఐరిస్ టాబ్లెంగ్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. మను అత్రీ-సిక్కి రెడ్డి ద్వయం 15-21, 7-21తో లాంగ్ఫి షి-క్వియాన్ జోంగ్ (చైనా) చేతిలో ఓడింది.