కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): అసాధారణ ఆటగాడు అక్సెల్‌సన్‌కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్‌లో ఈ కేరళ స్టార్ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్ ఓడిపోయా డు.
శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–18, 13–21, 14–21తో కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టులో పరుగు పెట్టిస్తూ స్కోరు సాధించాడు. నెట్‌వద్ద చురుగ్గా పాయింట్లు సాధించిన ప్రణయ్ స్మాష్‌లతో చెలరేగి... తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.
తర్వాత రెండో గేమ్ కూడా ప్రణయ్ ఆధిపత్యంతోనే మొదలైంది. వరుసగా 4–0తో పైచేయి సాధించాడు.ఈ దశలో చేసిన అనవసర తప్పిదాలతో భారత షట్లర్ పాయింట్లను కోల్పోయాడు. పదే పదే ఇవే తప్పిదాలు కొనసాగించడంతో ఆధిక్యాన్ని, ఆపై గేమ్‌నే కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ప్రణయ్ తప్పిదాలనే ఆసరాగా చేసుకొని పుంజుకున్న థాయ్ ప్రత్యర్థి చివరిదాకా ఆధిపత్యాన్ని కొనసాగించాడు.
Comments
Please login to add a commentAdd a comment