బిట్ బర్గర్ ఓపెన్
సార్‌బ్రుకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకుపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఏడోసీడ్ ప్రణయ్ 21-19, 21-18తో 9వ సీడ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడికి ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో తన్వీ లాడ్ 17-21, 12-21తో సన్ యు (చైనా) చేతిలో ఓడింది.
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 15-21, 22-20, 21-12తో కోల్‌బెర్జ్-నిక్లాస్ నోహర్ (డెన్మార్క్)లపై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రద్నా గాద్రె జోడీ 13-21, 21-19, 21-17తో జాకో అరెండేస్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్)పై; అశ్విని పొన్నప్ప-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) 23-21, 21-12తో జెలీ మాస్-ఐరిస్ టాబ్లెంగ్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మను అత్రీ-సిక్కి రెడ్డి ద్వయం 15-21, 7-21తో లాంగ్‌ఫి షి-క్వియాన్ జోంగ్ (చైనా) చేతిలో ఓడింది.
క్వార్టర్స్‌లో ప్రణయ్
Published Fri, Oct 31 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM
Advertisement