క్వార్టర్స్‌లో శ్రీకాంత్, శంకర్‌ | Kidambi Srikanth and Subramanian into quarterfinals in Thailand Masters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, శంకర్‌

Jan 31 2025 2:56 AM | Updated on Jan 31 2025 2:56 AM

Kidambi Srikanth and Subramanian into quarterfinals in Thailand Masters

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్‌ 21–19, 21–15తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌)పై, శంకర్‌ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్‌ టుంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 19–21, 15–21తో రచాపోల్‌–నాథమోన్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రతీక్‌–పృథ్వీ కృష్టమూర్తి రాయ్‌ (భారత్‌) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్‌–నారుసెట్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement