Subramanian
-
భారత్‌లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
సుబ్రమణ్య స్వామి Vs ఏపీ.
-
ప్రసాదం వివాదంపై మరో బిగ్ ట్విస్ట్ .. సుప్రీం కోర్టుకు సుబ్రమణ్య స్వామి
-
ఐఎంఎఫ్‌లో రాష్ట్ర విద్యార్థినికి గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ విద్యార్థుల బృందంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలకు చెందిన లారీ డ్రైవర్ కుమార్తె చాకలి రాజేశ్వరికి తన చైర్ ఆఫర్ చేసి అందులో కూర్చోబెట్టారు. సుమారు 1.20 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజేశ్వరి అదే చైర్లో కూర్చుంది. ఈ సందర్భంగా సుబ్రమణ్యన్ విద్యార్థులతో మాట్లాడుతూ.. కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని, సమాజంలో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు దేశానికి చేతనైన సాయం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్ర మణ్యన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘నేను నా కార్యాలయంలో ఏపీ నుంచి వచ్చిన తెలివైన విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారంతా అత్యంత నిరాడంబరమైన నేప థ్యాల నుంచి వచ్చినవారు కావడం వల్ల భార తీయుడిగా గర్వపడుతున్నాను. విద్య ప్రాముఖ్యత ప్రతి భారతీయ కుటుంబం మనసులోకి ప్రవేశించింది’ అంటూ సుబ్రమ ణ్యన్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘వారిని ప్రోత్స హిస్తున్నందుకు ధన్యవాదాలు సుబ్రమణ్యన్గారూ! మిమ్మల్ని కలవడం, మీతో సంభాషించడం మన పిల్లలకు, ఏపీ పిల్లలందరికీ అపురూపమైన గౌరవం. మన పిల్లలు మన రాష్ట్రాన్ని, మన విద్యా విధానం సారాంశాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పడాన్ని చూసి నేను గర్వపడుతున్నాను’ అంటూ రీట్వీట్ చేశారు. గీతాగోపీనాథ్‌కు సీఎం జగన్ ధన్యవాదాలు ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతాగోపీనాథ్‌కు కూడా సీఎం ధన్యవాదాలు తెలి పారు. ఐఎంఎఫ్ కార్యాలయంలో విద్యార్థులు గీతాగోపీనాథ్తో సమావేశమైన సందర్భంగా ఆమె ‘ఐఎంఎఫ్‌కి ఏపీ విద్యార్థులను స్వాగతించ డం నిజంగా ఆనందంగా ఉంది. వారి యూఎన్, యూఎస్ పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయానికి రావడం సంతోషిస్తున్నాను’ అంటూ ఏపీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ‘మా పిల్లలను కలిసినందుకు, వారిని ఇంత ఆప్యాయంగా చూస్తు న్నందుకు ధన్యవాదాలు గీతా గోపీనాథ్ గారూ, వారి చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి! విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మా ర్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మన పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రాతి నిధ్యం వహిస్తున్న మన పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో ఉప్పొంగిపోయాను’ అంటూ రీట్వీట్ చేశారు. -
సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్1 మిషన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్కు చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. బెంగళూరులోని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్ఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్ ఆనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్–1. చంద్రయాన్–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. ఆదిత్య ఎల్–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్ ఇవే 1,475 కేజీలు బరువు కలిగిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బింవు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదిత్య ఎల్1లో ఆరు పేలోడ్స్ పరిశోధనలు.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 170 కేజీల బరువు కలిగిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. -
5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్‌లు
హైదరాబాద్: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది. ఈ నెల 27న ఇన్వెస్టర్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్‌లకు సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్ గ్యారంటీ స్టార్టప్‌లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్‌లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ శృతీసింగ్ అభినందించారు. -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
India GDP: వృద్ధి జోరులో మనమే టాప్..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. వివిధ సంస్థలు, రేటింగ్ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన (బేస్ ఎఫెక్ట్) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. విలువల్లో ఇలా... తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది. కాగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి. ♦తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం. ♦నిర్మాణం, ట్రేడ్, హోటల్స్ రవాణా, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ♦ప్రభుత్వ సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం. ♦ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది. ♦కాగా, జూలై–సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం. 2021–22పై అంచనాలు ఇలా... గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది. రెండంకెల వృద్ధి దిశగా... భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్‌లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది. – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
మళ్లీ ప్రొఫెసర్‌గానే పనిచేస్తా: థ్యాంక్యూ మోడీజీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఈ ఏడాది చివరితో తన బాధ్యతలకు విరామం పలకనున్నారు. తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్రమణియన్‌ను 2018 డిసెంబర్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేంద్రం నియమించింది. అంతకుముందు వరకు అరవింద్ సుబ్రమణియన్ ఈ బాధ్యతలు చూశారు. మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిపోనుంది. ఈలోపే కేవీ సుబ్రమణియన్ తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు, మార్గదర్శకంగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత బోధనవైపు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని సుబ్రమణియన్ ప్రకటించారు. -
రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ
మన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో 20.1 శాతంగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏప్రిల్-జూన్ 2020 కాలంలో భారతదేశం ప్రధానంగా మొదటి కరోనా వైరస్ కారణంగా జీడీపీ భారీగా దెబ్బతింది. జీడీపీ వృద్ది రేటు -24.4 శాతానికి పడిపోయింది. "క్యూ1ఎఫ్ వై22లో స్థిరమైన(2011-12) ధరల వద్ద జీడీపీ వృద్ది రేటు క్యూ1 ఎఫ్ వై21లో 24.4 శాతం సంకోచంతో పోలిస్తే 20.1 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా వివిధ ఆర్థిక సంస్థలు ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికంలో జీడీపీ రికార్డు స్థాయిలో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఇఏ) కె సుబ్రమణియన్ భారతదేశ స్థూల ఆర్థిక మౌలికాంశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పారు. "క్యూ1 జిడిపి భారత ఆర్థిక వ్యవస్థ వి-ఆకారంలో రికవరీని పునరుద్ఘాటిస్తుంది. భారత దేశం తీసుకున్న సంస్కరణలు ఆర్థిక రికవరీ సమన్వయ వేగాన్ని పెంచినట్లు'' అని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడీపీ వృద్ధి రేటు 21.4 శాతంగా అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా ఎకోర్ప్ నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి సుమారు 18.5 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, క్యూ1 ఎఫ్ వై22లో జీవిఏ 15 శాతంగా ఉంటుందని పేర్కొంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!) -
మూడంచెల జీఎస్టీ అవశ్యం: పీహెచ్‌డీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో మూడంచెల వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని అమలు చేయాలని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ ఉద్ఘాటించారు. అలాగే అత్యధిక శ్లాబ్ 18 శాతానికి పరిమితం చేయాలని కూడా కూడా సూచించారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రస్తుతం ప్రధానంగా ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని, మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఇటీవలే పేర్కొన్నారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ వల్ల వినియోగం, పన్ను ఆదాయాలు పెరుగుతాయని, క్లిష్టతలు తగ్గుతాయని, పన్ను ఎగవేతల సమస్యను పరిష్కరించవచ్చని సంజయ్ అగర్వాత్ తాజాగా పేర్కొన్నారు. ఎకానమీ రికవరీ.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. స్థానికంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలను రాష్ట్రాలు తొలగించడం, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఎకానమీలో డిమాండ్ పెంచడానికి గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద పట్టణ, గ్రామీణ పేదలకు సాధ్యమైనంత అధికంగా ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపులు అవసరమని ఆయన సూచించారు. ప్రయోజనాలు పక్కదారిపట్టకుండా ఈ విధానం రక్షణ కల్పిస్తుందన్నారు. -
మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి వేవ్‌తో పోల్చితే ప్రస్తుత రెండవ దశలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇందుకు కారణాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకటని వివరించారు. మహమ్మారి భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్ 14, ఏప్రిల్ 15- మే 3, మే 4–మే 17, మే 18మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. దీనితో ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకున్నాయి. మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. (దేశవ్యాప్త లాక్డౌన్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు) కరోనా సెకండ్‌వేవ్ ఆందోళనల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020తో పోల్చితే ఇప్పుడు అనిశ్చితి వాతావరణం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అయితే సెకండ్ వేవ్ పట్ల ప్రజలు జాగరూకతతో వ్యవహరించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తత్సంబంధ అంశాలకు సంబంధించి కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ► కోవిడ్- నేపథ్యంలో డిజిటలైజేషన్, ఈ-కామర్స్‌లో పురోగతి నెలకొంది. ► దాదాపు 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నిత్యావసరాల సరఫరా జరిగింది. జన్‌ధన్, ఆధార్, మెబైల్ (జేఏఎం) ద్వారా ‘ఒక్క బటన్ క్లిక్’తో నగదు బదలాయింపు జరిగింది. అమెరికాస హా పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది. ► ఈ-కామర్స్ రంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన వృద్ధిని అందిపుచ్చుకోడానికి భారత్ తగిన రీతిలో సిద్ధంగా ఉంది. -
నచ్చినోళ్లకు రుణం... బ్యాంకింగ్‌కు భారం
న్యూఢిల్లీ: క్రోనీ రుణ మంజూరీలకు దూరంగా ఉండాలని, అధిక నాణ్యత రుణ మంజూరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం ఫైనాన్షియల్ సంస్థలకు మంగళవారం పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి సంబంధించి విలువైన ఆస్తుల సృష్టికి అధిక నాణ్యతతో కూడిన రుణాలు దోహదపడతాయని అన్నారు. తద్వారానే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించవచ్చని సూచించారు. నచ్చిన వాళ్లకు లేదా రాజకీయ నాయకుల ప్రభావానికి గురై ఇతర ఎటువంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకోకుండా మంజూరు చేసే రుణాలను ‘క్రోనీ లెండింగ్’గా పరిగణిస్తారు. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ►నాణ్యత లేని పేలవ రుణ మంజూరీ సమస్యను 1990 నుంచీ భారత్ బ్యాంకింగ్ ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి బడా రుణాల విషయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంటోంది. రుణాలను సకాలంలో తీర్చుతున్న (క్రెడిట్ వర్తీనెస్) వారికి రుణ మంజూరీలు సజావుగా లేవు. అదే సమయంలో క్రోనీ క్యాపిటలిస్టుల విషయంలో రుణ మంజూరీలు సునాయాసంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ►క్రెడిట్‌వర్తీ లేని ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడం అంటే, క్రెడివర్తీ కలిగిన రుణ గ్రహీత రుణం పొందడంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. ►వృద్ధి బాటలో మూలధనాన్ని తగిన రుణ గ్రహీతకు అందజేయడం ఫైనాన్షియల్ రంగం విధి. ►మౌలిక రంగంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితలు కూడా బ్యాంకింగ్ మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం. అధిక నాణ్యతతో కూడిన రుణాల మంజూరీల విషయంలో ఫైనాన్షియల్ రంగం బాధ్యతా ఉంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో రుణాల విషయంలో ‘క్రోనీ’ లెండింగ్‌కు ఎంతమాత్రం స్థానం ఉండకూడదు. ఫైనాన్షియల్ రంగ ప్రధాన లక్ష్యంలో ఈ అంశం ఉండాలి. ►ఫైనాన్షియల్ రంగంలో కార్పొరేట్ పాలనా విధానం కూడా మెరుగుపడాలి. ఇది అధిక నాణ్యత కలిగిన రుణ మంజూరీలకు దోహదపడుతుంది. సీనియర్ మేనేజ్మెంట్కు ప్రోత్సాహకాలకు రుణ నాణ్యత ప్రాతిపదికగా ఉండాలి. దివాలా చట్రంలో 4000 కంపెనీలు: సాహూ కార్యక్రమంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, దివాలా చట్రంలో ప్రస్తుతం 4,000 కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో 2,000 కంపెనీలకు సంబంధించి దివాల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల విలువ లిక్విడేషన్ కన్నా అధికంగా ఉందనీ తెలిపారు. కొన్ని కంపెనీల విషయంలో విలువలు లిక్విడేషన్ వ్యాలూకన్నా 300 శాతం వరకూ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. -
ఈ సర్వే కోవిడ్ యోధులకు అంకితం : సీఈఏ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ, ప్రజల ప్రాణాలను కాపాడంలో ప్రభుత్వం చురుగ్గా, సమర్ధవంగా వ్యవహరించిందని ప్రధాన ఆర్థిక సలహాదారు( సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే 2020-21ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతం సర్వేని మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ యాప్‌లో ఆర్థికసర్వే వివరాలను పొందుపర్చినట్టు వెల్లడించారు. అలాగే మహమ్మారిని దేశాన్ని రక్షించిన కోవిడ్ యోధులకు ఈ ఏడాది సర్వేను అంకితం చేసినట్టు తెలిపారు. కోవిడ్-19 కట్టడికిగాను విధించిన లాక్డౌన్ తదితర ఆంక్షల కారణంగా దేశంలో 3.7 మిలియన్ల కరోనా కేసులను నివారించగలిగామని పేర్కొన్నారు. మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.7 శాతంగా ఉండొచ్చని తెలిపారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసిందన్నారు. కరోనా కట్టడిలో, బాధితుల మరణాల నివారణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరించగా, మహారాష్ట్ర కరోనా కేసులు, మరణాల నివారణలో విఫలమైందని పేర్కొన్నారు. -
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
పెట్టుబడుల్ని రప్పించేందుకే కార్పొరేట్ పన్ను కోత
న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వెల్లడించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పడే ప్రగతి చక్రాలు ఆశించినంత వేగంగా పరుగు తీయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఇండియా ఎకనమిక్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం సుబ్రమణియన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఉత్పాదకత మెరుగుపడితే వేతనాలు పెరుగుతాయి. ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. ఇవన్నీ కలిస్తే అంతిమంగా వినియోగదారుల కొనుగోలు శక్తి మెరుగుపడి, డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ ఆధారంగానే కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఇదో చక్రం లాంటిది. గతంలో 7% పైగా వృద్ధి రేటు ఉన్నప్పుడు.. ఈ చక్రాలు వేగంగా పరుగెత్తేవి.. కానీ గడిచిన కొన్ని త్రైమాసికాలుగా ఆశించినంత స్థాయిలో పరుగు తియ్యడం లేదు. అందుకే .. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది‘ అని చెప్పారు. -
ఆర్థిక సర్వేలో ‘అర్ధ సత్యమే!’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశం రెండంకెల జీడీపీ వృద్ధి రేటును సాధించే చారిత్రక సంధికాలంలో ఉందని ప్రధాన మంత్రి ప్రధాన మాజీ ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ ఐదేళ్ల క్రితం వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించినట్లు చెబుతున్న జీడీపీ వృద్ధి రేట్ల పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చూపించిన 6.8 నుంచి 7.1 శాతం వృద్ధి రేటు సరైనదని కాదని, అంతకన్నా తక్కువ ఉంటుందని, స్వతంత్ర ఆర్థిక నిపుణులతో తిరిగి లెక్కలు వేయించాలని కూడా సూచించారు. అయితే ‘గత ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉంది’ గురువారం విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదికలో ప్రధాన మంత్రి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చివరి రోజుల్లో జీడీపీ రేటు మరింత పడిపోయిన విషయాన్ని గానీ, నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో గత 49 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందన్న విషయాన్ని సుబ్రమణియన్ ప్రస్తావించలేదు. ప్రస్తుతం 2.8 ట్రిలియన్ డాలర్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్ష్యాన్ని ఆర్థిక సర్వేలో చేర్చారు. దీని కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. అందుకోసం పన్ను రాయతీలు కల్పించాలని, విమాన సర్వీసుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. విమాన సర్వీసుల్లో ప్రాధాన్యతకు సరైన వివరణ, స్పష్టత లేదు. వాళ్ల కోసం సీట్లను రిజర్వ్ చేసి ఉంచాలా? వారు ప్రయాణించాలనుకుంటే అప్పుడు సీట్లను సర్దుబాటు చేయాలా? వారిని మంచి బిజినెస్ క్లాస్‌లో కూర్చోబెట్టాలా? వారికి టిక్కెట్లలో రాయతీ కల్పించాలా? లేదా ప్రయాణ సౌకర్యం కల్పించాలా? స్పష్టత లేదు. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు విమానాల్లో పర్యటించాల్సినంత అవవసరం ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న. కారు మబ్బులు కమ్ముకున్న ప్రస్తుత ఆర్థిక ఆకాశం నుంచి కాసులు కురుస్తాయన్న బాగుండేమోగానీ, ఆర్థికాకాశం నీలి రంగులో మెరిసిపోతోందని ఆర్థిక నిపుణులు కేవీ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆశించిన ఫలితాల కోసం ఎన్ని కాలాలు వేచి చూడాలో! (చదవండి: 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?!) -
సుభిక్ష ఫౌండర్ సుబ్రమణియన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో సుభిక్ష రిటైల్ స్టోర్స్, విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు ఆర్ సుబ్రమణియన్‌ను ఈడీ ఆరెస్ట్ చేసింది. డిపాజిటర్లను వందల కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఆరోపణలపై బుధవారం ఇతణ్ణి అరెస్ట్ చేసింది. బ్యాంకులకు, ఇతర పెట్టుబడిదారులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసిన ఆరోపణలు, వివిధ న్యాయస్థానాలలో చట్టపరమైన కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ తాజాగా ఈ చర్యకు దిగింది. సుబ్రమణియన్ 250 కోట్ల రూపాయల మేర డిపాజిటర్లను మోసగించడంతోపాటు, సుమారు రూ. 750 కోట్లకు 13 బ్యాంకులకు టోకరా వేశాడు. ఈ నేపథ్యంలో 2013లోనే ఈయనపై అనేక క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా సుమారు 10 ఎకరాల నాలుగు వ్యవసాయ భూములను, రెండు ఇతర ఖాళీ ప్లాట్లను మోసపూరితంగా తన గ్రూప్ కంపెనీకి మార్చుకున్నాడనీ ఈడీ తేల్చింది. వీటితోపాటు అతని భార్య పేరుతో ఉన్న మరో రెండు ప్లాట్లను కూడా ఈడీ ఇప్పటికే ఎటాచ్ చేసింది. కాగా 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భారీ ఎత్తున డిపాజిట్లు సమీకరించారు. తద్వారా దాదాపు 49 వ్యాపారాలు ప్రారంభించాడు. ఇందులో సుభిక్ష సూపర్ మార్కెట్ చెయిన్ ఒకటి. 1997 లో చెన్నైలో మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా స్టోర్ల ఏర్పాటు కోసం మోసపూరిత నిధులను దారి మళ్ళించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2002లో మనీ లాండరింగ్ చట్టం నిబంధనల ప్రకారం ఈడీ విచారణ చేపట్టింది. ఈ వివాదంతో 2009లో సుభిక్షకు చెందిన 1,600 రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఐఐటి, ఐఐఎంలో చదువుకున్న సుబ్రమణియన్ గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే సిటీ బ్యాంకు, ఎన్ఫీల్డ్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేశారు. -
మంత్రి మెడపై మరో కత్తి, వీడని మరణ మిస్టరీ
చెన్నై: ఐటీ దాడులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడపై ఆయన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ (52) మరణ మిస్టరీ మరో కత్తిలా వేలాడుతోంది. మరణానికి ముందు సుబ్రమణియన్‌కు ఒకే నంబర్ నుంచి 20 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. నామక్కల్ ఉపాధ్యాయ కాలనీకి చెందిన సుబ్రమణియన్ మంత్రి విజయభాస్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఈ స్నేహంతో మంత్రి ద్వారా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాల కాంట్రాక్టులు పొంది కోట్లు గడించాడు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ తరఫున ధన ప్రవాహానికి నేతృత్వం వహించిన మంత్రి విజయభాస్కర్ సహా 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో సుబ్రమణియన్ ఇంటిపై కూడా దాడులు చేసి రెండుసార్లు కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. నగదు బట్వాడాలో మంత్రి వెనుక సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర పోషించినట్లు అనుమానించిన ఐటీ అధికారులు నిజాలు రాబట్టేందుకు గట్టిగా విచారించారు. ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. తెల్లారితే చెన్నైలోని ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా ముందురోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినా అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల అనంతరం కొన్ని రోజులుగా సుబ్రమణియన్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి గడుపుతున్నారు. అయితే చివరిగా ఆయనకు కొందరు వీఐïపీల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. సుబ్రమణియన్ మరణానికి ముందు గుర్తుతెలియని వ్యక్తి ఒకే నంబరు నుంచి 20 సార్లు ఫోన్ చేసి అతనికి మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా అంతుచిక్కలేదు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు వీఐపీల జాబితాను సిద్ధం చేశారు. అలాగే తోటలో కూర్చుని తన స్వహస్తాలో పేజీల ఉత్తరం రాశాడని తోటలోని కూలీలు పోలీసులకు తెలపగా, ఆ ఉత్తరం కనిపించడం లేదు. సుబ్రమణియన్ స్వాధీనంలో మంత్రికి సంబంధించినవిగా చెప్పబడుతున్న కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయి. ఐటీ అధికారుల ముందు సుబ్రమణియన్ వాంగ్మూలం మంత్రి విజయభాస్కర్‌ను ఇరుకున పడేస్తుందనే కారణంతో ఎవరైనా హత్యచేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏది నిజం?
► సుబ్రమణియన్ మృతిపై అనుమానాలెన్నో? ► ఆత్మహత్యేనని పీఎం రిపోర్ ► ఐటీ ప్రశ్నలు.. బెదిరింపులే కారణమా? ► మంత్రి స్నేహితుని మృతిపై సర్వత్రా ఉత్కంఠ ► న్యాయ విచారణకు ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ తమిళనాడు ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ (52) మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయనది ఆత్మహత్యని కొందరు, కాదు సహజమరణమని మరికొందరు వాదించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా మంత్రి స్నేహితుడి మృతిపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన కారణంగా రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ టోపీ గుర్తుపై బరిలోకి దిగాడు. రెండాకుల చిహ్నం లేకుండా గెలుపు అసాధ్యమని తేలిపోవడంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డాడు. నగదు, బహుమతులతో ఓటర్లను ఆకట్టుకునే బాధ్యతను మంత్రి విజయభాస్కర్‌కు దినకరన్ అప్పగించాడు. ఈ సమాచారం ఎన్నికల కమిషన్ చెవినపడడంతో గత నెల 7వ తేదీన ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్ ఇళ్లు ,కార్యాలయాలు, క్వారీలు, ఆయన అనుచరులు, స్నేహితుల ఇళ్లపై 35 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. మంత్రి, ఆయన సతీమణి రమ్యలను ఐటీ అ«ధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఇలా ఐటీ అధికారుల విచారణకు గురైన వారిలో ఈనెల 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంత్రి స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ కూడా ఒకరు. ఐటీ దాడుల సమయంలో ఆయన విదేశాల్లో ఉండడంతో ఇటీవల చెన్నైకి తిరిగిరాగానే రెండుసార్లు విచారించారు. ఊపిరాడని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి మంత్రి కేసు విషయంలో ఐటీ అధికారులు సుబ్రమణియన్‌ను కీలకసాక్షిగా భావించి రెండుసార్లు చెన్నైకి పిలిపించుకుని పలు ప్రశ్నలను సంధించారు. మంత్రి సతీమణి నిర్మిస్తున్న కాలేజీ భవన నిర్మాణంపై అనేక ప్రశ్నలను వేసినట్లు సమాచారం. ఆ నిర్మాణంతో తనకు ఎటువంటి సంబంధం లేదని సుబ్రమణియన్ చేసిన వాదనతో అధికారులు ఏకీభవించలేదని తెలుస్తోంది. అంతేగాక సుబ్రమణియన్ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడంతో ఇతర కాంట్రాక్టు పనులు స్తంభించిపోయాయి. ఈనెల 9వ తేదీన మంగళవారం మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున సుబ్రమణియన్ నామక్కల్ జిల్లా సేవిట్టు రంగం»ట్టిలోని తన తోటలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఐటీ విచారణ తరువాత ఎలా ఉండేవారని సుబ్రమణియన్ భార్య శాంత, కుమార్తె అభిరామి, కుమారుడు శభరీస్ను పోలీసులు మంగళవారం విచారించారు. అయినా ముఖ్యమైన ఆధారాలు ఏవీ లభించలేదు. ఆర్కేనగర్లో నగదు బట్వాడా, రూ.89 కోట్ల పంపిణీపై ఆధారాలు తదితర అంశాల వివరాలను ఐటీ అధికారులకు చెప్పరాదని సుబ్రమణియన్‌ను కొందరు బెదిరించనట్లు కూడా తెలుస్తుండగా, బెదిరింపులకు గురిచేసిన వారే పథకం ప్రకారం సాక్ష్యాలు లేకుండా ఆయనను హతమార్చి ఉండొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. న్యాయవిచారణకు స్టాలిన్ డిమాండ్ మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ అనుమానాస్పద మృతి, కొడనాడు ఎస్టేట్‌లో హత్య దోపీడి ఉదంతంలో ప్రధాన ముద్దాయి, జయలలిత కారు మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలపై న్యాయవిచారణ జరపాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. సుబ్రమణియన్ ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రూ.89 కోట్ల నగదు బట్వాడా వ్యవహారంలో సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చని ఐటీశాఖ అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐటీ విచారణ జరుగుతున్న తరుణంలో సుబ్రమణియన్ మరణం కేసును పూర్తిగా మలుపుతిప్పిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కీలకమైన కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఆయన మరణం అనేక సందేహాలకు తెరలేపినందున న్యాయవిచారణ జరపాలని ఆయన సీఎంను కోరారు. ఇదిలా ఉండగా, స్థిరాస్తుల మోసం కేసులో మంత్రి విజయభాస్కర్ సమీప బంధువులు సుందరం, ధనపాల్లకు కోవై నేరవిభాగ న్యాయస్థానం మంగళవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. -
మరణం.. మర్మమేనా?
► అనుమానాస్పద స్థితిలో మంత్రి విజయభాస్కర్ స్నేహితుడి మృతి ► మృతుడు మంత్రితోపాటూ ఐటీ చిట్టాలో నిందితుడు ఆర్కేనగర్ ఉప ఎన్నికల తరువాత ఐటీ దాడులు, ఎన్నికల రద్దు తదితర వరుస అనూహ్య పరిణామాల జాబితాలో మరో అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వంలో ప్రముఖ కాంట్రాక్టర్, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ సోమవారం ఉదయం అకస్మాత్తుగా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. సుబ్రమణియన్ మృతి సహజమా, ఆత్మహత్యా, ఐటీ దాడులు, నేర నేపథ్యమా అనే అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు బట్వాడా సాగిందని ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖాధికారులు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ సహా 35 చోట్ల ఆకస్మికదాడులు జరిపారు. దాదాపుగా అందరూ అధికార పార్టీకి చెందినవారిపైనే గురిపెట్టారు. ఈ దాడుల్లో మంత్రి ఇంటి నుంచి రూ.50 కోట్లు పట్టుబడినట్లు సమాచారం. అంతేగాక ఉప ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు, ఓటర్లకు నగదు, బహుమతి కూపన్లు పంచినట్లు తేలింది. దీంతో ఉప ఎన్నిక రద్దయింది. ఐటీ అధికారులు కేసు నమోదు చేసి, మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గీతాలక్ష్మి, సమక అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఆయన భార్య నటి రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. వీరందరికీ ఐటీ అధికారులు సమన్లు జారీ చేసి విచారించారు. ఇటీవల మంత్రి సతీమణి రమ్యకు కూడా సమన్లు అందజేసి, విచారించారు. అదే సమయంలో నామక్కల్ జిల్లా మోగనూరు రోడ్డు ఉపాధ్యాయకాలనీలోని మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్(52) ఇంటిపై సైతం దాడులు జరిపారు. అయితే ఐటీ దాడుల సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్‌గా పేరుగాంచిన సుబ్రమణియన్ ఇంటిలో సుమారు 10 గంటలపాటూ తనిఖీలు నిర్వహించారు. సదరు సుబ్రమణియన్ పుదుక్కోట్టై, కరూరులో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ కాంట్రాక్టు పొందారు. మంత్రి విజయభాస్కర్ సిఫార్సుతోనే ఆయనకు ఈ కాంట్రాక్టు దక్కింది. భవన నిర్మాణ అంచనాలు, ఎంతకు ఒప్పందం, ఇందులో కమీషన్‌గా ఎవరి వాటా ఎంత అనే ఆధారాలు ఐటీ దాడుల్లో లభించినట్లు సమాచారం. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకునే సుబ్రమణియన్‌కి మరో మంత్రి ద్వారా మంత్రి విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడగా అనేక నిర్మాణాలతో పెద్ద కాంట్రాక్టరుగా ఎదిగారు. సుబ్రమణియన్ ఇటీవలే విదేశాల నుంచి తిరిగిరాగా విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం తెల్లవారుజామున నామక్కల్ జిల్లా సేవిట్టు రంగ»ట్టి తోటకు వెళ్లి స్నానం చేశారు. తోటలో సేదతీరుతుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. తోటలో పనిచేసే పనివాళ్లు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్యంగా తిరుగుతుండే సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుకు గురై మరణించారా అనే సందేహాలు నెలకొన్నాయి. -
50 శాతం రద్దు!
► వైద్యులకు షాక్ ► వైద్య కౌన్సిల్ నిబంధనలు తప్పనిసరి ► ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు పీజీలో యాభై శాతం సీట్ల కేటాయింపును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైద్యులకు షాక్ ఇచ్చే రీతిలో తీర్పు వెలువడడమే కాకుండా, భారత వైద్య కౌన్సిల్ నిబంధనల మేరకు సీట్ల కేటాయింపులు సాగాల్సిందేనని శనివారం కోర్టు స్పష్టం చేసింది. సాక్షి, చెన్నై: గ్రాడ్యుయేషన్‌తో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులుగా సేవల్ని అందిస్తున్న వారికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రత్యేక రాయితీ ఇన్నాళ్లు తమిళనాట దక్కుతూ వచ్చింది. తమిళనాడు వైద్య విధానం మేరకు ఉన్నత చదువుల్లో 50 శాతం సీట్లను ఈ వైద్యులకు కేటాయిస్తూ వచ్చారు. నీట్ పుణ్యమా ఇటీవల భారత వైద్య కౌన్సిల్ రూపొందించిన నిబంధనలు తమిళనాడు పాలసీ మీద తీవ్ర ప్రభావం పడేలా చేసింది. నీట్‌కు వ్యతిరేకంగా ఓ వైపు పోరాటం సాగుతున్న సమయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు వైద్యుల్ని ఆందోళనలో పడేసింది. యాభై శాతం సీట్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు. రెండు వారాలకు పైగా ఆందోళనలు సాగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అప్పీలుకు వెళ్లింది. ప్రభుత్వం, వైద్య సంఘాల తరఫున దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్లతోకూడిన బెంచ్ విచారించింది. ఈ బెంచ్ తీర్పుభిన్న వాదనలకు దారి తీయడంతో మూడో న్యాయమూర్తి బెంచ్‌కు విచారణ చేరింది. న్యాయమూర్తి సత్యనారాయన్ నేతృత్వంలో, న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ రెండు రోజులుగా పిటిషన్‌ను విచారించి శనివారం తీర్పును వెలువరించింది. 50 శాతం రద్దు : ఇది వరకు ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి శశిధరన్ తమిళనాడు పాలసీకి అనుగుణంగా, న్యాయమూర్తి సుబ్రమణియన్ భారత వైద్య కౌన్సిల్ నిబంధనల్ని పాటించాల్సిన ఇచ్చిన తీర్పులను, తన నేతృత్వంలోని సాగిన విచారణను పరిగణించి న్యాయమూర్తి సత్యనారాయణన్ సాయంత్రం నాలుగున్నర గంటలకు తీర్పు ఇచ్చారు. తమకు అనుకూలంగా తీర్పు ఉంటుందన్న భావనతో వైద్యులు ఆందోళనను సైతం వీడి రోగులకు వైద్య సేవల్ని అందించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తీర్పు వైద్యులకు పెద్ద షాక్‌గా మారింది. న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును గుర్తుచేస్తూ న్యాయమూర్తి సత్యనారాయణన్ 120 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు. 50 శాతం కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు పాలసీతో పని లేదని, నీట్ రూపంలో భారత వైద్య కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధనల్ని అనుసరించాల్సిన అవసరం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. అప్పీలు పిటిషన్లను తిరస్కరించింది. కింది బెంచ్ ఇచ్చిన తీర్పు, న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును సమర్థిస్తూ 50 శాతం రద్దును ధ్రువీకరిస్తున్నట్టు సత్యనారాయణన్ ప్రకటించడం వైద్యులక పెద్ద షాక్ తగిలేలా చేసింది. తమిళనాడు హక్కులను కాలరాసే విధంగా తీర్పు వెలువడిందంటూ వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. భవిష్యత్తుల్లో గ్రామీణ, అటవీ, కుగ్రామాల్లో వైద్య సేవల్ని అందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురారు అని , ఇందుకు అద్దం పట్టే రీతిలో తీర్పు వెలువడిందని వైద్యుల సంఘం నాయకుడు కదిర్ వేల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే విధానం అంటూ, 28 ఏళ్లుగా తమిళనాడులో సాగుతున్న విధానాన్ని తుంగలో తొక్కడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మరో నాయకుడు బాలకృష్ణన్ పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ప్రభుత్వ వైద్యులకు అనుగుణంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తుల్లో గ్రామీణ ప్రాంతాల వైపుగా ఏ వైద్యుడూ వెళ్లడని, అలాగే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థికి వైద్య సీటు అందని ద్రాక్షగా మారడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించినానంతరం తదుపరి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. -
ఫెడ్ పెంపును తట్టుకుంటాం
ఆ శక్తి మన ఆర్థిక వ్యవస్థకుంది • కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుంది • ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ • అనిశ్చితికి తెరపడింది: శక్తికాంత దాస్ • కొంత కాలం పాటు విదేశీ నిధులు వెనక్కి: ఆర్థికశాఖ • 0.25% పెంపుతో... 0.75%కి ఫెడ్ రేటు • వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు ఉండొచ్చన్న ఫెడ్ చీఫ్ ఎలెన్ న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే శక్తి మనకుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కరెన్సీ మార్కెట్లో తక్షణం స్వల్ప ఆటు పోట్లు కనిపించినా తర్వాత స్థిరపడుతుందని అభయమిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి అమెరికా ఆర్థిక రంగం పురోగమిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా 0.50%గా ఉన్న ఫెడ్ ఫండ్ రేటు 0.75%కి చేరింది. అంతేకాక... వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు నిర్ణయం ఉంటుందని కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ సంకేతాలిచ్చారు. దీంతో ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనిశ్చితికి తెరపడింది..: అమెరికాలో అమల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మన వడ్డీ రేట్లను సమతుల్యం చేయాల్సి ఉందని, ఫెడ్ రేటు పెంపుతో అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితికి తెరపడిందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. దేశీయ మార్కెట్లు ఇప్పటికే ఈ రేటు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నాయని చెప్పారు. వృద్ధి అంచనాలు స్థిరంగానే ఉన్నాయన్నారు. స్వల్ప ఆటు పోట్ల అనంతరం కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుందని చెప్పారు.మన ఆర్థిక రంగానికి ఆ శక్తి ఉంది...‘‘దేశీయ ఆర్థిక రంగానికి ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే అద్భుత శక్తి ఉంది. అయితే, అంచనాలను పునఃసమీక్షించాల్సి ఉంది. కొంత కాలం పాటు వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు నిధులు తరలిపోవడం ఉంటుంది. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే మనపై ప్రభావం తక్కువే’’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఫెడ్ రేటు పెంపును ఆర్బీఐ ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించగా... యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ ఈ నెల సమీక్ష అనంతరం నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు తక్కువుంటే నిధులు తరలిపోతాయ్ అమెరికాను డిపాజిట్లకు సురక్షిత ప్రదేశంగా పరిగణిస్తారని వడ్డీ రేటు పెంపు ఎప్పుడు వెలువడినా నిధులు వెనక్కి మళ్లడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం సాధారణమేనని ఆర్థిక శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు. ‘‘ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉండాలని మన దేశం భావిస్తోంది. అయితే దీన్ని బ్యాలన్స్ చేయాల్సి ఉంది. అప్పుడే ఆ ప్రభావం రూపాయిపై పడకుండా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే నిధులు తరలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. అమెరికా, భారత వడ్డీ రేట్లలో మరింత అంతరం ఉంటే రూపాయి ప్రభావితం అవుతుందని, కనుక వడ్డీ రేట్ల విషయంలో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడ్ నిర్ణయంతో గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి డాలర్‌తో 40 పైసలు బలహీనపడి 67.85కు చేరుకున్న విషయం తెలిసిందే. -
సీఐ వీరంగం ... బహిరంగ క్షమాపణ
టీనగర్: అదృశ్యమైన కుమార్తె గురించి విచారించేందుకు వెళ్లిన తండ్రిపై ఇన్స్పెక్టర్ దాడి చేశారు. దీనిపై స్నేహితులు, బంధువులు నిలదీయడంతో ఇన్స్పెక్టర్ బహిరంగ క్షమాపణ తెలిపారు. ఈ వ్యవహారం తాంబరంలో తీవ్ర సంచలనం కలిగించింది. చెన్నై, సైదాపేటకు చెందిన మేతర్. ఇతని భార్య మేరి మృతిచెందారు. వీరి కుమార్తె అముదవల్లి (4). వీరితోపాటు మేతర్ తల్లి నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కీల్‌కట్టలైలో నివసిస్తున్న మేరి అక్క ఇంటికి అముదవల్లిని మేతర్ తల్లి తీసుకువెళ్లింది. తాంబరానికి వెళ్లగానే మేతర్ తల్లి ఒక టాస్మాక్‌లో మద్యం తాగారు. మత్తు తలకెక్కడంతో కొద్దిసేపట్లోనే బస్టాండులోనే తూలిపోయారు. దీంతో అముదవల్లి బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో తిరిగింది. దీన్ని గమనించిన కొందరు తాంబరం పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని అముదవల్లిని రక్షించారు. ఆమెను తాంబరం సీటీవో కాలనిలోగల ఉదవుం ఉల్లంగల్ అనే అనాథాశ్రమంలో చేర్చారు. తన తల్లి, కుమార్తె మేరి అక్క ఇంట్లోనే ఉంటారని మేతర్ భావించి మిన్నకుండిపోయారు. ఇలావుండగా మేరీ అక్కకు మేతర్ ఫోన్ చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకోలేదన్న విషయం మేతర్కు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను తాంబరం చేరుకుని విచారణ జరిపారు. ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో తాంబరం పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ సుబ్రమణియం వద్ద విచారణ జరిపారు. ఆయన ఏమీ ప్రశ్నించకుండా మేతర్పై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటికి చేరాడు. తర్వాత ఆదివారం స్నేహితుల సాయంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. మేతర్పై ఎలా దాడి చేస్తారని స్నేహితులు, బంధువులు ఇన్స్పెక్టర్ను ప్రశ్నించారు. చాలా సేపు వారి మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం ఇన్స్పెక్టర్ బహిరంగ క్షమాపణ కోరాడు. దీంతో ఉదవుం ఉల్లంగల్ అనాథాశ్రమంలో వున్న బిడ్డను మేతర్కు అప్పగించారు. -
భువనేశ్వరి ఇల్లు ఆక్రమణ
తన ఇంటిని ఆక్రమించారంటూ నటి భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి స్థానిక సాలిగ్రామంలో ఉన్నారు. ఈమె కోవై జిల్లా అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ఏముందంటే... తనకు అన్నూర్ గ్రామంలో ఇల్లు, థియేటర్ ఉన్నాయన్నారు. వీటిని 2012లో అన్నూరుకు చెందిన వ్యాపారవేత్త సుబ్రమణియన్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే సుబ్రమణియన్ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి తన ఇల్లు, థియేటర్లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకుని తన ఇంటిని, థియేటర్‌ను తనకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సుబ్రమణియన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.