
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఈ ఏడాది చివరితో తన బాధ్యతలకు విరామం పలకనున్నారు. తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్రమణియన్‌ను 2018 డిసెంబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేంద్రం నియమించింది. అంతకుముందు వరకు అరవింద్ సుబ్రమణియన్ ఈ బాధ్యతలు చూశారు. మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిపోనుంది.
ఈలోపే కేవీ సుబ్రమణియన్ తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు, మార్గదర్శకంగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత బోధనవైపు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని సుబ్రమణియన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment