Arvind Subramaniyan
-
మళ్లీ ప్రొఫెసర్‌గానే పనిచేస్తా: థ్యాంక్యూ మోడీజీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఈ ఏడాది చివరితో తన బాధ్యతలకు విరామం పలకనున్నారు. తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్రమణియన్‌ను 2018 డిసెంబర్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేంద్రం నియమించింది. అంతకుముందు వరకు అరవింద్ సుబ్రమణియన్ ఈ బాధ్యతలు చూశారు. మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిపోనుంది. ఈలోపే కేవీ సుబ్రమణియన్ తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు, మార్గదర్శకంగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత బోధనవైపు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని సుబ్రమణియన్ ప్రకటించారు. -
మాజీ ఆర్థిక సలహదారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల రద్దు పెద్ద తప్పిదమని విమర్శలు గుప్పిస్తోంటే.. మరోవైపు నోట్ల రద్దు అమానుషం అదొక మానిటరీ షాక్ అంటూ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ మరో బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు 8శాతంగా ఉన్న జీడీపీ దాదాపు ఏడు త్రైమాసికాల్లో 6.8శాతానికి కి పడిపోందని విమర్శించారు. డీమానిటైజేషన్పై పెద్ద నోట్ల రద్దుపై మౌనాన్ని వీడిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ "భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్" అని పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80 శాతం కరెన్సీ రద్దు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందన్నారు. డిసెంబర్ 5న విడుదలవనున్నఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ అనే పుస్తకంలో అరవింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థికవృద్ది మరింత మందగించిందని టు పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్- పొలిటికల్ అండ్ ఎకానమిక్ అనే చాప్టర్లో రాసుకొచ్చారు. అధిక వడ్డీరేటు, జీఎస్టీ చట్టం అమలు, చమురు ధరలు లాంటి అంశాలు ఆర్థికవృద్ది రేటును ప్రభావితం చేసినప్పటికీ నోట్లరద్దుతో వృద్ది మందగించిందనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు. -
జీఎస్టీ చాలా క్లిష్టమైందే..కానీ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జీఎస్టీ జిఎస్టి శ్లాబులను కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను సైతం కాలక్రమేణా విలీనం చేసే అవకాశాలున్నాయన్న సంకేతాలనందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘ఇక్ఫాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లుర్నింగ్’లో ప్రసంగించిన సుబ్రమణియన్ జీఎస్టీ అమలు ఒక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. తదుపరి ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వ్యవస్థ స్థిరపడతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టి చట్టం వచ్చే 6-9 నెలల కాలంలో స్థిరత్వం సాధించనుందని, ఇతర దేశాలకు సైతం మార్గదర్శకం కానుందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. కొత్త పరోక్ష పన్నుల విధానంలో నిలకడ వచ్చాక పన్ను శ్లాబులను కుదించే ప్రక్రియ ప్రారంభం కావచ్చన్నారు. భవిష్యత్లోపెట్రోల్, డీజిల్‌ను జిఎస్టి పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ర్టాల అంగీకారమే కీలకమని అన్నారు. అయితే, భారత్‌లాంటి పెద్ద దేశంలో ఒకే జిఎస్టి రేటు మాత్రం సాధ్యపడకపోచ్చని పేర్కొన్నారు. జిఎస్టి పోర్టల్‌లో రిటర్నులు ఫైలింగ్ వ్యవస్థల్లో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు భిన్న ఐటీ వ్యవస్థలను కలిగి ఉన్న నేపథ్యంలో జిఎస్టి సిస్టమ్ కొంత సంక్లిష్టంగా మారిందన్నారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక అవాంతరాలు గురించి అడిగినప్పుడు వ్యవస్థ ఎంత క్లిష్టంగా ఉందో మీకు చెప్పలేను. ఇంకా బాగా చేయగలిగి ఉండే బావుండేదని తాను భావిస్తున్నానన్నారు. కానీ జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి సరైన చర్య తీసుకుంటోంది అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిఎస్టిలో 5, 12, 18, 28 శాతం ఇలా నాలుగు పన్ను శ్లాబులుండగా, ఇటీవలి కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్టీ స్లాబుల్లో పలు మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
25% తగ్గిన రాయితీ సిలిండర్ విక్రయాలు
న్యూఢిల్లీ: వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ బదిలీ (డీబీటీ) పథకాన్ని అమలు చేయడంవల్ల రాయితీ సిలిండర్ల విక్రయాలు సుమారు 25 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ గురువారం యూఎన్డీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. బోగస్ లబ్ధిదారులను వీలైనంతగా ఏరివేయడంవల్లనే ఇది సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు. డీబీటీని అమలు చేయడంవల్ల బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట వేయగలిగామని, దాంతో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల విక్రయాలు చాలావరకు తగ్గాయని ఆయన వివరించారు. 2014-15లో ఈ పథకంవల్ల రూ.12,700 కోట్లవరకు ఆదా చేయవచ్చని భావించామని, అయితే రూ.6,500 కోట్లమేరనే ఆదా చేయగలిగామని తెలిపారు.