
సాక్షి,న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల రద్దు పెద్ద తప్పిదమని విమర్శలు గుప్పిస్తోంటే.. మరోవైపు నోట్ల రద్దు అమానుషం అదొక మానిటరీ షాక్ అంటూ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ మరో బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు 8శాతంగా ఉన్న జీడీపీ దాదాపు ఏడు త్రైమాసికాల్లో 6.8శాతానికి కి పడిపోందని విమర్శించారు.
డీమానిటైజేషన్‌పై పెద్ద నోట్ల రద్దుపై మౌనాన్ని వీడిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ "భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్" అని పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80 శాతం కరెన్సీ రద్దు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందన్నారు. డిసెంబర్ 5న విడుదలవనున్నఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ అనే పుస్తకంలో అరవింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థికవృద్ది మరింత మందగించిందని టు పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్- పొలిటికల్ అండ్ ఎకానమిక్ అనే చాప్టర్‌లో రాసుకొచ్చారు. అధిక వడ్డీరేటు, జీఎస్‌టీ చట్టం అమలు, చమురు ధరలు లాంటి అంశాలు ఆర్థికవృద్ది రేటును ప్రభావితం చేసినప్పటికీ నోట్లరద్దుతో వృద్ది మందగించిందనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment