monetary
-
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!
న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్ సర్వీసులను ఐఆర్సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది. ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది. ‘‘భారతీయ రైల్వేస్ తన కస్టమర్/వెండార్ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది. దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవసీకి రిస్కులపై సందేహాలు... ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమోల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్సీటీసీ గానీ ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు.. రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్సీటీసీ ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది. -
మాజీ ఆర్థిక సలహదారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల రద్దు పెద్ద తప్పిదమని విమర్శలు గుప్పిస్తోంటే.. మరోవైపు నోట్ల రద్దు అమానుషం అదొక మానిటరీ షాక్ అంటూ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ మరో బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు 8శాతంగా ఉన్న జీడీపీ దాదాపు ఏడు త్రైమాసికాల్లో 6.8శాతానికి కి పడిపోందని విమర్శించారు. డీమానిటైజేషన్పై పెద్ద నోట్ల రద్దుపై మౌనాన్ని వీడిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ "భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్" అని పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80 శాతం కరెన్సీ రద్దు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందన్నారు. డిసెంబర్ 5న విడుదలవనున్నఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ అనే పుస్తకంలో అరవింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థికవృద్ది మరింత మందగించిందని టు పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్- పొలిటికల్ అండ్ ఎకానమిక్ అనే చాప్టర్లో రాసుకొచ్చారు. అధిక వడ్డీరేటు, జీఎస్టీ చట్టం అమలు, చమురు ధరలు లాంటి అంశాలు ఆర్థికవృద్ది రేటును ప్రభావితం చేసినప్పటికీ నోట్లరద్దుతో వృద్ది మందగించిందనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు. -
ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్య సాధన కష్టమే
ఐఎంఎఫ్ అంచనా సమన్వయ లోపాలే కారణంగా విశ్లేషణ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేవలం తన ద్రవ్య పరపతి విధానాల ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడం కష్టమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్య పరపతి విధానాల బదలాయింపు’ పేరుతో ఐఎంఎఫ్ తాజా అధ్యయన పత్రాన్ని విడుదల చేసింది. దిగువస్థాయి ఆదాయాల దేశాల్లో ద్రవ్య, పరపతి విధానాల ద్వారా ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించడం తేలిక్కాదని ఈ అధ్యయన పత్రం వివరించింది. ఆర్బీఐ నియంత్రణలోని పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ (రెపో, రివర్స్ రెపో వంటి సాధనాలు)-ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మధ్య తగిన విశ్వసనీయ, సమర్థవంతమైన సంబంధాలు లేకపోవడం భారత్‌కు సంబంధించి తమ ‘ద్రవ్యోల్బణం లక్ష్య సాధన కష్టనష్టాల’ అంచనాకు కారణంగా వివరించింది. ఇప్పటికే దేశంలో రుణ వృద్ధి, డిపాజిట్ రేట్లు తగ్గడాన్నీ నివేదిక ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ‘ప్లస్ 2 లేదా మైనస్ 2’తో 4 శాతంగా ఉండేలా చర్యలు తీసుకునే బాధ్యతలను ఆర్బీఐకి అప్పగించిన నేపథ్యంలో ఐఎంఎఫ్ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఆర్థిక రికవరీ: మోర్గాన్ స్టాన్లీ మరోవైపు దేశంలో ఆర్థిక రికవరీ మున్ముందు మరింత వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. విద్యుత్ వినియోగం పెరగడం, వినియోగ వృద్ధి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా రుణ రేట్లు తగ్గే అవకాశాలను ఇందుకు కారణంగా చూపింది. అలాగే వచ్చే రెండేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం దిగువనే కొనసాగుతుందని కూడా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. గ్రామీణ డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో భారత్ వృద్ధికి దోహదపడే అంశాలుగా వివరించింది. -
ద్రవ్యోల్బణం పెరిగినా రేటు కోత: బీఓఎఫ్ఏ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 9వ తేదీన జరిపే ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు-రెపోను పావుశాతం తగ్గించే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.2 (మేలో 21 నెలల గరిష్ట స్థాయి 5.8 శాతం) శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన బ్యాంక్... అయినప్పటికీ రేటు కోత ఉంటుందని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదు అవకాశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని ఒక పరిశోధనా పత్రంలో విశ్లేషించింది. -
పాలసీ విధానాలపై అంతర్జాతీయ మార్గదర్శకాలు!
♦ ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన ♦ లేదంటే... ప్రతికూల పరిణామలకు ♦ అవకాశం ఉంటుందని విశ్లేషణ ముంబై: ద్రవ్య పరపతి విధానాలకు సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని మార్గదర్శకాలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాధ్యతాయుత ద్రవ్య విధాన ప్రవర్తన దిశలో ఇది కీలకమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధే లక్ష్యంగా ఒక దేశం తీసుకునే దూకుడు నిర్ణయాలు... అంతర్జాతీయంగా మరో దేశంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, దీనిపై సమగ్ర మార్గదర్శకాలు అవసరమని అన్నారు. అంగీకృత మార్గదర్శకాలు పాలసీ విధాన నిర్ణయాల్లో పాటిస్తే... ఏకీకృత సానుకూల ఫలితాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ‘రూల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ’ అన్న శీర్షికన రాసిన ఒక వర్కింగ్ పేపర్లో ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనుసరించే విధానాలు తాత్కాలిక ప్రయోజనాలను కల్పించే విధంగా కాకుండా... దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేట్లు ఉండాలని అన్నారు. ఒక విధానం దేశీయంగా అంతర్జాతీయ సానుకూల ఫలితాన్ని ఇస్తే.. అది దీర్ఘకాలంలో ప్రపంచ సంక్షేమానికి దోహదపడుతుందని వివరించారు. విధానాల అసమర్థత అనే పదానికి ఎక్కడా తావులేని పరిస్థితిని తద్వారా సృష్టించవచ్చని అన్నారు. సిగ్మా పేరుతో ఇలాంటి ఒక విధానాన్ని ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అభివృద్ధి చేసింది. -
2న ఆర్ బీఐ ద్రవ్య పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఫిబ్రవరి 2వ తేదీన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఫిబ్రవరి 29న ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ సమీక్ష నిర్వహించనుంది. అంచనాలు చూస్తే... బడ్జెట్ నేపథ్యంలో ఈ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం)ను తగ్గించకపోవచ్చని ఇప్పటికే సిటీగ్రూప్, హెచ్ఎస్బీసీ వంటి ఆర్థిక సంస్థలు అంచనావేశాయి. బడ్జెట్లోని అంశాలను పరిశీలించిన తర్వాత మార్చి, ఏప్రిల్‌లో ఈ రేటు పావుశాతం తగ్గే వీలుందని సిటీ గ్రూప్ అంచనా. కాగా ఫిబ్రవరి 2న పావుశాతం రేటు కోత ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడుతోంది.