2న ఆర్ బీఐ ద్రవ్య పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఫిబ్రవరి 2వ తేదీన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఫిబ్రవరి 29న ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ సమీక్ష నిర్వహించనుంది.
అంచనాలు చూస్తే...
బడ్జెట్ నేపథ్యంలో ఈ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం)ను తగ్గించకపోవచ్చని ఇప్పటికే సిటీగ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ఆర్థిక సంస్థలు అంచనావేశాయి. బడ్జెట్‌లోని అంశాలను పరిశీలించిన తర్వాత మార్చి, ఏప్రిల్‌లో ఈ రేటు పావుశాతం తగ్గే వీలుందని సిటీ గ్రూప్ అంచనా. కాగా ఫిబ్రవరి 2న పావుశాతం రేటు కోత ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) అభిప్రాయపడుతోంది.