
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్పిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. శక్తికాంత్ దాస్.. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ2గా నియమించడానికి క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది., ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DoPT) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాతా ఉత్తర్వులు ప్రకారం ప్రధాని మోదీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ శక్తికాంత్ దాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే పికె మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుండి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు.2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు. 1980 తమిళనాడు క్యాడర్ కు ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్.. ఢిల్లీ సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం బర్మింగమ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పూర్తి చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం ‘ పెద్ద నోట్ల రద్దు’ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన ఎకానామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment