ద్రవ్యోల్బణం పెరిగినా రేటు కోత: బీఓఎఫ్ఏ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 9వ తేదీన జరిపే ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు-రెపోను పావుశాతం తగ్గించే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.2 (మేలో 21 నెలల గరిష్ట స్థాయి 5.8 శాతం) శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన బ్యాంక్... అయినప్పటికీ రేటు కోత ఉంటుందని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదు అవకాశాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని ఒక పరిశోధనా పత్రంలో విశ్లేషించింది.