Demonetisation
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
Rahul Gandhi: బీజేపీ విధానాలతో ప్రజలకు చావులే
జంషెడ్పూర్/ధన్‌బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్ఎస్ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్‌పూర్‌లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.మహారాష్ట్రలోనూ కుల గణన సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
హ్యపీ బర్త్‌డే: ‘నోట్ల రద్దు’ను వినూత్నంగా గుర్తు చేసిన అఖిలేష్ యాదవ్
ఏడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు గాయాల్ని వినూత్నంగా గుర్తు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు సమయంలో జన్మించిన 'ఖాజాంచి' (కోశాధికారి అని అర్థం) అనే చిన్నారి పుట్టినరోజును లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సతమతమవుతున్న సమయంలో 'ఖాజాంచి' ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చిన్నారి తండ్రి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి ఉండగా తల్లి ఆ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం రూ.15 లక్షల కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్‌ను కప్పిపుచ్చడమేనని ఆరోపించారు. ధనికుల ఖజానాను నింపేందుకు పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. బీజేపీ చెప్పినట్లుగా నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం ముగిసిపోలేదని ఆక్షేపించారు. మరో అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పుడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఖాజాంచి తల్లి, ఇతర పార్టీ సభ్యులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..
దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్ పేమెంట్ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్ దొరకడమే కష్టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్‌గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు. ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా.. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు. -
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్‌ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్‌ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
93 శాతం 2,000 నోట్లు వెనక్కు వచ్చేశాయ్: ఆర్బీఐ
ముంబై: ఉపసంహరణ నిర్ణయం వెలువడిన మే 19వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన ఒకటి పేర్కొంది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం, ఆగస్టు 31వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.0.24 లక్షల కోట్లకు పడిపోయింది. బ్యాంకులకు తిరిగి వచి్చన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో జరగ్గా, 13 శాతం బ్యాంకుల్లో ఇతర కరెన్సీలోకి మారి్పడి ద్వారా వెనక్కువచ్చాయి. అధిక విలువ నోట్లు కలిగి ఉన్న ప్రజలు 2023 సెప్టెంబరు 30 నాటికి ఆ నోట్లను డిపాజిట్ చేయాలని లేదా నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, మే 19వ తేదీన ఒక కీలక ప్రకటన చేస్తూ, రూ.2,000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8% మాత్రమే. వ్యవ స్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
పాక్‌లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా?
పేదరికం అంచునకు చేరుకున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు నల్లధనం సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్లో నల్లధనం విపరీతంగా పెరిగిపోవడంతో దానిని అరికట్టడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. పాకిస్తాన్లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన పోలీసు అధికారులు తమ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్లో నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా విఫలం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. పాక్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై మాట్లాడేందుకు ఏ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరని సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పాకిస్తాన్లో నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇది మొదట్లో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసిరింది. కానీ తరువాతి కాలంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచిందని ఆ పత్రిక పేర్కొంది. నగదు నిల్వలను అరికట్టేందుకు పాకిస్తాన్లో రూ.5000 నోటును దశలవారీగా రద్దు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. అయితే దీనిపై పాక్ అధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్‌లోనే అతిపెద్ద నోటు దక్షిణాసియా దేశాల్లో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన నోటు మరే ఇతర ఆసియా దేశంలోనూ లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గత ఏడాదిలో నగదు ప్రవాహం గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ మొత్తంమీద భౌతిక నగదు మారకం 29 శాతం వరకూ ఉంటుంది. పాకిస్తాన్లో జీడీపీలో 40 శాతం నల్లధనం పాకిస్తాన్లో నల్లధనంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ 341.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐపీఎస్ఓఎస్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం మేరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి సంవత్సరం 6 శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా నెట్టివేస్తున్నది ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..! -
రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా,‘ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్, అదనపు బెనిఫిట్స్ కూడా -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్‌లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!
న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ పబ్లిక్ యాప్ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) 55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, 23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి, 22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. మే 19వ తేదీన వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి. వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ... ► తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు. ► ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు. ► సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ► 2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు. ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్ చేయవచ్చు. లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు. ► ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి. ► రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. ► 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ మరిన్ని బిజినెస్ అపడేట్స్, ఇంట్రస్టింగ్ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పిచ్చి మోదీ: అధీర్
కోల్‌కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది. మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్ ఓ నేరగాడంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్ అన్నారు. -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెద్ద నోట్ల(500, 1000)ను 2016 నవంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, భారీ సంఖ్యలో ఉన్న ఈ నోట్లను ఏం చేశారు? కరెన్సీ నోట్లను కాల్చివేశారా?.. లేక ఈ కరెన్సీ నోట్లను ఆర్బీఐ వద్దే దాచి పెట్టారా? లేక రీసైక్లింగ్ చేశారా? అంత విలువ చేసే నోట్లను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
గతంలో రద్దైన పెద్ద నోట్లను ఏం చేశారో తెలుసా ?
-
ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేనా?
బ్రిటిష్ వలస పాలకులు కూడా పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నామని కోతలు కోసేవారు. అవే మాటల్ని దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా చెప్పింది. అవే ఇప్పటికీ కేంద్ర పాలకులు చెబుతారు. ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు. కానీ ఈ రాజకీయవేత్తలకు తమ ‘అమాయక మనస్తత్వం’ నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకు అందనంత పెద్ద జబ్బు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. రూ. 2 కూడా చేతిలో ఆడని అసంఖ్యాక కష్టజీవులకు దీనివల్ల కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? ‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కారణం – ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొలదిమంది సంపన్న స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోరికలేనని మరచిపోరాదు.... దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా తాను పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నానని బీరాలు పలకవచ్చు. కానీ, బ్రిటిష్ వలస పాలకులు కూడా అలాంటి కోతలే కోసేవారు. కానీ అసలు రహస్యం – పేద ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరక పోవడం. ఈ సత్యాన్ని స్వతంత్ర భారత పాలకులు వినమ్రతతో అంగీకరించి తీరాలి.’’ – జాతిపిత గాంధీజీ (1947 డిసెంబర్ 11); ‘ది హిందూ’ ప్రచురించిన ‘మహాత్మాగాంధీ: ది లాస్ట్ 200 డేస్’ నుంచి. ‘‘సంపన్నుల చేతిలో అంత అధికారం ఎలా గూడు కట్టుకుంది? పాలకులు ప్రయివేట్ కార్పొరేషన్ల పైన, సంపన్నుల ఆస్తుల పైన శ్రుతి మించిన ఆదాయంపై విధించే పన్నుల్ని తగ్గించి వేయడంవల్ల! మరోవైపున శ్రమజీవులైన కార్మిక సంఘాలను అణచి వేయడం ద్వారా వారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం ద్వారా కోత పెట్టేయడం రివాజుగా మారింది.’’ – ప్రసిద్ధ ఆర్థికవేత్త పాల్ క్రూగ్మన్ 2016లో అకస్మాత్తుగా బీజేపీ పాలకులు పెద్ద నోట్ల చలామణీని అదుపు చేసి దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడుతామని బీరాలు పలికి తాము చతికిలపడటమే గాక కోట్లాదిమంది సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు తేరుకోలేదు. ఈలోగానే ‘పెద్ద నోట్ల భారం’ పేరిట వాటిని చలామణీ నుంచి ఉపసంహరించే పేరిట గతంలో 500, 1000 నోట్లకు ఎసరు పెట్టినట్టే ఇప్పుడు రూ. 2000 నోట్లపై యుద్ధం ప్రకటించారు. 2016లో ‘పాకిస్తాన్‌పై యుద్ధం కోసం’ పెద్ద నోట్ల చలామణీని అదుపు చేస్తే, ఈ రోజు దాకా తేరుకోకుండా కునారిల్లుతూ వస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. సామాన్య ప్రజాబాహుళ్యం మౌలిక ప్రయోజనా లకు రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రత్యక్షంగా నష్టం కలగక పోవచ్చు. అయితే పరోక్షంగా ఎన్నికల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీలతో అనుసరించే ఎత్తుగడల నుంచి మాత్రం రెండువేల రూపాయల నోటు తొలగిపోదు. లోపాయకారీగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కేవలం పాలకపక్ష నాటకంగా పైకి కనిపించినా, పరోక్షంగా ప్రతిపక్షాల ప్రయోజనాలు నెరవేర్చడంలో కూడా ‘రెండు వేల నోటు’ ఉపయోగపడుతుందని మరచిపోరాదు. గతంలో రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు వల్ల ‘నల్ల ధనం, నకిలీ నోట్లు’ చలామణీ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఏళ్ల తరబడిగా తలదాచుకుంటున్న భారత పెట్టుబడి దారుల దొంగ డబ్బును దేశానికి తీసుకొచ్చి, భారత ప్రజలకు లక్షలు, కోట్లు పంచిపెడతానన్న ప్రధాన మంత్రి మాట ‘నీటి మూట’గా ఎలా మారిందో ప్రజలు చూశారు. ఈ సందర్భంగా నాటి రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ పాలకుల నిర్ణయాల్ని నిరసించి, ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం’లోకి పాలకులు నెట్టబోతున్నారని ప్రజల్ని హెచ్చరించి మరీ గవర్నర్ పదవికి రాజీనామా చేసి అమెరికాలో కొలువుకి ‘చెక్కేయ’వలసి వచ్చింది. రాజన్ హెచ్చరికలు దేశానికి ముందస్తు మెలకువలయ్యాయి. అయినా పాలకులలో చలనం లేదు. సుప్రీం కోర్టు కూడా ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న’ తీవ్ర నిరాశను బాహాటంగానే వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు స్వతం త్రంగా, ఎలాంటి ‘ఉచ్చులు’ లేకుండా బతకవచ్చునో జూలియస్ నైరేరి అధ్యక్షతన ఏర్పడిన ‘సౌత్ కమిషన్’ నిరూపించింది (1990 రిపోర్టు). కాంగ్రెస్ హయాంలో ప్రధాని హోదాలో నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆ రిపోర్టును ఆహ్వానించి కూడా ఆచరణలో అమలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా – ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అన్నార్తులైన ప్రజాబాహుళ్యంపై ఎక్కుపెట్టిన దారి దోపిడీ పద్ధతుల వల్ల ఆయా ఖండాల ప్రజలు ఎలా ఆర్థికంగా కునారిల్లి పోయారో ఆ సంస్థల ఆదేశంపై వాటి తరఫున ఆ దేశాలలో పని చేసిన వైస్ ప్రెసిడెంట్ డేవిసన్ బుధూ తన అనుభవాలను అమితమైన దుఃఖంతో అక్షరబద్ధం చేశారు. ‘‘ఈ ఖండాలలో కోటానుకోట్ల పేద ప్రజలు పట్టెడన్నం కోసం మాడుతున్నారు. అన్నార్తుల రక్తంతో తడిసిన మా అధికారుల చేతులను కడగటానికి ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ చాలవు’’ అని ప్రకటించారు! ‘రూ. 2000’ పెద్ద నోటును సర్క్యులేషన్ నుంచి కట్టడి చేసినంత మాత్రాన రూ. 2లు కూడా చేతిలో ఆడని అసంఖ్యాక సామాన్య కష్టజీవులకు కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర పాలకులు కొత్త వేషానికి గజ్జె కట్టారు. కర్ణాటక తాజా ఎన్నికల్లో రెండువేల రూపాయల కట్టలు ప్రాణం పోసుకున్నందువల్ల 2024 ఎన్నికల నాటికన్నా ఈ కట్టల్ని ‘కట్టడి’ చేయాలన్నది కేంద్ర పాలకుల ఎత్తుగడ! అసలు ‘మంచి పాలన’ పేరిట దేశ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు అని నిశితమైన ఆర్థిక వ్యవహారాల నిపుణులలో ఒకరైన సంజీవి గుహన్ ఖండించవలసి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ చరిత్రకారులైన ఎడ్వర్డ్ మాసన్, రాబర్ట్ ఆషర్ అభిప్రాయం కూడా అదే! అంతేగాదు, బీజేపీ పాలకుల నిర్ణయాలను ‘ఆదర్శం’గా భావించిన ఒక ‘నేత’ మరొక అడుగు ముందుకు వేసి – ప్రతిపక్షాల కూటమికి తనను రథసారథిని చేస్తే మొత్తం ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని అన్నట్టుగా ఓ ఇంగ్లిష్ ఛానల్లో బాహాటంగా ప్రకటించడంతోనే – రెండు వేల రూపాయల నోటుకు ‘వేటు’ పడిందని కొల్లలుగా ప్రకటనలు వెలువడజొచ్చాయి. ఈ సందర్భంగా రాజకీయ పాలకుల, నాయకుల తప్పిదాలకు మూలాన్ని కనుగొనే యత్నంలో ఐన్‌స్టీన్‌కూ, సోషలిస్టు నాయకుడు రావ్‌ుమనోహర్ లోహియాకూ మధ్య సాగిన ఒక ఆసక్తికరమైన సంభా షణను గమనించాలి. ఐన్‌స్టీన్: ‘రాజకీయులు చేసే తప్పిదాలు వాళ్ల లోని చెడ్డ తలంపుల వల్లగాక, అమాయకత్వం నుంచి పుట్టే లక్షణంగా మనం భావించవచ్చా?’ లోహియా: ‘అసలు రహస్యం – రాజకీయవేత్తలకు తమ అమా యక మనస్తత్వం నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకి అందనంత పెద్ద జబ్బు. ఆ జబ్బే వారిని పీడిస్తుండే పెద్ద రోగం. ఈ రోగం నుంచి బయట పడటం ఇష్టం లేనందుననే చాలా మంది రాజకీయులకు దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు గాక ఉండదు’! ఆర్థిక నిపుణులైన శుభదారావు నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్థికవేత్తల బృందం (క్వాంట్ ఎకో) వివరించినట్టుగా, పన్నుల ఎగ వేతకు వీలుగా దొంగచాటుగా అట్టిపెట్టుకోవడానికి ఈ 2000 లాంటి పెద్ద నోట్లు సంపన్నుల వద్ద మేట వేసుకున్నాయి. అవి ఇప్పుడు కోట్లాది విలువ చేసే లోహ సంపద పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గతంలో బ్యాంకుల వద్ద పొద్దుగూకులు పెద్ద నోట్లు మార్చుకోవడానికి పడిగాపులు పడి 125 మంది సాధారణ ఖాతాదార్ల ప్రాణాలు ‘హరీ’ అన్నాయి. ఈసారి ‘భాగోతం’ ఎలా ముగుస్తుందో రేపటి ‘వెండి తెర’పై చూడాల్సిందే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
2,000 నోటు.. సవాలక్ష ప్రశ్నలు!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నాటితో పోలిస్తే చిన్న లైన్లు, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలపరమైన గందరగోళం మధ్య రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. పాన్ లేదా ఆధార్ వంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఫారంలు తప్పనిసరని ఆర్బీఐ సూచించకపోయినా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది అవి కావాల్సిందే అనడంతో ఖాతాదారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఎల్రక్టానిక్ ఎంట్రీలు చేసుకుని నోట్లను మార్చగా, మరికొన్ని మాత్రం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలేమీ అడగకుండా రిజిస్టరులో పేరు, మొబైల్ నంబరు రాయాలంటూ కస్టమర్లకు సూచించాయి. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డులను చూపించాలని అడిగినట్లు కొందరు కస్టమర్లు తెలిపారు. అలాగే, మరికొన్ని బ్యాంకులు నోట్లను మార్చలేదని, దానికి బదులుగా తమ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా సూచించాయని వివరించారు. అయితే, 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు (డీమానిటైజేషన్) కనిపించినంతగా చాంతాడంత లైన్లు ఈసారి కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావొచ్చనే అంచనాలతో కూర్చునేందుకు, తాగు నీటికి ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది రాలేదు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) నోట్లను మార్చుకునేందుకు దాదా పు 130 రోజుల పైగా వ్యవధి ఉండటం ఇందుకు కారణమని పరిశీలకులు తెలిపారు. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నాలుగు నెలల సమయం ఉండటంతో డీమానిటైజేషన్‌తో పోలిస్తే అంత హడావుడి ఏమీ లేదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు వివరించారు. రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఎటువంటి ఫారం లేదా పత్రం అవసరం లేదంటూ ఎస్బీఐ తమ శాఖలకు అధికారికంగా మెమో పంపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి ఫారం నిర్దేశించకపోయినా, తమ ఖాతాదారులు కాకపోతే మాత్రం ఐడీ ప్రూఫ్ మాత్రం అడుగుతోంది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఇక కోటక్, హెచ్ఎస్బీసీ వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులు కాని వారి దగ్గర్నంచి ఫారం/ఐడీ ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రం తాము ఎటువంటి ఫారం లేదా ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చెల్లుబాటవడం కొనసాగుతుంది. సెపె్టంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చు లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. (అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) సమర్థించుకున్న ఆర్బీఐ.. రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ఢిల్లీ హైకోర్టులో ఆర్బీఐ సమర్థించుకుంది. ఇది డీమానిటైజేషన్ కాదని చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపింది., నిర్వహణ సౌలభ్యం కోసమే నోట్ల మార్పిడిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా నోట్లను మార్చుకోవచ్చన్న ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే లాయరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆర్బీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. ధ్రువీకరణ పత్రాల ప్రసక్తి లేకపోతే మాఫియా, నక్సల్స్ మొదలైన వారి వల్ల ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనరు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్‌ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్‌లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా?
ముంబై: రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ప్రొఫార్మా కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీనిని అన్ని బ్యాంకులకు పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. నోట్లను మార్పిడి చేయాలనుకునే వారు ఈ ప్రొఫార్మాను పూర్తి చేయడం తప్పనిసరని చెబుతున్నారు. ఈ ప్రొఫార్మా మొదటి కాలమ్‌లో నోట్లను మార్పిడి చేయాలనుకునే వారి పూర్తి పేరు రాయాలి. రెండో కాలమ్‌లో గుర్తింపు ధ్రువీకరణకు చూపే కార్డు, మూడో కాలమ్‌లో ఆ కార్డులోని నంబర్ నాలుగో కాలమ్‌లో రూ.2,000 నోట్లు, వాటి సంఖ్య, వాటి మొత్తంను తెలపాలి. చివరిగా డిపాజిట్ చేసే వ్యక్తి సంతకం చేయాలి. ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఎంఎన్ఆర్జీఏ కార్డు లేదా పాపులేషన్ రిజిస్టర్లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిల్లో ఏదో ఒకటి గుర్తింపు పత్రం ఒరిజినల్ కాపీని బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ లేకున్నా నోట్ల మార్పిడికి ఓకే. గత తప్పును కప్పిపుచ్చుకునేందుకే: విపక్షాలు రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా రెండో విడత నోట్ల రద్దు అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తం నోట్ల రద్దు వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మొదటిసారి నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా అసంఘటిత రంగం ఆసాంతం కుప్పకూలింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు’అంటూ ఖర్గే శనివారం పలు ట్వీట్లు చేశారు. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రభుత్వ ప్రకటనను ఎద్దేవా చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మరోసారి చపలచిత్తంతో తీసుకున్న నిర్ణయం. తుగ్లక్ తరహా నోట్ల రద్దు డ్రామా’అంటూ ఆమె అభివర్ణించారు. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా ఉంటుందంటూ ఆమె పలు ట్వీట్లలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. -
ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం
సాక్షి, నేషనల్ డెస్క్: అది 2016. నవంబర్ 8. రాత్రి 8 గంటల సమయం. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న వేళ. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి టీవీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. జాతినుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్న వాళ్లందరికీ షాకిస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) నల్లధనాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రూ.1,000, రూ.500 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ నోట్ల బెడద పోవడమే గాక నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ నిర్ణయంతో ఊపొస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి! కానీ అనంతర పరిణామాలను, ముఖ్యంగా నోట్ల మార్పిడి ప్రక్రియను సజావుగా డీల్ చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దాంతో కొద్ది నెలల పాటు దేశమంతా అక్షరాలా అల్లకల్లోలమైపోయింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంకు ముందు చూసినా కొండవీటి చాంతాటిని తలదన్నే లైన్లే. ఆ లైన్లలోనే కుప్పకూలిన ప్రాణాలు. నగదు మీదే ఆధారపడి నడిచే వ్యాపారాలు పడకేసి ఆర్థికంగా చితికిపోయిన సగటు బతుకులు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి కథలే! మనసుల్ని మెలిపెట్టే గాథలే. వ్యవసాయం మొదలుకుని ఆటోమొబైల్, నిర్మాణ తదితర కీలక రంగాలు నగదు కటకటతో కొన్నాళ్ల పాటు పూర్తిగా పడకేశాయి. మొత్తంగా దేశ ఆర్థిక రంగమే అతలాకుతలమైపోయింది. ఇంతా చేస్తే నోట్ల రద్దు వల్ల నల్లధనం ఏ మాత్రమూ కట్టడి కాలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు నిరూపణ కావడం మరో విషాదం. అప్పట్లో ప్రవేశపెట్టిన రూ.2,000 కరెన్సీని ఆర్బీఐ తాజాగా రద్దు చేసిన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలను జనం మరోసారి భయంభయంగా గుర్తు చేసుకుంటున్నారు... నోట్ల రద్దు–కొన్ని వాస్తవాలు ♦ పలు అంచనాల ప్రకారం మన దేశ జీడీపీలో 20 నుంచి 25 శాతం దాకా నల్లధనమే. అంటే రూ.30 లక్షల కోట్ల పై చిలుకు! ♦ నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధాని చెప్పుకొచ్చారు. జనం కూడా అందుకు సిద్ధపడ్డారు. ♦ నోట్ల రద్దుతో తమకు కలిగిన నష్టాలను, వ్యయప్రయాలను పళ్ల బిగువున భరించారు. ♦ నోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్ వ్యవస్థకు ఆవల ఉన్న రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం కింద మారుతుందని కేంద్రం ఆశించింది. ♦ కానీ వాస్తవంలో జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధమని గణాంకాలు తేల్చాయి. ♦ నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశం చలామణిలతో ఉన్న నగదులో ఏకంగా 86 శాతం (రూ.16.24 లక్షల కోట్లు) రూ.1,000, రూ.500 నోట్లే. ఇందులో రూ1,000 నోట్ల వాటా 38 శాతం కాగా రూ.500 నోట్లది 47 శాతం. అదంతా రాత్రికి రాత్రి పనికిరాకుండా పోయింది. ♦ ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చిందని అనంతరం రిజర్వు బ్యాంకే అధికారికంగా ప్రకటించింది. నల్లధనం కట్టడి లక్ష్యం ఇసుమంతైనా నెరవేరలేదని తద్వారా స్పష్టమైంది. ♦ నగదు కార్యకలాపాలను తగ్గించాలన్న ఉద్దేశమూ నెరవేరలేదు. 2016 నవంబర్‌లో దేశ ప్రజల దగ్గర రూ.17.7 కోట్ల విలువైన నగదుంటే 2022 అక్టోబర్ నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ♦ నకిలీ నోట్ల చలామణి కూడా పెద్దగా తగ్గలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్లలో అత్యధికం వంద రూపాయల నోట్లే కావడం ఇందుకు కారణమని తేలింది. ♦ కాకపోతే నోట్ల రద్దు వల్ల ఇటు ప్రజలకు, అటు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. ♦ నగదు కార్యకలాపాల మీదే ఆధారపడే 48 కోట్ల మందికి పైగా భారతీయులను పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ♦ దేశ జీడీపీలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్ల పాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్థికవేత్తల విస్మయం పలువురు ఆర్థికవేత్తలు కూడా నోట్ల రద్దు నిర్ణయంలో ఔచిత్యమేమిటో అంతుబట్టడం లేదంటూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ‘‘నల్లధనంలో మహా అయితే ఓ 5 శాతం మాత్రం నగదు రూపంలో ఉంటుందేమో. మిగతాదంతా భూములు, బంగారం వంటి ఆస్తుల రూపేణా మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మాయమైపోతుందని ఆర్బీఐ అనుకున్నారో!’’ అన్నారు. ♦ 2016 సెప్టెంబర్ దాకా ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన రఘురాం రాజన్ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని కుండబద్దలు కొట్టారు. ♦ నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమేనని గత జనవరిలో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కూడా, ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టంగా పేర్కొంది. చదవండి👉 ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్! -
ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
దేశంలో ఇప్పటివరకూ చలామణిలో రూ.2 వేల నోటు శకం ముగిసింది. రూ.2 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా చలామణి నుంచి ఉపసంహరించింది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఆరేళ్ల ప్రస్థానం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా 2016 నవంబర్ 8న ఆర్బీఐ ఈ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్‌తో విడుదల చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ఆకర్షణీయ డిజైన్ రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్యాన్ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది. మైసూరులో ప్రింటింగ్ రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2017 మార్చి ఆఖరు నాటికి 3,285 మిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది వీటి సంఖ్య కేవలం 3,365. అప్పటి నుంచి ముద్రణను క్రమంగా తగ్గించేసింది ఆర్బీఐ. 2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.18,037 కోట్లు. 2020 మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న అన్ని నోట్లలో రూ.20 వేల నోట్లు కేవలం 22.6 శాతం. ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి.. పరిమితికి మించితే అనుమతి తప్పనిసరి -
నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని... ఈ నిర్ణయం వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటిౖకైనా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కృష్ణమోహన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్‌లతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే అంగీకరించిందన్నారు. బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి అనేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయమే ఉదాహరణని ఎద్దేవా చేశారు. ప్రధానిపై నమ్మకంతో అప్పట్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని తాము సమర్థించామని, అయితే చెప్పిన లక్ష్యం ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఏ ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని... ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. నగదు చెలామణి పెరిగింది.. పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ కాబట్టే దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చెలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. 2014కు ముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు ఉండేదని, అదిప్పుడు 13 శాతానికి పెరిగిందన్నారు. అలాగే గతంతో పోలిస్తే పెద్ద నోట్ల వాడకం రెట్టింపయ్యిందని చెప్పారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి తెచ్చిన రూ. 2 వేల నోటు వల్ల పెద్ద నోట్ల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. కొత్త నోట్ల ముద్రణకు మోదీ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు ఖర్చు పెట్టిందని... ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టుకున్న నల్లధనమే రూ. 40 వేల కోట్లు.. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని చెప్పిన ప్రధాని మాటలు అపహాస్యమయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. 592 కేసుల్లో రూ. 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారని చెప్పారు. బీజేపీ వేసే ప్రతి అడుగు పేదలపై పిడుగులా మారిందని, నీతి ఆయోగ్ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడం.. తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందని, కేంద్రం ప్రతిరోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లని ఆయన పేర్కొన్నారు. మోదీ హయాంలో రూ. కోటీ ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలలో నిలబడి 108 మంది మరణించారని, నోట్ల రద్దు కారణంగా 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిందని, దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోందని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని భరోసా ఇచ్చిన పెద్దలు... ఇప్పుడు 2 వేల రోజులైనా ఏం మార్పు తెచ్చారని హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం పెరిగాయని ఆరోపించారు. -
‘నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సుమారు 62 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) హరీష్‌రావు మాట్లాడుతూ.. ‘ దేశంలో నగదు చలామని గతం కంటే రెట్టింపు అయ్యింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. దేశంలో అవినీతి పెరిగిందని సీబీడీఐ చెప్పింది. దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగింది. టెర్రరిజాన్ని అదుపులోకి తెస్తామన్నారు.. ఏం చేశారు?, కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని మందిపడ్డారు. -
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..!
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..! -
గురి తప్పిన లక్ష్యాలు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్? జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్‌సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి? 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది. ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి. 2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది. ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్లో అప్పుడు భారత్‌ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది? వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది. రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు. మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
చెంపదెబ్బ వాళ్లిద్దరికీ కాదు....
చెంపదెబ్బ వాళ్లిద్దరికీ కాదు.... -
Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. -
నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందో?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించి డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నాటి సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నోట్ల రద్దు అంశంపై రెండు వేర్వేరు తీర్పులుంటాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చే ఈ తీర్పులు ఏకీభవిస్తాయా, భిన్నంగా ఉంటాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ధర్మాసనంలో వీరితోపాటు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఉన్నారు. -
‘నోట్ల రద్దు’పై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ నెల 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్ -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్‌లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్‌గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్‌ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్ ప్రైస్..లిమిటెడ్ పీరియడ్, త్వరపడండి!) 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో ఇది 46.690 మిలియన్ నోట్లుగా ఉందని ఐఏఎన్ఎస్ దాఖలు చేసిన RTI క్వెరీ లో తెలిపింది. మరోవైపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా 2,44,834గా ఉంది. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. -
‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2016 నవంబర్ 8న దేశంలో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు ఉన్నపళంగా రద్దయిపోయాయి. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు (డిమానిటైజేషన్) చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల రద్దు దుష్ఫలితాలు బయటపడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆరేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటే నిరాశే మిగులుతుంది. 115 మంది బలి! అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంలో వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు జనసందోహంతో కిటకిటలాడాయి. క్యూలో నిల్చొని 115 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం మాత్రం మరోలా ఉంది. 2016 నవంబర్ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు కాగా, 2022 అక్టోబర్ 21 నాటికి రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ‘మాస్టర్‌స్ట్రోక్’తర్వాత 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరగడం గమనార్హం. పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బడా బాబులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. సామాన్య జనం మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ 2016 నవంబర్ 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషన్లు పేర్కొన్నారు. వివేక్ నారాయణ్ శర్మ పిటిషన్‌పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. హైకోర్టుల్లోనిపిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే నిర్ణయం తీసుకున్నారు. నేడు సుప్రీంకోర్టు విచారణ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్‌పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. చదవండి: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం -
నేషన్ వాంట్స్ టు నో
అది 1978, జనవరి 14వ తేదీ ఉదయం. ముంబై (అప్పుడు బొంబాయి)లో ఉన్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అకౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం. ఆయన ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లని చలా మణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పిం చిందనీ, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనీ, ఇదంతా చాలా గోప్యంగా జరగాలనీ రామన్‌ను ఆదేశించారు. అనుకున్న పద్ధతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారు జాము కల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్‌కు ఈ రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆయన అభి ప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు. భారతీయ ఆర్థిక విధానాలపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు. ‘పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ నాతో ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబ ట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.’ ‘సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు’ అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభిప్రాయం. 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్‌కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నేళ్ళ తరు వాత, 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అయిదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలవి కావడం మరో పోలిక. నవంబర్ ఎనిమిది సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసే సమ యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చో బెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియ చేయడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజలనుద్దేశించి రేడియో, దూరదర్శన్లలో ప్రసం గించారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరనీ తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లలో భాగమే కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారు చేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం. ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోదీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభి ప్రాయం కలిగింది. ‘కొద్ది రోజులు కటకట పడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు’ అనే భావన సర్వత్రా కనబడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొ కటన్న అభిప్రాయం బలపడసాగింది. బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడక పోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల వద్దా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొట మరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. అయితే ప్రజలకు ఉన్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే మంచి రోజుల కోసం ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. దానితో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు పూర్తిగా లభించినట్టు అయింది. దేశానికి సంబంధించి తీసుకున్న ఒక కీలక, ప్రధాన నిర్ణయానికి ప్రజల మద్దతు పొందడం మామూలు విషయం కాదు. ఆ మేరకు ప్రధాని మోదీ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ నల్లధనం రద్దుకు తీసుకున్న ఈ నిర్ణయం వికటించిందా, ఫలించిందా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు అంతకు ముందు లేని ఒక మంచి అలవాటు అలవడింది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో దేశంలో ద్రవ్య చలామణి 17.97 లక్షల కోట్లు వుండగా ఇప్పుడది 72 శాతం పెరిగి 30.88 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబు తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి. ప్రతి చిన్నా, పెద్దా ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు విచ్చల విడిగా డబ్బు వెదజల్లారు. ఇదంతా ప్రజలు కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత కూడా బడా బాబుల దగ్గర ఇంతంత డబ్బు ఎలా పోగుపడింది? పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలించలేదు అనడానికి ఇది తార్కాణం. కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నోట్ల రద్దుపై వీడియో.. ‘PayPM’ అంటూ మోదీపై ఆగ్రహం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీని పేపీఎం (PayPM) అంటూ అభివర్ణించారు. తన 2-3 బిలియనీర్ స్నేహితుల కోసం ఉద్దేశపూర్వకంగా మోదీ తీసుకొచ్చిన చర్య అంటూ మండిపడ్డారు. ‘చిన్న, మధ్యతరహా వ్యాపారాలను సమూలంగా తుడిచిపెట్టి.. తన 2-3 బిలియనీర్ స్నేహితులకు భారత ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం అందించడం కోసం PayPM ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన చర్య ఈ నోట్ల రద్దు’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు విఫల చర్య అని సమర్థించేలా ఉన్న పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలను ఆ వీడియోలో చూపించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. మరోవైపు.. స్వతంత్ర భారతంలో నోట్ల రద్దు అనేది అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ అంటూ ఆరోపించింది కాంగ్రెస్. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. భారత్‌ను డిజిటల్, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది. 2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది కేంద్రం. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడంతో పాటు అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే నోట్ల రద్దు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలిపింది. అయితే, ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లతో కొత్త గరిష్ఠానికి చేరిందని, ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 72శాతం ఎక్కువని ఇటీవల నివేదికలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. Demonetisation was a deliberate move by ‘PayPM’ to ensure 2-3 of his billionaire friends monopolise India’s economy by finishing small & medium businesses. pic.twitter.com/PaTRKnSPCx — Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022 ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వామ్మె అంత నగదు ఉందా! నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం! -
పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్ కారణం
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కూడా తోడ్పడిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు. అంతిమంగా .. పెద్ద సంఖ్యలో ట్యాక్స్‌పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు. నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
మా లక్ష్మణరేఖ తెలుసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
... పిటిషన్లు రద్దు చేయడం కుదరనుకుంటా సార్!
... పిటిషన్లు రద్దు చేయడం కుదరనుకుంటా సార్! -
చిన్న పరిశ్రమలపై కుట్ర: రాహుల్ గాంధీ
కొచ్చి: తమకు ఆప్తులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు మేలు చేసేందుకే మోదీ సర్కార్ నోట్ల రద్దు, జీఎస్టీలను అమలుచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో బుధవారం భారత్ జోడో యాత్ర సందర్భంగా కొచ్చిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘చిరు వ్యాపారుల పొట్ట కొట్టడమే మోదీ సర్కార్ పని. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చిధ్రం చేసి కేవలం తమకు అత్యంత దగ్గరివారైన అతి కొద్దిమంది భారీ పారిశ్రామిక వేత్తలకు లాభం వచ్చేలా ప్రభుత్వం పథకరచన చేసింది. ఈ కుట్రలో భాగంగానే మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తెచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ ధాటికి అసంఘటిత రంగం అతలాకుతలమైంది. మోదీ మిత్రులకు కావాల్సింది ఇదే’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చిన్న సంస్థలకు అనుమతుల మంజూరులో జాప్యం చేస్తూ పెద్ద తలకాయలకు లబ్ధిచేకూరుస్తున్నారని ఆరోపించారు. కేరళలో సుగంధ ద్రవ్యాలు, రబ్బర్ తోటల రైతుల సమస్యలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర సర్కార్ విస్మరించడం వంటి సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ బృందం రాహుల్‌ను వివరించింది. ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్.. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురుకు నివాళులర్పించి కొచ్చి సమీపంలోని మాదవనలో బుధవారం భారత్ జోడో యాత్రను కొనసాగించారు. రాహుల్‌తోపాటు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పాల్గొన్నారు. -
India@75: పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చేసిన ఆ అకస్మాత్తు ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. కొన్ని నెలల పాటు ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఆరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడం తోపాటు, కొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా నవంబర్ 9, 10 తేదీలలో ఏటీఎం లను, అన్ని బ్యాంకులను మూసి ఉంచారు. పాత పెద్ద నోట్లను కొత్తవాటితో మార్చుకునేందుకు 2016 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఆ గడువును 2017 మార్చి 30 వరకు పొడిగించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జయలలిత, చో రామస్వామి, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్, నాయని కృష్ణకుమారి, పరమేశ్వర్ గోద్రెజ్.. కన్నుమూత పార్లమెంటులో జి.ఎస్.టి. బిల్లుకు ఆమోదం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 26 ఏళ్ల దళిత పిహెచ్.డి. స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య. అత్యంత వేగంగా ప్రయాణించే ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఢిల్లీ ఆగ్రాల మధ్య ప్రారంభం. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. కృత్రిమ మేధస్సు) -
కరెన్సీ నోట్లపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్‌లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో ఒరిజినల్ నోట్లు,ఫేక్ నోట్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్ల ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి నోట్ సార్టింగ్ మెషీన్లను (డబ్బులు లెక్కించే యంత్రం) పరీక్షించాలని ఆర్బీఐ తెలిపింది. 2016 నవంబర్ నెలలో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసింది. నాటి నుంచి ఆర్బీఐ కొత్త రూ.200, రూ.500, రూ.2000నోట్ల సిరీస్‌ను విడుదల చేస్తుంది. అయితే కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్బీఐ నోట్ల ప్రామాణీకరణ,బ్యాంకుల్లో డబ్బులు లెక్కించే ఫిట్నెస్ సార్టింగ్ మెషిన్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలుపుతూ కొత్త మార్గ దర్శకాల్ని విడుదల చేసింది. ►'నోట్ సార్టింగ్ మెషీన్స్ అథెంటికేషన్, ఫిట్నెస్ సార్టింగ్ పారామీటర్స్' అనే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం..ఫిట్ నోట్ అనేది "వాస్తవమైన, తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది" అని పేర్కొంది. ►నోటు భౌతిక స్థితిని బట్టి..రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించనుంది. ►రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను తప్పని సరిగా వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్ చేయించాలని రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ►నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాలి. ►ఇలా కరెన్సీ నోట్లను చెక్ చేసి సంబధిత వివరాల్ని ఆర్బీఐకి పంపాలని తెలిపింది. అలాగే చినిగిపోయిన నోట్లు, నకిలీ నోట్లను అన్‌ఫిట్ నోటు కేటగిరి కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు తప్పని సరిగా అమలు చేయాలని ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పేదరికం 2011–2019 మధ్య 12.3 శాతం మేర తగ్గినట్టు ప్రపంచబ్యాంకు తన చర్చా పత్రంలో తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2011 నేషనల్ శాంపిల్‌సర్వే (ఎన్ఎస్ఎస్) తర్వాత భారత్ గృహ వినియోగానికి సంబంధించిన సర్వే వివరాలను ఇంత వరకు వెల్లంచలేదు. దీనికితోడు పేదరికం, అసమానతలకు సంబంధించి గత పదేళ్లలో అధికారికంగా ఎటువంటి గణాంకాలను ప్రకటించలేదు’’అని ఈ చర్చా పత్రం రూపొందించడంలో భాగమైన ఆర్థికవేత్త సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్‌డెర్ వీడ్ తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తిన 2020లో భారత్‌లో తీవ్ర పేదరికం రేటు 0.8 శాతానికి పరిమితం అయిందని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇందుకు సాయపడినట్టు లోగడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన చర్చా పత్రం కూడా ప్రకటించడం గమనార్హం. ‘‘భారత్‌లో 2011–2019 మధ్య తీవ్ర పేదరికం 12.3 శాతం తగ్గింది. 2004–2011 మధ్య కాలంలో ఉన్న రేటుతో పోలిస్తే ఎంతో మెరుగుపడింది’’ అని ప్రపంచబ్యాంకు చర్చా పత్రం వివరించింది. 2016లో డీమోనిటైజేషన్ సమయంలో పట్టణాల్లో పేదరికం 2 శాతం పెరిగిందని.. ఆ తర్వాత గణనీయంగా క్షీణించినట్టు తెలిపింది. 2019లో వృద్ధి కుంటు పడడంతో గ్రామీణ పేదరికం 0.10 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. వినియోగంలో అసమానతలు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఆర్థికవేత్తలు ఈ చర్చా పత్రంలో స్పష్టం చేశారు. చిన్న రైతులకు ఆదాయం 10 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. చదవండి: చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..ఇది మన పరిస్థితి..! -
పెద్దనోట్ల రద్దుకు అయిదేళ్లు...!
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రకంపింపజేసిన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి అయిదేళ్లు నిండాయి. దేశప్రజలపై సర్జికల్ స్ట్రయిక్ అని చెబుతున్న ఈ ఒక్క నిర్ణయంతో చలామణిలో ఉన్న 86 శాతం నగదు ఉనికిలో లేకుండా పోయింది. యావద్దేశం నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. డబ్బుకోసం పడిగాపులు కాస్తూ 120 మంది సామాన్యులు చనిపోయారు. ఈ పిడుగుపాటు నిర్ణయం ద్వారా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. నల్లధనం బయటపడలేదు. సంపన్నుల అక్రమార్జనను ఇది అడ్డుకోలేదు. డిజిటల్ చెల్లింపుల లక్ష్యం పనిచేయలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ. 15 లక్షల కోట్లకు పైగా నగదు చలామణిలో ఉండగా 2021 అక్టోబర్ నాటికి అది రూ. 28 లక్షల కోట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 94 శాతం శ్రామికులకు ఉపాధి కలిగిస్తున్న అసంఘటిత రంగం కోలుకోలేనంతగా కుప్పగూలి పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. పెద్దనోట్ల రద్దు దేశంపై రుద్దిన విధాన నిర్ణయ సంక్షోభం మాత్రమే. అయిదేళ్ల క్రితం అంటే 2016 నవంబర్ 8 రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దుపై ‘చారిత్రక’ నిర్ణయాన్ని ప్రకటించారు. దీన్ని భారత ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించే చర్యగా ప్రధాని పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థలో చలామణిలో లేకుండా దాగి ఉంటున్న లెక్కలోకి రాని డబ్బును వెలికి తీయడం, నకిలీ నోట్ల పనిపట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు ప్రాధాన్యత తగ్గించి డిజిటల్ చెల్లింపులను పెంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలోని రాబడిని పెంచుకోవడమే పెద్ద నోట్ల రద్దు లక్ష్యమని తెలిపారు. ప్రధాని నిర్ణయంతో అంతవరకు చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఒక్కక్షణంలో రద్దయిపోయాయి. దేశ కరెన్సీలో వీటి వాటా 86 శాతం. మరి ఈ అయిదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పులేమిటి? పెద్దనోట్ల రద్దుకు, ఈ కాలంలో జరిగిన మార్పులకు ఉన్న సంబంధం ఏమిటి? దాదాపు 86 శాతం కరెన్సీ నోట్లు ఉపయోగంలో లేకపోవడంతో యావద్దేశం గగ్గోలు పెట్టింది. వేలాది మంది నిత్యం తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేయడం రోజువారీ కార్యక్రమమైపోయింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గట్టిగా సమర్థించుకుంటూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయలు దాచుకుంటున్నట్లు వస్తున్న వార్తలపట్ల నిజాయితీ కల పౌరులు బాధపడటం లేదా? గన్నీ బ్యాగ్‌ల నిండా అక్రమ సంపాదన దాచుకుంటున్న వార్తలు చూసి దేశంలో బాధపడనివారెవ్వరు? ఇలా అక్రమంగా డబ్బు దాచుకుంటున్న వారు తమ వద్ద అంత డబ్బు ఎలా కూడిందో పన్ను అధికారుల ముందు చెప్పేలా చేయడం, లేదా తమ వద్ద పోగుపడిన ఆ డబ్బుపై ఆశ వదులుకునేలా చేయడానికే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నామని ప్రధాని సెలవి చ్చారు. అందుకే చాలామంది పెద్ద నోట్ల రద్దు చర్యను అవినీతికి వ్యతి రేకంగా కేంద్రం చేపట్టిన మరో సర్జికల్ స్ట్రయిక్‌గా వర్ణించారు. అక్రమ నగదు ఎక్కడకు పోయినట్లు? కేంద్రం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం దేశప్రజలకు పిడుగుపాటులా తగిలింది. కానీ కొంతమంది ఆర్థిక వేత్తలు మాత్రం పెద్దనోట్ల రద్దు భావనను సమర్థించారు. 2016 నవంబర్ 14న ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఒక వాణిజ్య పత్రికకు రాస్తూ, పెద్ద నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థనుంచి 4.5 లక్షల కోట్ల రూపాయలు అదృశ్యమైపోతాయని పేర్కొన్నారు. ఇలాంటి నమ్మకాలు, ఆశావహ ప్రకటనలు అతి త్వరలోనే మాయమైపోయాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెద్ద నోట్ల రద్దు జరిగి మూడు నెలలు కాకముందే 2017 ఫిబ్రవరి 2న పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో చావుకబురు చల్లగా చెప్పేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో లెక్కలోకి రాకుండా దాగివున్న నగదు నిల్వలు పెద్దగా బయటకు రాలేదని తేల్చేశారు. ఆ సంవత్సరం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 లోపు, 2 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకు నగదును 1.09 కోట్ల ఖాతాలలో ప్రజలు తిరిగి డిపాజిట్ చేశారు. అలాగే 80 లక్షలకు పైబడిన డిపాజిట్లను 1.48 లక్షల ఖాతాలలో పెద్ద నోట్ల రద్దు సమయంలోనే సంపన్నులు డిపాజిట్ చేశారని బడ్జెట్ ప్రసంగం పేర్కొంది. ఈ రెండు విభిన్న ఖాతాలనుంచి బ్యాంకులకు చేరిన మొత్తం 10.38 లక్షల కోట్లు. దేశం మొత్తంలో చలామణిలో ఉన్న నగదు 15.44 లక్షల కోట్లు అని నాటి అంచనా. అంటే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో మూడింట రెండువంతులు తిరిగి బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చేసినట్లు లెక్క. పైగా రద్దయిన పెద్దనోట్లలో అధిక భాగం నయా సంపన్నుల నుంచే డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని 2017 ఫిబ్రవరి 2 నాటికే పత్రికలు కోడై కూశాయి. దీనికి పరాకాష్టగా రద్దయిన పెద్ద నోట్లలో 99 శాతం వరకు బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని భారతీయ రిజర్వ్ బ్యాంకు స్వయానా పేర్కొంది. మరి ఆర్థిక వేత్తలు పేర్కొన్నట్లు అక్రమంగా దాచుకున్న 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్లు? పైగా ఆర్థిక కార్యకలాపాలు నెలలపాటు స్తంభించిపోయాయి. నల్లధనం అంటే అక్రమ నగదు కాబట్టి పెద్దనోట్లను ఉన్నఫళానా రద్దు చేస్తే సంపన్నులు దాచిపెట్టిన నల్లధనం హుష్ కాకీ మాదిరి మాయమైపోతుందని పాలకపార్టీ భ్రమించింది. కానీ వాస్తవానికి నల్లధనంపై పిడుగుపాటు ఆనుకున్నది కాస్తా దేశ ప్రజలపై విధ్వంసంలా విరుచుకుపడింది. నగదు రహిత భారత్ సిద్ధించిందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తాను భావించిన ప్రాథమిక లక్ష్యాలపై పదే పదే మాట మారుస్తుండటం గమనార్హం. అయిదేళ్ల తర్వాత ఇప్పడు, అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడం పెద్దనోట్ల రద్దు లక్ష్యం కానే కాదంటూ బీజేపీ కొత్త పాట పాడుతోంది. ప్రభుత్వ పన్నుల రాబడిని పెంచుకోవడానికి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యమివ్వడమే పెద్దనోట్ల రద్దు లక్ష్యమని ఇప్పుడు చెబుతున్నారు. గత రెండేళ్ల కాలంలో దేశంలోని సంపన్నులు మరింత సంపన్నులు కావడం, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోవడం స్పష్టమవుతున్నప్పుడు కేంద్ర లక్ష్యాల డొల్లతనం బయటపడుతుంది. డిజిటల్ చెల్లింపులు తగుమాత్రంగా పెరుగుతున్నప్పటికీ ముందెన్నడూ లేనంత స్థాయిలో నగదు చలామణి కూడా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 నవంబర్ 4న దేశంలో నగదు చలామణీ దాదాపు రూ. 15 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తంమీద చెప్పాలంటే, పెద్ద నోట్లరద్దు నేపథ్యంలో సంపన్నులు వివిధ మార్గాల ద్వారా నల్లధనాన్ని ఆస్తులుగా మార్చుకుని మరింత బలపడగా, అసంఘటిత రంగంలోని శ్రామికులు నిరుపేదలు దారుణంగా దెబ్బతినిపోయారని డాక్టర్ అమర్త్యసేన్, డాక్టర్ అభిజిత్ వినాయక్, డాక్టర్ అరుణ్ కుమార్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉత్పాతానికి, మెజారిటీ ప్రజానీకం దుస్థితికి ప్రధాని స్వయంగా బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని వీరు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు సృష్టించిన ఉత్పా తంతో 120 మంది నిరుపేదలు బ్యాంకుల్లో చెక్కుల కోసం వడిగాపులు కాస్తూ కన్నుమూశారు. ఇక అసంఘటిక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి మార్కెట్‌కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. పెద్దనోట్ల రద్దువల్ల 2017 జనవరి–ఏప్రిల్ కాలం లోనే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికవ్యవస్థకు కోలుకోని దెబ్బ శరీరంలోని అన్ని అవయవాలకు పోషకాలను అందించడంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆర్థిక వ్యవస్థకు డబ్బు కూడా అలాగే జీవం పోస్తుంది. నగదు చలామణిలో ఉండటం వల్లే ఆర్థిక లావాదేవీలు జరిగి ఆదాయాలను సృష్టించవచ్చు. శరీరం నుంచి 85 శాతం రక్తాన్ని తోడేసి, ప్రతివారమూ 5 శాతం రక్తాన్ని మాత్రమే తిరిగి చేర్చుతూపోతే శరీరం చచ్చి ఊరుకుం టుంది. అదే విధంగా చలామణిలో ఉన్న నగదులో 85 శాతాన్ని రద్దు చేసి సంవత్సరం పాటు కొంచెం కొంచెంగా తిరిగి చేరుస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా జరిగిన ఉత్పాతం ఇదే. దేశ కార్మికరంగంలో 94 శాతానికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం... డబ్బులేక కుప్పగూలిపోయింది. ఈ రంగంలోని లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లకు నిరంతరం డబ్బు అవసరం. అయిదేళ్లు గడిచిన తర్వాత కూడా పెద్దనోట్ల రద్దు అసంఘటిర రంగాన్ని దెబ్బతీస్తూనే ఉంది. వైఫల్యాల దాటివేతకే ఈ ‘బిగ్ బ్యాంగ్’ శత్రుదేశం వ్యూహాలను అరికట్టేందుకు సైన్యం చేసే మెరుపుదాడులనే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రయిక్ అంటారు. ఊహించని సమయంలో, ఊహించని చోట శత్రువులపై మెరుపుదాడి చేసి తేరుకోకముందే దెబ్బకొట్టి తిరిగి రావడమే సర్జికల్ స్ట్రయిక్. కానీ దేశంలో, అంతర్గతంగా పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక మెరుపుదాడికి ప్రభుత్వం దిగడానికి కారణం ఏమిటి? అంటే 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నల్లధనాన్ని నిర్మూలిస్తాననీ, విదేశాల్లో దాచుకున్న దేశ సంపదను వెలికి తీస్తామనీ హామీ ఇచ్చింది. అలా విదేశాలనుంచి వెలికితీసి రప్పించిన నల్లధనం నుంచి దేశంలోని ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయల నగదును ఇస్తామని బీజేపీ నాటి ప్రచారంలో అడక్కుండానే వాగ్దానాలు చేసింది. కాని ఇది తప్పుడు ప్రచారమని త్వరలోనే తేలిపోయింది. విదేశాలనుంచి నల్లధనం తీసుకురావడం అసాధ్యమని స్పష్టమైంది. పర్యవసానంగా పాలకపార్టీ 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతింది. దీంతో నల్లధనానికి చెక్ పెట్టడానికి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించడం, నల్లధనం వెలికితీత పన్ను చట్టం, ఆదాయ ప్రకటన పథకం వంటి పలు చర్యలకు కేంద్రం దిగింది. కానీ ఇవేవీ పనిచేయలేదు. ఒక బిగ్ బ్యాంగ్ లాంటి విస్ఫోటనం అవసరమని స్పష్టమైంది. అదే పెద్ద నోట్ల రద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. అది ప్రకటించిన లక్ష్యాలను వేటినీ సాధించలేదు. పైగా నష్టాన్ని గ్రహించి లక్ష్యాలను మార్చుకున్న తర్వాత కూడా ఫలితాలు ఒనగూరలేదు. ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి అది కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కేంద్ర పాలకవర్గం దీన్ని గ్రహించింది కాబట్టే తదనంతర ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు గురించి ప్రచారంలో వాడుకోలేదు. పెద్దనోట్ల రద్దు దేశం ముందు విధాన నిర్ణయ సంక్షోభాన్ని తీసుకొచ్చింది. మహిళలు, రైతులు, కార్మికులు వంటి బలహీన వర్గాలపై తీవ్రప్రభావం చూపింది తప్పితే నల్లధనం వెలికితీతపై అది సాధించింది శూన్యం మాత్రమే. – సాత్యకి చక్రవర్తి, సీనియర్ కాలమిస్ట్ -
డీమానిటైజేషన్‌తో పెరిగిన డిజిటల్ చెల్లింపులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కాస్త మందకొడిగా అయినప్పటికీ చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ పరిస్థితుల మధ్య ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల వినియోగం ఎగిసింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016లో రూ. 17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉండగా 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కి చెందిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ).. పేమెంట్లకు ప్రధాన మాధ్యమంగా మారుతోంది. 2016లో యూపీఐని ఆవిష్కరించగా కొన్ని సందర్భాలు మినహా ప్రతి నెలా లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 అక్టోబర్‌లో లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబర్‌లో యూపీఐ ద్వారా 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: మెటావర్స్‌పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
మ్యాగజైన్ స్టోరీ 08 November 2021
-
పెద్దనోట్ల రద్దుపై హార్వర్డ్ కీలక వ్యాఖ్యలు, మరి ఆర్బీఐ ఏమందంటే..!
పెద్దనోట్ల రద్దు నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016 నవంబర్ 8న అప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దు చేసిన ఆ రెండు పెద్దనోట్లను డిసెంబర్ 30వ తేదీలోపల ప్రజలు బ్యాంకుల్లో జమ చేసి రూ.2000,రూ.500కొత్త పెద్ద నోట్లను తీసుకోవచ్చని గడువు విధించారు. అయితే కేంద్రం ఈ నిర్ణయంపై తీసుకొని 5ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగిపోయాయి కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్ కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్ లలో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు జరిగి గడించిన రెండేళ్లైనా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేశారే తప్పా నగదు చెల్లింపులు జరపలేదని పేర్కొంది. నవంబర్ 8, 2016న డీమానిటైజేషన్ ప్రభావంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయని, అదే సమయంలో సాంప్రదాయ ట్రాన్సాక్షన్లు తగ్గాయని,డిజిటల్ లావాదేవీలు 2017 నుండి స్థాయిలు, వృద్ధి రేటులో సాంప్రదాయ లావాదేవీలను స్థిరంగా అధిగమించినట్లు తేలింది. ఆర్బీఐ నివేదిక ఇక,ఆర్బీఐ నివేదిక ప్రకారం..నోట్ల రద్దు దేశాన్ని తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చినట్లు తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2014-15 కంటే 14.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రేటు ప్రకారం, 2020-21 చివరి నాటికి చెలామణిలో ఉన్న నోట్లు రూ.32.62 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే, 2021 చివరి నాటికి ఇది చాలా తక్కువగా రూ.28.26 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా! -
వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సొమ్మంతా వృధానేనా!
చెన్నై: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్ 16నలో డీ మానిటైజేషన్ ప్రవేశ పెట్టి రూ.500/-, రూ.1000/- నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి అప్పుడే ఐదేళ్లు అయినా దీని గురించి కొంతమందికి ఇంకా తెలియదంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రస్తుతం ఈ విషయం గురించి తనకు ఏమి తెలియదంటున్నాడు తమిళనాడుకి చెందిన ఒక వృద్ధ బిచ్చగాడు. (చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది) వివరాల్లోకెళ్లితే... తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన చిన్నక్కణ్ను అనే వృద్ధ బిచ్చగాడు తాను అడుక్కుంటూ జీవితాంతం పోదుపు చేసుకుంటూ కూడబెట్టిన సొమ్ము రూ.65,000 వృద్ధా అయిపోయిందంటూ ఆవేదన చెందాడు. తాను ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన డీమానిటైజేషన్ గురించి చెప్పులు కుట్టే కన్నయ్యన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. దీంతో తాను దాచిని సోమ్మంతా పనికిరాదని అర్థమైందని, చివరిగా తన వద్ద మిగిలన డబ్బు కేవలం రూ 300/- మాత్రమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు చిన్నక్కణ్ను కలెక్టర్‌కు ఒక పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు జిల్లా రెవెన్యూ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు ఈ పిటిషన్‌ను పంపించడమే కాక రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం అని చిన్నక్కన్నకి హామీ కూడా ఇచ్చారు. అయితే నోట్ల మార్పిడి మార్చి 31, 2017తో ఆఖరు కాబట్టి కాబట్టి నోట్లు మారే అవకాశం ఉండదేమోనంటూ అదికారులు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా యంత్రంగం చిన్నక్కణ్నుని ఆదుకోవడానికి ముందకు రావడమే కాక వృద్ధాప్య పెన్షన్‌ని కూడా ఏర్పాటు చేసింది. (చదవండి: 'బీరు' బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) -
కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, కాల్పులు
Chaotic Scenes At Kabul Airport అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. అఫ్గాన్‌లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది. రన్‌వేపై విమానాల కోసం వేచిచూస్తున్న వందలాది మంది పౌరులు దేశవిదేశీ పౌరులతో కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. ఎయిర్‌పోర్టుకు దారితీసే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. కాబూల్ నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రయాణికుల విమాన సేవలే కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జనం గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. విమానాల రాకకోసం వేలాది మంది పిల్లా పాపలతో కలిసి ఆకలి దప్పులు మరిచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏకంగా రన్‌వే పైకి చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఏదైనా విమానం రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. టేకాఫ్ అవుతున్న విమానాల వెంట ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆకాంక్షే అందరిలోనూ కనిపిస్తోంది. కొందరు విమానం రెక్కలపైకి ఎక్కి కూర్చుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇక్కడ నిలబడడానికి స్థలం లేదని వాపోయారు. పిల్లల ఏడుపులు, పెద్దల అరుపులు, యువకుల ఆగ్రహావేశాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పది మంది మృతి దేశం విడిచి వెళ్లడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో విమానం పైకి ఎక్కి కూర్చున్న జనం తాజాగా కాబూల్ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు. ఈ దృశ్యాలను టెహ్రాన్ టైమ్స్ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్‌నకు సిద్ధమవుతున్న అమెరికా జెట్ విమానంపైకి ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. విమానం కదులుతుండగా పెద్ద సంఖ్యలో జనం దాని వెనుక పరుగులు తీయడం వారి ఆత్రుతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతోపాటు కొందరు జారిపడ్డారని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అలాగే విమానాశ్రయంలో అమెరికా సైనికుల కాల్పుల్లో ఇద్దరు సాయుధులు చనిపోయారు. బయటకు రావాలంటే భయం భయం ప్రాణం కోసం పరుగులు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకొనే క్రమంలో తాలిబన్లు కేవలం సైనికులు, పోలీసులతో తలపడ్డారు తప్ప సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినప్పటికీ జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. జైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయుధాగారాలను లూటీ చేశారు. కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. నిలాన్ అనే 27 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. తాను కాబూల్ వీధుల్లో 15 నిమిషాల పాటు ప్రయాణించానని, పురుషులు తప్ప మహిళలెవరూ కనిపించలేదని చెప్పారు. వంట సరుకులు తెచ్చుకోవడం లాంటి చిన్నచిన్న పనుల కోసం కూడా మహిళలు బయటకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. ‘ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. మా ఉద్యోగాలు ఉన్నాయో ఊడాయో తెలియదు. మా జీవితం ముగిసిపోయినట్లే, భవిష్యత్తు లేనట్లే అనిపిస్తోంది’ అని నిలాన్ వ్యాఖ్యానించారు. మరో వేయి మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి మళ్లుతున్న అమెరికా, దాని మిత్రదేశాల ఉద్యోగుల రక్షణ కోసం కాబూల్ ఎయిర్‌పోర్టుకు రాబోయే 48 గంటల్లో వేయి మంది సైనికులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ భద్రత కోసం ఇప్పటికే అమెరికా అక్కడ 5వేల మంది సైనికులను మోహరించింది. ఎయిర్‌పోర్టు జోలికి రావొద్దు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఖతార్ రాజధాని దోహాలో సీనియర్ తాలిబన్ నాయకులతో తాజాగా చర్చలు జరిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి తమ ఉద్యోగులు, పౌరులను స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టు తమ నియంత్రణలోనే ఉంటుందని, దాని జోలికి రావొద్దని సూచించారు. దీనికి తాలిబన్లు అంగీకరించారని సమాచారం. ‘ఉగ్ర’నిలయంగా మారనివ్వద్దు: ఐరాస తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్ ఉగ్ర మూకలకు నిలయంగా మారకుండా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వ్యవహరించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ సోమవారం పిలుపునిచ్చారు. అఫ్గాన్ ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలివేయకూడదని భద్రతా మండలికి గుటెరస్ విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేక అత్యవవసర సమావేశం భారత్ నేతృత్వంలో జరిగింది. అఫ్గాన్‌పై భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్‌కు ఇది కీలక కఠోర సమయమని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబన్లు యత్నించాలని ఈ సందర్భంగా అంటోనియో హితవు పలికారు. తక్షణమే ఈ ప్రాంతంలో హింసను నివారించాలని, మానవ హక్కుల పరిరక్షణ చేయాలని అన్ని పక్షాలను గుటెరస్ కోరారు. -
రూ.2 వేల నోట్ల రద్దంటూ రూ.45 లక్షలు దోపిడీ
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ‘ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉంది.. అన్నీ రూ.2 వేల నోట్లే.. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు.. వాళ్లు రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే.. నేను రూ.2 వేల నోట్లు రూ.కోటి ఇస్తా.. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’.. అంటూ డీల్ కుదుర్చుకుని రూ.45 లక్షలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘరానా మోసానికి సంబంధించి చిత్తూరు పోలీసులు గురువారం తమిళనాడుకు చెందిన ఆర్.నరేష్కుమార్ (29), అబీద్‌బాషా (37), డి.రమేష్ ప్రభాకర్ (54), వి.కె.కుమార వడివేలు (54), ఆర్.విజయానందన్ (45), జి.మురుగదాస్ (55), సి.జయపాల్ (27), ఎ.జగన్‌రాజ్ (25)లతోపాటు చిత్తూరులోని గుడిపాలకు చెందిన డి.శ్రీకాంత్‌రెడ్డి (45)ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ బాలయ్య ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ఘరానా మోసం జరిగిందిలా.. కేరళకు చెందిన కె.వి.అశోకన్ చెన్నైలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. వ్యాపారంలో భాగంగా ఆయనకు కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తన పేరు సాయికృష్ణ అని మహ్మద్‌తో పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని.. త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని.. వీటిని రూ.500 నోట్లుగా మార్పించి ఇస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని మహ్మద్‌కు చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న అశోకన్‌కు మహ్మద్ విషయం చెప్పగా.. రూ.45 లక్షలున్న రూ.500 నోట్లను తీసుకుని సాయికృష్ణ చెప్పినట్టు చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు తమిళనాడు పోలీసు దుస్తుల్లో, వాహనాల్లో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ అనుచరులు అశోకన్‌కు తుపాకులు చూపించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీంతో అశోకన్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల సాయంతో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో రూ.13 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడు కృష్ణగిరిలో రూ.80 లక్షల లూటీ, చిత్తూరులోని యాదమరిలో రూ.10 లక్షల దోపిడీ కేసుల్లో సైతం నిందితుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. -
డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన గృహిణులకు సంబంధించి ఎటువంటి పరిశీలన అవసరం లేదని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ ఏటీ) ఆగ్రా బెంచ్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని అసెస్సీ ఆదాయంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఇదే మాదిరి అన్ని కేసులకూ వర్తిస్తుందని తేల్చింది. గ్వాలియర్‌కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016–17 ఏడాదికి రూ.1,30,810 ఆదాయంగా పేర్కొం టూ ఐటీ రిటర్ను దాఖలు చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత రూ.2,11,500 పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. దీంతో ఈ కేసును పరిశీలన కోసం ఆదాయపన్ను శాఖ తీసుకుంది. భర్త, పిల్లలు, బంధువులు ఇవ్వగా పొదుపు చేసుకున్న మొత్తం ఇదంటూ ఆమె ఆదాయపన్ను శాఖ పరిశీలన అధికారికి వివరించారు. కానీ, దీన్ని ఆదాయపన్ను శాఖ అంగీకరించలేదు. వివరణలేని ధనంగా తేల్చింది. దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆమె ఆశ్రయించారు. చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?! -
డీమోనిటైజేషన్ నాటి సీసీటీవీ రికార్డులు జాగ్రత్త
ముంబై: డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో బ్యాంకుల శాఖలు, కరెన్సీ చెస్ట్‌ల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా పదిలపరచాలంటూ ఆర్బీఐ కోరింది. ఆ సమయంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సహకరించేందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తపరచాలని కోరింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లధనం గుర్తింపు, నకిలీ నోట్ల ఏరివేత లక్ష్యాలతో నాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం ప్రకటించుకుంది. ఇందులో భాగంగా రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకు శాఖల్లో మార్చుకునేందుకు అదే ఏడాది డిసెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. దాంతో బ్యాంకు శాఖల వద్ద భారీ క్యూలు చూశాము. రద్దు చేసే నాటికి రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, బ్యాంకుల్లోకి రూ.15.31 లక్షల కోట్లు వచ్చాయి. పెద్ద ఎత్తున నల్లధనాన్ని కలిగిన వారు సైతం అక్రమ మార్గాల్లో తెల్లధనంగా (సక్రమమైనదిగా) మార్చుకున్నారనే విమర్శలున్నాయి. దీనిపైనే దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. దర్యాప్తునకు సహకరించేందుకు వీలుగా సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలని గతంలోనూ ఆర్బీఐ కోరింది. ఇప్పుడు మరో విడత సీసీటీవీ రికార్డులను నిర్వీర్యం చేయరాదంటూ ఆర్బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది. -
రూ.2,000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-2021)లో కూడా కొత్తగా నోట్లు ముద్రించలేదని పేర్కొంది. మే 26వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,23,875 లక్షలు. రూ.500 నోటు, రూ.2,000 నోట్లు ఆర్ధికవ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువలో వీటి విలువ 85.7 శాతం. గత ఏడాది 83.4 శాతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్ నోట్లలో రూ.500 నోట్ల సంఖ్యే 31.1 శాతం. ఆర్బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో, భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసినట్లు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో రూ.2,000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి. నల్లధనం నిల్వలను అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 నోటు, పాత రూ.1,000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత రూ.1,000 నోటు స్థానంలో రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నోటు రద్దు కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ రూ.2000 నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా? అనే మరో వాదన కూడా ఉంది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఇంకా మూడు రోజులే గడువు -
పంజాబ్‌లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్‌కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్‌ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్‌నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్‌నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
పాత 100 నోట్ల రద్దుపై ఆర్బీఐ స్పందన
న్యూఢిల్లీ : రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రద్దు చేయనుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను త్వరలో చలామణిలోంచి తీసేయనున్నట్లు కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని పేర్కొంది. అంతకు క్రితం కేంద్రం కూడా ఈ నోట్ల రద్దుపై స్పందించింది. పాత నోట్ల రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. ( ఎన్బీఎఫ్సీలు : ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు ) నిన్న (ఆదివారం) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) దీనిపై ట్విటర్ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అదో ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. కాగా, 2021 మార్చి లేదా ఏప్రిల్ చివరి నాటికి రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోనుందని మీడియాలో వెలువడ్డ వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect. — ReserveBankOfIndia (@RBI) January 25, 2021 -
నోట్ల రద్దుకు నాలుగేళ్లు
-
వేల రూపాయలు దాచి దాచి చివరికి..
సాక్షి, తమిళనాడు : మట్టిలో పాతి పెట్టిన రూ.35 వేల నోట్లు చెల్లవని తెలుసుకుని ఓ దివ్యాంగురాలు ఆవేదనకు లోనైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నాగై జిల్లా సిర్కాలి సమీపంలో ఉన్న పట్టియమేడు గ్రామానికి చెందిన రాజ (58) కూలీ కార్మికుడు. ఇతని భార్య ఉష (52). వీరి కుమార్తె విమల (17). తల్లీ, కుమార్తెకు మాటలురావు. మహాత్మాగాంధీ జాతీయ పథకం కింద పనికి వెళుతూ వచ్చారు. పది సంవత్సరాలుగా తన కుమార్తె వివాహం కోసం రూ.1000, రూ.500 నోట్లని రూ.35,500 వరకు కొంచెంకొంచెంగా ఉషా చేర్చిపెట్టింది. ఆ నోట్లను ఒక ప్లాస్టిక్ సంచిలో భద్రంగా చుట్టి దాంతో ఒక గ్రాము బంగారు బిస్కెట్‌ను పెట్టి తన భర్తకు తెలియకుండా ఇంటి వెనుక భాగంలో గుంత తవ్వి పాతి పెట్టింది. 2016లో కేంద్ర ప్రభుత్వం పాత వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ విషయం తల్లి, కుమార్తె తెలుసుకోలేకపోయారు. రాజదురై తన గుడిసె ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం నిధి సహాయంతో ఇటుకల ఇంటిని కట్టే పథకంలో అనుమతి పొంది ఇల్లు కట్టే పనిని ప్రారంభించారు. ఈ పని కోసం శుక్రవారం కార్మికులు ఇంటి వెనుక భాగంలో తవ్వినప్పుడు, నగదు చిక్కింది. ఆ నగదు తన కుమార్తె వివాహం కోసమే చేర్చి పెట్టినట్లుగా సైగ ద్వారా ఉషా తెలిపింది. అప్పుడు కార్మికులు ఈ నగదు నోట్లు చెల్లవు అని, కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకు ముందే ప్రకటించిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతితో తల్లి, కుమార్తె అలాగే నిలబడి పోయారు. తన కుమార్తె వివాహానికి ఏంచేయాలో తెలియలేదని, తమిళ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నోట్లను మార్చడానికి సహాయం చేయాలని కన్నీరు పెట్టారు. -
‘625 టన్నుల కొత్త నోట్ల రవాణా’
ముంబై: 2016లో నోట్ల రద్దు తర్వాత వాయుసేనకు చెందిన విమానాల్లో 625 టన్నుల బరువు గల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేసినట్లు వాయుసేన మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పేర్కొన్నారు. శనివారం ఐఐటీ–బాంబేలో జరిగిన ఓ టెక్ ఫెస్ట్‌లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్గత సేవల్లో భాగంగా 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేయడానికి 33 మిషన్లు నిర్వహించామన్నారు. 2016, నవంబర్ 8న పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నోట్ల రద్దు సమయంలో కొత్త కరెన్సీ నోట్లను వాయుసేన రవాణా చేసింది. కోటి రూపాయలకు 20 కేజీల బ్యాగ్ ఉపయోగించామ’ని బీఎస్ ధనోవా అన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇలాంటి వివాదాలు ఆయుధాల సేకరణపై ప్రభావం చూపుతాయన్నారు. -
కార్చిచ్చు కాకూడదు
మట్టి ఏ దేశానిదైనా ఒకటే అయినప్పుడు మనుషుల్లో ఇన్ని అంతరాలెందుకు? మాటల్లో మానవత్వాన్ని చాటే మనం మతాలుగా విడిపోవడమెందుకు? అభద్రతా భావమేనేమో..! విభిన్న మతాలను సృష్టించి ఆధిపత్యం కోసం పాకులాడే విష సంస్కృతిని ప్రేరేపించింది ఏదైనా మనదాకా వస్తేనే కదా తెలిసొచ్చేది పక్కోడి ఇల్లు కాలినా, కూలినా మనకేంటి నోట్లో బూడిద కొట్టి ప్రసాదమంటే పరవశించిపోయే మన లాంటి వాళ్ళ కోసం కొత్త చట్టాలు పుడుతూనే ఉంటాయి దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి లౌకికతత్వాన్ని తుత్తునియలు చేసే సవరణలు జరుగుతూనే ఉంటాయి పెద్దనోట్ల రద్దు నల్లధనం జాడ తీయలేదు ఒకే దేశం – ఒకే పన్ను నినాదం అద్భుతాలూ సృష్టించలేదు సామాన్యుడిని కష్టాల పాలు జేశాయి దేశాన్ని మాంద్యం బారిన పడకుండా ఆపలేకపోయాయి సవరణ జాతిని ఏకం చేసే సంస్కరణ కావాలి కానీ విద్వేషాలను రగిల్చే కార్చిచ్చు కాకూడదు -గుండు కరుణాకర్, వరంగల్ మొబైల్ : 98668 99046 -
రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది. -
రూ. 2000 నోటు రద్దుపై కేంద్ర మంత్రి క్లారిటి
-
రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకుంటుందనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని సాగుతున్న ప్రచారం అవాస్తవమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్ చెప్పారు. అసంఘటిత రంగాన్ని సంఘటితపరచడంతో పాటు తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ లావాదేవీలను నోట్ల రద్దు ద్వారా పెంచగలిగామని తెలిపారు. -
హతవిధీ! ఆ నోట్లు ఎంత పని చేశాయి
సాక్షి , చెన్నై : కన్నతల్లి మమకారం ఆ అక్కాచెల్లెళ్లను పొదుపరులుగా మార్చింది. ఏనాటికైనా చావు తప్పదు, అయితే తమ అంత్యక్రియలకు ఆయ్యే ఖర్చు తమ సంతానానికి భారం కాకూడదని తలచేలా చేసింది. ఏడుపదులు దాటిని వృద్ధాప్య దశలో ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి గోప్యంగా దాచి ఉంచిన రూ.46వేలు బయటకు తీయగా అవన్నీ రద్దయిన పెద్దనోట్లు కావడంతో ఖిన్నులై కృంగిపోయారు. బిడ్డలకు చెప్పుకుని బోరుమని విలపించారు. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పూమలూరులో కే రంగమ్మాళ్ (75), పీ తంగమ్మాళ్ (72) అనే అక్కచెల్లెళ్లు నివసిస్తున్నారు. రంగమ్మాళ్‌కు ఏడుగురు, తంగమ్మాళ్‌కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరు ఊళ్లలో కాపురం ఉంటున్నారు. వారిద్దరి భర్తలు చనిపోవడంతో పశువులు మేపడం వృత్తిగా పెట్టుకుని వేర్వేరుగా కాపురం ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో ఇద్దరూ కూడబలుక్కుని పిల్లలకు తెలియకుండా కొంతదాచిపెట్టేవారు. నెలరోజుల క్రితం తంగమ్మాళ్ ఆస్మావ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఒక కుమారుడిని పిలిచి ఇంటిలో తన అంత్యక్రియల ఖర్చుకోసం కొంతసొమ్ము పొదుపుచేసి ఉన్నాను, అందులో నుంచి కొంత తీసుకురమ్మని పంపింది. ఇంటికి వెళ్లి నగదును చూడగా అవన్నీ రూ.24వేల విలువైన రద్దుకు గురైన రూ.1000, రూ.500 పెద్దనోట్ల కావడంతో అతడు బిత్తరపోయాడు. ఈవిషయాన్ని తల్లికి చెప్పగా తనతోపాటూ సోదరి రంగమ్మాళ్ కూడా ఇలానే రూ.22వేలను దాచిపెట్టి ఉందనే విషయాన్ని తెలిపి కన్నీరుపెట్టుకుంది. లోకజ్ఞానం లేని నిరక్షరాస్యులైన ఈ అక్కచెల్లెళ్లకు పెద్దనోట్ల రద్దు విషయం వీరికి తెలియకపోవడంతో సదరు సొమ్మును బ్యాంకులో మార్చుకోకుండా అలానే ఉంచుకున్నారు. రంగమ్మాళ్ కుమారుడు సెల్వరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత టీవీలు వారిద్దరి ఇళ్లలో ఉన్నా గత కొంతకాలంగా అవిపనిచేయడం లేదని, దీంతో పెద్దనోట్ల రద్దు విషయం వారి దృష్టికి రాలేదని తెలిపాడు. రోజువారీ ఇంటి ఖర్చుల కోసం కొడుకుల నుంచి కొంత తీసుకుంటూ అంత్యక్రియల కోసం వారిద్దరూ కలిసి రూ.46వేలు దాచుకున్నారు. ఆ సొమ్ము ఇక చెల్లదని తెలియడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నాడు. వారిని హెల్పేజ్‌లైన్ ఆదుకునేనా : నిరక్షరాస్యులైన ఆ అక్కాచెలెళ్లకు పెద్దనోట్ల రద్దుతో అనుకోని సమస్య వచ్చి పడింది. మూడేళ్ల కిత్రమే చెల్లకుండా పోయిన నోట్లను చెల్లుబాటు చేసే పరిస్థితులు లేకపోవడం వారిని దిగాలులోకి నెట్టేసింది. వృద్ధుల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ఉత్తర్వులు అక్కాచెల్లెళ్ల సమస్యను తీర్చేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన సామాజిక భద్రత కల్పిస్తోంది. అంతేగాక వృద్ధులు తమకు అవసరమైన సహాయాన్ని పొందేందుకు టోల్‌ఫ్రీ నంబరును సిద్ధం చేసింది. చెన్నై పరిధిలోని వారు 1253, చెన్నై మినహా ఇతర జిల్లాల వారు 1800–180–1253 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు. హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలలా ఉన్న సీనియర్ సిటిజెన్స్, వృద్ధులకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా ఫోన్ నంబర్లను ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ : 044–24350375, సెల్‌ఫోన్ : 93612 72792 నంబర్లను ప్రకటించింది. ఈ హెల్పేజ్ లైన్‌కు అక్కాచెల్లెళ్లు తమ సమస్యను తీసుకెళితే ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. -
బ్లాక్‌మనీ వెలికితీత ఏమైంది?..
సాక్షి, రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న విధానాల వల్లే దేశంలో ఆర్థిక మాద్యం తలెత్తిందని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌ని ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా తీరు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు ఊదరకొట్టిన ‘బ్లాక్‌మనీ వెలికతీత’ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీని అసంబద్ధంగా అమలు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలించడం ఏమాత్రం చేతకాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం నియంతలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హడావుడిగా పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత నిధులు విడుదల చేయడాన్ని విస్మరించారని విమర్శించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు. ఏ పథకమూ సక్రమంగా కొనసాగడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు లేకపోవడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనడానికి నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పతనం జిల్లా నుంచే మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారిణి ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, జానకిరాం, శివకుమార్, ఉదయ్‌మోహన్‌రెడ్డి, బాబర్‌ఖాన్, అధికార ప్రతినిధి సిద్దేశ్వర్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వినోద్, దేపభాస్కర్‌రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రియాజ్, శంకర్, సంజయ్ యాదవ్, గోపాల్ రెడ్డి, ఖలీద్, చిగురింత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.2000 నోటు : ఎస్సీ గార్గ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా చలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ డిమానిటైజేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రూ. 2 వేల నోటు రద్దుపై పలు అనుమానాలు, అంచనాలు ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ద్రవ్య చలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా అనే భయాందోళనలు మరోసారి రేగాయి. నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త రూ .2000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్‌గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలావరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదనీ, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని..ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 2016లో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూ .500, రూ .1,000 నోట్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రధానమంత్రి నరేంద మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శుక్రవారమిక్కడ ఆమె మాట్లాడుతూ... నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు. ‘గ్రామీణ భారత దేశం పనులకోసం ఎదురు చూస్తుంది. బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయి. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నా. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంత మంది స్వామీజీలు కూడా ఉన్నారు’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. మోదీ సర్కారు తలాక్ బిల్లుపై చూపిన శ్రద్ధ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు చూపడం లేదని బృందాకారత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అధికార పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు బృందాకారత్ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. -
క్యాష్ ఈజ్ కింగ్!
పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? సాక్షి, బిజినెస్ విభాగం: 2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!! మళ్లీ క్యాష్ జమానా! నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్ఏఎస్ వెల్లడించింది. మరి బ్లాక్‌మనీ సంగతి? నలుపు... తెలుపైపోయిందా? నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి. ► రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు ► బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు ► వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు ► తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు డిజిటల్ లావాదేవీల్లోనూ వృద్ధి.. నోట్ల రద్దు తరవాత డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. ఆర్బీఐ, ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి. మందగమనానికి బీజం.. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. ► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది. ► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ► నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుదేలవటం గతేడాది నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. కష్టాలకు అదే మూలం.. డీమోనిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. – అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత -
నేడే వైఎస్సార్ నవోదయం పథకం
-
నేడే ‘నవోదయం’
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, మందగమనం లాంటి వరుస కష్టాలతో ఆర్థికంగా కుంగిపోయిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రచారం.. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి. రుణాలు తీర్చలేని యూనిట్లను గుర్తించి వైఎస్సార్ నవోదయం పథకంలో చేర్చే బాధ్యతను కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకులకు ప్రభుత్వం అప్పగించింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థలను గుర్తించి పథకంలో చేర్చాలని ఆదేశించింది. దీనిపై ప్రతి జిల్లాలో అవగాహన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్బీఐ సహకారంతో అమలు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తీర్చలేక నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారిన ఖాతాలతోపాటు మొండి బాకీలుగా మారేందుకు సిద్ధంగా ఉన్న (స్ట్రెస్డ్ అకౌంట్స్)ను ఆదుకునేలా వైఎస్సార్ నవోదయం పథకాన్ని రూపొందించారు. గరిష్టంగా రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అవసరమైన ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ.2 లక్షల వరకు సాయం చేయనున్నారు. ఈ కంపెనీలకు గత ప్రభుత్వం బకాయి పడ్డ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రాధాన్య క్రమంలో విడుదల చేస్తారు. టీడీపీ సర్కారు పరిశ్రమలకు సుమారు రూ.3,000 కోట్లు రాయితీలు బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. రిజర్వ్ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. -
ద్రవ్య లోటుపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు. -
ఆర్థిక మందగమనమే
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందని ప్రముఖ పాత్రికేయులు వివేక్ కౌల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన మంథన్‌సంవాద్ కార్యక్రమంలో ఆయన ‘ది గ్రేట్‌ఎకనమిక్ స్లో డౌన్’ అనే అంశంపై ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామంతో చిన్న పరిశ్రమలు చితికిపోయాయని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. ప్రజల తలసరి ఆదాయం కూడా తగ్గుతోందని తెలిపారు. కార్పొరేట్లకు అను కూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వారికే గరిష్ట ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి రుణభారం పెరిగి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు. గాంధీ ఆదర్శప్రాయంగా నిలిచారు.. సత్యాగ్రహం, అహింస, సత్యంతో తాను చేసిన ప్రయోగాలతో మహాత్మాగాంధీ నాటికీ.. నేటికీ అన్ని దేశాలకు.. అన్ని వర్గాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రముఖ ఫిలాసఫర్స్ దివ్య ద్వివేదీ, షాజ్‌హాన్‌లు అన్నారు. ‘గాంధీస్ ట్రూత్’ అనే అంశంపై వారు ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు దేశంలోని అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులను ఆయన ఆకాంక్షించడంతో పాటు అందుకు నడవాల్సిన దారిని చూపారని కొనియాడారు. స్వాతంత్య్రమే కీలకం ‘లిబర్టీ అండ్ ది బిగ్ స్టేట్స్’ అనే అంశంపై ప్రము ఖ పాత్రికేయురాలు సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సామా జిక, ఆర్థిక రంగాల్లో అన్ని వర్గాలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ లభించాలన్నారు. కేరళలో పౌరసమాజం తమ హక్కుల సాధనకు రాజకీయ నేతలను ప్రశ్నించడం శుభపరిణమమన్నారు. అలరించిన కామెడీ ప్రముఖ టీవీ యాంకర్ అజీమ్ బనత్వాలా సమకా లీన అంశాలు, రాజకీయా లపై నిర్వహించిన లైవ్ కామెడీ షో ఆహూతులను అలరించింది. దేశం లో చోటుచేసుకుంటున్న మతపరమైన అసహనం, గోరక్షణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలు వంటి వాటిపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించడంతో పాటు ఆలోచింపజేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
పాత రూ.500 నోటు ఇస్తే రూ.50 వేలు..
సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్‌కు ముందు అమలులో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే రూ.50 వేలు వస్తాయంటూ నమ్మబలికిన ముఠా రూ.12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా ఫిర్యాదు అందినప్పటికీ సైదాబాద్ పోలీసులు 48 గంటల్లో కేసు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేష్, మలక్‌పేట ఏసీపీ ఎం.సుదర్శన్‌లతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన రాజ్‌కుమార్ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్‌మహల్ రోడ్లో శ్రీ సంతోషి ఫిల్లింగ్ స్టేషన్ పేరుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రకాష్‌నగర్‌కు చెందిన సంబరం రాజేష్ పని చేస్తున్నాడు. బండ్లగూడకు చెందిన ఏఎం మెటల్ స్టోర్ నిర్వాహకుడు అబేద్ మొహియుద్దీన్, తలాబ్‌కట్టకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి షేక్ అబ్దుల్ బాసిత్ రాజేష్‌కు స్నేహితులు. తన యజమాని బగాడియాకు ఆశ ఎక్కువని, గతంలోనూ అనేక చిన్న చిన్న వ్యవహారాలు నడిపాడని అతడి ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వారిద్దరూ రాజేష్‌తో కలిసి వెళ్లి బగాడియాను పరిచయం చేసుకున్నారు. అదును చూసుకుని బగాడియా వీక్నెస్పై కొట్టాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ త్రయం ఇటీవల బగాడియాను కలిసి తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం ఉందని చెప్పింది. 2002లో ముద్రితమైన పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చిందని, ఆ కరెన్సీ దొరికితే ఒక్కో నోటుకు రూ.50 వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు బగాడియాతో చెప్పారు. తేలిగ్గా డబ్బు వస్తుందనడంతో ఆశపడిన అతను అందుకు అంగీకరించాడు. అయితే ఇప్పుడు పాత నోట్లు ఎక్కడ దొరుకుతాయంటూ ప్రశ్నించగా, సైదాబాద్‌లోని ఓ వ్యక్తి వద్ద రూ.2 కోట్ల పాత కరెన్సీ ఉందని చెప్పారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం ఇస్తే ఆ నోట్లు ఇచ్చేస్తాడని, వాటిలో తమకు కావాల్సిన సిరీస్ పాత నోట్లు ఎంచుకుని మిగిలినవి తిరిగి ఇచ్చేదామని గత శనివారం చెప్పారు. దీంతో ఆదివారానికి రూ.12 లక్షలు సిద్ధం చేసిన బగాడియా ఆ మొత్తం తీసుకుని అబేద్, బాసిత్‌లతో కలిసి బయలుదేరాడు. ఇతడిని సైదాబాద్‌లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వరకు తీసుకువెళ్లిన నిందితులు అక్కడ దృష్టి మళ్ళించారు. సదరు వ్యక్తి అందరినీ ఇంట్లోకి రానీయడని, ముందు తాము వెళ్ళి డబ్బు చూపిస్తామని, ఆపై నమ్మకం కలిగి మిమ్మల్నీ లోపలకు అనుమతిస్తాడని చెప్పారు. అందకు అంగీకరించిన బగాడియా రూ.12 లక్షలు ఇచ్చి వారిని పంపాడు. కొద్దిదూరం వెళ్లిన ఇరువురూ ఆ మొత్తం తీసుకుని ఉడాయించారు. కాస్సేపు అక్కడే వేచి చూసిన బగాడియా తిరిగి తన బంకుకు వచ్చేసి ఆ ఇద్దరి విషయం రాజేష్‌ను అడిగాడు. ఎంత ప్రయత్నించినా తనకూ వారి ఫోన్ నెంబర్లు కలవట్లేదని చెప్పిన అతగాడు బహుశా పోలీసులు పట్టుకుని ఉంటారని, ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారని చెప్పాడు. రెండు రోజులు వేచి చూసిన బగాడియా తాను మోసపోయినట్లు గుర్తించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కస్తూరి శ్రీనివాస్ నేతృత్వంలో రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని రూ.12 లక్షలు రికవరీ చేశారు. ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మూడింతలు చేస్తానని ముంచేశాడు..ఓ డ్రైవర్‌కు నకిలీబాబా బురిడీ బంజారాహిల్స్: యంత్ర తంత్రాలు, పూజలతో మూడింతల డబ్బును చేస్తానంటూ నగరానికి చెందిన ఓ డ్రైవర్‌ను మహారాష్ట్ర బురిడీ బాబా నిండా ముంచాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఎన్ నగర్‌కు చెందిన బండారు రత్నయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు జాఫర్ కోసం అతను తరచూ మంచిర్యాల వెళ్లేవాడు. ఇటీవల మంచిర్యాలకు వెళ్ళినప్పుడు జాఫర్, ప్రభాకర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. జాఫర్, ప్రభాకర్ ఇద్దరూ కలిసి తమకు మహారాష్ట్రలో మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ అనే బాబా తెలుసని రూ. లక్ష ఇస్తే మంత్రాలు, పూజలు చేసి రూ. మూడు లక్షలు చేస్తాడని నమ్మించాడు.రూ. 12 లక్షలు సర్ధితే ’ 36 లక్షలు తీసుకోవచ్చని చెప్పడంతో రత్నయ్య ఈ ఏడాది మే 2న విడతల వారిగా వారికి డబ్బులు ఇచ్చాడు. గత మే నెలలో ఎల్ఎన్ నగర్‌లోని రత్నయ్య ఇంటికి బాబా మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ వచ్చాడు. డబ్బును ఓ బ్యాగులో పెట్టి పూజల అనంతరం రూ. 50 లక్షలు అయ్యిందంటూ ఓ బ్యాగును రత్నయ్యకు ఇచ్చి 15 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం బ్యాగ్‌ను తెరవాలని చెప్పి వెళ్లిపోయాడు. బాబా చెప్పినట్లుగానే రత్నయ్య, జయ దంపతులు పూజలు నిర్వహించి బ్యాగు తెరిచి చూడగా అందులో తెలుపు, నలుపు పేపర్ల బండిళ్లు కనిపించాయి. వెంటనే బాబాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా, పూజల్లో ఏదో లోపం జరిగిందని వెంటనే ఆ బ్యాగు తీసుకొని మహారాష్ట్రకు రావాలని సూచించాడు. దీంతో భార్యతో కలిసి కారులో అక్కడికి వెళ్ళాడు. ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి రూ. 60 వేలు వసూలు చేశాడు. తాను కొద్దిసేపట్లో వస్తానని ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా బాబా రాకపోవడంతో రత్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. జాఫర్, ప్రభాకర్, బాబా ఇర్ఫాన్ ముగ్గురూ కలిసి తనను మోసం చేశారని తెలుసుకొని నిలదీయగా, బాబా వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ బాబాతో పాటు జాఫర్, ప్రభాకర్‌లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్లిస్ట్ను విడుదల చేసింది. లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు. -
ముసద్దిలాల్ జ్యువెల్లర్స్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు ఇన్వాయిస్లతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయంలో అడ్డంగా దొరికిపోయిన ముసద్దిలాల్ జ్యువెల్లర్స్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. తమకు రూ.75 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) ఫిర్యాదుతో సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను నిందితులుగా చేర్చింది. పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009 అక్టోబర్‌లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.55 కోట్లు రుణం తీసుకుంది. ఈ క్రమంలో తమ రుణాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)కు మార్చాలంటూ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ ఐఎన్జీ వైశ్యా బ్యాంకుకు విన్నవించుకుంది. బ్యాలెన్స్ షీట్ సరిగానే నిర్వహించడంతో సంతృప్తి చెందిన ఐఎన్జీ వైశ్యా బ్యాంకు 2013 మార్చిలో ఆ రుణాన్ని ఐవోబీ బ్యాంకుకు మార్చారు. ఆ తర్వాత బ్యాంకు వద్ద మరికొంత రుణం తీసుకున్నారు. అది కాస్తా రూ.82 కోట్లకు చేరింది. రానురాను రుణాన్ని తిరిగి చెల్లించడంలో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ విఫలమవుతూ వచ్చింది. దీంతో 2014 మార్చిలో ఖాతాలను బ్యాంకు స్తంభింపజేసింది. 2016లో జరిగిన ఆడిట్ తనిఖీల్లో వారు తీసుకున్న రుణంలో రూ.58 కోట్ల రూపాయలను ఇతర కంపెనీలకు మళ్లించినట్లుగా గుర్తించారు. దీంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి తమకు రూ.75 కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఐవోబీ బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ రవిచంద్రన్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ బెంగళూరు శాఖ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్‌తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలపై ఐపీసీ 120, 406, 420, 468, 471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసింది. -
పాత నోట్లు.. కొత్త పాట్లు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసు దర్యాప్తు సీఐడీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. నిందితులను పట్టుకునేందుకు యూపీ, ఢిల్లీ, బిహార్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా మొత్తం 8 రాష్ట్రాల్లో వేట సాగించాల్సి వచ్చింది. దీనికితోడు ఆధారాల సేకరణ మరింత కష్టంగా మారింది. కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో గాలింపు చేపట్టిన సీబీఐ మరోవైపు తెలంగాణ, ఆంధ్రాలో నిందితుల వేటను ఉధృతం చేసింది. అదే సమయంలో కస్టడీలో ఉన్న కమిలేశ్ సింగ్ (55) గుండెనొప్పితో చనిపోయాడు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. అతనిచ్చిన సమాచారంతో పోలీసులు స్థానికంగా వారి ఏజెంట్లను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సీఐడీ పోలీసులకు అనుకోని అవాంతరం వచ్చిపడింది. పట్టుకున్నవన్నీ పాతనోట్లే..: రూ.50 లక్షల్లో అధిక శాతం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. అన్నీ కూడా రద్దయిన నోట్లు. నిందితులు కూడా వాటిని మార్చలేక ఏం చేయాలో పాలుపోక వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు వారిపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, నగదును కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని న్యాయనిపుణుల వద్ద సలహా తీసుకున్నారు. రద్దయిన నోట్లను కోర్టులో ఎలా సమర్పిస్తారన్న సందేహం లేవనెత్తారు. అదే సమయంలో విధించిన ఆర్బీఐ గడువు ముంచుకొస్తోంది. పిడుగులాంటి ఈ విషయం మీద పడేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతపెద్ద మొత్తాన్ని మార్చడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక నానాతిప్పలు పడ్డారు. చివరికి గడువులోగా నోట్లు మార్చి నగదును కోర్టుకు సమర్పించగలిగారు. -
నోట్ల రద్దు ఇతివృత్తంగా ‘మోసడి’
తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం మోసడి అని ఆ చిత్ర దర్శకుడు జగదీశన్ తెలిపారు. విజూ హీరోగా నటిస్తున్న ఇందులో హీరోయిన్గా పల్లవిడోరా నటిస్తోంది. జయకుమార్ ఎన్సీబీ.విజయన్, వెంకటాచలం. నీలు సుకుమారన్, ఓఎస్.శరవణన్, మోహన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న దీనికి ఆర్.మణికంఠన్ ఛాయాగ్రహణం, షాజహాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మోసడి చిత్రం పూర్తిగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. 2016 నవంబర్ నెల 8వ తేదీన సాయంత్రం అనూహ్యంగా రూ.1000, 500 నోట్లు చెల్లవు అన్న ప్రకటన వెలువడిన తరువాత బడాబాబులందరూ తమ అధికారాన్ని ఉపయోగించుకుని పెద్ద నోట్లను ఎలా రూ.2000నోట్లకు మార్చుకున్నారు? సాధారణ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రకటనతో దొడ్డి దారిన ఎలాంటి మోసాలు జరిగాయి? లాంటి యథార్థ అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా మోసడి ఉంటుందని తెలిపారు. జరిగిన సంఘటనలే ఈ∙చిత్రంలో చూపించామని, అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి సెన్సార్ కూడా అయిపోయిందని తెలిపారు. కమర్శియల్ అంశాలతో కూడిన జనరంజకంగా సాగే మోసడి చిత్రాన్ని ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జగదీశన్ తెలిపారు. -
రోడ్డెక్కిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ సంక్షోభంతో అనేక ఇబ్బందుల పాలవుతున్న ఉద్యోగులు పోరుబాట బట్టారు. తమకు జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్‌ఎయిర్‌వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని కోరారు. సంస్థ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అటు దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అటు విమానాలకు అద్దెబకాయిలు చెల్లించలేక ఇప్పటికే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా సోమవారం దాకా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
ఉరుము లేని పిడుగులా..!
అది నవంబర్ 8, 2016.. రాత్రి 8 గంటలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియా ముందుకు వచ్చారు. ఉరుము లేని పిడుగులా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలో చెలామణిలో ఉన్న నోట్లలో 86శాతం ఉన్న పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేయడంతో జాతి యావత్తూ గందరగోళానికి లోనైంది. పాత నోట్లు మార్చుకోవడానికి 50 రోజులు సమయం ఇచ్చినా సామాన్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బ్యాంకు క్యూ లైన్లలో నిల్చొని పడరాని పాట్లు పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు, రైతులు, చిన్న పరిశ్రమలు, రోజువారీ కూలీలు, కార్మికులు విలవిలలాడిపోయారు. నగదు లావాదేవీలపైనే అధికంగా ఆధారపడే వ్యవసాయ రంగం, అసంఘటిత రంగంపై నోట్లరద్దు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా దేశ సంక్షేమం కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని జనం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచారు. నరేంద్ర మోదీపై ప్రజలు ఎంత భరోసా ఉంచారో నోట్ల రద్దు జరిగిన నాలుగు నెలల్లోనే 2017, ఫిబ్రవరిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. నోట్ల రద్దు ఒక అనవసర ప్రహసనమని విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని మెజార్టీని బీజేపీకి కట్టబెట్టారు. నోట్ల రద్దు లక్ష్యాలేంటి ? అవినీతిని అంతం చేసి బ్లాక్ మనీని బయటకు తీసుకురావడం నకిలీ నోట్ల దందాను అరికట్టడం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు బ్లాక్ మనీ ఉంటుందని, దానిని రొటేషన్‌లోకి తీసుకురావడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునని మోదీ సర్కార్ భావించింది. అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి ♦ నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బొక్క బోర్లా పడింది. తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. భారతదేశంలో బ్లాక్ మనీ బంగారం, భూముల రూపంలోనే ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడానికి ఎంతో కాలం పట్టం లేదు. నోట్ల రద్దు జరిగిన రెండేళ్ల తర్వాత ఆర్థిక రంగంపై పడిన దుష్ప్రభావాలు ఒక్కొక్కటి బయటపడసాగాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సర్వేలు నోట్ల రద్దు వల్ల పైసా ఉపయోగం లేదని పెదవి విరిచాయి. ♦ నోట్ల రద్దు జరిగిన కేవలం 35 రోజుల్లోనే 99.3 శాతం కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017–18 వార్షిక నివేదిక వెల్లడించింది. ♦ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏకంగా 7.3శాతం వరకు జీడీపీ పడిపోయిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ♦ నోట్ల రద్దు కారణంగా నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు చేసిన ఫలితాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2011–12లో 5 శాతం మాత్రమే ఉన్న నిరుద్యోగ సమస్య 2017–18 వచ్చేసరికి 17.5శాతానికి పెరిగిపోయింది. ♦ భారత స్థూల జాతీయోత్పత్తి నోట్ల రద్దుకు ముందు 8 శాతం ఉంటే ఆ తర్వాత రెండేళ్లలో 2 శాతం పడిపోయిందని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ సర్వీస్ అంచనా వేసింది. ♦ అయితే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు మాత్రం 150 శాతం వరకు పెరిగాయి. ఎన్నికల్లో ప్రభావం ఎంతవరకు ? నోట్ల రద్దుపై మొదట్లో ఉన్నంత సానుకూలత రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో కనిపించలేదు. సీఎస్డీఎస్ సర్వేలో నోట్ల రద్దు దేశానికి అవసరమా అంటే 53 శాతం మంది అవసరమేనని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏదో ఒకటి చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు ప్రభావం ప్రత్యక్షంగా ఎంతవరకు ఉందో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మిగిలింది. కానీ పరోక్షంగా దాని ప్రభావం తీవ్రంగానే పడింది. చిన్న వర్తకులు, కార్మికులు, రైతులు విలవిలలాడారు. అదే సీఎస్డీఎస్ సర్వేలో 2017లో వర్తకుల్లో 50 శాతం మంది ఎన్డీయేకి అనుకూలంగా ఉంటే 2018 వచ్చేసరికి వారి సంఖ్య 48 శాతానికి పడిపోయింది. రైతుల మద్దతు ఎన్డీయేకి 2017 మేలో 49శాతం ఉంటే, ఆ తర్వాత ఏడాదికి 37శాతానికి తగ్గిపోయింది. నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని జీఎస్టీ వల్ల పూడ్చుకోవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు పుల్వామా దాడుల తర్వాత మొత్తంగా రాజకీయ చిత్రం మారిపోయి నోట్ల రద్దుని పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొందని అంచనా.