న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మోదీ బడ్జెట్‌ను ఓట్ల బడ్జెట్‌గా చిత్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వరుస ట్వీట్లు చేశారు. ‘మోదీ ప్రభుత్వం జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతు సవరణలు చేస్తోంది. కానీ పెగురుతున్న నిరుద్యోగుల సంఖ్యను మాత్రం దాచి పెడుతుంది. వాటిని కూడా సవరించండ’ని పేర్కొన్నారు. అలానే ‘మోదీ ప్రభుత్వంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన ఏడాదే అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయ్యింది. ఈ సారి వంద రూపాయల నోట్లను రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుందం’టూ ఎద్దేవా చేశారు.
అంతేకాక ‘సగటున 7 శాతం కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం.. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాల’ని ప్రశ్నిస్తూ చిదంబరం వరుస ట్వీట్లు చేశారు.
Modi Government revises GDP growth figures upward. What government did not realise was that unemployment figure was also revised upwards!
— P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019
The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation.
— P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019
This time let's demonetise 100 rupee notes.
Comments
Please login to add a commentAdd a comment