నకిలీ కరెన్సీ నోట్లు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : డిమానిటైజేషన్.. నకిలీ కరెన్సీ నిర్మూలనకు 2016లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న హఠాత్తు నిర్ణయం. దీంతో నకిలీ కరెన్సీ ఆట కట్టించవచ్చంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితి దీనికి తలకిందులైంది. నోట్ బ్యాన్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీకి దారితీసింది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీ ఎత్తున్న నకిలీ కరెన్సీ చేరినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. అంతేకాక అనుమానిత లావాదేవీల్లో 480 శాతం జంప్ అయినట్టు గుర్తించినట్టు పేర్కొన్నాయి. ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు తర్వాతే ఎక్కువగా చోటు చేసుకున్నట్టు రిపోర్టులు తెలిపాయి. ప్రైవేట్, పబ్లిక్, కోఆపరేటివ్ రంగాలు, ఇతర ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లు.. 400 శాతం ఎక్కువ అనుమానిత లావాదేవీల రిపోర్టులను(ఎస్‌టీఆర్) జనరేట్ చేశాయని రిపోర్టులు వెల్లడించాయి.
మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం చేపట్టిన అనుమానిత లావాదేవీలను ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పరిశీలిస్తోంది. ఇది నివేదించిన రిపోర్టులో బ్యాంకింగ్, ఇతర ఎకనామిక్ ఛానళ్లలో నకిలీ కరెన్సీ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3.22 లక్షల సందర్భాలలో పెరిగినట్టు తెలిసింది. నకిలీ కరెన్సీ రిపోర్టులు(సీసీఆర్‌లు) 2015-16లో 4.10 లక్షలకు పైగా ఉంటే, 2016-17లో 7.33 లక్షలకు పైగా పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. సీసీఆర్ అనేవి ‘లావాదేవీ ఆధారిత రిపోర్టులు’.. వీటిని కేవలం నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లు గుర్తించినప్పుడు రికార్డు చేస్తారు. అయితే నకిలీ కరెన్సీ విలువను ఎంత ఉందని మాత్రం రిపోర్టు వెల్లడించలేదు. అనుమానిత లావాదేవీల రిపోర్టులు కూడా 2015-16తో పోలిస్తే నాలుగు సార్లకు పైగా పెరిగి 4,73,006గా నమోదయ్యాయి. డిమానిటైజేషన్‌తోనే ఈ రిపోర్టుల సంఖ్య మరింత పెరిగినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. ఎప్పడికప్పుడు అన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లు ఎస్‌టీఆర్‌లను రికార్డు చేసి, యాంటీ-మనీ లాండరింగ్ లా కింద వాటిని ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు పంపిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment