సిటీ నుంచి బాన్సువాడకు తరలిస్తుండగా పట్టుబడ్డ నిందితులు
ఆరుగురి అరెస్టు, పరారీలో మరో ఇద్దరు
బోయిన్‌పల్లిలో నకిలీ నోట్ల ప్రింటింగ్
వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి టౌన్: హైదరాబాదులో నకిలీ నోట్లను తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాన్సువాడ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులోని కొందరు పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కోలావర్ కిరణ్‌కుమార్, బాన్సువాడకు చెందిన కె.రమేష్ గౌడ్‌తోపాటు హైదరాబాద్ కొంపల్లికి చెందిన కడపత్రి రాజ్‌గోపాల్ ఉన్నారు.
వారి వద్దనుంచి రూ. 30 లక్షల విలువ చేసే నకిలీ రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్ల తయారీ, చెలామణిలో పెట్టుబడి పెడతారు. రాజస్థాన్‌కు చెందిన కమలే‹Ù, సుఖ్‌రాం, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణలు కలిసి నకిలీ కరెన్సీని తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ వీటిని చెలామణి చేస్తున్నారు.
పట్టుబడ్డారిలా..
నగరంలోని గౌలిగూడ, సికింద్రాబాద్ సీటీసీలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి బోయిన్‌పల్లిలోని అంటిలియా అపార్ట్‌మెంట్‌లో పెంట్‌హౌజ్‌లో ఇప్పటివరకు రూ.60 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. ఇందులో రూ.3 లక్షలను బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్‌కు చెలామణి కోసం అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చెలామణి చేశారు. మరో రూ.30 లక్షలను హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు తీసుకువచ్చి కిరణ్‌కుమార్, రమేష్ గౌడ్‌లకు అప్పగించాడు.
అయితే తిరిగి రాజ్‌గోపాల్‌ను బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమే‹Ùగౌడ్‌లు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో బాన్సువాడలోని కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వా«దీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అలాగే నోట్ల తయారీకి వినియోగించే వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కమలే‹Ù, సుఖ్‌రాంలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల 90 వేల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment