
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment