telangana police
-
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ శివ మృతి మిస్టరీని ఛేదించే పనిలో ఉన్న పోలీసులకు ఆ ముగ్గురి వాట్సాప్ చాటింగ్, వారు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ కీలకమైంది. ముగ్గురూ మృతి చెందడంతో అసలేం జరిగి ఉంటుందనేదిపెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురి ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్‌పైఆధారపడ్డారు. అలాగే సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏకకాలంలో జరిగిన ముగ్గురి మరణాల మిస్టరీని తేల్చేందుకు పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. చాలా కాలంగా క్లోజ్‌గా ఉన్న వాళ్లు కలిసి చనిపోవడానికి కారణాలు ఏమిటనేదానిపై ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం సాయంత్రం భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌లు చనిపోయిన విషయం తెలిసిందే. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చనిపోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై సాయికుమార్ వద్ద రెండు ఫోన్లు, కానిస్టేబుల్ శ్రుతి ఒక ఫోన్, నిఖిల్ రెండు ఫోన్లు వాడినట్లు నిర్ధారణకు వచ్చారు. ముగ్గురి కాల్ డేటాను ఇప్పటికే పరిశీలించారు. గడిచిన వారం రోజుల్లో ముగ్గురు పలుమార్లు కాల్స్ మాట్లాడినట్లు కాల్‌డేటా ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలు, వాళ్లు సడెన్‌గా ఆ రోజు ఎందుకు కలవాల్సి వచ్చింది ? అక్కడ జరిగిన గొడవ ఏమిటి? అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు.భిక్కనూరు నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి దాకా..విచారణలో భాగంగా పోలీసు అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. భిక్కనూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి మొదలుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. జాతీయ రహదారిపై ఓ దాబా హోటల్ సమీపంలో నిఖిల్ బైకును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్ వద్ద కలిసి భోజనం చేశారన్న ప్రచారం జరగడంతో అధికారులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే అక్కడ సీసీ ఫుటేజీని చెక్ చేసే క్రమంలో అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కారులో కామారెడ్డి పట్టణంలోకి రాకుండా బైపాస్ రోడ్డు గుండానే నిజామాబాద్ రూట్లో వెళ్లినట్టు భావిస్తున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపుకుని డిస్కషన్ చేసి ఉంటారని, తరువాత ఎవరి కంట పడకుండా ఉండేందుకు చెరువు కట్టపైకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ముగ్గురి చావుల మిస్టరీ తేల్చడం పోలీసులకు సవాల్‌గానే మారిందని చెప్పాలి.వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..ముగ్గురు కూడా రెగ్యులర్‌గా వాట్సాప్ వాడుతున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారు. ఎస్సై సాయికుమార్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి కారులో ఉండగా, మరో ఫోన్ ఆయన ప్యాంట్ జేబులోనే ఉండిపోయింది. నీటిలో మునిగిపోవడంతో ఫోన్ ఆన్ కావడం లేదని తెలుస్తోంది. కారులో ఉన్న ఐ ఫోన్ స్క్రీన్ లాక్ ఉండడంతో ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అయితే ఎస్సై ఫోన్ లాక్ గురించి ఆయన భార్యను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తనకు తెలియదనే సమాధానం వచ్చినట్లు సమాచారం. నిఖిల్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒకటి లాక్ ఓపెన్ కావడం లేదని, మరొకదానిలో పెద్దగా చాటింగ్ లేనట్టు చెబుతున్నారు. శ్రుతి ఫోన్ లాక్ సైతం ఓపెన్ కాలేదని తెలుస్తోంది. వాటిని ఓపెన్ చేయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్‌లో కచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే నమ్మకంతో పోలీసులు ఉన్నారు.కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా? -
Fake Currency: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల తయారీ
కామారెడ్డి టౌన్: హైదరాబాదులో నకిలీ నోట్లను తయారుచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాన్సువాడ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులోని కొందరు పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన కోలావర్ కిరణ్‌కుమార్, బాన్సువాడకు చెందిన కె.రమేష్ గౌడ్‌తోపాటు హైదరాబాద్ కొంపల్లికి చెందిన కడపత్రి రాజ్‌గోపాల్ ఉన్నారు. వారి వద్దనుంచి రూ. 30 లక్షల విలువ చేసే నకిలీ రూ. 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్ల తయారీ, చెలామణిలో పెట్టుబడి పెడతారు. రాజస్థాన్‌కు చెందిన కమలే‹Ù, సుఖ్రాం, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణలు కలిసి నకిలీ కరెన్సీని తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేశ్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ వీటిని చెలామణి చేస్తున్నారు. పట్టుబడ్డారిలా.. నగరంలోని గౌలిగూడ, సికింద్రాబాద్ సీటీసీలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి బోయిన్‌పల్లిలోని అంటిలియా అపార్ట్మెంట్లో పెంట్‌హౌజ్‌లో ఇప్పటివరకు రూ.60 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. ఇందులో రూ.3 లక్షలను బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేశ్ గౌడ్‌కు చెలామణి కోసం అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో చెలామణి చేశారు. మరో రూ.30 లక్షలను హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు తీసుకువచ్చి కిరణ్‌కుమార్, రమేష్ గౌడ్లకు అప్పగించాడు. అయితే తిరిగి రాజ్‌గోపాల్‌ను బాన్సువాడ బస్టాండులో దింపడానికి కిరణ్ కుమార్, రమే‹Ùగౌడ్లు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో బాన్సువాడలోని కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. రూ.30 లక్షలు స్వా«దీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టి మిగతా రూ.26.90 లక్షల విలువైన రూ.500 నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అలాగే నోట్ల తయారీకి వినియోగించే వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుసేన్ పీరా, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్ ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కమలే‹Ù, సుఖ్రాంలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి రూ.56 లక్షల 90 వేల విలువ చేసే రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
TG: వీవీఐపీలకు గద్దలతో భద్రత..త్వరలో రంగంలోకి ‘గరుడ దళం’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పి స్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనం. అయినా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో.. గగనతలం నుంచీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం తెలంగాణ పోలీసులు త్వరలో ‘గరుడ దళం (ఈగిల్ స్క్వాడ్)’ను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 4 గద్దలకు మొయినా బాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదు ఇచ్చారు. ఇటీవలే ఈ ‘గరుడ దళం’ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద డెమోను సైతం ఇచ్చింది. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు పోలీస్ ఉన్నతాధి కారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)లో భాగంగా ఉంటూ తెలంగాణలో వీవీఐపీ రక్షణను పర్యవేక్షించనుంది.గగనతలం నుంచి నిఘా నేత్రాలుగా..దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో గరుడ దళాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. చిన్న పక్షి పిల్లలను తెచ్చి,వాటిని పోషిస్తూ, తర్ఫీదు ఇస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారితోపాటు కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌తో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానాస్పద వ్యక్తులను గమ నించడం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో వీటికి అమర్చిన ప్రత్యేక నిఘా కెమెరాల సాయంతో భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతారు.అనుమానం రాకుండా...సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టవచ్చు. కానీ డ్రోన్ల నుంచి వెలువడే శబ్దం, వాటి కదలికలను కింద ఉన్నవారు సులువుగా గుర్తించవచ్చు. దీనితో నేరస్తులు అప్రమత్తమై తప్పించుకోవడం, లేదా తాము చేసేది గమనించ లేకుండా చేయడం వంటివాటికి పాల్పడే చాన్స్ ఉంటుంది. అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే వీఐ పీల భద్రతతోపాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలిక లను పసిగట్టేందుకు కూడా ఈ గరుడ స్క్వాడ్‌ను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. అంతేగాక డ్రోన్లను ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశముండదు. వాటి వేగమూతక్కువ. అదే ‘గరుడ స్క్వాడ్’తో ఈ సమస్యలు ఉండవని అంటున్నారు.ఇదీ చదవండి: నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో -
హైదరాబాద్ : హోం శాఖ విజయోత్సవాల్లో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
మాటల్లేవ్.. అయినవాళ్లతో ఆనంద భాష్పాలు తప్ప! (ఫొటోలు)
-
పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు
సాక్షి,హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లగచర్లలో అధికారులపై దాడి ఘటన వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే?దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టాడు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్ చేశాడు. నిందితులకు ఆర్థిక,నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాడు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడు. అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌కు హామీ ఇచ్చాడు నరేందర్ రెడ్డి.పట్నం నరేందర్‌రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారు. నిందితుడు పట్నం నరేందర్‌రెడ్డి ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు నరేందర్‌రెడ్డి.అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్‌రెడ్డి చెప్పాడు. రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సురేష్‌ను ఫోన్లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. నిందితుడు బి. సురేష్ సీడీఆర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. -
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
తెలంగాణ పోలీస్‌కు కేంద్ర పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), అసోం రైఫిల్స్‌తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్ సైన్స్ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.2024కు గాను మొత్తం 463 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ భాస్కరన్. ఆర్, ఇన్స్పెక్టర్లు భీసం హరిప్రసాద్, కాంపల్లి శ్రీనివాస్, చీగూరి సుదర్శన్‌రెడ్డి, గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేంద్రరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చారి రాంబాబు, డొంకల రాంబాబు, సోము గౌతంరెడ్డి, పొన్న సంతోష్‌కుమార్, దుండిగల్ల రాజేశ్, ఏఆర్ఎస్సై మహ్మద్ ముజీబ్, హెడ్‌కానిస్టేబుళ్లు దేవులపల్లి మోహన్‌రెడ్డి, పండరి రవీందర్, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, ఉడుతనూరి మల్లేశ్, కానిస్టేబుళ్లు కడారి హరిబాబు, అంగీల జిడియో డార్లింగ్ మార్కస్, డి.రామచంద్రారెడ్డి, మదారి నాగరాజు, పట్లావత్ రాజేందర్, కేసరి శ్రీకాంత్æ గౌడ్, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐపీఎస్ అధికారి సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పులిమామిడి, డీఎస్పీ సత్యనారాయణ దీపు, ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి మామిళ్ల ఉన్నారు. -
జన్వాడ కేసు: 8 గంటల పాటు ప్రశ్నించి.. రాజ్ పాకాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జన్వాడ కేసులో రాజ్‌పాకాల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయనను జన్వాడ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. మరోసారి జన్వాడ నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజ్ పాకాలను మళ్లీ మోకిల పీఎస్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. 35(3) బీఎంఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.కాగా, రాజ్ పాకాల తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు వచ్చారు. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. మంగళవారం కూడా రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు.ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. కాగా, బుధవారం రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. -
10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: సెలవుల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ఆందోళనలు చేపట్టిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, ఆందోళనలను రెచ్చగొట్టడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్వాసనకు గురైన సిబ్బంది వీరే..: 3వ బెటాలియన్ కానిస్టేబుల్ జి.రవికుమార్.. 6వ బెటాలియన్ కానిస్టేబుల్ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్కే షరీఫ్.. 17వ బెటాలియన్ ఏఆర్ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
జన్వాడ ఫామ్‌హౌస్ ఘటన: డీజీపీకి కేసీఆర్ ఫోన్
సాక్షి,హైదరాబాద్ : జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌కి కేసీఆర్ ఫోన్ చేశారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాలకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు నిలిపివేయాలని డీజీపీని కోరారు. కాగా, శనివారం జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు 30 ఎకరాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు..విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. 👉చదవండి : రేవ్ పార్టీ అంటూ అసత్య ప్రచారమా? బీఆర్ఎస్ ఆగ్రహం -
రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహం
Janwada Farm House Party Updates :తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిగ్గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యాన్ని గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ పోలీసుల దాడులతో రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి తెలిపారు. 6.00pmతలసాని శ్రీనివాస్ యాదవ్కక్ష సాధింపు చర్యలు సరికాదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంఅనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు... వాటిపై దృష్టి సారించాలిప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలుగంట గంటకు మారుతున్న ఎఫ్ఐఆర్లు.. కారణం ఏమిటిఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారుప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదువేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారుకేటీఆర్ బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారుజన్వాడలో ఏం దొరకలేదుగచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారుకేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలిపోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారుప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందికేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉందిసబితా ఇంద్రారెడ్డితెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దాపోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదురాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారుసెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారుప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోందితెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్ లు చేసుకోవడం కామన్ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదుశ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారుతెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవుతెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండిలేనిపోని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారు5:30pmరేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహంరేవ్ పార్టీ చెడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు5:10pmశైలేంద్ర పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులుఓరియన్విల్లాకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు4:40pmహైదరాబాద్ ఓరియన్ విల్లా వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒరియన్ విల్లాలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై బీఆర్ఆర్ఎస్ నేతలు తిరగబడ్డారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.3:40pmఒరియన్ విల్లాస్‌లో ఉద్రిక్తతరాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అధికారూలుకేటీఆర్ విల్లా పక్కనే ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లాఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతల వాగ్వాదంసెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకి పంపిస్తాం అంటున్న బీఆర్ఎస్ నేతలుతమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ వాదన 3:21pmరాయదుర్గం ఓరియన్ విల్లాస్‌కు చేరుకున్న పోలీసులురాజ్ పాకాల ఉంటున్న విల్లా నెంబర్ 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసుల గుర్తింపుఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులుపోలీసుల దాడులతో ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తతనోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహిస్తున్నారని బీఆర్ ఎస్ నేతల ఆందోళనఎక్సైజ్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదంఎలాంటి నోటీసులు లేకుండా ఇంటిని తడిఖీలు ఎలా చేస్తారంటు ప్రశ్ననోటీసులు చూపించాలని డిమాండ్కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం 2:55pmరాజేంద్ర నగర్ డీసీపీ రాజ్ పాకాల ఫామ్ హౌస్‌పై నిన్న రాత్రి దాడి చేశాంలోకల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు చేశాంపార్టీలో మొత్తం 35 మంది ఉన్నారువీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారుఏడు విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు 10 దేశీయ మధ్య బాటిళ్లు స్వాధీనంబాటిల్స్తో పాటు నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనంఅందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించంవిజయ్ మద్దూరి కొకైనే పాజిటివ్ వచ్చిందివిజయ్ మద్దూరికి రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాంపార్టీ నిర్వహించిన రాజ్ పాకాల పైన గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశాంపార్టీకి ఎక్సైజ్ నుండి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఎక్సైజ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారుమోకిలా పీఎస్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశాం2:53 pmకేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందహామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుకేటీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారుస్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారుఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారుఅధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారురిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలంరేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారుసొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దాకేటీఆర్పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారురాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరుకేటీఆర్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారురేవంత్ రెడ్డి డైవర్షన్‌లో ఇది జరుగుతోందిరేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారుబండి సంజయ్,రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారురేవంత్ రెడ్డి,బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారురేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు2:30pmరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషిరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి స్పందించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్, రాజ్ పాకాలపై కేసు నమోదు చేశాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ రాజ్ పాకాల నిర్వహించారు. విదేశీ మద్యం లభించడంతో అయన ఇంట్లో సోదాలు చేయాలి. ఫామ్‌హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన విల్లాకు తాళం వేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలిఫామ్ హౌస్ ఓనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ్ ఫామ్‌హౌస్‌లోనే ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు. రేవ్ పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొస్తున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కాకపోతే డీజీపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలని అన్నారు. -
39 మంది సస్పెండ్.. పోలీసు శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని, సిబ్బంది యథావిధిగా విధుల్లో చేరాలని హామీ ఇస్తూనే.. క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించరాదని.. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తదనుగుణంగా చర్యలు చేపడతామని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ విధానాలే.. ఉమ్మడి ఏపీలో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధులకు అనుసరించిన విధివిధానాలే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పండుగలు, సెలవుల్లో సిబ్బంది విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో డీజీపీ వివరించారు. టీజీఎస్పీ సిబ్బందికి ఉన్నతాధికారుల కౌన్సెలింగ్.. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు వారికి పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటనే అంశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు మొదటి, ఎనిమిదో బెటాలియన్ల సిబ్బందికి శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్లు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వరంగల్‌లో సీపీ వరంగల్, 12వ బెటాలియన్‌లో నల్లగొండ జిల్లా ఎస్పీ, సిరిసిల్లలో స్థానిక ఎస్పీ, డిచ్‌పల్లిలో కామారెడ్డి ఎస్పీలు సిబ్బందితో మాట్లాడారు. -
రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా!
సాక్షి, నల్లగొండ: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ధర్నాకు దిగారు. నల్లగొండలో ఎస్ఐను సస్పెండ్ చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేయగా.. సిరిసిల్లలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ పోలీసులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు. ప్రతీకార బాంబులు అణుబాంబులు మిరపకాయ బాంబులుతాటాకు బాంబులు కాదుతెలంగాణకు కావాల్సింది.. !మీ..మాయ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎలాగో మంచి చేయలేదు.. !కనీసం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులనైనా మనుషులుగా చూడండి.. !ఒక సంవత్సరంలోనే ఇంత చెండాలమైనా ప్రభుత్వం బహుశా..ఈ ప్రపంచంలోనే… pic.twitter.com/0x7DDbFRpy— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) October 26, 2024 మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మాకు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మాతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్ వేడుకున్నారు. పోలీస్ లే కార్మికుల తరహాలో స్లొగన్స్.. సమ్మె కానీ సమ్మె ఇది!#CongressFailedTelangana pic.twitter.com/00v54OZsLb— Harish Rao Thanneeru (@BRSHarish) October 26, 2024 సంచలనం.. యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ https://t.co/HvAS9vFfGe pic.twitter.com/9NyrTl0JBr— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 Video Credit: Telugu scribe -
భార్యలు ధర్నా చేస్తే భర్తల్ని సస్పెండ్ చేస్తారా?
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ పోలిసుల్ని మనుషులుగా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో స్పెషల్ పోలీసులు నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. అనంతరం, నాలుగు రోజులు మాత్రమే సెలవు తీసుకుని వెసులు బాటు ఉంది. దీంతో తమ భర్తలు కుటుంబానికి, పిల్లలికి దూరంగా ఉండాల్సి వస్తుందంటూ నల్గొండలో పోలీస్ కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. వారి ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణం. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తామనడం దారుణం. పాత పద్దతిలో 15రోజులు డ్యూటీ చేస్తే..4రోజులు సెలవులు ఇవ్వాలి. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉంది. ఇది ప్రమాదకరం. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో వృద్ద దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా?.కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. -
గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్‌లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024కాగా గురువారం కూకట్పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్‌లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు. -
తెలంగాణ హెడ్‌కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందించనుంది. ఈ మేరకు అవార్డ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషంరాష్ట్రంలో ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్ చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్ 25,2022న దోపిడీకి పాల్పడ్డారు. ఆ మరుసటి సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య పట్టుకున్నారు. యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు. అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. కటకటాల్లోకి పంపారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది. -
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై పోలీస్ శాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఉంచారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్న డీజీపీ.. బాలాపూర్ పరిధిలో ఐదువేల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని.. అలాగే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. -
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి
-
Interceptor: పదేళ్లలో ఒక్క కేసూ పట్టుకోలే...!
సాక్షి, హైదరాబాద్: ‘ఇంటర్‌సెప్టర్’.. ఈ పదానికి తెలుగులో అడ్డగించేవాడు అని అర్థం. నగరంలో ఏదైనా జరగరాని ఉదంతం జరిగినా, ముష్కర మూకలు దాడులు చేసినా, శాంతిభద్రతల పరమైన హఠాత్పరిణామాలు తలెత్తినా తక్షణం స్పందించాలని, బాధ్యతలను అడ్డుకోవాలని, పారిపోతున్న వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఇంటర్‌సెప్టర్ వాహనాలు, అందులో సిబ్బందిని ఏర్పాటు చేసింది. అయితే పదేళ్లు ఈ టీమ్స్ కనీసం ఒక్కసారీ ‘అడ్డుకోలేదు’.. కొన్ని అంశాల్లో ఆ అవసరం ప్రాంతానికీ రాలేదు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ వాహనాల అంశాన్ని సమీక్షించాలని నిర్ణయించారు.స్పందించిన ఉదంతం ఒక్కటీ లేదు..గడిచిన పదేళ్ల కాలంలో ఉన్నతాధికారులు మారినప్పుడల్లా వారి ప్రాధాన్యాలు మారాయి. అందులో భాగంగా ఇంటర్‌సెప్టర్ తీరుతెన్నులు, రూపు మారుతూ వచ్చింది. కాలక్రమంలో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను పంప్ గన్‌తో, ఒక హోంగార్డును వాకీటాకీతో ఈ వాహనంలో ఉంచి సరిపెట్టారు. నగర పోలీసు కమిషనరేట్ పునరి్వభజన తర్వాత డివిజన్ల సంఖ్య 25కు పెరిగింది. ఈ వాహనాల సంఖ్య 20కి మాత్రమే చేరింది. ప్రజాభవన్, డీజీపీ కార్యాలయం సహా అనేక ప్రాంతాల్లో నిలిచి ఉండే ఈ ఇంటర్సెప్టర్స్ గడిచిన పదేళ్లలో అడ్డుకున్న ఉదంతం కానీ, పట్టుకున్న నేరగాడు కానీ లేడు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ వాహనాల పనితీరును సమీక్షించాలని, పునర్ వ్యవస్థీకరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆ వాహనం పని తీరు చూసిన తర్వాతే..నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున డెకాయ్ బృందాలు నేరగాళ్లపై కాల్పులు జరిపాయి. ఈ ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అదే రోజు మధ్య మండల డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన జరిగిన ఉదంతాన్ని సమీక్షించారు. తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న ఇంటర్‌సెప్టర్ వాహనంపై ఆయన దృష్టి పడింది. అందులో ఉన్న సిబ్బందితో మాట్లాడటంతో పాటు దాని కదలికలను నమోదు చేసే లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాహనాల పరిస్థితి ఆయన దృష్టికి వచ్చింది. ఇలా నగరంలోని అనేక ప్రాంతాల్లో కనిపించే ఈ ఇంటర్‌సెప్టర్ బృందాలను సది్వనియోగం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర విధివిధానాలు ఖరారు చేయనున్నారు. మొత్తమ్మీద ప్రతి షిఫ్ట్‌లోనూ 60 మంది చొప్పున సిబ్బంది ఉండే ఈ వాహనాలను నగర ప్రజలకు ఉపయోగపడేలా నిఘాతో పాటు గస్తీకి వినియోగించుకోవాలని సీపీ భావిస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు..రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన పోలీసు సంస్కరణల్లో భాగంగా 2014లో ఇంటర్‌సెప్టర్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాథమికంగా ఒక్కో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. అప్పటికి నగరంలో 17 సబ్ డివిజన్లే ఉండటంతో 17 వా హనాలు, అదనంగా మరోటి ఆవిష్కరించారు. ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధులు ముగ్గురు ఉండేలా, వీరితో అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 24 గంటలూ నగరంలోని కీలక ప్రాంతాల్లో మోహరించిన ఉండే ఈ టీమ్స్ ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటారని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వీరు తక్షణం స్పందించి వాటిని అణిచి వేస్తారని ప్రకటించారు. దీనికోసమే వీటికి పంప్ యాక్షన్ షాట్ గన్స్ కూడా అందించారు. -
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
హైదరాబాద్ జోన్: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వర్గాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో రెండు నెలల కాలంలోనే ఏసీబీ దాడుల్లో పదుల సంఖ్యలో ఏసీబీ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జోన్ పరిధిలో ఏసీబీ దాడుల్లో పోలీసులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్, ఫైనాన్స్ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఓ అధికారి అరెస్ట్ అయ్యాడు. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ చిక్కారు. సీసీఎస్ సుధాకర్ గౌడ్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఇక, కుషాయిగూడలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లు పట్టుబడ్డారు.తాజాగా సూరారం ఎస్ఐ ఆకుల వెంకటేశం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరు చర్చనీయాంశంగా మారింది. -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్ ఐ యాప్‌తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్‌కాప్ యాప్‌లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్‌కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్‌లు, స్పెషల్ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్ యాప్‌కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.