
పెగడపల్లి: నిత్యం పోలీసుల భద్రత, సె ల్యూట్లు, అధికారుల ప్రొటోకాల్ మధ్య ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలకు అవి దూరమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చినపప్పటి నుంచే ప్రొటోకాల్ నిబంధనలు వర్తించకుండాపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మంత్రులతోపాటు పది మంది ఎమ్మెల్యేలున్నారు. వారు పర్యటనకు వచ్చినప్పుడు గౌరవ వందనం, సె ల్యూట్, ప్రొటోకాల్స్ తప్పనిసరి. ఎన్ని కల కోడ్ అమల్లోకి రావడంతో అవి నిలిచిపోయాయి.
పైలెటింగ్ సేవలు కూడా ఉండవు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత భధ్రతా సిబ్బంది మాత్రం కొనసాగుతారు. ఎన్నికలు పూ ర్తయి ఎమ్మెల్యేలుగా గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ అధికారులు, పోలీసుల నుంచి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక మర్యాదలుండవు.
Comments
Please login to add a commentAdd a comment