
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు దేశవ్యాప‍్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు పొలిటికల్ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మహమూద్ అలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది. కాబట్టి వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి తొలగింపు నా పరిధిలో లేదు. అమ్నేషియా పబ్‌లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ‘యాక్షన్.. ఓవరాక్షన్’ అసలు సంగతి ఇదే!..కానిస్టేబుల్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment