Waqf Board Chairman
-
తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ రాజీనామా
-
రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్‌కు టీఆర్ఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తక్షణం వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు ఘటనలో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వక్ఫ్‌బోర్డు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంపై పార్టీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకునే బాధ్యతను హోంమంత్రి మహమూద్ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారు. చదవండి: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు కాగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు పొలిటికల్ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మహమూద్ అలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది. కాబట్టి వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి తొలగింపు నా పరిధిలో లేదు. అమ్నేషియా పబ్‌లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘యాక్షన్.. ఓవరాక్షన్’ అసలు సంగతి ఇదే!..కానిస్టేబుల్‌పై వేటు -
7న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎన్నిక
సాక్షి,హైదరాబాద్: రాష్ట వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎన్నిక ఈ నెల 7న జరుగనుంది. అదేరోజున పాలకమండలి సభ్యులంతా హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశమై అందులోని ఒక సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకుం టారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే మూజువాణీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే వక్ఫ్‌బోర్డు పాలకమండలికి ఆరుగురు సభ్యులు ఎన్నిక కాగా, తాజాగా మరో ముగ్గురు సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముస్లిం ప్రముఖుల కేటగిరీలో మహ్మద్ మసీఉల్లాఖాన్, షీయా స్కాలర్ కేటగిరీలో డాక్టర్ సయ్యద్ నీసార్ హుస్సేన్ ఆఘా, సున్నీ స్కాలర్ కేటగిరీలో మల్లిక్ మోహెతేశం, ప్రభుత్వ అధికారుల కేటగిరీలో షేక్ యాస్మీన్ బాషాలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పేరు ప్రచారంలో ఉండగా తాజాగా మాజీ హజ్ కమిటీ చైర్మన్ మహ్మాద్ మసీఉల్లా పేరు తెరపైకి వచ్చింది. -
మదర్సా వ్యవస్థను రద్దు చేయండి : వసీం రిజ్వీ
లక్నో : మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీని హత్య చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. మదర్సాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తనని, తన కుటుంబాన్ని హతమారుస్తామని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు బెదిరిస్తున్నారని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ రిజ్వీ..! ‘పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లలో పేరుపొందిన ఉగ్రవాదులు దియోబంధి మదర్సాలలో తయారు చేయబడ్డారు... ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని’ ఆరోపిస్తూ రిజ్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, కేబినెట్ సెక్రటరీకి ఐదు పేజీలతో కూడిన ఈ- మెయిల్ చేశారు. మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాసి రజ్వీ వార్తల్లోకెక్కారు. ‘వారంతా పాకిస్తాన్ వెళ్లాలి’... రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ రిజ్వీ వ్యాఖ్యానించారు. మసీదు పేరిట జిహాద్‌ను వ్యాప్తి చేసేవారు అబూ బకర్ ఆల్-బాగ్దాదీ లేదా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షియా వర్గానికి చెందినవారు రజ్వీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి లేఖలు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించాలని గత నెలలో రిజ్వీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అంతేకాకుండా దేశంపై, దేవుడిపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటే అయెధ్యలో రామ మందిర నిర్మాణం, లక్నోలో మసీద్-ఇ-అమన్ నిర్మించేందుకు ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సహకరించాలని సూచించారు. -
ఆ కుట్రకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : యూపీ షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వసీం రిజ్వీ హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు దావూద్ ఇబ్రహీం అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ సూచనలతోనే వీరు రిజ్వీ హత్యకు పథకం రచించారని తెలిసింది. ముగ్గురు దావూద్ అనుచరులను అతిఫ్, అబ్రార్, సలీంలుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితులను యూపీలోని బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం వెల్లడించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే రిజ్వీ హత్యకు దావూద్ తన అనుచరులను ప్రేరేపించినట్టు తెలిసింది. రిజ్వీ హత్య కుట్రను ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంతో పెనుముప్పు తప్పిందని భావిస్తున్నారు. -
వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ సలీం ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ హజ్‌హౌస్‌లో జరిగిన బోర్డు సమావేశంలో సభ్యుల్లో ఒకరు సలీం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, మరొకరు బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ప్రకటించారు. పదకొండు మంది సభ్యుల్లో ఎంపీ అసదుద్దీన్, ఐపీఎస్ తౌసిఫ్ ఎగ్బాల్ అందుబాటులో లేని కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. సమావేశానికి బోర్డు సభ్యులు మహ్మద్ మౌజంఖాన్, మహ్మద్ జాకీర్ హుస్సేన్ జావీద్, మిర్జా అన్వర్ బేగ్, సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, మాలిక్ మోతసిమ్ ఖాన్, డాక్టర్ సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్‌ఆగా , న్యాయవాది వహీద్ అహ్మద్, డాక్టర్ సోఫియా బేగంలు హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించడమే తమ ధ్యేయమని బోర్డు చైర్మన్ సలీం ప్రకటించారు. బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు నుంచి ఎలాంటి టీఏ, డీఏ, వాహనం తీసుకోకుండా పనిచేస్తామని వెల్లడించారు. అన్యాక్రాంతమైన భూములు, ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.