వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ సలీం ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ హజ్‌హౌస్‌లో జరిగిన బోర్డు సమావేశంలో సభ్యుల్లో ఒకరు సలీం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, మరొకరు బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ప్రకటించారు. పదకొండు మంది సభ్యుల్లో ఎంపీ అసదుద్దీన్, ఐపీఎస్ తౌసిఫ్ ఎగ్బాల్ అందుబాటులో లేని కారణంగా సమావేశానికి హాజరుకాలేదు.
సమావేశానికి బోర్డు సభ్యులు మహ్మద్ మౌజంఖాన్, మహ్మద్ జాకీర్ హుస్సేన్ జావీద్, మిర్జా అన్వర్ బేగ్, సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, మాలిక్ మోతసిమ్ ఖాన్, డాక్టర్ సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్‌ఆగా , న్యాయవాది వహీద్ అహ్మద్, డాక్టర్ సోఫియా బేగంలు హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించడమే తమ ధ్యేయమని బోర్డు చైర్మన్ సలీం ప్రకటించారు. బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు నుంచి ఎలాంటి టీఏ, డీఏ, వాహనం తీసుకోకుండా పనిచేస్తామని వెల్లడించారు. అన్యాక్రాంతమైన భూములు, ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.