Haj House
-
‘హజ్ సువిధ’లో 10 భాషల్లో హజ్ యాత్ర సమాచారం!
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ‘హజ్ సువిధ’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ యాప్ హాజీలకు అవసరమైన సమయాల్లో సమీపంలోని ఆరోగ్య సదుపాయాలను గుర్తించడంలోనూ సహాయపడుతుందని ఆమె తెలిపారు. ‘హజ్ సువిధ’యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. హజ్ 2024 కోసం ‘హజ్ గైడ్’ 'హజ్ సువిధ’ యాప్‌లను ఆవిష్కరించాం. 2024లో హజ్‌కు వెళుతున్న భారతీయులకు శుభాకాంక్షలు’ అని స్మృతి ఇరానీ ఆ పోస్టులో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, బెంగాలీతో సహా మొత్తం 10 భాషల్లో ఈ ‘హజ్ గైడ్’ అందుబాటులో ఉండనుంది. 'హజ్ సువిధ’ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్‌తో నేరుగా కమ్యూనికేషన్ అందుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సహాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. समन्वय, सुगमता और बढ़ता विश्वास!🕋 देश के यशस्वी पीएम @narendramodi जी के नेतृत्व में, हज यात्रा पर जाने वाले भारतीयों को बेहतर सुविधा प्रदान करने एवं उनके लिए यात्रा सरल, सुखद एवं सुरक्षित बनाने की दिशा में @MOMAIndia ने एक अहम प्रगति की है। हज 2024 हेतु आज विज्ञान भवन, नई… pic.twitter.com/jV1LyhEKhz — Smriti Z Irani (@smritiirani) March 3, 2024 -
7న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎన్నిక
సాక్షి,హైదరాబాద్: రాష్ట వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎన్నిక ఈ నెల 7న జరుగనుంది. అదేరోజున పాలకమండలి సభ్యులంతా హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశమై అందులోని ఒక సభ్యుడిని చైర్మన్‌గా ఎన్నుకుం టారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే మూజువాణీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే వక్ఫ్‌బోర్డు పాలకమండలికి ఆరుగురు సభ్యులు ఎన్నిక కాగా, తాజాగా మరో ముగ్గురు సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముస్లిం ప్రముఖుల కేటగిరీలో మహ్మద్ మసీఉల్లాఖాన్, షీయా స్కాలర్ కేటగిరీలో డాక్టర్ సయ్యద్ నీసార్ హుస్సేన్ ఆఘా, సున్నీ స్కాలర్ కేటగిరీలో మల్లిక్ మోహెతేశం, ప్రభుత్వ అధికారుల కేటగిరీలో షేక్ యాస్మీన్ బాషాలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పేరు ప్రచారంలో ఉండగా తాజాగా మాజీ హజ్ కమిటీ చైర్మన్ మహ్మాద్ మసీఉల్లా పేరు తెరపైకి వచ్చింది. -
హజ్‌యాత్రికులు టీకాలు వేయించుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రలో రోగాల బారిన పడకుండా ఉండేందుకు హజ్ యాత్రికులంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్ శిబిరాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..హజ్ యాత్రకు దాదాపు 150 వివిధ దేశాల నుంచి భక్తులు మక్కాకు వస్తారని, రాష్ట్ర యాత్రికులు అక్కడ రోగాల బారిన పడకుండా ముందస్తుజాగ్రత్తగా టీకాలు వేయిస్తున్నట్లు తెలిపారు. హజ్ యాత్రికులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వారికోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి హజ్ క్యాంప్ ఏర్పాట్లలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. అనంతరం హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ మాట్లాడుతూ..హజ్ యాత్రికుల గురువారం నుంచి మూడ్రోజుల పాటు హజ్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ ఇస్తారని, జిల్లా యాత్రికులకు జిల్లాలో టీకాలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ ఈఓ షఫీవుల్లా, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
సంతృప్తికరమైన హజ్ దిశగా చర్యలు
సాక్షి, విజయవాడ: విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం సెమినార్ హల్లో జరిగిన హజ్ యాత్రికుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర హజ్ కమీటీ చైర్మన్ మసి ఉల్లా ఖాన్, ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహ్మాన్ హాజరయ్యారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అల్ హజ్ ఎస్ బీ అంజాద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన హజ్ యాత్ర చేసేవిధంగా యాత్రికులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ముందుగానే పోర్టల్ లో నమోదు చేసుకోవాలనీ, హజ్ యాత్రకు వెళ్లేవారికి సౌకర్యాల కల్పనపై అవగాహన కార్యక్రమాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం హజ్ యాత్రికులకు అన్ని వసతులు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. భవిష్యత్తులో హాజీలకు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ముస్లిం మైనార్టీలు ఎవ్వరూ విజయవాడలోని విద్యాధరపురంలో హజ్ హౌస్ ఏర్పాటుకు ఇష్టపడని కారణంగా విమానాశ్రయానికి దగ్గరలో హజ్ హౌస్ నిర్మించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మూసి ఉల్లా ఖాన్ మాట్లాడుతూ..హజ్ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరవ్వటం సంతోషంగాఉంది. హాజీలకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా కమిటీకి మంచి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో మరో రెండు హజ్ హౌస్‌లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు హజ్ హౌస్‌లు నిర్మించాలని వక్ఫ్ బోర్డు పాలక మండలి సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ హజ్ హౌస్ మాదిరిగా సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ల్లో సకల హంగులతో వీటి నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. బుధవారం హైదరాబాద్ హజ్ హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగిన బోర్డు పాలక మండలి సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం మాట్లాడుతూ.. భువనేశ్వర్ వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న రాష్ట్రానికి చెందిన 100 మంది విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించాలని, తుప్రాన్‌లో ఓ ఫంక్షన్ హాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మసీదు, దర్గాలకు సంబంధించిన 11 కమిటీలకు ఆమోద ముద్రతోపాటు ముగ్గురు ముతవల్లీలను నియమిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. డబుల్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు. 25 అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పరిమితి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొంతమంది నాలుగవ తరగతి ఉద్యోగులు 65 ఏళ్లు పైబడి పనిచేయకుండానే భారీ జీతాలు పొందడాన్ని సమావేశం తప్పుబట్టిందని, దీనిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బోర్డు సీఈవో షాహానవాజ్ ఖాసీం, సభ్యులు అక్బర్ నిజామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మా స్థలంలో హజ్ హౌజ్ నిర్మాణం ఎందుకు? : చక్రధర్
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణుల స్థలంలో హజ్ హౌజ్ నిర్మాణం ఎలా చేపడతారంటూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం నేత జింకా చక్రధర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న స్థలం ప్రభుత్వందో, వక్ఫ్ బోర్డ్‌దో కాదని అది బ్రాహ్మణుల స్థలం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కామకోటి నగర్‌ను ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడం సరికాదన్నారు. బ్రాహ్మణుల స్థలంలోనే హజ్ నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. శంకుస్థాపన చేసే ముందు ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాన్ని కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు, కమిషనర్‌కు, సిఎంఓ కార్యాలయాలకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందన్నారు. స్థానిక నేతల ఒత్తిడితో వారు పట్టించుకోలేదని అందుకే రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. -
వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ సలీం ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ హజ్‌హౌస్‌లో జరిగిన బోర్డు సమావేశంలో సభ్యుల్లో ఒకరు సలీం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, మరొకరు బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు వక్ఫ్‌బోర్డు సీఈవో అసదుల్లా ప్రకటించారు. పదకొండు మంది సభ్యుల్లో ఎంపీ అసదుద్దీన్, ఐపీఎస్ తౌసిఫ్ ఎగ్బాల్ అందుబాటులో లేని కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. సమావేశానికి బోర్డు సభ్యులు మహ్మద్ మౌజంఖాన్, మహ్మద్ జాకీర్ హుస్సేన్ జావీద్, మిర్జా అన్వర్ బేగ్, సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, మాలిక్ మోతసిమ్ ఖాన్, డాక్టర్ సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్‌ఆగా , న్యాయవాది వహీద్ అహ్మద్, డాక్టర్ సోఫియా బేగంలు హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించడమే తమ ధ్యేయమని బోర్డు చైర్మన్ సలీం ప్రకటించారు. బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు నుంచి ఎలాంటి టీఏ, డీఏ, వాహనం తీసుకోకుండా పనిచేస్తామని వెల్లడించారు. అన్యాక్రాంతమైన భూములు, ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. -
హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్రి కులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రం నుంచి 4,900 మంది యాత్రికులను మక్కాకు పంపగా, ఈ ఏడాది ఎక్కువ మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. హైదరాబాద్‌లో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. సోమవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆయన విడుదల చేశారు. హజ్ యాత్రికులకు మక్కాలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీమ్, ఫరూక్ హుస్సేన్ హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్‌హౌస్ కాంప్లెక్స్‌కు రూ.3 కోట్లు
ముస్లిం మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మౌలానా జుబేర్ కర్నూలు (టౌన్): నగరంలో హజ్‌హౌస్ మల్లిపుల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైనట్లు కర్నూలు నగర ముస్లిం మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మౌలానా జుబేర్ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 29న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ముస్లిం మైనార్టీ జాయింట్యాక్షన్ కమిటీ నాయకులు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గణేష్‌నగర్‌లో మసీదు నిర్మాణానికి రూ.17 లక్షలు, ఈద్గా ఏర్పాటుకు 10 ఎకరాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో నాలుగు ముస్లింల శ్మశానవాటికల అభివృద్ధి కోసం రూ.1.80 కోట్లు, పాత ఈద్గా మరమ్మతులు రూ.35 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో జాయింట్ యాక్షణ్ కమిటీ ఉపాధ్యక్షుడు మౌలానా జాకీర్, మౌలానా జబీర్, సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ, షఫి అహ్మద్‌ఖాన్, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
విజయవాడకు ఏపీ స్టేట్ హజ్‌హౌస్ కార్యాలయం
హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ శాఖలన్నీ తరలుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏపీ స్టేట్ హజ్ కమిటీ కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడకు తరలిస్తున్నట్లు ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని ఏపి హజ్‌కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి అమరావతి గన్నరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే హజ్ హౌస్ నిర్మాణం కోసం కడపలో సుమారు 12 ఎకరాల భూమిని కేటాయించడంతో రూ.12 కోట్లు విడుదల చేశారన్నారు. అమరావతిలో సైతం హజ్‌హౌస్ నిర్మాణం కోసం స్థల గుర్తింపు కసరత్తు కొనసాగుతుందని ఆయన వివరించారు. -
రేపటి నుంచి హజ్ క్యాంప్
24 గంటల ముందు రిపోర్టు ఏర్పాట్లు పూర్తి చేసిన హజ్ కమిటీ హైదరాబాద్: హైదరాబాద్‌లో హజ్ హౌస్‌లో రేపటి నుంచి హజ్ క్యాంప్-2016 ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఇక్కడి నుంచే బయలు దేరనున్నందున ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్ హౌస్‌తో పాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న భవన సముదాయంలో యాత్రికులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆవరణలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. యాత్రికులతో పాటు వారి వెంట వచ్చే బంధుమిత్రులకు భోజనాల సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈనెల 21 నుంచి తెలంగాణ, 24 నుంచి ఆంధ్రప్రదేశ్ యాత్రికుల విమాన షెడ్యూల్ ఉండటంతో రెండు రోజుల ముందే హజ్ క్యాంప్‌లో రిపోర్టు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరెన్సీ మార్పిడి కోసం బ్యాంక్, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హజ్ క్యాంప్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తరలించేందుకు ప్రతి బృందానికి ఒక ప్రత్యేక బస్సును వినియోగించనున్నారు. రెండు రాష్ట్రాల హజ్ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశాయి. -
'ముస్లిం, మైనార్టీలపై టీడీపీకి ప్రేమ లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీ వర్గాలపై టీడీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భూమా మాట్లాడుతూ... రాష్ట్రంలో హజ్‌హౌస్ భవనం శంకుస్థాపనకే పరిమితమైందని విమర్శించారు. భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే హజ్ హౌస్ నిర్మాణాన్ని గుంటూరు నగరంలో చేపట్టాలని నగర తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు నగరం రాజధాని అతి సమీపంలో ఉండటమే కాకుండా రైలు, రహదారి, వాయు మార్గాలకు అతి సమీపంలో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో హౌజ్ హౌస్ గుంటూరులో ఏర్పాటు చేయాలని తెలిపారు. -
హజ్ హౌస్ వద్ద షాక్ సర్క్యూట్, 4గురు మృతి
-
7న యూపీ నుంచి హజ్ యాత్ర బృందం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రికులతో మొట్టమొదటి విమానం సెప్టెంబర్ 7న వారణాసిలోని బాబట్పూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని ఆ రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు,పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి మహమ్మద్ అజాంఖాన్ శుక్రవారం లక్నోలో వెల్లడించారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు రెండు రోజుల ముందుగానే లక్నోలోని హజ్ హౌస్‌కు చేరుకోవాలని ఆయన యాత్రికులకు సూచించారు. తదుపరి విమాన సర్వీసులు హజ్ యాత్రికులను తీసుకు వేళ్లేందుకు సెప్టెంబర్ 9న లక్నో, న్యూఢిల్లీ నగరాల నుంచి బయలుదేరుతాయని అజాంఖాన్ తెలిపారు.