
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ‘హజ్ సువిధ’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ యాప్ హాజీలకు అవసరమైన సమయాల్లో సమీపంలోని ఆరోగ్య సదుపాయాలను గుర్తించడంలోనూ సహాయపడుతుందని ఆమె తెలిపారు.
‘హజ్ సువిధ’యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. హజ్ 2024 కోసం ‘హజ్ గైడ్’ 'హజ్ సువిధ’ యాప్‌లను ఆవిష్కరించాం. 2024లో హజ్‌కు వెళుతున్న భారతీయులకు శుభాకాంక్షలు’ అని స్మృతి ఇరానీ ఆ పోస్టులో పేర్కొన్నారు.
హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, బెంగాలీతో సహా మొత్తం 10 భాషల్లో ఈ ‘హజ్ గైడ్’ అందుబాటులో ఉండనుంది. 'హజ్ సువిధ’ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్‌తో నేరుగా కమ్యూనికేషన్ అందుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సహాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు.
समन्वय, सुगमता और बढ़ता विश्वास!🕋
— Smriti Z Irani (@smritiirani) March 3, 2024
देश के यशस्वी पीएम @narendramodi जी के नेतृत्व में, हज यात्रा पर जाने वाले भारतीयों को बेहतर सुविधा प्रदान करने एवं उनके लिए यात्रा सरल, सुखद एवं सुरक्षित बनाने की दिशा में @MOMAIndia ने एक अहम प्रगति की है। हज 2024 हेतु आज विज्ञान भवन, नई… pic.twitter.com/jV1LyhEKhz
Comments
Please login to add a commentAdd a comment