haj yatra
-
‘హజ్ సువిధ’లో 10 భాషల్లో హజ్ యాత్ర సమాచారం!
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ‘హజ్ సువిధ’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ యాప్ హాజీలకు అవసరమైన సమయాల్లో సమీపంలోని ఆరోగ్య సదుపాయాలను గుర్తించడంలోనూ సహాయపడుతుందని ఆమె తెలిపారు. ‘హజ్ సువిధ’యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. హజ్ 2024 కోసం ‘హజ్ గైడ్’ 'హజ్ సువిధ’ యాప్‌లను ఆవిష్కరించాం. 2024లో హజ్‌కు వెళుతున్న భారతీయులకు శుభాకాంక్షలు’ అని స్మృతి ఇరానీ ఆ పోస్టులో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, బెంగాలీతో సహా మొత్తం 10 భాషల్లో ఈ ‘హజ్ గైడ్’ అందుబాటులో ఉండనుంది. 'హజ్ సువిధ’ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్‌తో నేరుగా కమ్యూనికేషన్ అందుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సహాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. समन्वय, सुगमता और बढ़ता विश्वास!🕋 देश के यशस्वी पीएम @narendramodi जी के नेतृत्व में, हज यात्रा पर जाने वाले भारतीयों को बेहतर सुविधा प्रदान करने एवं उनके लिए यात्रा सरल, सुखद एवं सुरक्षित बनाने की दिशा में @MOMAIndia ने एक अहम प्रगति की है। हज 2024 हेतु आज विज्ञान भवन, नई… pic.twitter.com/jV1LyhEKhz — Smriti Z Irani (@smritiirani) March 3, 2024 -
హజ్‌యాత్రికుల బృందాన్ని కలిసిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హజ్ యాత్రికుల బృందాన్ని కలిశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి హజ్‌యాత్ర బృందం బయల్దేరనుంది. దీనిలో భాగంగా నంబూరుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్.. యాత్రికులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలిసారిగా నంబూరు హజ్ క్యాంప్ నుంచి హజ్ యాత్రికలు బృందం బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం తరఫున హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్రం గురించి ప్రార్ధన చేయమని కోరుతున్నానని, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాని సీఎం జగన్ తెలిపారు. హజ్ యాత్రలో మీకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. హజ్ యాత్రలో ఇబ్బంది తలెత్తకుండా కమిటీని పంపిస్తున్నామని, హజ్ యాత్రికులకు ఏ సమస్య వచ్చినా అంజద్ బాషా చూసుకుంటారన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే అంజద్ బాషాతో పాటు ఇతర అధికారులు మీకు అందుబాటులో ఉంటారని హజ్ యాత్రికులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు మైనార్టీల తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే అంజద్ బాషా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు సీఎం జగన్ సంక్షేమ ఫథకాలు అందిచారన్నారు. మైనార్టీలకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలిచారన్నారు. ఆనాడు వైఎస్సార్, ఇప్పుడు సీఎం జగన్ మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు. గతంలో పోలిస్తే మైనార్టీలకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ అందాయని ఈ సందర్భంగా తెలియజేశారు. -
హజ్ యాత్రికులకు ఏపీ ప్రభుత్వ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ/చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడే అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీశాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. అనంతరం అంజాద్ బాషా ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సమస్యపై పౌరవిమానయాన శాఖ మంత్రితో చర్చించామని, బుధవారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం అవుతామని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులలోని ఎంబార్కేషన్ పాయింట్ల కన్నా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ధరలు అధికంగా ఉన్నాయని, ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఒక్కొక్కరికీ హైదరాబాద్ నుంచి రూ.3.05 లక్షలు, బెంగళూరు నుంచి రూ.3.04 లక్షలు ఉండగా.. విజయవాడ నంచి రూ.3,88,350 ఉందని తెలిపారు. ఒకవేళ ధర తగ్గించడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం భరిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంబార్కేషన్ పాయింటును హైదరాబాద్ లేదా బెంగళూరుకు మార్చాలని మంత్రిని కోరామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హజ్ యాత్రికుల సమస్యను టీడీపీ రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్, సభ్యులు ఉన్నారు. -
హజ్ యాత్ర దరఖాస్తుదారులకు ‘సర్వర్ డౌన్’ సమస్య
సాక్షి, సిటీబ్యూరో: 2023 హజ్ యాత్రకు దరఖాస్తుల ప్రక్రియ తీవ్ర అంతరాయాలతో కొనసాగుతోంది. దరఖాస్తులు అప్లోడ్కాక నానా తిప్పలు పడుతున్నారు. ఈ నెల 10న ఆన్లైన్ ద్వారా హజ్ యాత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రాంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర హజ్ కమిటీ సర్వర్ డౌన్ చూపుతుండడంతో దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హజ్ కమిటీ యాత్రికుల సౌకర్యార్థం హజ్ హౌస్‌లో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సర్వర్ డౌన్ ఉండడంతో ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ కాలేదు. 16వ తేదీ నుంచి దరఖాస్తులు అప్లోడవుతున్నా మధ్య మధ్యలో సర్వర్ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దరఖాస్తు కోసం ఓటీపీ వస్తుంది. అయితే సమయానికి ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తు మధ్యలోనే ఆగిపోతుందని యాత్రికులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర హజ్ కమిటీలు సమన్వయంతో స్పందించి దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు. కాగా దీనిపై హజ్‌కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. గతంలో దరఖాస్తులకు సంబంధించిన సర్వర్ నిర్వహణ కేంద్ర హజ్ కమిటీ ముంబయి అధీనంలో ఉండేదని, ప్రస్తుతం ఎన్ఐసీ డిల్లీ నిర్వహణలోకి మారిందని తెలిపారు. దరఖాస్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సర్వర్ డౌన్ సమస్య ఏర్పడిందని, కేంద్ర హజ్‌కమిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు. -
చోటా సన్మాన్.. బడా దావత్! ప్లేట్ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది. ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్‌కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్ హజ్ కమిటీ చైర్మన్‌ది కావడం మరో విశేషం. హజ్ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం) -
హజ్ యాత్ర–2022 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2022కు కేంద్ర హజ్ కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు. కరోనా వల్ల ఈ ఏడాది యాత్రకు 65 ఏళ్లలోపు వారికే కేంద్ర హజ్ కమిటీ షరతులతో కూడిన అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర ఉంటుందన్నారు. ఇప్పటికే ఎంపికైన యాత్రికుల నుంచి మొదటి వాయిదాగా రూ.2.1లక్షలు వసూలు చేశామని, కేంద్ర హజ్ కమిటీ ఆదేశాలతో రెండో వాయిదా వసూలు చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులుంటారని, ఈ ఏడాది రెండు రాష్ట్రాలవారూ హైదరాబాద్ ఎంబారికేషన్ పాయింట్ నుంచే వెళ్లనున్నారని చెప్పారు. హజ్ యాత్రికులను తీసుకెళ్లే అవకాశం ఈసారి సౌదీ ఎయిర్‌లైన్స్‌కు లభించిందని, ఎంపికైన యాత్రికులకు హజ్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని వివరించారు. -
హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు
అల్లిపురం (విశాఖ దక్షిణ): ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆ తర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దాన ధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. దీనినే జీవిత సాఫల్య యాత్రగా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్ యాత్ర చేస్తారు. ఈ యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ముస్లింలు ఏటా హజ్ యాత్రకు వెళ్తుంటారు. హజ్ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు విశాఖలోనే శిక్షణ ఇస్తారు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు త్యాగానికి నిర్వచనంగా జరుపుకునే బక్రీదు పర్వదినం రోజున సౌదీ అరేబియాలోని పుణ్యస్థలం మక్కా ముకార్రమ్ ప్రదేశంలో కాబతుల్లా వద్ద హజ్ జరుగుతుంది. హజ్ పేరుతో వెళ్లే యాత్రికులు 40 రోజుల మక్కాతో పాటు ప్రవక్త హజరత్ మహమ్మద్ రసూలుల్లా(సాల్లెల్లాహు అలైహి వసల్లం) జన్మస్థలం మదీనా తదితర ప్రాంతాల్లో గడుపుతారు. నమాజులు, తవాఫ్, జికర్, దువా, ఖురాన్ పఠనం వంటి కార్యక్రమాలతో నిత్యం అల్లాను స్మరించుకోవడం, హజ్ జరిగే రోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడమే ఈ యాత్ర ప్రత్యేకత. దైవ ప్రవక్తలు హజరత్ ఇబ్రహీమ్ ఖలీలుల్లా, హజరత్ ఇస్మాయిల్ జబీవుల్లా త్యాగాలకు ప్రతి రూపంగా ఏర్పడిన హజ్ ముస్లింలకు ఫరజ్ (తప్పనిసరిగా)గా మారిందని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది హజ్ యాత్రకు వెళుతుంటారు. ఈ ఏడాది హజ్ యాత్రకు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటివరకు 24 మంది దరఖాస్తు చేసుకున్నారని కమిటీ ప్రతినిధి రహమతుల్లా బెయిగ్ యాసీన్ తెలిపారు. 65 ఏళ్ల లోపు వారే అర్హులు.. గతంలో 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయసు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయసు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయసు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్‌హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయసు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నంబర్ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులకు తోఫా హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తోఫా (బహుమతి) అందజేయనుంది. రూ.3 లక్షలు లోపు ఆదాయం కలిగిన వారికి రూ.60 వేలు, రూ.3 లక్షల పైన ఆదాయం కలిగిన వారికి రూ.30 వేలు తోఫా అందజేయనుంది. అర్హతలు భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పి స్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. 31తో ముగియనున్న రిజిస్ట్రేషన్ హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 31లోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి. దరఖాస్తులో ఒక్క గడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరఫున హజ్ యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన హజ్ యాత్రికులు విశాఖపట్నం, ద్వారకానగర్‌లోని హజ్ వెల్ఫేర్ సొసైటీ, డోరు నంబర్ 47–7–49, సుందర్ రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్, నెహ్రూ బజార్ ఎదురుగా, ద్వారకానగర్, విశాఖపట్నం–530016 చిరునామాలో గానీ 98481 95722, 93481 95722 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి విశాఖలోనే మూడు విడతలుగా, మూడు నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ యాత్రకు రూ.3,35,000 నుంచి రూ.4,07,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంట్‌పై బ్యాంక్‌లో (ఎస్బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. వీరు అనర్హులు.. గర్భిణులు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుషు్ట, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరఫున హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వ్రస్తాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. – కరీమ్ బేగ్, రిటైర్డ్ ఇంజినీర్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు నియమాలు పాటించాలి హజ్ యాత్రకు వెళ్లే వారు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వలంటీర్లు చెప్పినట్లు నడుచుకోవాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకు యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ముందుగా హజ్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తాం. అర్హులైన వారిని ఇక్కడ నుంచి హైదరాబాద్ హజ్ హౌస్‌కు పంపించి, అక్కడ నుంచి నేరుగా మక్కాకు విమానంలో పంపిస్తాం. – రహమతుల్లా బెయిగ్ యాసిన్,హజ్ వెల్ఫేర్ సొసైటీ, విశాఖపట్నం ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. చిన్నతనంలోనే రెండు పర్యాయాలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లి రావడం అదృష్టంగా భావిస్తున్నా. – సయ్యద్ నౌషద్ అలీ, పూర్ణామార్కెట్ -
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు బాధాకరం’
సాక్షి, అనంతపురం: నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు దేశంలో ఎక్కడా లేవని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన గురువారం మీడియాతో మట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆయన కొనియాడారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం జగన్‌దని అన్నారు. వ్యవసాయానికి రూ. 35 వేల కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్నారని అంజాద్ బాషా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేయటం బాధాకరమన్నారమని అంజాద్ బాషా అన్నారు. హజ్ యాత్రకు సబ్సిడీ కింద రూ. 60 వేలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను ఏపీలో అమలు చేయమని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అంజాద్ బాషా చెప్పారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉంటారని అంజాద్ బాషా అన్నారు. -
హజ్‌యాత్రకు 4,169 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2019 హజ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల సంఖ్య (కోటా)ను కేంద్ర హజ్ కమిటీ ప్రకటించిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లా ఖాన్, ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ తెలిపారు. రాష్ట్రం నుంచి 4,169 మందికి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని వెల్లడించారు. సోమవారం హజ్ కమిటీ కార్యాలయంలో 2019 హజ్ యాత్ర, యాత్రికుల ఎంపికకు సంబంధించిన వివరాలపై వారు విలేకరులతో మాట్లాడారు. హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13,388 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర హజ్ కమిటీ కోటా ప్రకారం ఇందులో 4,169 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన కేటగిరీలో 484 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక, మిగిలిన 12,884 మంది దరఖాస్తుదారుల్లో 3,685 మందికి డ్రా తీసి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముస్లిం జనాభా శాతం ప్రకారం ఈ మేర కోటా దక్కిందని వివరించారు. 12న నాంపల్లి హజ్ హౌస్‌లో ఎంపిక ఈ నెల 10న రాష్ట్ర హజ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధిచిన ప్రణాళికలు రూపొందిస్తామని మసీవుల్లా ఖాన్, షుకూర్ తెలిపారు. ఈ నెల 12న హజ్ యాత్రికుల ఎంపిక నాంపల్లి హజ్ హౌస్‌లో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎలాంటి మోసాలు లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఎవరైనా హజ్ యాత్రకు హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్లతామని, డ్రాలో మీ పేరు వచ్చే విధంగా చేస్తామని చెబితే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ఎవరైనా ఇలా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని వారు వెల్లడించారు. -
హజ్ యాత్రకు 13 వేల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: 2019 హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. హజ్‌యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13 వేల దరఖాస్తులు అందాయని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హజ్ యాత్రకు గతేడాది కంటే ఈసారి 4 వేల దర ఖాస్తులు తక్కువగా అందాయన్నారు. 70 ఏళ్ల పైబడిన వారి కేటగిరీలో 416 దరఖాస్తులు అందాయని, వీరు కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం నేరుగా హజ్ యాత్రకు ఎంపికైనట్లు తెలిపారు. మిగతా దరఖాస్తుదారులకు డ్రా పద్ధతిలో జనవరిలో కేంద్ర హజ్ కమిటీ ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా హార్డ్ కాపీలు హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయకపోతే అందించాలని సూచించారు. జనవరి నెలలో డ్రా పద్ధతిలో ఎంపికైన యాత్రికులు మొదటి కిస్తుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
హజ్‌యాత్రకు నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2019కు వెళ్లాలనుకునేవారు ఈ నెల 18 నుంచి హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు అన్ని ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా చేపట్టినట్లు పేర్కొన్నారు. నవంబర్ 17వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందన్నారు. పాస్‌పోర్టు గడువు 2018, నవంబర్ 17కు ముందు నుంచి 2020, జనవరి 31 వరకు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిని డ్రా పద్ధతిలో హజ్‌యాత్రకు ఎంపిక చేస్తారని, డిసెంబర్ చివరివారంలో డ్రా ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరన్నారు. దరఖాస్తుతోపాటు ఎస్బీఐ ద్వారా రూ.300 చెల్లించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే 040 2329 8793 నంబర్ లేదా కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ www.hajcommittee.gov.inద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. -
కేంద్రమే గజగజలాడాలి
సాక్షి, విజయవాడ: కర్ణాటక ఎన్నికల తర్వాత మనకు చుక్కలు చూపిస్తారని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడని, అయితే మనకు ఎవరూ చుక్కలు చూపించలేరని, తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రమే గజగజలాడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ విద్యాధరపురంలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న హజ్‌హౌస్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ముస్లింలంతా అండగా ఉండాలని, ఇది తన కోసం కాదని భావితరాల కోసమన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీశామని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వమే ఖర్చులు ఇస్తుందన్నారు. హజ్‌యాత్రపై 18 శాతం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. విజయవాడలో హజ్ హౌస్ కడుతున్నామని.. ఇక్కడే షాదీఖానా, మసీదు, వక్ఫ్ బోర్డ్ కార్యాలయం ఉంటాయన్నారు. -
హజ్ యాత్రకు 4,066 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు 4,066 మంది ఎంపికయ్యారని ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 2017 లో ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ హజ్ కమిటీని దేశంలోనే నంబర్ వన్ కమిటీ అని కేంద్ర హజ్ కమిటీ ప్రశంసించిందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్‌లో 2018 సంవత్సరానికి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న యాత్రికుల ఎంపిక డ్రా పద్ధతిలో జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు ఐదారువేల మంది వెళ్లేవారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేవలం రాష్ట్రం నుంచే 4,500 మంది యాత్రకు వెళుతున్నారని వివరించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగి ఐదువేల వరకు చేరుతుందన్నారు. కోటా పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారని తెలిపారు. యాత్రికు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌదీ అరేబియా ప్రభుత్వంతో కూడా మాట్లాడతామ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్ కమిటీ వార్షిక బడ్జెట్ కేవలం రూ. 1.50 కోట్లుండేదని, వచ్చే ఏడాది నుంచి దాన్ని రూ. 5 కోట్లకు పెంచుతామన్నారు. 31 లోపు సర్టిఫికెట్లు సమర్పించాలి 2018 హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 17,130 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో 70 ఏళ్లకు పైబడినవారు ప్రత్యేక కేటగిరీలో నేరుగా 508 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ చెప్పారు. మిగతా 16,622 మంది యాత్రికులలో డ్రా పద్ధతిలో 3,558 మంది ఎంపికయ్యారన్నారు. డ్రాలో ఎంపికైన యాత్రికులు ఈ నెల 31 లోపు పాస్‌పోర్టు, మెడికల్ సర్టిఫికెట్లతో పాటు హజ్ యాత్ర తొలి కిస్తు రూ. 81 వేల డీడీని కూడా హజ్ కమిటీకి జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ నిర్ణయంపై ఆశ్చర్యం..
రియాద్: గత కొన్ని రోజులుగా ఖతర్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సౌదీ అరేబియా కాస్తంత మెత్తబడింది. ఖతర్ నుంచి హజ్ యాత్రికులు వచ్చేందుకు వీలుగా రెండు దేశాల సరిహద్దు పోస్టులను తెరచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక తమ ఎయిర్‌లైన్స్ విమానాలను దోహాకు పంపి హజ్ యాత్రికులను మక్కాకు దగ్గర్లోని జెడ్డా వరకు రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను ఖతర్ స్వాగతించింది. ఈ నిర్ణయాన్ని శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా అమలయ్యేలా చూడాలని సౌదీ అరేబియాను కోరింది. సౌదీ యువరాజు సల్మాన్, ఖతర్‌కు చెందిన రాజ కుటుంబ సభ్యునితో బుధవారం సమావేశమైన అనంతర ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే సదరు రాజకుటుంబం 1972లో జరిగిన కుట్రలో పదవులు కోల్పోయిందని సమాచారం. సరిహద్దు- పోస్టులు తెరుచుకోవటంతో ఇప్పటికే 100 మంది ఖతర్ వాసులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించారని అధికారులు తెలపారు. దాదాపు గత 10 వారాలుగా సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు కలిసి ఖతర్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాయి. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఖతర్‌పై ఆరోపణలు చేస్తూ వివిధ అంశాలకు సంబంధించి 13 డిమాండ్లను నెరవేర్చాలని తమ దేశాల సరిహద్దులు మూసివేశాయి. విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. దీంతో ఖతర్ ఒంటరిగా పోరాడుతోంది. వచ్చే వారంలో సౌదీ అరేబియాలో హజ్ యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగా కోట్లాది మంది ముస్లింలు పవిత్ర మక్కా, మదీనాలను సందర్శించుకుంటారు. -
రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్ అలీ
హజ్ యాత్రను ప్రారంభించిన మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. ప్రజలం దరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుడిని వేడుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ హజ్ యాత్రికులను కోరారు. అదివారం రాత్రి 11.30 గంటలకు రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో 452 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌కు జెండా ఊపి హజ్ యాత్ర–2017ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది హజ్ క్యాంప్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు 7వేల మంది హజ్ యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లనున్నారన్నారు. హజ్ కమిటీ యాత్రికులకు అన్ని రకాల వసతులు కల్పించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రుబాత్‌లో రాష్ట్రం నుంచి వెళ్లే 1,270 మంది యాత్రికులకు ఉచిత వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రకు మరో 200 మందికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2015 కోసం తెలుగు రాష్ట్రాల్లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరో 200 మందికి అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర హజ్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి ఆదేశాలు అందాయి. దేశ వ్యాప్తంగా హజ్ యాత్ర కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న 3,237 మంది దరఖాస్తుదారులకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర హజ్ కమిటీ జాబితా విడుదల చేసింది. ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 110, ఆంధ్రప్రదేశ్‌కు 90 మంది కోటాను కేటాయించింది. ఎంపికైన వారు హజ్‌యాత్ర కోసం మొదటి విడత రుసుముతో పాటు పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలను మే నెల 8వ తేదీలోగా సమర్పించాలని కేంద్ర హజ్ కమిటీ పేర్కొంది. -
హజ్ యాత్రకు మెరుగైన సదుపాయాలు: సుష్మా
న్యూఢిల్లీ: హజ్ యాత్రికుల సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. హజ్ వార్షిక యాత్రకు భారత్ కోటాలో విధించిన 20శాతం కోతను ఉపసంహరించుకునేలా సౌదీ అరేబియాను కోరతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హాజ్ యాత్రికుల ప్రయాణ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. హజ్ యాత్రపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిల భారత సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. హజ్ యాత్రికులనుంచి టికె ట్ చార్జీ వసూలులో ఎయిరిండియా తీరును ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎంపిక చేసిన ఇతర విమానాశ్రయాలనుంచి హజ్‌యాత్రకు టికెట్‌కు రూ. 62,800 వసూలు చేస్తున్నారని, శ్రీనగర్‌నుంచి హజ్ యాత్రకు మాత్రం రూ. 1.54లక్షలు వసూలు చేస్తున్నారని ఇది కాశ్మీర్ ప్రజలకు భారం కాగలదని అన్నారు. కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు.