హజ్ యాత్రకు మరో 200 మందికి అవకాశం | another 200 for haj yatra | Sakshi
Sakshi News home page

హజ్ యాత్రకు మరో 200 మందికి అవకాశం

Published Tue, Apr 28 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

another 200 for haj yatra

సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2015 కోసం తెలుగు రాష్ట్రాల్లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరో 200 మందికి అవకాశం లభించింది. ఈ మేరకు  కేంద్ర హజ్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి ఆదేశాలు అందాయి. దేశ వ్యాప్తంగా హజ్ యాత్ర కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న 3,237 మంది దరఖాస్తుదారులకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర హజ్ కమిటీ జాబితా విడుదల చేసింది. ముస్లిం జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 110, ఆంధ్రప్రదేశ్‌కు 90 మంది కోటాను కేటాయించింది. ఎంపికైన వారు హజ్‌యాత్ర కోసం మొదటి విడత రుసుముతో పాటు పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలను మే నెల 8వ తేదీలోగా సమర్పించాలని కేంద్ర హజ్ కమిటీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement