రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్‌ అలీ | Mohammad Ali send off to haj yatra pilgrims | Sakshi
Sakshi News home page

రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్‌ అలీ

Published Mon, Aug 14 2017 3:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్‌ అలీ

రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్‌ అలీ

హజ్‌ యాత్రను ప్రారంభించిన మహమూద్‌ అలీ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. ప్రజలం దరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుడిని వేడుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హజ్‌ యాత్రికులను కోరారు. అదివారం రాత్రి 11.30 గంటలకు రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో 452 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌కు జెండా ఊపి హజ్‌ యాత్ర–2017ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది హజ్‌ క్యాంప్‌ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు 7వేల మంది హజ్‌ యాత్రికులు హజ్‌ యాత్రకు వెళ్లనున్నారన్నారు. హజ్‌ కమిటీ యాత్రికులకు అన్ని రకాల వసతులు కల్పించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రుబాత్‌లో రాష్ట్రం నుంచి వెళ్లే 1,270 మంది యాత్రికులకు ఉచిత వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ.షుకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement