mohammad ali
-
కానిస్టేబుల్ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
వైఎస్ఆర్సీపీ 175కి 175 సీట్లు గెలవడం ఖాయం: అలీ
-
సీఎం జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీకి సిద్ధం: అలీ
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు. కాగా, మంత్రి రోజా, అలీ.. మంగళవారం నగరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ క్రమంలో అలీ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175కి 175 సీట్లు గెలవడం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు. సినిమా వేరు.. రాజకీయాలు వేరు అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీ రౌడీయిజం చేస్తే బాగోదు: హోంమంత్రి మహమూద్ అలీ
-
సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారు. -
అపోలోకు పద్మారావు
సాక్షి, హైదరాబాద్: హోం క్వారంటైన్లో ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్‌ను మరిం త మెరుగైన వైద్యసేవల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పద్మారావుతోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను శుక్రవారం అపోలో ఆస్పత్రికి తరలించి ప్రత్యేకగదిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావును సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. డిశ్చార్జయిన మహమూద్ అలీ కరోనాతో ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. జూన్ 28న మహమూద్ అలీతోపాటు, ఆయన కుమారుడు, మనవడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన వారంతా ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. ఇకపై హోంక్వారంటైన్లోనే ఉంటూ చికిత్స పొందనున్నారు. -
ప్రజలకు చేరువైన ‘షీ–టీమ్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రజలకు చేరువైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హైదరా బాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణలో షీ–టీమ్స్ సాధించిన విజయాలు వారి పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సైతం షీ టీమ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేరాలను తగ్గిస్తూ.. నిందితుల్లో పరివర్తన కోసం కౌన్సెలింగ్ చేస్తోన్న షీ–టీ మ్స్ విధానాన్ని ప్రశంసించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలోని పలు మెట్రో నగరాల్లో షీటీమ్స్‌ను స్ఫూర్తిగా ప్రత్యేకదళాలను ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.షీ–టీమ్స్ అధిపతి, ఐజీ స్వాతి లక్రామాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలన్న నినాదంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు. -
హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, సైబర్ అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ ట్విటర్లో రోజూ పౌరులను హెచ్చరిస్తూ ఉంటారు. విచిత్రంగా ఆయన పేరిట రిజిష్ట్రర్ అయిన ఓ వాహనంపై ఏకంగా హోంమంత్రి మహమూద్ అలీ మనవడు, అతడి స్నేహితుడు కలసి డిపార్ట్మెంట్కు వ్యతిరేకంగా చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఐజీస్థాయి అధికారిని నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పీక కోస్తా అంటూ బెదిరిస్తూ చెప్పే ఓ సినిమా డైలాగ్ ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోపై గురువారం డీజీపీ కార్యాలయంలోనూ చర్చ జరిగింది. విషయం డీజీపీ, ఏడీజీ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. డీజీపీ కార్యాలయం సమాచారం ప్రకారం.. ఆ వీడియో పాతదని, కారుపై కూర్చున్న యువకుడు హోంమంత్రి మనవడు కాగా, డైలాగులు చెప్పిన యువకుడు అతడి స్నేహితుడని తెలిపారు. హోంమంత్రి భద్రత కోసం కేటాయించిన కార్లలో అది కూడా ఒకటని తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి పోలీసు వాహనం డీజీపీ పేరుతో రిజిస్టర్ అయి ఉంటుందని వివరణ ఇచ్చారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని ఇలా అభ్యంతరకరంగా వీడియో చిత్రించడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. This #TikTok video shows grandson of #Telangana Home Minister #MahmoodAli seated on police vehicle (regd @TelanganaDGP?); his friend mimes to audio of a police officer being threatened that his throat will be slit if he is not respectful to the man on jeep; Creative licence?@ndtv pic.twitter.com/ym6RHrVSJ3 — Uma Sudhir (@umasudhir) July 18, 2019 -
ప్రతీ తల్లి బాధ్యతగా పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. ప్రతీ తల్లి తన కుమారుడి తీరును గమనిస్తూ ఉండాలని, అబ్బాయిలకు ఆడవాళ్లపై గౌరవభావం కలిగేలా వారిని పెంచాలని చెప్పారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్బంగా ‘విమెన్స్ సేఫ్టీ వింగ్’ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు మహిళా భద్రతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. నిధుల కేటాయింపు, విడుదల వరకు ఎక్కడా జాప్యం జరగలేదన్నారు. ఆడపిల్ల భద్రంగా ఉంటేనే ఏ నగరానికైనా మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఏటా నేరాల శాతం తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమని హోంమంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ షీటీమ్స్, భరోసా కేంద్రాలతోపాటు విమెన్స్ సేఫ్టీ వింగ్‌లను రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించారన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి: డీజీపీ హైదరాబాద్ మహిళలకు సురక్షితమైన నగరమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. 2014 నుంచి పోలీసులకు సంబంధించి పరిపాలనా పరంగా అనేక మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. ఇటీవల భరోసా కేంద్రాలను సుప్రీంకోర్టు అభినందించిందని, తప్పకుండా విమెన్ సేఫ్టీ వింగ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న పలు నేరాల దర్యాప్తు, వారికి అందించే న్యాయపరమైన సేవలను ఒకే గొడుగు కిందకు ‘విమెన్ సేఫ్టీ వింగ్’ద్వారా తీసుకువచ్చామని ఆ వింగ్ చీఫ్, ఐజీ స్వాతీ లక్రా తెలిపారు. ఇకపై ఇలాంటి నేరాల విచారణ వేగంగా జరిగేలా ఇక్కడ నుంచే నిరంతర పర్యవేక్షణ జరుపుతామన్నారు. ఈ సెల్‌కు సంబంధించి వెబ్సైట్, వాట్సాప్, ఫేస్బుక్, హాక్ ఐ ద్వారా మహిళలు న్యాయసేవలు, ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. తక్కువ సమయంలోనే కార్పొరేట్ తరహాలో అధునాతన భవనాన్ని నిర్మించి అందించిన టీపీఎస్హెచ్ఎల్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ మల్లారెడ్డిలకు సీఐడీ ఎస్పీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్రానికి కేసీఆర్ దేవుడి బహుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గాడ్ గిఫ్ట్ అని, దేశంలోనే ఆయనంతటి నాయకుడు లేరని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. గతంలో తనకు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు హోంమంత్రిగా అవకాశం క ల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. గురువా రం సచివాలయంలోని ఆయన చాంబర్లో హోంమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారని, అయన చేసిన ఆరోపణలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టేలా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలోనే టాప్ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ టాప్‌లో ఉందని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు అనేక సార్లు కితాబునిచ్చినట్టు మహమూద్ అలీ వెల్లడించారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్ దృష్టి పెట్టి అమలుచేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే అధికారం అప్పగించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మైనారిటీ కోసం కేటాయిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. మంచి పేరు తెచ్చుకుంటా.. సీఎం కేసీఆర్ అప్పగించిన హోంమంత్రి పదవీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటానని మహమూద్ అలీ అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, క్రైమ్ రేట్ ఇంకా తగ్గించాల్సిన అవసరముందన్నారు. అలాగే పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవుల అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సంద ర్భంగా మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీకి అభినందనలు తెలిపారు. అలాగే డీజీపీ మహేందర్‌రెడ్డి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఫైర్ విభాగం డీజీ గోపీకృష్ణ, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ బి.మల్లారెడ్డి తదితరులు హోంమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం
-
అన్నపూర్ణగా తెలంగాణ
శంకర్పల్లి : రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోపాల్, వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ
నిజామాబాద్ : జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లో మత్స్యకారులకు నిజామాబాద్ ఎంపీ కవిత ద్విచక్రవాహనాలను అందజేశారు. మరో కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో హాస్టల్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. బీహెచ్ఈఎల్ సహాకారంతో 3 కోట్ల నిధులతో ప్రభుత్వం హాస్టల్‌ను నిర్మించనుంది. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలకు 800 ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
‘ఆసిఫ్‌నగర్’ ఆందోళన తాత్కాలిక విరమణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండల కార్యాలయ సిబ్బందిపై కొందరు దుండగులు చేసిన దాడికి నిరసనగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన హామీ మేరకు ఆందోళనలను విరమించుకుంటున్నామని టీఆర్ఎస్ఏ అధ్యక్షుడు మఠం శివశంకర్ తెలిపారు. మహమూద్ అలీతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ సమక్షంలో మంగళవారం టీజీటీఏ, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి వారంలోగా జిల్లా కలెక్టర్‌తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పినట్లు శివశంకర్ తెలిపారు. దాడికి పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమావేశంలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జి.సతీశ్, వీఆర్ఏల అధ్యక్షుడు వి.ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మునిగిపోతే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న మల్కాజ్గిరి, అల్వాల్, నిజాంపేట, బేగంపేట తదితర ప్రాంతాల్లోని పలు కాలనీలు.. వరద సుడిగుండంలో చిక్కుకున్న విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, భవనాలు.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు.. వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనాలు.. బాధితుల ఆక్రందనలు.. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పోలీసులు సహాయం చేస్తున్నా అదుపులోకి రాని పరిస్థితులు.. చివరికి రంగంలోకి దిగిన త్రివిధ దళాలు.. హెలికాప్టర్ నుంచి సాగర్‌లోకి తాడు సాయంతో కిందకి దిగి అక్కడి నుంచి పడవల ద్వారా నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకున్న సైన్యం.. బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.. అక్కడే ఉన్న 108 అంబులెన్స్ ద్వారా సమీప పునరావాస కేంద్రాలకు తరలించింది.. ..ప్రకృతి విపత్తుల వల్ల హైదరాబాద్ మహానగరం మునిగిపోతే.. ఎలా స్పందించాలనే దానిపై నిర్వహించిన ‘ప్రళయ్ సహాయ్’లో కళ్లకు కట్టిన దృశ్యాలివీ.. ఒకవేళ ప్రకృతి విపత్తులు వస్తే అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండి ప్రజలను ఎలా సంరక్షిస్తాయనే సందేశాన్ని ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వరదల్లో నుంచి బయటపడేందుకు తోడ్పాటును అందించే ఉద్దేశంతో చేపట్టిందే ఈ మాక్‌డ్రిల్. హుస్సేన్‌సాగర్‌లో భారత సైనిక దళం దక్షిణ విభాగం కమాండెంట్ హరీజ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 10.30 గంటల వరకు ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించింది. ఇందులో స్థానిక సంస్థలు మొదలుకుని కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సిబ్బంది పాలుపంచుకున్నారు. సమన్వయంతో ప్రకృతి విపత్తును ఎదుర్కొని చేసే సహాయ, పునరావాస చర్యల గురించి కళ్లకు కట్టినట్టు చూపించారు. సంజీవయ్య పార్కు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ డ్రిల్‌ను రక్షణ శాఖ సహాయ మంత్రి రామారావు సుభాష్ బామ్రే, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తిలకించారు. సమన్వయంతో.. సహజసిద్ధంగా.. ప్రకృతి విపత్తులు.. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల సంభవించే వరదల్లో చేపట్టే సహాయ, పునరావాస చర్యలను తెలిపేదే ఈ ‘ప్రళయ్ సహాయ్’. త్రివిధ దళాల సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. భారత సైనిక దళం దక్షిణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రళయ్ సహాయ్‌లో భారీ వరదల సందర్భంగా ముంపుకు గురయ్యే కాలనీలు సహాయం కోసం బాధితులు చేసే ఆక్రందనలు, నీట మునిగిన వాహనాలతో సహజసిద్ధమైన సెట్టింగ్‌లను హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేశారు. డ్రిల్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై ఆహారం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు అందించారు. ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ నుంచి రాఫ్ట్ సాయంతో కిందకు దిగి పడవలో నీటమునిగిన భవంతుల వద్దకు చేరుకుని బాధితులను రక్షించారు. రెడ్‌క్రాస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ జెండాతో వారిని ఒడ్డుకు చేర్చి అంబులెన్స్‌లో పునరావాస ప్రాంతాలకు పంపారు. కొంతమంది బాధితులను అత్యాధునిక పరికరాలతో తాడుకు కట్టి హెలికాప్టర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. మరో ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో భవనం కాలిపోతుంటే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ అండ్ ఫైర్ సర్వీస్, విద్యుత్ విభాగాల అధికారులు చేరుకుని సహాయక చర్యలు అందించడాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. ఇలా అన్ని ప్రభుత్వ విభాగాలు విపత్తుల సమయంలో సమర్థంగా పనిచేస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయవచ్చనే సందేశాన్ని ఇచ్చారు. ఈ మాక్‌డ్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పోలీసు, రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవలు, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎంఐ–17 హెలికాప్టర్లతో పాటు ఆర్మీ ఏవియేషన్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, చేతక్ హెలికాప్టర్లతో చేపట్టిన సహాయక చర్యలు, ఆర్మీ కమాండ్లు, మెరైన్ కమాండోస్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ డాగ్ స్క్వాడ్లు పాల్గొన్నాయి. మాక్‌డ్రిల్ విజయవంతం: బామ్రే కేంద్ర మంత్రి సుభాష్ బామ్రే మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ విభాగాల వరకు సమన్వయంతో పనిచేస్తే బాధితులను రక్షించవచ్చన్నారు. హైదరాబాద్ వేదికగా ‘ప్రళయ్ సహాయ్’మాక్‌డ్రిల్ నిర్వహించడం హర్షణీయమన్నారు. అన్ని విభాగాలూ మద్దతివ్వడంతో మాక్‌డ్రిల్ విజయవంతమైందన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మాక్‌డ్రిల్ రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రకృతి విపత్తు సంభవిస్తే ఎలా రక్షిస్తారనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అవగాహన కలిగించేలా స్టాళ్లు.. అనంతరం పీపుల్స్ ప్లాజాలో విపత్తుల నివారణలో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలసి సుభాష్ బామ్రే, మహమూద్ అలీ సందర్శించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను, ప్రాణులను ఎలా కాపాడాలి.. ఆ సమయంలో త్రివిధ దళాలు, సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయి.. ఎలాంటి సామగ్రిని ఉపయోగిస్తారు.. అనే విషయాలపై ఈ స్టాళ్లలో అవగాహన కలిగించారు. రెండు రోజుల ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగిసింది. మనోధైర్యం కలిగిస్తున్నాం.. సముద్రంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, మంటలు ఎగిసిపడుతున్నప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు కాపాడేందుకు ఉపయోగించే సామగ్రిని వాడే విధానంపై ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు అవగాహన కలిగిస్తున్నాం. విపత్తులో ప్రజలు కూడా సహాయం చేసేలా మనోధైర్యం కల్పిస్తున్నాం. – ప్రకాశ్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్, కోస్ట్‌గార్డు, వైజాగ్ బాంబు విచ్ఛిన్నంపై జాగృతం బాంబు డిస్పోజల్, డీప్ సెర్చ్ మిషన్, ట్రాన్సిస్టర్ రిమోట్ ఆపరేటింగ్‌తో పని చేసే పరికరాలు, మొబైల్ ఎక్స్‌రే స్కానర్, 2 కేజీల టీఎన్టీ బాంబు పేలినా నష్టం జరగకుండా అడ్డుకునే బాంబు ఇన్హిబిటర్ ఇలా అనేక వస్తువుల పనితీరును తెలియజేశాం. – ఎం.రామకృష్ణ, ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ డీఎస్పీ -
రాష్ట్రం కోసం ప్రార్థించండి: మహమూద్ అలీ
హజ్ యాత్రను ప్రారంభించిన మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. ప్రజలం దరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుడిని వేడుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ హజ్ యాత్రికులను కోరారు. అదివారం రాత్రి 11.30 గంటలకు రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో 452 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌కు జెండా ఊపి హజ్ యాత్ర–2017ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది హజ్ క్యాంప్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు 7వేల మంది హజ్ యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లనున్నారన్నారు. హజ్ కమిటీ యాత్రికులకు అన్ని రకాల వసతులు కల్పించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. రుబాత్‌లో రాష్ట్రం నుంచి వెళ్లే 1,270 మంది యాత్రికులకు ఉచిత వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
కైట్ ఫెస్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
-
నేడు అలీ సంస్మరణ సభ
లూయిస్విల్లే: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ సంస్మరణ సభలో పాల్గొనేందుకు అభిమానులు పోటీపడ్డారు. శుక్రవారం జరిగే మెమోరియల్ టిక్కెట్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు 15 వేల టిక్కెట్లను పంపిణీ చేశారు. తన మరణానంతరం జరిగే సంస్మరణ సభకు అభిమానులను ఉచితంగానే ఆహ్వానించాలని అలీ చెప్పినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్, కమెడియన్ క్రిస్టల్ ఉపన్యసిస్తారు. -
'రింగ్' రోదిస్తోంది
- బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కన్నుమూత - మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాటం - సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని విజయాలు లాస్ ఏంజెల్స్: ‘నన్ను ఓడించాలని ఎవరైనా కలగన్నా.. వెంటనే నిద్ర లేచి నాకు క్షమాపణలు చెప్పాలి’... అంటూ రొమ్ము విరిచిన తెగింపుతో... తిరుగులేని ఆటతో... సుదీర్ఘకాలం ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన ‘ది గ్రేట్’ మొహమ్మద్ అలీ (74) శనివారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలకు చికిత్స పొందుతూ ఫోనిక్స్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ‘చాంపియన్లు జిమ్‌లో పుట్టరు’ అంటూనే 21 ఏళ్ల బాక్సింగ్ కెరీర్లో (1960-81) తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను నిలువెల్లా వణికించారు. కవ్వించే మాటలకు.. కన్పించని తంత్రాలకు... తనదైన రీతిలో ముష్టిఘాతాలు కురిపిస్తూ... ఎదురుపడ్డోడి ఒంట్లో నరాలన్నీంటిని పిండి చేశారు. ‘ప్రతి నిమిషం శిక్షణ నాకు నచ్చదు’ అంటూనే... అవసరమైనప్పుడు శ్రమకు నిర్వచనంగా నిలిచారు. బాధతో విలవిలలాడే ప్రత్యర్థులు పిడిగుద్దులు గుద్దినా ఓర్పుగా అనుభవిస్తూనే.. నేర్పుగా తాను అనుకున్న ఫలితాన్ని రాబట్టారు. అభిమానులు చంపేయంటూ అరిచినా... ప్రత్యర్థులు భీకరిల్లే అరుపులు పెట్టినా... దాన్ని బౌట్ వరకే పరిమితం చేశారు. కానీ ఆనాడు తగిలిన దెబ్బలకు జీవితంలో ఎన్నడూ కోలుకోలేని ‘పార్కిన్సన్’ వ్యాధికి (1984) గురై దాదాపు మూడు దశాబ్దాలు చిత్ర వధ అనుభవించారు. దీంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు, న్యూమోనియా (2014), యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (2015)తో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ జీవిత గమనాన్ని నెట్టుకుంటూ వచ్చిన అలీ.. రెండు రోజుల కిందట శ్వాస సమస్యలతోనే మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కానీ చికిత్స చేసినా... పరిస్థితి చేజారడంతో ఈ లోకం విడిచారు. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన అలీ... చివరిసారిగా పార్కిన్సన్ చికిత్సకు నిధులు సమకూర్చుకునేందుకు ఏప్రిల్‌లో ఫోనిక్స్‌లో ‘సెలబ్రిటీ ఫైట్ నైట్ డిన్నర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌తో అనుబంధం న్యూఢిల్లీ: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ భారత్‌లో రెండుసార్లు పర్యటించారు. కేవలం రెండు పర్యటనల్లోనే ఎంతోమంది ఆత్మీయ అభిమానులను సంపాదించుకున్నారు. 1980లో ఓ పారిశ్రామికవేత్త ఆహ్వానం మేరకు తొలిసారి అలీ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బౌట్లలో పాల్గొన్నారు. రెండోసారి 1990లో భారత్ వచ్చిన అలీ కోల్‌కతాలో మూడు రోజులు గడిపారు. ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ మ్యాచ్ కోసం నేను బండరాతిని హత్య చేశాను... కొండను గాయపర్చాను... చికిత్స చేసే మందులను కూడా నేను ఇప్పుడు రోగిగా మార్చగలను... ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరుకు ముందు ప్రత్యర్థికి సవాల్ విసురుతూ... బాక్సింగ్ రింగ్‌లో అలీ గర్జన. యూనిఫారం ధరించి 10 వేల మైళ్లు ప్రయాణించి అమాయకులైన ప్రజలపై బాంబులు వేసేందుకు నన్ను పంపిస్తారా? మన దేశంలో నల్లజాతివారిని మనుషులుగా చూడకుండా... తెల్లవాళ్ల ఆధిపత్యం కోసం మరో పేద దేశాన్ని బలి చేస్తారా... అమెరికా ప్రభుత్వంపై అలీ ధిక్కారం. నాకు ట్రైనింగ్ అంటే అసహ్యం...కానీ జీవిత కాలమంతా చాంపియన్‌గా బతకాలంటే ఇప్పుడు ఆగిపోవద్దు. రిస్క్‌లు చేయడం ఇష్టం లేనివారు జీవితంలో ఏదీ సాధించలేరు... నా జీవితంలో నేను తలపైనే 29 వేల పంచ్‌లు తిన్నాను... అనుభవంతో అలీ నింపే స్ఫూర్తి. మొహమ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాదు...రింగ్‌లో రక్తం కళ్లచూసినవాడు. కానీ బయట మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకనాడు బాక్సింగ్ కెరీర్‌నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బాక్సింగ్‌లో సూపర్ మ్యాన్‌లా ప్రపంచాన్ని శాసించిన అతను నల్లజాతివారి హక్కుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించేందుకు వెనుకాడలేదు. అదే అలీని ప్రపంచ క్రీడాకారుల్లో అందరికంటే ముందు నిలిపింది. ఒక ఫైటర్నుంచి మత ప్రచారకుడి వరకు అతనిలో ఎన్నో కోణాలు ఉన్నాయి. బాక్సింగ్‌లోనే కాదు మాటల్లో కూడా పంచ్‌లతో అలీ తనకు ఎదురు లేదనిపించాడు. ‘నేను గొప్పవాడినే కాదు. అంతకంటే ఎక్కువే’ అంటూ స్వయంగా ప్రకటించుకోగలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది. దేవుడు తన చాంపియన్ కోసం కిందికి దిగి వచ్చాడు... అలీ మరణానంతరం మరో స్టార్ బాక్సర్ మైక్ టైసన్ ఇచ్చిన నివాళి ఇది. బాక్సింగ్‌లో అసలైన చాంపియన్‌గా రెండు దశాబ్దాల పాటు అలీ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టాడు. ఆ పంచ్‌కు రింగ్‌లో కుప్పకూలిన ఆటగాళ్లెందరో... ఆ పవర్‌కు ఇక చాలు అంటూ శరణుజొచ్చిన బాక్సర్లు మరెందరో... మూడు సార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ అయిన అలీ, గత వందేళ్లలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడిగా నీరాజనాలందుకున్నాడు. తిరుగులేని పంచ్‌లు: తన సైకిల్ ఎత్తుకుపోయిన దొంగను పట్టుకొని చితకబాదాలని 12 ఏళ్ల కుర్రాడిలో వచ్చిన ఆవేశాన్ని ఒక పోలీస్ గుర్తించి సానబెట్టడంతోనే ప్రపంచ బాక్సింగ్‌కు అలీ లభించాడు. కాసియస్ మార్సెలస్ క్లేగా పలు సంచలన విజయాలు సాధించిన అతను 1960 రోమ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే ఏడాది ప్రొఫెషనల్‌గా రింగ్‌లోకి అడుగు పెట్టిన అతనికి ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. 22 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలవడంతో అలీ పేరు మా రుమోగిపోయింది. ఆ తర్వాత మరో రెండు సార్లు అతను ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 1960 నుంచి 1981 మధ్య కాలంలో ప్రొఫెషనల్ బాక్సిం గ్లో తలపడిన 61 బౌట్లలో 56 విజయాలు... ఇందులో 37 నాకౌట్లే ఉండటం విశేషం. మతంపై నమ్మకంతో...:1967లో వియత్నాంపై అమెరికా యుద్ధం సాగిస్తున్న రోజులవి. అప్పటికే ముస్లింగా మారిన అలీ తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అప్పటి నిబంధనల ప్రకారం అలీ కూడా ఆర్మీలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ దానిని వ్యతిరేకించాడు. దాంతో ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ రద్దు చేసి అరెస్ట్ కూడా చేయించింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత అలీని అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో దాదాపు నాలుగేళ్ల కాలం అలీ జోరుకు అడ్డు వేసింది. అయినా పునరాగమనం తర్వాత కూడా పదును తగ్గని అతను మళ్లీ తన దూకుడును కొనసాగించాడు. శాంతి కోరుతూ...: ‘రంగు కారణంగా మనుషులను ద్వేషించడంకంటే దుర్మార్గం మరొకటి లేదు’ అంటూ అమెరికాలో నల్లజాతివారిపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా అలీ పోరాడాడు. కెరీర్‌ను పణంగా పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించడం అక్కడి నల్లజాతీయులందరిలో స్ఫూర్తి నింపింది. కెరీర్ ముగిసిన తర్వాత కూడా అలీ మానవ హక్కుల కోసం తన పోరాటం కొనసాగించాడు. అనారోగ్యంతో బాధ పడుతున్నా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్యటించి శాంతి కోసం ప్రచారం చేశాడు. అమెరికా అత్యున్నత పురస్కారాలు ప్రెసిడెన్షియల్ సిటిజన్స్ మెడల్, మెడల్ ఆఫ్ ఫ్రీడం అలీకి దక్కాయి. చివరి రోజుల్లో కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తామూ అమెరికన్లమే అంటూ ఘాటుగా బదులిచ్చాడు. పాపులర్ ‘పంచ్’లు అలీxసోనీ లిస్టన్ (1964) అలీ తొలిసారి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన బౌట్. అతనిపై ఎవరికీ అంచనాలు లేవు. ఆరు రౌండ్లలో అలీ చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ లిస్టన్ తాను కొనసాగించలేనంటూ చేతులెత్తేశాడు. అలీx జార్జ్ ఫోర్మన్ (1974) ఆఫ్రికా దేశం జైర్‌లో జరిగిన ఈ పోరుకు ‘రంబల్ ఇన్ ద జంగిల్’గా పేరు పెట్టారు. అలీ అద్భుతమైన ఆటతో ఎనిమిదో రౌండ్లో ఫోర్మన్ను పడగొట్టాడు. మ్యాచ్ జరిగినంత సేపూ ‘అలీ...అతడిని చంపేయ్’ అంటూ ప్రేక్షకులు హోరెత్తించడం బాక్సింగ్‌లో చాలా కాలం చర్చనీయాంశం అయింది. అలీx జో ఫ్రేజర్ (1975) ‘థ్రిల్ల ఇన్ మనీలా’ పేరుతో ఈ బౌట్ సాగింది. ఇద్దరు బాక్సర్లూ పరస్పరం పదునైన పంచ్‌లు విసురుకున్నారు. అయితే 14వ రౌండ్ ముగిసే సరికి ఫ్రేజర్ తీవ్రంగా గాయపడగా...అతని ప్రాణాలు కాపాడేందుకు కౌంట్‌కు స్పందించకుండా ట్రైనర్ అడ్డుపడటంతో అలీని విజేతగా ప్రకటించారు. తాను చావుకు దగ్గరగా వెళ్లిన బౌట్ ఇదని అలీ తర్వాత చెప్పుకున్నాడు. అలీ ఉత్తమ ఆటగాడు. స్ఫూర్తి ప్రదాత, అందరికీ ప్రేరణగా నిలిచే గొప్ప బాక్సర్. ఆయన మరణం విచారకరం.- భారత ప్రధాని మోదీ అలీ మరణం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఎల్లప్పుడు మంచి కోసం ఫైట్ చేసిన చాంపియన్. ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం. - అమెరికా అధ్యక్షుడు ఒబామా గొప్ప చాంపియన్, అదర్శనీయమైన వ్యక్తి. మనమంతా ఆయన్ని కోల్పోయాం. - డొనాల్డ్ ట్రంప్ అలీ రింగ్‌లో చూపించే ధైర్యం, తెగువ బాక్సింగ్‌ను అందమైన ఆటగా మార్చాయి.ఆయన వ్యక్తిత్వమే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. - హిల్లరీ క్లింటన్ ‘జీవితంలో ఒక్కసారైనా ఆ దిగ్గజాన్ని కలవాలని అనుకున్నాను. కానీ నా కోరిక ఇక తీరదు’- సచిన్ ‘ఆటకు ఆయన చేసిన సేవ మరువలేనిది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. చిరస్మరణీ యులు’ - విజేందర్ ‘బాక్సింగ్‌కు అలీ మరణం తీరని లోటు. ఆయనే నాకు ఆదర్శం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. ఒక గొప్ప వ్యక్తిగా అందరి మదిలో నిలిచిపోయారు’ - మేరీ కోమ్ ►కెరీర్ బౌట్స్: 61 ►విజయాలు: 56 (ఇందులో 37 నాకౌట్స్) ► ఓటములు: 5 కింగ్ ఆఫ్ ద రింగ్ 1942: జనవరి 17న అమెరికాలోని కెంటకీలో జననం అసలు పేరు: కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ ఎత్తు: 6.3 అడుగులు 1954: 12వ ఏట బాక్సింగ్ శిక్షణ ప్రారంభం 1959: జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ లైట్ హెవీవెయిట్ టైటిల్ 1960: రోమ్ ఒలింపిక్స్‌లో లైట్ హెవీవెయిట్ స్వర్ణం 1960: ప్రొఫెషనల్‌గా మార్పు 1964: దిగ్గజ బాక్సర్ సోనీ లిస్టన్‌ను ఓడించి 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ దక్కించుకున్నాడు. అనంతరం ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును మొహమ్మద్ అలీగా మార్చుకున్నారు. సోంజి రాయ్‌తో తొలి వివాహం 1967: అమెరికా, వియత్నాం యుద్ధ సమయంలో ఆర్మీలో చేరేందుకు నిరాకరణ. టైటిల్ కోల్పోవడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత17 ఏళ్ల బెలిండా బాయ్డ్‌తో రెండో వివాహం 1970: న్యాయ పోరాటం అనంతరం తిరిగి బాక్సింగ్ బరిలోకి దిగారు 1971: జో ఫ్రేజర్‌తో జరిగిన ‘శతాబ్దపు ఫైట్’లో ఓటమి.అలీపై ఉన్న అభియోగాలను కొట్టివేసిన యూఎస్ సుప్రీం కోర్టు 1974: రెండోసారి ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ (జార్జి ఫోర్మన్పై విజయం) 1977: వెరోనికా పోర్షేతో అలీ మూడో వివాహం 1978: మూడోసారి ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ (లియోన్ స్పింక్స్పై విజయం)తో తొలిసారి ఈ ఫీట్ సాధించిన బాక్సర్‌గా రికార్డు. అదే ఏడాది రిటైర్మెంట్ ప్రకటన. 1980: పునరాగమనంలో లారీ హోమ్స్‌పై నాకౌట్ ఓటమి 1981: ట్రెవర్ బెర్బిక్తో ఓటమి అనంతరం తన కెరీర్‌కు ముగింపు పలికారు 1984: చికిత్సకు లొంగని పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు 1986: యోలండా లోనీ విలియమ్స్‌తో నాలుగో వివాహం 1998: ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా ప్రకటన 2002: అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలిసారిగా జ్యోతి ప్రజ్వలన చేశారు 2005: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసినందుకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ పురస్కారం. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఆసుపత్రికి మినహా పెద్దగా బయటకు రాలేదు. 2016: జూన్ 3న (అమెరికా కాలమానం) 74వ ఏట మరణం. -
ముస్లింల సంక్షేమానికి పెద్దపీట
కొల్లాపూర్: ముస్లింల సంక్షేమానికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని.. వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని జామా మజీద్‌లో ముస్లింలకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రి జూపల్లిని జామా మజీద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. షాదీ ముబారక్ పేరుతో ఐదేళ్ల కాలంలో లక్ష వివాహాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇప్పటివరకు షాదీ ముబారక్ ద్వారా 16వేల మంది వివాహాలకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. రూ.1105 కోట్ల వ్యయంతో ముస్లిం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొం దిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ లౌకిక విధానాలను కొనసాగిస్తుందని అన్నా రు. అన్ని మతాలు, సంప్రదాయాలను గౌరవించే పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. భవిష్యత్‌లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి ఇదే పంథాను కొనసాగిస్తారని వివరించారు. ముస్లింలు చదువులో రాణించాలని, ప్రతి పిల్లాడిని చదివించాలని డిప్యూటీ సీఎం సూచించారు. విద్యారంగంలో రాణించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల సాధించవచ్చన్నారు. ప్రజారంజక పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఆఫీసాహెబ్, ఆరీఫ్ సుతారీ, ఎంపీపీ నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, టీఆర్ఎస్ నాయకులు జూపల్లి రామారావు, నర్సింహా రావు, బాలస్వామి, మేకల రాముడుయాదవ్, వెంకటస్వామిగౌడ్, రహీంపాష, హసన్ తదితరులు పాల్గొన్నారు. ఖాదర్‌బాషా దర్గా సందర్శన కొల్లాపూర్ పట్టణం సమీపంలోని ఖాదర్‌బాషా దర్గాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సందర్శించారు. దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ మజీద్ కమిటీ నాయకులు డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. టెలీహెల్త్ సెంటర్ ప్రారంభం కొల్లాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన టెలీహెల్త్ సెంటర్‌ను మహిమూద్ అలీ ప్రారంభించారు. టెలీహెల్త్ సెంటర్లో రోగులను నిపుణులైన వైద్యులు టెలిఫోన్ ద్వారా వైద్య సేవలందిస్తారని.. అవసరమైన మందులను, చికిత్సల వివరాలను సూచిస్తారని వివరించారు. -
అలీ పంచ్‌కు యాభై ఏళ్లు!
బయోగ్రఫీ ఫస్ట్ రౌండ్లోనే తన నాకౌట్‌కు నేలకొరిగిన సోనీ లిస్టన్‌ను ‘గెటప్ అండ్ ఫైట్’ అని రెచ్చగొడుతున్న బాక్సింగ్ ఛాంపియన్ మహ్మద్ అలీ (1965 మే 25) యాభై ఏళ్ల క్రితం. 1965 మే 25 యూఎస్‌లోని మెయిన్ స్టేట్. యాడ్రోస్స్కాజిన్ కౌంటీ. లూయిస్టన్ సిటీ. అక్కడ జరుగుతోంది మ్యాచ్. మహ్మద్ అలీకి సోలీ లిస్టన్కి మధ్య! నిజానికది మ్యాచ్ కాదు. రీమ్యాచ్. అంతకుముందు ఏడాది బోస్టన్‌లో నవంబరులో జరగవలసి ఉండి, అలీకి అత్యవసర హెర్నియా ఆపరేషన్ కారణంగా వాయిదా పడిన మ్యాచ్. లూయిస్టన్ బరిలో ఫస్ట్ రౌండ్లోనే అలీ పంచ్‌కు లిస్టన్ నేలపై వెల్లకిలా పడ్డాడు. ఇరవై సెకన్ల వరకు లిస్టన్ పైకి లేవలేకపోయాడు. ‘‘గెటప్ అండ్ ఫైట్ సక్కర్’ అని అలీ ఘీంకరిస్తూనే ఉన్నాడు. ఊహు. లిస్టన్లో ఓపిక లేదు. రిఫరీ జెర్సీ జో అలీని విజేతగా ప్రకటించాడు. అలీ విన్నింగ్ పంచ్‌ని మీడియా ‘ఫాంటమ్ పంచ్’ గా అభివర్ణించింది. ఫాటమ్ అంటే ఊహాత్మకం అని. అలీ పంచ్ ఎంత నిజమో, ఆ పంచ్‌ని ఆ క్షణంలో ఎవరూ చూడకపోవడమూ అంతే నిజం. మొత్తానికైతే లిస్టన్ నాకౌట్ అయ్యాడు. 2015 మే 25 అలీ పంచ్‌కి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా లూయిస్టన్ సిటీ బరిలో నిన్న రాత్రి ‘రైజింగ్ అలీ’ అనే 27 నిమిషాల డాక్యుమెంటరీ ప్రీమియర్ షో ప్రదర్శన జరిగింది. దీని నిర్మాత చార్లీ హెవిట్. 68 ఏళ్ల చార్లీ జీవితకాలంలో ఎక్కువ భాగం న్యూయార్క్, పోర్ట్లాండ్ సిటీల మధ్య తిరగడంతోనే సరిపోయింది. బాల్యం గడిచింది మాత్రం లూయిస్టన్‌లో. అందుకే ఆ సిటీ అంటే అతడికి అంత ప్రేమ. మరి ఆయన తన డాక్యుమెంటరీకి ‘రెయిజింగ్ అలీ’ అని పేరు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పటికీ అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు ‘‘ఇక్కడే కదా అలీ తన ఫాంటమ్ పంచ్ ఇచ్చింది’’ అని గైడ్లను, స్థానికులను అడుగుతుంటారట. ఆ బాక్సింగ్ బరిని ఫోటోలు తీసుకుంటుంటారట. లూయిస్టన్ అనగానే అందరికీ అలీ గుర్తొస్తున్నాడు కాబట్టి, అలీ అనగానే లూయిస్టన్ గుర్తొచ్చేలా ఈ పేరు పెట్టారు చార్లీ. అందుకే మనకు ‘రెయిజింగ్ అలీ’ టైటిల్ కింద ‘ఎ లూయిస్టన్ స్టోరీ’ అనే సబ్ టైటిల్ కనిపిస్తుంది. అలీ బ్యాగ్రౌండ్ మహమ్మద్ అలీ మన దేశపు అలీ అనిపిస్తాడు. కానీ అమెరికన్. అలీ అలియాస్ కాస్సియెస్ మార్సెలస్ క్లే తొలి ఫైట్ అతడి 22వ యేట 1964 ఫిబ్రవరిలో సోనీ లిస్టన్తో జరిగింది. ఆ ఫైట్ లో అతడు లిస్టన్‌పై విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ యోధుడిగా టైటిల్ గెలిచాడు. అదే ఏడాది తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ‘మహమ్మద్ అలీ’ అనే టైటిల్‌నీ ఎంతో గర్వంగా ధరించాడు. బాక్సింగ్ టైటిల్ అతడిని జగదేకవీరుడిని చేస్తే, భక్తితో స్వీకరించిన ‘అలీ’ అన్న టైటిల్ అతడిని జగద్విదితం చేసింది. అయితే ఇస్లాం మతాన్ని స్వీకరించినందుకు క్రైస్తవ మూలాలు ఉన్న ఈ ‘త్రీ-టైమ్’ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్.. సంప్రదాయవాదుల ఆధ్యాత్మిక ముష్టి ఘాతాలను ఏళ్లపాటు ఎదుర్కొనవలసి వచ్చింది. జాతివివక్ష అన్నది అలీతో పాటు దెయ్యపు నీడలా ఎదిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొని లైట్ హెవీ వెయిట్ చాంపియన్‌గా బంగారు పతకంతో సంతోషంగా తిరిగి వచ్చిన క్లే (అలీ) కి అమెరికాలో వివక్ష మాత్రమే స్వాగతం పలికింది. విజేతను ప్రశంసించడం పోయి, పట్టనట్టు ఉండిపోవడం అతడినేమీ కలిచివేయలేదు కానీ, ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఒక పరిణామం అతడికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. క్లే హాజరైన ఓ విందు వేడుకలో అతడికి వడ్డించేందుకు అక్కడివారు నిరాకరించడంతో క్లే బయటికి వచ్చి ఎప్పుడూ తన వెంట ఉంచుకునే ఒలింపిక్ పతకాన్ని తీసి ఓహియో నదిలోకి విసిరికొట్టాడు. తనను గౌరవించని దేశంలో ఆ దేశం తరఫున సాధించిన పతకాన్ని గౌరవించడం తనకు అవమానకరం అని అతడు భావించాడు కనుకే అలా చేశాడు. అలీ దేవుడికి తప్ప మరెవరికీ కట్టుబడి లేడు. అదే ఆయన్ని అనేకసార్లు చిక్కుల్లో పడేసింది. వియత్నాం యుద్ధ సమయంలో యు.ఎస్. ఆర్మీ నుంచి అలీకి ‘కన్స్క్రిప్షన్’ నోటీసు వచ్చింది... వెంటనే వచ్చి యుద్ధంలో చేరమని. అలీ తిరస్కరించాడు. జాతి గర్వించే ఒక క్రీడాకారుడిగా కన్స్క్రిప్షన్ను తిరస్కరించే హక్కు అతడికి ఎలాగూ ఉంటుంది. అయితే తన మత నిబంధనలు ఏ విధమైన హింసనూ అనుమతించవన్న కారణం చూపి సైన్యంలో చేరడానికి అతడు నిరాకరించడంతో అమెరికా ఆగ్రహించింది. అతడికి పది వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. తర్వాత అలీ తరఫున వచ్చిన అభ్యర్థనలను మన్నించి కారాగారవాసాన్ని రద్దు చేసినప్పటికీ అతడి బాక్సింగ్ టైటిల్‌ను వెనక్కు తీసేసుకుంది. బాక్సింగ్ లెసైన్స్నీ (తాత్కాలికంగా) లాగేసుకుంది. అలీ తన నలభయ్యవ యేట 1981లో బాక్సింగ్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మూడేళ్లకు వైద్యులు అతడిలో పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు. బాక్సింగ్‌లో తలకు అయిన గాయాల కారణంగా వచ్చిన వ్యాధి అది. అలీ వైవాహిక జీవితం కూడా నాలుగు పెళ్లిళ్లతో నలతకు గురయినట్లే ఉంది. ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు తండ్రి అయిన అలీ ప్రస్తుతం యు.ఎస్. కెంటకీలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. పేరు : మహ్మద్ అలీ (73) ఇతర పేర్లు : ది గ్రేటెస్ట్, ది పీపుల్స్ ఛాంపియన్, ది లువీజా లిప్ ప్రఖ్యాతి : బాక్సింగ్‌లో హెవీవెయిట్ వరల్డ్ చాంపియన్ ఎత్తు 6 అ. 3 అం. మొత్తం ఫైట్లు 61 గెలిచినవి 56 ఓడినవి 5 మహ్మద్ అలీ వ్యక్తిత్వం భక్తిపరుడు విలువలను గౌరవిస్తాడు. మృదుస్వభావి ముక్కోపి కూడా భావోద్వేగాలు ఎక్కువ మితభాషి అలీ ప్రత్యర్థులలో ఐదుగురు సోనీ లిస్టన్ ఫ్లాయిడ్ పాటర్సన్ హెన్రీ కూపర్ లియాన్ స్పింక్స్ జో ఫ్రేజియర్ మహ్మద్ అలీపై వచ్చిన పాపులర్ సాంగ్ ‘హి ఫ్లోట్స్ లైక్ ఎ బటర్‌ఫ్లై, హి స్టింగ్స్ లైక్ ఎ బీ..’ -
మహమ్మదాలీని మరిపించాడు
-
మేవెదర్ మహమ్మదాలీని మరిపించాడు: చిరంజీవి
బాక్సింగ్ చరిత్రలో ఎంతో హైప్ క్రియేట్ చేసిన మేవెదర్, పాకియో పోరాటంపై ఇండియా బాక్సింగ్ మాజీ కోచ్ చిరంజీవి పెదవి విప్పారు. మేవెదర్ డిఫెన్స్ బాగుందని, ప్రత్యర్థి పంచ్‌లకు ఏమాత్రం అందకుండా కోర్టంతా కలియదిరుగుతూ ప్రఖ్యాత మహ్మదాలీని మరిపించాడని చిరంజీవి అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇద్దరు గొప్ప బాక్సర్లు మహమ్మదలీ, టైసన్‌లను మీడియా హైప్‌తో మేవెదర్ మించిపోయాడని ఆయన తెలిపారు. ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఈ బౌట్‌ని ఆదరించిన బాక్సింగ్ లవర్స్‌కు థాంక్స్ చెప్పాడు మేవెదర్. పాయింట్ల తేడాలో ఓడిపోయినప్పటికీ, మెనీ పాకియోలో మంచి బాక్సర్ ఉన్నాడని ప్రశంసలు కురిపించాడు. అతడిని అంత ఈజీగా ఓడించలేనని తను వేసిన అంచనా నిజమైందని ఫ్లాయిడ్ మేవెదర్ చెప్పాడు. ఈ పోరాటంలో తానే గెలిచినట్టు మెన్నీ పాకియో చెప్పుకున్నాడు. తను కొడుతున్న పంచ్‌లను తప్పించుకునేందుకు మేవెదర్ కోర్టంతా కలియదిరిగాడని... తను గెలిచినట్టు చెప్పుకునేందుకు ఇది చాలని అన్నాడు పాకియో. మొత్తానికి ఇది మంచి ఫైట్ అని పోటీ అనంతరం పాకియో సమర్థించుకున్నాడు. -
బాక్సర్‌గా మారిన చాక్లెట్ బోయ్
-
క్రీడల్లో రాణిస్తే ప్రోత్సాహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించిన తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించేలా చూస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఫౌండేషన్, షాట్‌కాన్ కరాటే అకాడమీ, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహించిన తైక్వాండో గ్రేట్ కిక్స్ విన్యాసానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది రికార్డు విజేతలకు డిప్యూటీ సీఎం సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండోకు క్రీడల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ సమాజం రేపటి విశ్వంతో పోటీపడుతుందన్నారు. విశ్వవ్యాప్తమైన మార్షల్ ఆర్ట్స్‌లో నగరవాసులు రాణించాలన్నారు. ఒక గంటలో కాళ్లతో 54,127 కిక్స్‌తో గిన్నిస్‌బుక్‌లో కొత్త రికార్డును నమోదు చేశారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి మాట్లాడుతూ తమ క్రీడాకారులు నెలకొల్పిన రికార్డును నమోదు చేసినట్లు గిన్నిస్‌బుక్ ధ్రువీకరణ పత్రాలు పంపారని చెప్పాడు. సభ ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వి.నరేందర్, బి. కృష్ణగౌడ్, ఎ. భరత్, ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాతలు
సాధారణంగా క్రీడాకారులంటేనే పోరాటయోధులు. ఒక మ్యాచ్‌లో లేదా టోర్నీలో ఓడిపోయినా నీరు గారిపోరు.. కసితో మళ్లీ బరిలోకి దిగుతారు. ఓటమిని జీవన్మరణ సమస్యగా తీసుకుని తాము అనుకున్నది సాధిస్తారు. అయితే ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ స్టార్లు కొందరు నిజ జీవితంలోనూ జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడినా, వాటిని అధిగమించి మళ్లీ మైదానంలో సత్తా చాటారు. మరికొందరు రిటైర్మెంట్ తర్వాత వ్యాధుల బారిన పడి, వాటిని అధిగమించారు. కొందరైతే తాము అనుభవించిన బాధలు ఎదుటివాళ్లు పడొద్దన్న ఉద్దేశంతో చారిటీలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి... - శ్యామ్ తిరుక్కోవళ్లూరు యువరాజ్ క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తూ క్యాన్సర్ బారిన పడిన ఏకైక క్రికెటర్ యువరాజ్.. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ కణితిగా పరీక్షల్లో తేలింది. యువరాజ్ ఎడమ ఊపిరితిత్తిలో కణితి ఉందని గుర్తించడంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లి కీమో థెరపీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇండియానాలోనూ చికిత్స పొందాడు. 2012లో పూర్తిగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఐపీఎల్ ఏడో సీజన్లో రాణించాడు. మొత్తానికి రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న యువరాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక యువరాజ్ ‘యు వియ్ కెన్’ పేరుతో క్యాన్సర్ చారిటీని ఏర్పాటు చేశాడు. ఈ చారిటీ ద్వారా క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నాడు. టిమ్ హోవార్డ్ అమెరికా స్టార్ గోల్ కీపర్. సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియంతో మ్యాచ్‌లో 16 గోల్ ప్రయత్నాలను అడ్డుకుని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ గోల్‌కీపర్‌కు సాధ్యం కాని రీతిలో గోల్‌పోస్ట్ దగ్గర అద్భుతమైన విన్యాసాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా చిత్తయినా... బెల్జియం ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు అతను చేసిన విన్యాసాలు చూసిన వారేవరికైనా సూపర్మ్యాన్లా కనిపించాడు. టిమ్ హోవార్డ్ అద్భుత ప్రదర్శనకు 9 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన టోరెట్టె సిండ్రోమే కారణం. ఈ సిండ్రోమ్ బారిన పడటం వల్ల హోవార్డ్‌కు వెంటనే స్పందించే లక్షణాలు వచ్చాయని న్యూరో స్పెషలిస్టులు చెబుతున్నారు. మెదడులో న్యూరో సెక్రియాట్రిక్ రుగ్మతతో బాధపడిన హోవార్డ్, ఆ తర్వాత దానిని అధిగమించాడు. టోరెట్టె సిండ్రోమ్ నుంచి కోలుకుని గోల్‌కీపర్‌గా రాణించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ వల్లే అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ప్రపంచకప్‌లో హోవార్డ్ అద్భుత ప్రదర్శన అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆకట్టుకోవడమే కాదు.. ఆయన నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌తో అమెరికా ఫుట్‌బాల్‌కు నయా స్టార్ దొరికాడు. మార్టినా నవ్రతిలోవా టెన్నిస్ దిగ్గజాల్లో మార్టినా నవ్రతిలోవా కూడా ఒకరు. ఒకప్పుడు అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన నవ్రతిలోవా.. మార్టినా హింగిస్ లాంటి టెన్నిస్ స్టార్లకు ఆదర్శం. ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న ఈ మాజీ చెక్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి బ్రెస్ట్ కాన్సర్ బారిన పడింది. నాలుగేళ్ల కిందట (2010లో) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ సమస్య నుంచి బయటపడిన మార్టినా నవ్రతిలోవా అందరికీ ఆదర్శంగా నిలిచింది. విల్మా రుడాల్ఫ్ ఈమె జీవితమే ఒక పాఠం.. చిన్నతనంలో పోలియో బారిన పడింది. 12 ఏళ్ల వయసులో రుడాల్ఫ్ కోరింత దగ్గు, తీవ్ర జ్వరం, తట్టు ఇలా అనారోగ్యం నుంచి బయటపడి చివరికి అథ్లెట్‌గా తానేంటో నిరూపించుకుంది. పోలియో కారణంగా ఎడమ కాలులో తేడా ఉండటంతో దాన్ని సరిచేసుకుని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటింది. 1960 ఒలింపిక్స్‌లో రుడాల్ఫ్ మూడు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా అందరి మన్ననలు పొందిన రుడాల్ఫ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. వీనస్ విలియమ్స్ అమెరికా టెన్నిస్ బ్యూటీ... తన చెల్లెలు సెరెనా విలియమ్స్‌తో కలసి టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించింది. 2000 నుంచి 2010 వరకు టెన్నిస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వీనస్.. జగ్రెన్స్ సిండ్రోమ్ అనే అరుదైన స్వయం నిరోధిత లోపంతో బాధపడింది. ఆయాసం, కీళ్లనొప్పి కారణంగా 2011లో యూఎస్ ఓపెన్ మధ్యలోనే నిష్ర్కమించింది. జగ్రెన్స్ నుంచి బయటపడిన ఈ అమెరికా స్టార్.. 2012లో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సెరెనాతో కలసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అదే ఏడాది లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. మళ్లీ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసేందుకు ఈ బ్లాక్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. లో గెహ్రాగ్ అమెరికాకు చెందిన అద్భుతమైన బేస్‌బాల్ ఆటగాడు. అమ్యోట్రోఫిక్ లాటరల్ స్ల్కేరోసిస్(ఏఎల్ఎస్) కారణంగా 37 ఏళ్లకే కన్నుమూసిన గెహ్రాగ్.. తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలోనే బయట పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే గెహ్రాగ్ మాత్రం అలా చేయలేదు. ఏఎల్ఎస్ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అంతా దీన్ని లో గెహ్రాగ్ వ్యాధి అని పిలుస్తుంటారు. అంతేకాదు తనకు వ్యాధి ఉందన్న సంగతిని బయటపెట్టిన తొలి క్రీడాకారుడు కూడా గెహ్రాగే. మొహమ్మద్ అలీ అమెరికాకు చెందిన 72 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ.. కెరీర్ ముగిశాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డాడు. మూడుసార్లు హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన అలీలో తొలిసారిగా 1981లో పార్కిన్సన్ లక్షణాలు కనిపించాయి. అయితే మూడేళ్ల తర్వాత (42 ఏళ్ల వయసులో) అది పార్కిన్సనే అని డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అప్పటికే బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన బాక్సింగ్ దిగ్గజం ఈ వ్యాధిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. 30 ఏళ్లుగా పార్కిన్సన్తో పోరాడుతున్న అలీ తనలా వేరేవాళ్లు ఈ వ్యాధి బారిన పడకుండా... 1997లో పార్కిన్సన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. వ్యాధుల బారిన పడిన ఇతర ప్లేయర్లు... అర్థర్ యాష్ (టెన్నిస్)-ఎయిడ్స్/హెచ్ఐవీ కరీం అబ్దుల్ జబ్బార్ (బాస్కెట్‌బాల్)-లుకేమియా -
ముస్లింలకు 12 % రిజర్వేషన్లు
మెదక్: ముస్లింల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన, స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లౌకికవాద దృక్ఫథంతో అటు హిందువులకు, ఇటు ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం పలు పథకాలు రూపొందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మైనార్టీల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్‌బోర్డు భూములు చాలా మట్టుకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. వీటి ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు జ్యుడీషియల్ అధికారులు ఇచ్చేందుకు ప్ర యత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ముస్లింలకు పవిత్రమైన రం జాన్ పండగ, హిందువులకు సంబరమైన బో నాల పండగలు వచ్చాయన్నారు. ఈ రెం డింటిని ప్రభుత్వ పండుగలుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. 70 ఏళ్ల లాల్‌దర్వాజా బోనాల చరిత్రలో గతంలో నిజాం, నేడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాత్రమే పాల్గొన్నారన్నారు. బోనాలు, రంజాన్ పండుగల నిర్వహణ కోసం మెదక్ జిల్లాకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జె డ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ విజయలక్ష్మి, డీఎస్పీ గోద్రూ, కౌన్సిలర్లు సోహైల్, బట్టి సులోచన రామ్మోహన్, సలాం, జెల్ల గాయత్రి, పలువురు వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.