
మేవెదర్ మహమ్మదాలీని మరిపించాడు: చిరంజీవి
బాక్సింగ్ చరిత్రలో ఎంతో హైప్ క్రియేట్ చేసిన మేవెదర్, పాకియో పోరాటంపై ఇండియా బాక్సింగ్ మాజీ కోచ్ చిరంజీవి పెదవి విప్పారు. మేవెదర్ డిఫెన్స్ బాగుందని, ప్రత్యర్థి పంచ్‌లకు ఏమాత్రం అందకుండా కోర్టంతా కలియదిరుగుతూ ప్రఖ్యాత మహ్మదాలీని మరిపించాడని చిరంజీవి అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇద్దరు గొప్ప బాక్సర్లు మహమ్మదలీ, టైసన్‌లను మీడియా హైప్‌తో మేవెదర్ మించిపోయాడని ఆయన తెలిపారు.
ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఈ బౌట్‌ని ఆదరించిన బాక్సింగ్ లవర్స్‌కు థాంక్స్ చెప్పాడు మేవెదర్. పాయింట్ల తేడాలో ఓడిపోయినప్పటికీ, మెనీ పాకియోలో మంచి బాక్సర్ ఉన్నాడని ప్రశంసలు కురిపించాడు. అతడిని అంత ఈజీగా ఓడించలేనని తను వేసిన అంచనా నిజమైందని ఫ్లాయిడ్ మేవెదర్ చెప్పాడు.
ఈ పోరాటంలో తానే గెలిచినట్టు మెన్నీ పాకియో చెప్పుకున్నాడు. తను కొడుతున్న పంచ్‌లను తప్పించుకునేందుకు మేవెదర్ కోర్టంతా కలియదిరిగాడని... తను గెలిచినట్టు చెప్పుకునేందుకు ఇది చాలని అన్నాడు పాకియో. మొత్తానికి ఇది మంచి ఫైట్ అని పోటీ అనంతరం పాకియో సమర్థించుకున్నాడు.