indian boxing coach
-
భారత మహిళల బాక్సింగ్ కోచ్‌గా ఖమర్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన కోల్‌కతా బాక్సర్ అలీఖమర్... జాతీయ మహిళల జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి అలీఖమర్ను కోచ్‌గా నియమిస్తున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రస్తుత కోచ్ శివ్ సింగ్ స్థానంలో అలీ ఖమర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2002 మాంచెస్టర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లైట్ ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో అలీ ఖమర్ స్వర్ణాన్ని గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇతనికి జాతీయ బాక్సింగ్ క్యాంపులో అసిస్టెంట్ కోచ్‌గా ఏడాదికి పైగా పనిచేసిన అనుభవముంది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ మహిళల జట్టుకు మూడేళ్ల పాటు తన సేవలందించాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన అలీఖమర్... 38 ఏళ్ల వయస్సులోనే భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు ఈ పని చేసిన వారిలో ఇతనే పిన్న వయస్కుడు. గతంలో కోచ్‌లుగా పనిచేసిన అనూప్ కుమార్, గుర్బక్ష్ సింగ్ సంధు 50 ఏళ్ల పైబడిన తరువాతే ఈ బాధ్యతలు స్వీకరించారు. -
మహమ్మదాలీని మరిపించాడు
-
మేవెదర్ మహమ్మదాలీని మరిపించాడు: చిరంజీవి
బాక్సింగ్ చరిత్రలో ఎంతో హైప్ క్రియేట్ చేసిన మేవెదర్, పాకియో పోరాటంపై ఇండియా బాక్సింగ్ మాజీ కోచ్ చిరంజీవి పెదవి విప్పారు. మేవెదర్ డిఫెన్స్ బాగుందని, ప్రత్యర్థి పంచ్‌లకు ఏమాత్రం అందకుండా కోర్టంతా కలియదిరుగుతూ ప్రఖ్యాత మహ్మదాలీని మరిపించాడని చిరంజీవి అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇద్దరు గొప్ప బాక్సర్లు మహమ్మదలీ, టైసన్‌లను మీడియా హైప్‌తో మేవెదర్ మించిపోయాడని ఆయన తెలిపారు. ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఈ బౌట్‌ని ఆదరించిన బాక్సింగ్ లవర్స్‌కు థాంక్స్ చెప్పాడు మేవెదర్. పాయింట్ల తేడాలో ఓడిపోయినప్పటికీ, మెనీ పాకియోలో మంచి బాక్సర్ ఉన్నాడని ప్రశంసలు కురిపించాడు. అతడిని అంత ఈజీగా ఓడించలేనని తను వేసిన అంచనా నిజమైందని ఫ్లాయిడ్ మేవెదర్ చెప్పాడు. ఈ పోరాటంలో తానే గెలిచినట్టు మెన్నీ పాకియో చెప్పుకున్నాడు. తను కొడుతున్న పంచ్‌లను తప్పించుకునేందుకు మేవెదర్ కోర్టంతా కలియదిరిగాడని... తను గెలిచినట్టు చెప్పుకునేందుకు ఇది చాలని అన్నాడు పాకియో. మొత్తానికి ఇది మంచి ఫైట్ అని పోటీ అనంతరం పాకియో సమర్థించుకున్నాడు.