ముస్లింలకు 12 % రిజర్వేషన్లు
మెదక్: ముస్లింల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన, స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లౌకికవాద దృక్ఫథంతో అటు హిందువులకు, ఇటు ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం పలు పథకాలు రూపొందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మైనార్టీల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్‌బోర్డు భూములు చాలా మట్టుకు అన్యాక్రాంతమయ్యాయన్నారు.
వీటి ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు జ్యుడీషియల్ అధికారులు ఇచ్చేందుకు ప్ర యత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ముస్లింలకు పవిత్రమైన రం జాన్ పండగ, హిందువులకు సంబరమైన బో నాల పండగలు వచ్చాయన్నారు. ఈ రెం డింటిని ప్రభుత్వ పండుగలుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. 70 ఏళ్ల లాల్‌దర్వాజా బోనాల చరిత్రలో గతంలో నిజాం, నేడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాత్రమే పాల్గొన్నారన్నారు. బోనాలు, రంజాన్ పండుగల నిర్వహణ కోసం మెదక్ జిల్లాకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న
డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్
మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జె డ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీ ఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ విజయలక్ష్మి, డీఎస్పీ గోద్రూ, కౌన్సిలర్లు సోహైల్, బట్టి సులోచన రామ్మోహన్, సలాం, జెల్ల గాయత్రి, పలువురు వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.