R & B
-
సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. -
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
ఖమ్మం దారి..నరకంలో సవారీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రవి కుటుంబం సంక్రాంతి పండగను సొంతూళ్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాజమండ్రి బయలుదేరింది. భోగి మంటలు వేసే సమయానికి గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతో ముందురోజు రాత్రి 7.45కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. కానీ రాజమండ్రి చేరుకునేసరికి ఉదయం 8 దాటింది. ప్రయాణ సమయం ఏకంగా 12 గంటలకుపైగా కొనసాగింది. దీంతో తిరుగు ప్రయాణంలో రిజర్వ్ చేసుకున్న ఆర్టీసీ టికెట్‌ను రద్దు చేసుకుని మరీ ప్రైవేటు బస్సు ఎక్కారు. తిరుగు ప్రయాణం రాత్రి 10కి ప్రైవేటు బస్సులో బయలుదేరారు. ఉదయం 6.15కు లక్డీకాపూల్ చేరుకున్నారు. ఎందుకీ తేడా.. ఆర్టీసీ బస్సు ప్రధాన నినాదం భద్రత. అంతర్గత నినాదం పొదుపు మంత్రం. ఒకటి ప్రయాణికులకు క్షేమదాయకమైతే.. రెండోది సంస్థకు లాభసాటి. నాన్‌స్టాప్‌గా తిరిగే బస్సులను వీలైనంత దగ్గరి దారిలో పంపటం ద్వారా డీజిల్ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ ఆలోచిస్తుంది. ఇందుకోసం సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులను దగ్గరి దారిలో గమ్యం పంపే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే నాన్‌స్టాప్ బస్సులను ఈ ఉద్దేశంతోనే ఖమ్మం మీదుగా గోదావరి జిల్లాలోకి ప్రవేశించే కొవ్వూరు మార్గాన్ని ఎంచుకుంది. విజయవాడ మీదుగా కంటే ఇది దగ్గరిదారి కావటమే కారణం. ఇక్కడే సమస్య ఎదురైంది. గత కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవటంతో ఈ దారి బాగా దెబ్బతిన్నది. మెయింటెనెన్స్ పనులు నామమాత్రంగా ఉండటంతో ఇటీవలి భారీ వర్షాలకు పెద్ద గోతులు పడి మారుమూల పల్లె దారికంటే హీనంగా తయారైంది. ముఖ్యంగా వైరా–సత్తుపల్లి మధ్య దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్డుమీద ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. మళ్లీ ఏపీ పరిధిలో జంగారెడ్డి గూడెం–రాజమండ్రి మధ్య ఇలాగే తయారైంది. ఇతర కొన్ని చోట్ల కూడా కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా మారింది. దీంతో బస్సులు బాగా నెమ్మదిగా వెళ్తే తప్ప క్షేమంగా గమ్యం చేరని పరిస్థితి. ఏమాత్రం వేగంగా వెళ్లినా అదుపుతప్పి బోల్తా కొట్టే ప్రమాదం ఉంది. ఈ దారిలో ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో ఇలాగే బోల్తాపడ్డ లారీలు కనిపిస్తున్నాయి. దీంతో నెమ్మది ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు 8 గంటల సమయం పడుతుండగా, ఖమ్మం మీదుగా 12 గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో నాన్‌స్టాప్ సర్వీసులకు ఇదే రోడ్డు సూచించడంతో ఆ బస్సులో వెళ్లివచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ప్రయాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండగా మరోవైపు గోతుల వల్ల వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలి సంక్రాంతి ప్రయాణాలు వారికి ప్రత్యక్ష నరకాన్ని చవిచూపాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసుకున్నవారిలో కొందరు వెళ్లేప్పుడు దుస్థితి చూసి వచ్చేప్పుడు టికెట్ రద్దు చేసుకుని విజయవాడ మీదుగా వచ్చే బస్సులను ఆశ్రయించటం విశేషం. ఆ రోడ్డుకు ఆ దుస్థితి ఎందుకు.. రెండేళ్ల క్రితం వరకు ఇది రాష్ట్ర రహదారి. ఆ సమయంలో కూడా దీనిపై దృష్టి పెట్టకపోవటంతో ఇది గోతులుగానే ఉండేది. కానీ అడపాదడపా చేపట్టే రెన్యూవల్స్‌తో కాస్త మెరుగుపరుస్తూ నెట్టుకొచ్చేవారు. రెండేళ్ల క్రితం దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించారు. అంటే నేషనల్ హైవే విభాగం దీన్ని విస్తరించి మెరుగు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఎన్నికల సమయం కావటంతో దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ దీన్ని పెండింగ్‌లో ఉంచింది. జాతీయ రహదారిగా ప్రకటించినందున రాష్ట్ర అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అసలు మరమ్మతులే లేకపోవటంతో అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఆ దారిగుండా వెళ్లే వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. త్వరలో పనులు రోడ్లు, భవనాల శాఖ అధికారులు జాతీయ రహదారిగా డిక్లేర్ చేసినందున కొంతకాలంగా మేం మరమ్మతులు చేపట్టలేదు. జాతీయ రహదారిగా మార్చే పనిలో జాప్యం జరిగినందున ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెన్యూవల్స్ చేపట్టనున్నాం. రోడ్డు బాగా దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాం. దాదాపు రూ.7 కోట్లతో త్వరలో పనులు చేపడతాం ప్రత్యామ్నాయంపై దృష్టి: ఆర్టీసీ అధికారులు రాజమండ్రికి అది దగ్గరి దారి కావటంతో ప్రధాన సర్వీసులను అటుగా తిప్పుతున్నాం. కానీ రోడ్డు బాగా దెబ్బతిన్నందున ఇటు ప్రయాణికులకు ఇబ్బంది కావటంతోపాటు అటు బస్సులు దెబ్బతినే పరిస్థితి ఉంది. స్థానిక డిపో అధికారులతో చర్చించి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే దిశగా చర్యలు తీసుకుంటాం. -
సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి వివిధ శాఖలను తరలించనున్నారు.మొదటగా ఆర్ అండ్ బీ శాఖ తరలి వెళ్లనుంది.లాంఛనంగా బుధవారం ఆర్అండ్బీ కార్యాలయానికి రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వెళ్లారు.గురువారం నుంచి అక్కడికే రావాలని సిబ్బందికి ఆదేశాలు చేశారు.ఈ కార్యాలయంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీ ఉంది. ముందుగా మంత్రుల ఛాంబర్లను తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో మంత్రుల ఛాంబర్లు తరలిపోనున్నాయి. -
డివైడర్ లేక ప్రమాదాలు
సాక్షి, విజయనగరం రూరల్ : మండలంలోని చెల్లూరు–ముడిదాం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి ఇరువైపులా డివైడర్లు లేక ప్రమాదాలకు నిలయంగా మారింది. మండలంలోని చెల్లూరు నుంచి ముడిదాం, రీమాపేట గ్రామాల మీదుగా వీటీ అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్లు లేకపోవడంతో ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకోవడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం, సాలూరు, పార్వతీపురం ఒడిశాకు రోజూ వేలాది వాహనాలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే జాతీయ రహదారి, పట్టణ శివారు కావడం రోడ్డు చిన్నదైనా వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం నెలకోసారైనా మూడు కిలోమీటర్ల రోడ్డులో ఎక్కడోచోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండే విద్యార్థులు పాఠశాలలకు సైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించడంతో తల్లిదండ్రులు భయం భయంగానే పిల్లలను పాఠశాలలకు సాగనంపుతున్నారు. పాలకులు, ఆర్ ఆండ్ బి అధికారులు స్పందించి రోడ్డు డివైడర్ మంజూరు చేసి నిర్మించాలని ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ ప్రజలు కోరుతున్నారు. భయమేస్తోంది రోడ్డు ఇరుగ్గా ఉండటం, భారీ వాహనాలు, కార్లు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయమేస్తోంది. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే. చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటాలంటే మనిషి తోటు ఉండాల్సిందే. – తుపాకుల అప్పలరాజు, ప్రశాంతినగర్ డివైడర్లు ఏర్పాటు చేయాలి ముడిదాం, రీమాపేట, ప్రశాంతినగర్ గ్రామాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. ప్రశాంతినగర్ వద్ద భారీ వాహనాలు రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డుకు ఇరుకుగా ఉండటం, వాహనాలు అతివేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. – అలమండ అప్పలరాజు, మాజీ సర్పంచ్, ముడిదాం -
దేశానికి ఆదర్శం తెలంగాణ
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనను చూసి ప్రజలు మళ్లీ గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. నిజాంసాగర్ మండలం మాగి శివారులో ఈ నెల 13న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. జహీరాబాద్ పార్లమెంట్ æపరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నారాణయఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి 20 వేల మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, నేషనల్ హైవేల నిర్మాణానికి నిధులు రావాలంటే కేంద్రంలో తెలంగాణ ఎంపీల బలం ఎంతో అవసరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగి గ్రామానికి వస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట సీఎం సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి, కామారెడ్డి, జుక్కల్, నారాయణ ఖేడ్, అందోల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్‌షిందే, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, భరత్‌కుమార్, వెంకయ్య, భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఉన్నారు. -
రోడ్లకు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ అద్భుతమైన పనితీరు చూపుతున్నా నిధులలేమితో ఈ ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారేలా కనిపిస్తోంది. గతేడాది రూ.5,575 కోట్లు కేటాయించి ఈసారి రూ.2218.73 కోట్లతో సరిపెట్టింది. గతేడాది కాంట్రాక్టర్లకు చేసిన పనులకే బిల్లులు చెల్లించలేనంతగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత బడ్జెట్ లో రూ.5,575 కోట్లు కేటాయించినా వాస్తవానికి రూ.2,177 కోట్లు (ఇందులో రూ.1000 కోట్ల మేర అప్పులు) విడుదల చేసింది. మిగిలిన వాటికి అప్పు తెచ్చుకోమని చెప్పింది. మొత్తానికి ఈసారీ ఆర్ అండ్ బీకి అప్పులవేట తప్పేలా లేదు. ఈ నిధులపై ఆర్ అండ్ బీకి మరింత కష్టాలు తప్పవని శాఖ ఉద్యోగులూ వాపోతున్నారు. అద్దంలాంటి రోడ్లు ఉండాలన్న సీఎం నినాదం ఈ నిధులతో ఎలా సాకారమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర అవతరణ తర్వాత 3,155 కి.మీ.ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో 1,388 కి.మీల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీ.ల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయాల్సి ఉంది. -
నాసిరకం కేరాఫ్ ఆర్అండ్బీ
మధిర : నిర్మాణాల్లో నాణ్యతా లోపాలకు రోడ్లు, భవనాలశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన మధిరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం కోటిరూపాయలు నిధులు మంజూరు చేసింది. అయితే దీనికి ఓ కాంట్రాక్టర్ దక్కించుకొని, సబ్ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే నివసించే భవనమే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతాలోపాలతో నిర్మిస్తుండటం గమనార్హం. బేస్మెంట్ లెవెల్లో పిల్లర్స్‌కు ఇనుపచువ్వలు వంకరగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల భవన నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఈఈ గమనించి సిబ్బందిని మందలించారు. అంతేకాకుండా రాడ్ బైండింగ్ సక్రమంగా లేకపోతే భవనం పటుత్వం కోల్పోతుందని చెప్పారు. సరిచేసి పిల్లర్స్‌ను నిర్మించాలని ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది పాటించడం లేదు. ఇనుపచువ్వలు వంకరగానే ఉంచి పిల్లర్ నిర్మించడం కొసమెరుపు. అదేవిధంగా మధిర పట్టణంలోని నాలుగులైన్ల రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంబేడ్కర్ సెంటర్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఎత్తులో రింగు నిర్మించారు. దీనిని గమనించిన రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాఖ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్మించిన రింగును పగులగొట్టారు. రూ.2.06కోట్ల నిధులతో డివైడర్, సీసీరోడ్లు, రాతికట్టుబడికి ప్రతిపాదనలు పంపగా మంజూరైన నిధులతో నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారు. కోటిరూపాయల నిధులతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి బైపాస్‌రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఖమ్మంపాడు– తొండలగోపవరం, మీనవోలు–తొండలగోపవరం గ్రామాలకు రూ.5కోట్ల నిధులతో బీటీరోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇల్లూరు–ఖమ్మంపాడు గ్రామాల మధ్య రూ.15.50కోట్ల నిధులతో వైరానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మాటూరు గ్రామసమీపంలో రూ.96లక్షల నిధులతో కల్వర్టు నిర్మించనున్నారు. మండలంలో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల వద్ద పర్యవేక్షణ కొరవడింది. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీశాఖ అధికారుల పర్యవేక్షణలో మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో రూ.3.20లక్షల నిధులతో కోర్టు హాలు, న్యాయమూర్తి చాంబర్, అదనపు కోర్టు హాలు, అదనపు కోర్టు న్యాయమూర్తి చాంబర్లకు మరమ్మతులు చేపడుతున్నారు. అయితే కొద్దిరోజులకే మరమ్మతులకు గురికావడంతో ఈ విషయాన్ని మధిర కోర్టు న్యాయమూర్తి జిల్లాకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ క్రమంలో ఇటీవల జిల్లా కోర్టు న్యాయమూర్తి మధిర కోర్టులో జరిగిన పనులను పరిశీలించారు. న్యాయస్థానంలో జరిగే పనుల్లోనే నాణ్యత లోపిస్తే ఎలా అని.. ఆర్అండ్బీ అధికారులను హెచ్చరించారు. ఇలా నాణ్యతా లోపంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతాప్రమాణాల గురించి ప్రజలు ప్రశ్నిస్తే తమశాఖ మంత్రి జిల్లాకు చెందినవారేనని, తమకు ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మంత్రి రామన్నను కలిసిన ఎస్పీ
ఆదిలాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్నను శనివారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మంత్రితో సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డిలు ఉన్నారు. ఎస్పీకి అధికారులు, సంఘాల స్వాగతం.. నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను వివిధ శాఖల అధికారులు, పలు సంఘాల నేతలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఎస్పీని కలిసిన వారిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ ఫారుఖ్ అహ్మద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, జాగృతి కన్వీనర్ శ్రీనివాస్, రవికుమార్, తదితరులు ఉన్నారు. -
జిల్లాలో రోడ్లకు మహర్దశ..
ఖమ్మం జిల్లాలో రోడ్లకు త్వరలో మహర్దశ పట్టబోతుంది. ఆర్ అండ్ బీ సూపరిటెండెట్ ఇంజనీర్ ఎం. లింగయ్య గురువారం మండలంలో పర్యటించి,రోడ్లను పరిశీలించారు. అనంతరం విలేక ర్లతో మాట్లాడుతూ.. రూ.1400 కోట్లతో జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 8 మండలాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు 72 కి.మీ.మేర రెండు వరుసల రోడ్ల నిర్మాణం కోసం రూ.119 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని 24 ప్రధాన రహదారులను డబుల్ లైన్లగా మార్చేందుకు రూ.418 కోట్లు కేటాయించామని, వాటిలో 20 పనులకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నాబార్డు కింద ఏడు బ్రిడ్జ్‌లు,21 కి.మీల డబుల్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని,మార్చిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రణాళిక పద్దు కింద రూ.175 కోట్లతో జిల్లాలో 23 బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. -
అంతరం..అవాంతరం..!
- 16 రోడ్లకు పాతర ! - రేడియల్ రోడ్ల డీపీఆర్‌లు పక్కకు...! - ఆర్అండ్బి,హెచ్ఎండీఏల మధ్య దూరం - నిరుపయోగంగా‘జైకా’ మిగులు నిధులు - ఔటర్‌కు అనుసంధానం ఇప్పట్లో అసాధ్యమే సాక్షి, సిటీబ్యూరో: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఏకంగా 16 రేడియల్ రోడ్లకు పాతర వేసింది. ఓ విభాగం భూ సేకరణ చేస్తే... మరో విభాగం నిర్మాణం చేపట్టాలన్న నిబంధనను సాకుగా చేసుకొని ఎవరికి వారు భీష్మించుకోవడంతో రేడియల్ రోడ్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకొనేందుకు 373కి.మీ 33 రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 11 రోడ్ల నిర్మాణం పూర్తికాగా మరో 5 రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. అయితే మిగిలిన 16 రేడియల్ రోడ్ల విషయంలో హెచ్ఎండీఏ, ఆర్అండ్బి శాఖల మధ్య సమన్వయం లోపించడంతో అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి. హెచ్ఎండీఏ భూ సేకరణ చేస్తే తాము రోడ్లు నిర్మిస్తామని ఆర్ అండ్ బి దాటవేస్తోంది. భూ సేకరణకు తమవద్ద సిబ్బంది లేనందున ఆ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించాలని హెచ్ఎండీఏ సూచిస్తోంది. భూసేకరణ , నిర్మాణ బాధ్యతలను ఒకరికే అప్పగించనందునే సమస్యకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. 180 కి.మీ. నిడివిగల 16 రేడియల్ రోడ్లు నిర్మించేందుకు దాదాపు రూ.1470కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. 9 రోడ్లకు డీపీఆర్‌లు కూడా సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఆర్థిక ఆసరా ఉన్నా.. : ఔటర్‌కు అనుసంధానం చేస్తూ మిగిలిన 16 రేడియల్ రోడ్లను కూడా నిర్మించి నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్ఎండీఏ భావించింది. ఔటర్ రింగ్ రోడ్డు రెండో దశ-బి నిర్మాణం కోసం జైకా నుంచి తీసుకొన్న రూ.3123.52కోట్ల రుణంలో కొంత మిగులుబాటు లభించింది. ఈ నిధులతో 16 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ముందుకొచ్చినా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. అంతేగాకుండా రూ.1470కోట్లతో ఈ రోడ్లను నిర్మిస్తామని ప్రకటిస్తూ ఆర్అండ్ బి బడ్జెట్ నుంచే నిధులు వెచ్చించేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగినట్లు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రోడ్ల నిర్మాణాన్నిఅటకెక్కించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ వత్తిడిని తగ్గించడం అసాధ్యమని ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని రేడియల్ రోడ్లను నిర్మించడంపై సీఎం చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
అతుకులు.. గతుకులు
జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి రోడ్డు చరిత్ర సమస్తం అతుకు గతుకుల మయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. పల్లెసీమలు ప్రగతికి పట్టుగొమ్మలు అంటూ ఊదరగొట్టే పాలకులు గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయడం లేదు. అధికారులు పంపిన ప్రతిపాదనలు సైతం చెత్తబుట్టల్లో చేరిపోతున్నాయి. వెరసి ఈ రహదారుల్లో ప్రజలకు ‘నడక’యాతన తప్పడం లేదు. - అస్తవ్యస్తంగా గ్రామీణ రహదారులు - ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌లకు తక్కువగా నిధులు - ప్రతిపాదనలకే పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే - సోమశిలకు బ్యాక్ వాటర్ వస్తే 20 గ్రామాలకు ఇబ్బందులు - నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య పూర్తికాని రహదారి - అటకెక్కిన నంద్యాల - పలమనేరు నాలుగులేన్ల రహదారి సాక్షి కడప: పల్లె సీమలు ప్రగతిబాట పట్టాలంటే ప్రధానంగా రహదారులే కీలకం. గ్రామాలకు రోడ్డు మార్గం ఉంటే ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు.. ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరేందుకు మార్గం సుగమమవుతుంది. స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్లు దాటుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. ప్రత్యేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌అండ్‌బీకి నిధుల వరద కురిసింది. అప్పట్లో ప్రతి పల్లెకూ తారు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తారు రోడ్ల మరమ్మతులకు కూడా టీడీపీ సర్కార్ నిధులు విదల్చడం లేదని పలువురు వాపోతున్నారు. అనేక చోట్ల ఇప్పటికీ అతుకు గతుకుల రోడ్లల్లో ప్రయాణం సాగించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుమునుపే రోడ్డు పనులు పూర్తి చేసినా బిల్లులు రాక అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు బిల్లులను ప్రభుత్వానికి నివేదిస్తున్నా పూర్తి స్థాయిలో రావడం లేదు. పైగా జిల్లాలో అనేక చోట్ల రోడ్లు, కాజ్‌వేలకు ప్రతిపాదనలు పంపినా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతిపాదనలకు పరిమితమైన సోములవారిపల్లె కాజ్వే ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె కాజ్వే కూలిపోయి చాలా రోజులు అవుతునా ఇప్పటి వరకు ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పెన్నానదిపై సోములవారిపల్లె వద్ద కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు దిక్కుదివానం లేదు. కాజ్వే లేకపోవడంతో వాహనదారులతోపాటు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని మీనాపురం రోడ్డు కూడా అధ్వానంగా తయారైంది. ఇక్కడి రోడ్డుపై ప్రయాణించడం కష్టం కావడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలే రోడ్డుపై ఉన్న గులకరాళ్లను ఎత్తివేసుకుని వెళ్తున్నారు. సోమశిలకు పూర్తి నీరు వస్తే 20 గ్రామాలకు ఇక్కట్లు అట్లూరు మండల పరిధిలోని సగిలేరు లో లెవెల్ వంతెనతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్ 72 టీఎంసీలు ఉన్నప్పుడు సగిలేరు ప్రాజెక్టులోకి నీరు వచ్చి లోలెవెల్ కాజ్‌వేపై ప్రవహిస్తున్నాయి. దాదాపు రెండు అడుగుల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అట్లూరు మండలంలోని వేమలూరు, ముతుకూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లి, కమలకూరు పంచాయతీలలోని దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్‌వేపై నీరు ప్రవహిస్తున్న సమయంలో అట్లూరుకు రావాల్సి వస్తే ... ప్రజలు బద్వేలు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో 32 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే మండల కేంద్రానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కాజ్వే ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. సగంలోనే ఆగిపోయిన నందలూరు ఆర్ఎస్ రోడ్డు రాజంపేట పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పలు చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రత్యేకంగా సుండుపల్లి-పీలేరు మార్గంలో మెటల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. అలాగే నందలూరు-నాగిరెడ్డిపల్లె మధ్య నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు పూర్తి చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించి సగం వరకు మాత్రమే పూర్తి చేశారు. మిగతా సగం పూర్తి చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటకెక్కిన నాలుగులేన్ల రహదారి దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నంద్యాల-పలమనేరు మధ్య నాలుగు లేన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.1100 కోట్ల వ్యయంతో టెండర్ల వరకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టు అటకెక్కింది. నంద్యాల నుంచి కోవెలకుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల, కదిరి మీదుగా పలమనేరుకు కలిపి బెంగుళూరు జాతీయ రహదారికి కలిపేలా ప్రణాళిక రూపొందించారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్ విస్మరించింది. దానికి సంబంధించిన ఫైళ్లను పక్కన పడేశారు. తక్కువగా నిధులు జిల్లాలో పల్లె సీమల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి నిధులు సక్రమంగా రావడం లేదు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీరాజ్‌కు కూడా నిధులు విడుదల కాకపోవడంతో పనులకు బ్రేక్ పడుతోంది. చాలా చోట్ల గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కూడా బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులకు మోక్షం కల్పించేందుకు పాలకులు, అధికారులు తగినన్ని నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
గతుకులకూ.. అతుకుల్లేవ్!
అటకెక్కిన కొత్తరోడ్ల ప్రతిపాదనలు చిన్నచిన్న రిపేర్లూ చేయని పరిస్థితి జిల్లాలో రహదారి ప్రయాణం నరకయాతనే లోలెవల్ కాజ్వేలనూ పట్టించుకోని ప్రభుత్వం ఆర్అండ్బీ పరిధిలో 134 కిలోమీటర్ల మేరకు మట్టి, గ్రావెల్ రోడ్లు కంకర తేలిన రోడ్లు, మోకాలులోతు గుంతలు.. రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల మట్టిరోడ్ల దుస్థితి ఇది. ఈ రోడ్లలో ప్రయాణం నరకమే. ప్రభుత్వం వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. వర్షాలొస్తే తిప్పలు తప్పవు. నిధుల లేమితో జిల్లాలో కొత్త రోడ్ల ప్రతిపాదనలు అటకెక్కాయి. గతుకులకు అతుకులు పడే పరిస్థితీ లేకుండా పోయింది. తిరుపతి: జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మారుమూల గ్రామాల రోడ్లు రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. నిధుల లేమి.. అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులు, వాహనదారులకు శాపంగా మారుతోంది. గతుకుల రోడ్లకు అతకులూ లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయమవుతోంది. జిల్లాలోని కొన్ని గ్రామాలకు కాలిబాట కూడా లేదు. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలోని ఆవులనత్తంగేట్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు నెలల తరబడి సా..గుతూనే ఉన్నాయి. ఇక గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో పది గ్రామాలకు చెరువుకట్టలే రహదారులు. సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణం లో భాగంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో పలుచోట్ల కల్వర్టుల కోసం రోడ్డు తవ్వకాలు చేపట్టారు. ఆ రోడ్డుపనులు పూర్తి చేయలేదు. పలమనేరులో ఆర్‌అండ్‌బీకి సంబంధించి మొత్తం 550 కి.మీ మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో పనులు 10 కి.మీ మేర ప్రారంభమై పెండింగ్‌లో ఉన్నాయి. 13.8 కి.మీ ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలే దు. నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం పిళాసపాళెం రోడ్డు తవ్వేసి సుమారు ఐదేళ్లవుతున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో సిబ్బందికి, నిధులకు కొదవలేకపోయినా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయలేని వింత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో అధికంగా అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. అటవీశాఖ అనుమతిలో జాప్యం వల్ల రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదు. పూతలపట్టు, జీడీ నెల్లూరు, సత్యవేడు, పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నిధుల లేమితో రోడ్ల మరమ్మతులు అటకెక్కాయి. ఆయా నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షమొస్తే ‘మునకే’ జిల్లాలో వర్షాలొస్తే మునిగిపోయి, రాకపోకలు నిలిచిపోయే ప్రమాదమున్న లోలెవల్ కాజ్‌వేలు 32 ఉన్నాయి. వీటి స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుతం స్వర్ణము ఖి నదిపై తొట్టంబేడు మండలం కనపర్తి వద్ద వంతెన నిర్మా ణం పనులు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం వద్ద, వరదయ్యపాళెం మండలం సంతవేలూరు, చంద్రగిరి మండలం రంగంపేట-పుదిపట్ల మధ్య రోడ్ల నిర్మా ణ పనులు సాగుతున్నాయి. మిగిలిన చోట్ల లోలెవల్ కాజ్‌వేల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణాలకు అధికారులు ప్రతినెలా ప్రతి పాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదు. నిధుల లేమిని సాకుగా చెపుతూ కొత్త రోడ్ల నిర్మాణాలకు మొండిచెయ్యి చూపుతోంది. నిధుల లేమితో రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపాం.. జిల్లాలో గ్రావెల్, మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాం. లోలెవల్ కాజ్‌వేల స్థానంలో బ్రిడ్జి నిర్మాణా ల కోసం ప్రభుత్వానికి నివేదిం చాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మరమ్మతులు చేపడుతున్నాం. - శివకుమార్, ఎస్ఈ, ఆర్అండ్బీ, చిత్తూరు -
300 మందికి 8 అంతస్తులా?
*ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ భవనంపై ఆ శాఖ కార్యదర్శి విస్మయం *'సాక్షి' కథనంతో అత్యవసర భేటీ నిర్వహించిన సునీల్‌శర్మ * రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఆరా * పూర్తి వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశం * దీనిపై సీఎంకు నివేదిక అందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్కడ పనిచేసే విభాగాధిపతులు ఆరుగురు... వారి ఆధీనంలో పనిచేసే సిబ్బంది మూడొందలు.. కానీ వారికోసం లక్ష చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంతో ఎనిమిది అంతస్తుల భవనం సిద్ధమవుతోంది. రూ. 67 కోట్లతో నిర్మిస్తున్న ‘అంత పెద్ద భవనంలో మేమేం చేస్తాం..’ అని స్వయంగా ఆ విభాగం అధికారులే ప్రశ్నించే పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న భవనం వ్యవహారం ఇది. ఈ భవనం నిర్మాణంలో అధికారుల ఇష్టారాజ్యం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘20 కోట్లతో మొదలై 67 కోట్లకు..’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితం కావటంతో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 300 మంది సిబ్బంది ఉండే చోట ఇంత పెద్ద భవనం నిర్మించాల్సిన పరిస్థితి, తొలుత ఐదంతస్తులుగా తలపెట్టి తర్వాత ఎనిమిది అంతస్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను తనకు అందజేయాల్సిందిగా ఆయన ఆర్అండ్బీ బిల్డింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే... ఈ భవనం పనులు పూర్తయ్యేలోపు దాని అంచనాను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతమున్న అంచనా రూ. 67 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన 2014లో చేసింది. కానీ ఇప్పుడు పనులు పూర్తి కావటానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలో మార్పులు వస్తాయి. దీంతో అంచనాను మరోసారి సవరించాల్సి ఉంటుందనే తీరులో అధికారులు చెబుతుండడం గమనార్హం. విభజన ముంగిట నిర్ణయం.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా ఆర్అండ్బీ భవనంలో దాదాపు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేశారు. విభజనతో తెలంగాణ వాటా మూడొందలకు తగ్గిపోయింది. 2009లో ఈ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదంతస్తులుగా ప్రణాళిక రూపొందించారు. దానిని 2012లో ఎనిమిది అంతస్తులకు మార్చి... అంచనా వ్యయాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 39 కోట్లకు పెంచారు. అప్పటికే రాష్ట్ర విభజన అంశం కొలిక్కివచ్చే తరుణంలో ఉంది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రం విడిపోతే తొలుత నిర్ణయించినట్టుగా ఐదంతస్తుల భవనం కూడా ఎక్కువే. అలాంటిది ఆగమేఘాల మీద అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించటం పట్ల ఇప్పుడు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆ తర్వాత అదనపు పనుల పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 67 కోట్లకు పెంచేశారు. ఇతర అవసరాలకు వినియోగిస్తే.. ఇంత భారీ భవనం ఆర్‌అండ్‌బీకి అనవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భవనంలోనే ఆర్అండ్బీ కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. కానీ ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్తగా సచివాలయం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నందున... ఆర్అండ్బీ మంత్రి కార్యాలయం వద్దే కార్యదర్శి కార్యాలయం కూడా ఏర్పటవుతుంది. అదే జరిగితే ఈ కొత్త భవనంలో దాని అవసరం ఉండదు. అలాంటప్పుడు దీన్ని రోడ్లు, భవనాల శాఖకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీహైకోర్టు కోసం ఈ భవనాన్ని విని యోగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
రోడ్ల తీరుపై సమగ్ర సమాచారం
దేశంలోనే తొలిసారి పారదర్శకత కోసం సీనియారిటీ ఆధారంగా ఎల్ఓసీలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖలో పారదర్శకతను పాటించడానికి, అవినీతిని అంతమొందించడానికి దేశంలోనే తొలి సారిగా రహదార్ల సమాచార వ్యవస్థను ప్రవేశ పెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప తెలిపారు. శాసన సభలో తన శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. ఆర్ అండ్ బీలో రహదారుల నిర్మాణం లేదా పనుల ప్రగతిపై ఎలాంటి సమాచారం ఉండడం లేదన్నారు. ఎంత ఖర్చవుతున్నదనే విషయం కూడా తెలియడం లేదన్నారు. ఇకమీదట రాష్ట్రంలోని అన్ని రహదారుల పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా, అనవసర పనులేమైనా జరుగుతున్నాయా లాంటి సమాచారం ఈ వెబ్సైట్ ద్వారా లభిస్తుందని వివరించారు. దీని ఆధారంగా రహదారులను అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అనవసరంగా రహదారుల పనులను చేపట్టి, బిల్లులు చేసుకోవడం లాంటి అవకతవకలను కూడా నివారించవచ్చని తెలిపారు. కాగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లలో పలుకుబడి కలిగిన వారు త్వరగా బిల్లు మొత్తాలు పొందుతున్నారని తెలిపారు. దీనిని నివారించడానికి సీనియారిటీ ఆధారంగా ఎల్ఓసీలను ఇచ్చే పద్ధతిని పాటించనున్నట్లు వెల్లడించారు. గతంలో పథకం అంచనాలను ఒకే వ్యక్తి రూపొందించే వారని, ఇప్పుడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ కమిటీల ఆమోదంతోనే ఇకమీదట ఎలాంటి పథకాన్నైనా చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. రూ.5 కోట్లకు వరకు సూపరింటెండెంట్ ఇంజనీర్, అంతకు మించితే చీఫ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు పనులను పరిశీలిస్తాయని ఆయన తెలిపారు. -
ముస్లింలకు 12 % రిజర్వేషన్లు
మెదక్: ముస్లింల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన, స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లౌకికవాద దృక్ఫథంతో అటు హిందువులకు, ఇటు ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం పలు పథకాలు రూపొందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మైనార్టీల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్‌బోర్డు భూములు చాలా మట్టుకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. వీటి ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు జ్యుడీషియల్ అధికారులు ఇచ్చేందుకు ప్ర యత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ముస్లింలకు పవిత్రమైన రం జాన్ పండగ, హిందువులకు సంబరమైన బో నాల పండగలు వచ్చాయన్నారు. ఈ రెం డింటిని ప్రభుత్వ పండుగలుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. 70 ఏళ్ల లాల్‌దర్వాజా బోనాల చరిత్రలో గతంలో నిజాం, నేడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాత్రమే పాల్గొన్నారన్నారు. బోనాలు, రంజాన్ పండుగల నిర్వహణ కోసం మెదక్ జిల్లాకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింలతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జె డ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ విజయలక్ష్మి, డీఎస్పీ గోద్రూ, కౌన్సిలర్లు సోహైల్, బట్టి సులోచన రామ్మోహన్, సలాం, జెల్ల గాయత్రి, పలువురు వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు. -
జిల్లా రహదారులకు మహర్దశ
రూ. 330 కోట్లు మంజూరు మొదలైన 50 పనులు టెండర్ల దశలో మరో 50 రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తి సాక్షి, విజయవాడ : జిల్లాలో రోడ్లు, రహదారులు భవనాల శాఖ అధికారులు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఏకకాలంలో భారీగా పనుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసి కొన్నింటిని ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులన్నింటినీ రానున్న రెండేళ్ల కాలవ్యవధిలోపు పనుల స్థాయిని బట్టి పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో సుదీర్ఘకాలంగా మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న రోడ్లకు మోక్షం కలిగింది. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న పలు పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరు అయ్యాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 100 పనులు జిలాల్లో జరుగుతున్నాయి. వీటిలో సుమారు 50 పనులు వరకు ఇప్పటివరకు మొదలు కాగా మరో 50 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. జిల్లాలో ఆర్అండ్బి రహదారులు మూడు జిల్లాలను కలుపుతూ ఉన్నాయి. జిల్లా నుంచి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతున్నాయి. జిల్లాలో 2883 కిలోమీటర్లు ఆర్అండ్బి రహదారులున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం 200 నుంచి 300 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతులు జరుగుతుంటాయి. ప్రధానంగా ఆర్అండ్బి నిధులతోపాటు కేంద్రప్రభుత్వ వివిధ పథకాల ద్వారా జిల్లాలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతుంటాయి. ముఖ్యంగా నాబార్డు, నేషనల్ సైక్లోన్ రీకన్స్ట్రక్షన్ లిగిటేషన్ ప్రాజెక్టు (ఎన్సిఆర్ఎల్ఎఫ్), రూరల్ డెవలప్మెంట్ ఫండ్( ఆర్డీఎఫ్), స్పెషల్ రిపేర్స్ గ్రాంట్, 13వ ఫైనాన్స్ కమిషన్ తదితర పథకాల ద్వారా నూతన రోడ్లు, వంతెనల నిర్మాణాలు జరుగుతుంటాయి. దీంతోపాటు రాష్ట్ర ఆర్అండ్బి పరిధిలోని స్టేట్రోడ్స్, ప్లాన్ వర్క్స్, మెయింటెన్స్ వర్క్ తదితరాల ద్వారా సాధారణ మరమ్మతులు జరుగుతుంటాయి. అలాగే కోర్ రోడ్ నెట్వర్క్ పథకం ద్వారా రోడ్ల విస్తరణ, మరమ్మతులకు నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పనులన్నీ ఆర్అండ్బి పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. ప్రధాన పనులు... ప్రధానంగా నగర శివారులోని నున్న వద్ద 4.6 కిలోమీటర్ల మేర రూ .10.5 కోట్ల వ్యయంతో నున్న బైపాస్‌రోడ్డు పనులు కొద్దినెలల కిత్రమే ప్రారంభించారు. మచిలీపట్నం బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులు 4 కిలోమీటర్ల మేర రూ 6 కోట్లతో సాగుతున్నాయి. జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని కాళీపట్నంల మధ్య రూ.26 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో ఏడాదిలో ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్సీఆర్ఎల్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన నిధులు రూ.64 కోట్లతో భవానీపురం-ఉల్లిపాలెం మధ్య వంతెన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడానికి తేదీలు ఖరారు చేశారు. తాళ్ళపాలెం-నారాయణపురం మధ్య రూ.9.5 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. రూ.7.75 కోట్ల నాబార్డు నిధులతో మూడు లోలెవల్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. శ్రీరాంపురం, పేర్వంచ రోడ్డు మార్గంలో ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. కంకిపాడు మండలంలోని కుందేరులో రూ.7.6 కోట్ల నాబార్డు నిధులతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. కాగా ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలవ్యవధిలో ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని జిల్లా ఆర్అండ్బి ఎస్ఈ కె.వి. రాఘవేంద్రరావు సాక్షికి తెలిపారు. -
రోడ్లకు ‘విభజన’ శాపం !
ఆగిన రూ.100 కోట్ల నిధులు పల్లెలకు రూ.47 కోట్లు అవసరం సీఎం హామీ అమలయ్యేనా..? రోడ్ల ప్రగతికి ‘విభజన’ శాపమరుుంది. కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాఖల కుదింపు జరిగింది. ఇందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ఇంతవరకు పురుడు పోసుకోలేదు. సంబంధిత శాఖకు అధికార యంత్రాంగం కూర్పు జరగనేలేదు. నిధుల మంజూరు విషయం ఇంతవరకు తేలలేదు. ఈ నేపథ్యంలో రోడ్ల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కంకర రోడ్లపై పాదచారులు, నరకయాతన అనుభవిస్తున్నారు. చిత్తూరు (అర్బన్): ‘జిల్లాల్లో ప్రతి మారుమూల గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఉండి తీరాల్సిందే. రోడ్డు లేకుండా ఏ ఒక్క పల్లె కనిపించడానికి వీల్లేదు.’ ఇవీ ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల కుప్పానికి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారులతో అన్న మాటలు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చూస్తే వాస్తవ పరిస్థితులు వేరేవిధంగా ఉన్నాయి. జిల్లాలో రోడ్డులేని గ్రామాలు చాలానే ఉన్నాయి. వీటికి తక్షణం రోడ్డు వసతి కల్పించాలంటే దాదాపు రూ.47 కోట్లు కావాలి. ఇక రోడ్ల నిర్వహణకు రూ.25 కోట్లు అవసరం. ఇవి కాకుండా కొత్తగా రోడ్ల విస్తరణకు రూ.28 కోట్లు కావాలి. అంటే ముఖ్యమంత్రి నోటి వాక్కు ఆగమేఘాల మీద అమలు చేయడానికి అధికారుల వద్ద రూ.100 కోట్లకు పైనే సొమ్ములుండాలి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు అధికారుల వద్ద ఉన్నాయా..? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నిధులను ఏమైనా విడుదల చేసిందా..? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పవచ్చు. జిల్లాలో 5188 కి.మీ దూరం వరకు ఆర్అండ్బీ రోడ్లున్నాయి. ఇందులో 645 కి.మీ జాతీయ రహదారులు, 4428 కి.మీ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. 114 కి.మీ ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మితమైన రోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా 1646 కి.మీ దూరం వరకు గ్రామీణ రోడ్లు విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏటా రూ.25 కోట్లు అవసరం. వీటితో పాటు కొత్తగా రోడ్ల నిర్మాణానికి ఏటా రూ.100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ విడుదలవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న రెండు రాష్ట్రాల రోడ్లు ఇప్పటికే బాగా అభివృద్ధి చెందాయి. మన సరిహద్దు రోడ్లు మాత్రం అంతంతమాత్రంగా దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లతో ముడిపడిన అంశం జిల్లాలో రోడ్ల నిర్వహణ అంశం కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుంది. ఒక్కో ఏడాదికి దాదాపు రూ.100 కోట్ల వరకు జిల్లాలోని రోడ్ల కోసం నిధులు వస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంత్సరానికి ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలైతే అధికారులు మార్చి వరకు దాదాపు రూ.97 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణం అవసరం ఉంది, ఎంత నిధులు కావాల్సి ఉందనే విషయాలపై అధికారులు నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడం జరిగిపోయి ఉండాలి. సరిగ్గా జూన్ 20 దాటిందంటే అధికారులు రోడ్ల నిర్వహణ, నిర్మాణం కోసం టెండర్లు పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి ఉంటారు. కానీ మారిన ప్రత్యేక పరిస్థితుల వల్ల జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విభజన శాపం... రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. ఏప్రిల్ మొదటి వారంలో తయారుకావాల్సిన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఇంకా కాగితాల్లోకి రాలేదు. రాష్ట్రంలో ఇంకా రోడ్లు, భవననాల శాఖకు రూపం పోసుకోకపోవడం, అధికార యంత్రాంగం కూర్పు జరగకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు లేకుండానే జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేయూలని చెప్పడం విడ్డూరంగా ఉంది. మాటలు చెప్పిన అదే నోటితో సీఎం నిధుల విడుదల విషయం కూడా చెప్పేస్తే జిల్లాలో రోడ్ల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది.