ఆర్ అండ్ బీ శాఖలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు.
ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు.
సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment