sudden inspection
-
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
లంగర్‌హౌస్: ఇంట్లో మీరు తినే భోజనం ఇలాగే వండుకుంటారా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా? ఉడకని కూరగాయలకు తోడు అధికంగా మసాలాలు వేస్తే పిల్లల ఆరోగ్యాలు దెబ్బ తినవా? నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా సరైన మెనూ అందివ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? అంటూ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. పిల్లల భోజనంపై ఇంత నిర్లక్షమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లంగర్‌హౌస్ ఇబ్రహీంబాగ్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సరిగా అందుతున్నాయా.. లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అన్నం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సైతం భోజనం పెట్టించుకున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గోల్కొండ తహసీల్దార్ అహల్యతో పాటు ఇతర అధికారులను కూడా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తినాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొన్నం.. కూరలు నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకులపై మండిపడ్డారు. టమాటాలు ముక్కలు చేయకుండా.. కనీసం కోయకుండా అలా మసాలాలో నేరుగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించకపోయినా.. నిర్లక్ష్యం వహించినా అందరూ బాధ్యులే అవుతారని ఆయన హెచ్చరించారు. మంచినీళ్లూ కరువేనా..? ఈ క్రమంలోనే మంత్రి మంచినీళ్లు కావాలని అడగడంతో అక్కడ ఉన్న గ్లాసులలోని నీరు ముట్టుకోనీయకుండా సిబ్బంది కాస్త ఆలస్యంగా బాటిళ్లు తెచ్చి ఇచ్చారు. ఇదేంటని మంత్రి అడగగా.. వాటర్ ఫిల్టర్ పని చేయడంలేదని నిర్వాహకులు తెలిపారు. అదే నీరు చిన్నారులకు ఇస్తున్నారంటే వారి ఆరోగ్యం, వారి ప్రాణాలపై మీకు బాధ్యత లేదా? అంటూ మరోసారి మండిపడ్డారు. వెంటనే ఫిల్టర్‌కు మరమ్మతులు చేయించాలని, భోజనాలలో కూడా మార్పులు రాకపోతే ఒక్కరు తప్పు చేసినా అందరినీ బాధుల్ని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. -
ప్రమాదకర ప్లాస్టిక్ రహిత విశాఖ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
-
కృష్ణా జిల్లా కోడూరులో కలెక్టర్ నివాస్ ఆకస్మిక తనిఖీలు
-
బ్రాహ్మణ కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-
సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడెకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సెంటర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శాంతిభద్రతలతో పాటు విపత్తుల నిర్వహణ, పండగలు, జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చని సీఎం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆరూరి రమేశ్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధీ, సంజీవరావు, అర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉస్మానియాలో ఆకస్మిక తనిఖీలు : లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఆయన కు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూపర్డెంట్కు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులను మీరు ఏ సమస్యల వలన ఆసుపత్రికి వచ్చారు, మీకు వైద్యం సరిగ్గా అందుతందా లేదా అని మంత్రి అడుగగా దానికి వారు భాగనే ఉందని సమాదానం ఇచ్చారు. రోగులకు ఐసీయు లోని వివిధ విభాగాలను పరిశీలిచి, తాగు నీరు, డోర్స్, వెంటిలేటర్లు, లిఫ్ట్, ఆక్సిజన్ వంటి అంశాలను పరిశీలించారు. లిఫ్ట్ మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మంత్రి వెంట ఉస్మానియా సూపర్డెంట్ నాగేందర్ ఆర్‌ఎంఓలు తదితరులు పాల్గొన్నారు. -
వేట మొదలైంది
►అన్ని శాఖల ప్రక్షాళనకు శ్రీకారం ►ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్ ►ప్రజల పనుల విషయంలో ఆలస్యం చేస్తే సహించని పరిస్థితి కలెక్టర్‌గా బాబూరావునాయుడు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి పాలనలో తనదైన మార్కు చూపెట్టడం ప్రారంభించారు.పొగడ్తలకు దూరంగా... పనికి దగ్గరగా వెళుతున్నారు. ఒకపక్క తాను చేస్తూనే, మరోపక్క అధికారులు కూడా చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజల పరంగా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. శాఖల్లో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు నడుం బిగించడంతోపాటు తప్పుచేసిన అధికారులను అందరి ముందే అదిలిస్తున్నారు. అంతేకాదు.. అందరికన్నా ముందే ఏదో ఒక కార్యాలయాన్ని తనిఖీ చేసి అందరినీ కదిలిస్తున్నారు. ►జిల్లాకు వచ్చిన కొత్తల్లో సాధారణ వ్యక్తిలా రిమ్స్‌కు ఉదయాన్నే వెళ్లారు. అటెండెన్స్ వద్ద కూర్చుని అంతా పరిశీలించారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించకపోవడం, వైద్యసేవల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. పేదలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ►గండికోట ముంపు పరిహారం పంపిణీపై ఆరోపణలు రావడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిన నేపథ్యంలో రికవరీకి చర్యలు చేపట్టడంతోపాటు క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్నారు. ►భూములకు సంబంధించి ఆన్లైన్ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అట్లూరు, తొండూరు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా మరో ఇద్దరు వీఆర్వోలు, ఒక డిప్యూటీ తహసీల్దార్‌కు కూడా మెమోలు జారీ చేశారు. సాక్షి, కడప/సెవెన్‌రోడ్స్ : జిల్లా పాలనకు కేంద్రబిందువు కలెక్టరేట్. కలెక్టర్ పరిపాలనాధికారి. అలాంటి అత్యున్నత అధికారి అందరికీ ఆదర్శంగా పనిచేస్తే.. మిగతా యంత్రాంగం కూడా ఆయన బాటలోనే నడుస్తుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం కలెక్టర్ డాక్టర్ బాబూరావునాయుడు ఆ దిశగా పాలనను గాడిలో పెట్టే దిశగా ముందుకుసాగుతున్నారని మేధావులు అంటున్నారు. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే అక్రమాలకు పాల్పడిన, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక ఆర్డీఓను సరెండర్ చేయడం, మరో ఇద్దరు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు, పలువురు అధికారులకు మెమోలు, సంజాయిషీ నోటీసులే అందుకు ఉదాహరణ. ప్రజల పట్ల నిజాయితీతో వ్యవహరించాలని, ఒకసారి సమస్యతో వచ్చిన సామాన్యులు మరోసారి కార్యాలయంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాలి తప్ప పదేపదే తిప్పుకోవడం సహేతుకం కాదని తనదైన శైలిలో సున్నితంగా మందలిస్తున్నారు. ఉరుకులు...పరుగులు.. విశాఖపట్టణం నుంచి బదిలీపై కలెక్టర్‌గా వచ్చిన బాబూరావునాయుడు ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులోనూ గ్రామీ ణ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆయన సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉండడంతో కింది స్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకపక్క కలెక్టర్ ఎప్పటికప్పుడు చురుగ్గా స్పం దిస్తూ...అంతే స్పీడుగా కిందిస్థాయి సిబ్బంది కూడా పనిచేయాలని చెబుతున్నారు. ఇప్పటికే వల్లూరు, వీరపునాయునిపల్లె, లక్కిరెడ్డిపల్లె, చిం తకొమ్మదిన్నె, కొండాపురం, పెండ్లిమర్రి, ముద్దనూరు, ఎర్రగుంట్ల తదితర మండలాల్లో పర్యటించి కార్యాలయాలను తనిఖీ చేశారు. సమీక్షల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం జిల్లాలో అన్ని శాఖలకు సమీక్షలు నిర్వహించిన కలెక్టర్ అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేకంగా ఏయే శాఖల్లో ఎక్కువగా అవినీతి రాజ్యమేలుతుందో తెలుసుకుంటున్న ఆయన ఆయా శాఖల అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలను పీడిస్తే చర్యలు తప్పవని కరాఖండిగా చెబుతున్నారు. సమీక్షల సందర్భంగా కూడా ముందస్తు హెచ్చరికలు ఇప్పటికే ఆయన జారీ చేశారు. వచ్చిన మొదట్లోనే మార్కెట్‌యార్డుకు వెళ్లి పసుపు రైతుల సమస్యల పట్ల సావధానంగా స్పందించిన ఆయన పరిష్కారానికి చొరవ చూపారు. కానీ వివిధ శాఖల్లో ఎంతోకా లంగా వేళ్లూనుకుపోయిన నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఇంకా స్తబ్ధత కొనసాగుతోంది. అధికారపార్టీ వైపు నుంచి కూడా ఒత్తిళ్లు ఉంటాయి. వాటిన్నింటినీ రాబోయే రోజుల్లో తనదైన శైలిలో ఆయన అధిగమిస్తారని, పాలనను గాడిలో పెడతారని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు. ఊరికి ఉపకారంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊరికి ఉపకారం అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, వివిధ పదవుల్లో ఉన్నవారు, మేధావులు సొంత ఊళ్లకు కొంతైనా మేలు చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. అంతేకాకుండా హాస్టళ్లు, స్కూళ్ల వద్ద పిల్లల ద్వారా చెట్లు నాటించడం, కచ్చితంగా ప్రతి మొక్క బతికేలా ప్రత్యేక చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. మొత్తానికి కలెక్టర్ వ్యవహార శైలి అటు ప్రజలకు మేలు చేస్తుండగా.. విధి నిర్వహణలో అలసత్వం చూపే అధికారులకు మాత్రం దడ పుట్టిస్తోందనే చెప్పవచ్చు. వీఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్ కడప సెవెన్‌రోడ్స్ : రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లె గ్రామ రెవెన్యూ అధికారి పి.హరిప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బాబూరావునాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో హరిప్రసాద్ 1–బి అండగల్‌ను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ నిర్వహించగా, ట్యాంపరింగ్ నిజమేనని తేలింది. ఈ నివేదిక కలెక్టర్‌కు అందడంతో ఆయన వీఆర్వోను సస్పెండ్ చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో సత్ఫలితాలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అడ్డుకోడానికి ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. మండల స్థాయి గిడ్డంగులు, రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి బియ్యం అక్రమ రవాణాకు బృందాలు చెక్ పెడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృంద ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించిన సీవీ ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 179 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.కోటికి పైగా విలువ గల 3,507 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 937 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.15 లక్షల విలువ గల చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌నూ స్వాధీనం చేసుకున్నామని.. రూ.3.16 కోట్ల విలువైన సన్నబియ్యం అక్రమ రవాణా నివారించామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ నిఘాతో మిల్లర్లకు రావాల్సిన సీఎంఆర్ కూడా పూర్తిస్థాయిలో వచ్చిందని.. ఈ బృందాల వల్లరేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో పనితీరు మెరుగుపడిందని కమిషనర్ వివరించారు. -
పెద్దపల్లిలో హరీష్‌రావు ఆకస్మిక పర్యటన
-
నగరంలో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బేగంపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిల్వ ఉన్న చెత్తతోపాటు నీరును తొలగించే పనులను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. -
సీహెచ్‌ఎన్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పిఠాపురంలోని కమ్యునిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్ఎన్సీ)లో గురువారం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై మండిపడ్డారు. సీహెచ్‌ఎన్‌సీలో కనీసం ఇంజక్షన్లు, సిరంజీలు లేకపోవడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంలో వైద్యాధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
జూనియర్ కళాశాలలో ఆర్జేడీ తనిఖీలు
చేవెళ్ల (రంగారెడ్డి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్ మల్హర్రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య, కోర్సుల వివరాలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మల్హర్రావు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని, ప్రభుత్వ కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపాలని పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, సంఖ్యను పెంచడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. -
ఎంఎంటీఎస్‌లో రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ఆయన ప్రయాణించి, ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై జీఎంకు పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండోదశ ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటికే 817 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రక్షణ శాఖతో సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరించుకుని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.