
సాక్షి, హైదరాబాద్ : జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఆయన కు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు.
రాజశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూపర్‌డెంట్‌కు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులను మీరు ఏ సమస్యల వలన ఆసుపత్రికి వచ్చారు, మీకు వైద్యం సరిగ్గా అందుతందా లేదా అని మంత్రి అడుగగా దానికి వారు భాగనే ఉందని సమాదానం ఇచ్చారు.
రోగులకు ఐసీయు లోని వివిధ విభాగాలను పరిశీలిచి, తాగు నీరు, డోర్స్, వెంటిలేటర్లు, లిఫ్ట్, ఆక్సిజన్ వంటి అంశాలను పరిశీలించారు. లిఫ్ట్ మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మంత్రి వెంట ఉస్మానియా సూపర్‌డెంట్ నాగేందర్ ఆర్‌ఎంఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment