minister laxma reddy
-
పవర్‌బోట్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
-
పవర్‌బోట్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్ : మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పట్టణంలోని మినీట్యాంక్ ను సందర్శించిన ఆయన.. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి పవర్ బోట్లో ప్రయాణించారు. అంతకుముందు ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటి పరిధిలో రూ. 60 కోట్లుతో చేపట్టిన అబివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు. రూ. 30 కోట్లతో పట్టణంలోని 41 వార్డుల్లో చేపట్టనున్న 215 పనులకు కూడా కేటీఆర్ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పట్టణంలోని దివిటిపల్లి వద్ద చేపట్టనున్న ఐటీ పార్క్ పైలాన్ ఆయన ఆవిష్కరించారు. -
ఐ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
-
ఉస్మానియాలో ఆకస్మిక తనిఖీలు : లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఆయన కు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూపర్డెంట్కు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులను మీరు ఏ సమస్యల వలన ఆసుపత్రికి వచ్చారు, మీకు వైద్యం సరిగ్గా అందుతందా లేదా అని మంత్రి అడుగగా దానికి వారు భాగనే ఉందని సమాదానం ఇచ్చారు. రోగులకు ఐసీయు లోని వివిధ విభాగాలను పరిశీలిచి, తాగు నీరు, డోర్స్, వెంటిలేటర్లు, లిఫ్ట్, ఆక్సిజన్ వంటి అంశాలను పరిశీలించారు. లిఫ్ట్ మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మంత్రి వెంట ఉస్మానియా సూపర్డెంట్ నాగేందర్ ఆర్‌ఎంఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఈ నూనె.. ఆ నూనేనా..?
కాచిగూడ: ‘‘ఈ నూనె ఏ కంపెనీది? ఎన్ని సార్లు వేడి చేశారు? ఈ నూనెతో ఏమేం వండుతున్నారు? మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా? హోటల్ని ఇంత అధ్వానంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? రోజు ఇక్కడే టీ తాగుతావా? ఇందులో వాడే పాలు, టీ పొడి నాణ్యమైనవేనా? మీ బేకరీకి పర్మిషన్ ఉందా? సోడాలో వాడే ఐస్ ఎక్కడి నుంచి తెస్తున్నావు’’? అంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా వ్యాపారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆహార తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన నారాయణగూడ వైఎంసీఏ రోడ్డులో ఉన్న ఆల్‌సబా రెస్టారెంట్, న్యూ బేక్‌జోన్, శ్రీ సాయికృష్ణ టిఫిన్ సెంటర్ తదితర వాటిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ వాడుతున్న నూనె, పిండి, రంగులు, మటన్, చికెన్, పాలు, చాయ్‌పత్తాతో పాటు మంచినీటిని సేకరించి పరీక్షించారు. పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్ల యజమాన్యాలు వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆహార భద్రత చట్టంలో మార్పులు చేస్తున్నామని పదార్థాల విక్రయదారులు సేప్టీ మేజర్స్ పాటించాలని, అవసరానికి మించి కలర్స్ వాడొద్దని సూచించారు. మంత్రి వెంట ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ ఉన్నారు. -
కల్తీలను నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
-
నిమ్స్ తరహాలో రిమ్స్
ఆదిలాబాద్: జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రిని నిమ్స్ తరహాలో ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏర్పాటు చేసిన సిటీస్కానింగ్, డయాలసిస్ సెంటర్, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈ–హెల్త్‌సెంటర్, పేయింగ్రూమ్స్, పీడియాట్రిక్ ఐసీయూ, టెలీమెడిసిన్ సెంటర్, గెస్ట్‌రూమ్స్, ఉద్యోగుల క్వార్టర్లు మంత్రులు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అధునాతన పరికరాలతో జిల్లా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవల కోసం హైదరాబాద్, నాగ్‌పూర్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. రిమ్స్‌లో త్వరలో వైద్య పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు ఇటీవల కోల్‌కతాలో అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన పరికరాల నిర్వహణ సంబంధిత కంపెనీలకు అప్పగించామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతోనే గతంలో మలేరియా వంటి జ్వరాలతో మరణాలు సంభవించాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ మరణాలను అరికట్టగలిగామని అన్నారు. నిత్యం ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఏజెన్సీలో వైద్య సేవలు అందించడంతో ఈ ఏడాది ఒక్క మరణం కూడా సంభవించలేదని అన్నారు. రిమ్స్‌లో 150 మెడికల్ సీట్లు, విద్యార్థులకు సదుపాయాల కోసం రూ.103 కోట్లు కావాలని, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని మంత్రి రామన్న తనకు ప్రతిపాదించారని, త్వరలో వీటిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిమ్స్ ఆస్పత్రిని సెమీ అటానమస్ నుంచి అటనామస్కు మార్చేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తాం.. ఆదిలాబాద్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాటీ ఆస్పత్రి నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. సూపర్స్పెషాలీటీ సేవలు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లాకు వైద్యులు రావాలంటేనే భయపడేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు వరుస కడుతున్నారని అన్నారు. అధునాతన పరికరాలతోపాటు వాటి నిర్వహణకు సంబంధించిన వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. అనంతరం రిమ్స్ ఎస్ఎన్సీయూ వార్డులకు ఇటీవల వచ్చిన జాతీయ అవార్డును మంత్రుల చేతుల మీదుగా ఆ విభాగం వైద్యుడు సూర్యకాంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్, రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, డీఎంహెచ్ఓ రాజీవ్‌రాజ్, డైరెక్టర్ అశోక్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ ప్రేమల, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు నీలాబాయి, తదితరులు పాల్గొన్నారు. అపరిశుభ్రతపై లోక భూమారెడ్డి అసంతృప్తి.. రిమ్స్ ఆడిటోరియంలో మంత్రుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి రిమ్స్, ఆడిటోరియంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు వచ్చినా కనీసం ఆడిటోరియంలో బూజు, దుమ్ము దులపలేదని, నడుస్తుంటే కాళ్ల అడుగులు కనిపిస్తున్నాయని అన్నారు. ఓ పక్క ప్రభుత్వం స్వచ్ఛభారత్ దిశగా ముందుకు వెళ్తుంటే.. రిమ్స్‌లో మాత్రం స్వచ్ఛత కనిపించడం లేదని పేర్కొన్నారు. -
మోడల్ అంగన్వాడీ
జడ్చర్ల టౌన్: ఈ చిత్రాలు చూస్తుంటే ఏ పార్కులోని గది అనుకుంటారేమో.. కాదండి జడ్చర్ల మండలం తంగెళ్లపల్లిలో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం అంటే విస్మయం కలుగుతుంది కదూ.. వాస్తవమే అంగన్వాడీ కేంద్రం అంటే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గదులు, పెంకుటిల్లు, స్కూల్ బిల్డింగ్‌లో అని ఊహించుకుంటాం. అందుకు విరుద్ధంగా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టార. గతంలో బేస్మెంట్ వరకు నిర్మించి వదిలేసిన భవనాన్ని పూర్తి చేసేందుకు జెడ్పీ నిధులు రూ.3లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.3.5లక్షలతో పనులు ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ పేరుతో కేంద్రానికి చిన్నారులను ఆకట్టుకునేందుకు పెయింటింగ్ వేయించారు. చోటాభీం చిత్రాలతోపాటు అక్షరమాల, శరీరంలోని భాగాలు, పండ్లు, పూల చిత్రాలు వాటి పేర్లు రాయించారు. మండలంలోని మాచారం, కిష్టారంలోనూ ఇలాంటి కేంద్రాలు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. గ్రామానికి వచ్చిన వారంతా అంగన్వాడీ కేంద్రాన్ని చూసి తమ ఊళ్లలోనూ ఇలా నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి చైల్డ్ ఫ్రెండ్లీ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. చిన్నారులను ఆటాపాటలతో కేంద్రానికి వచ్చేలా చూడటానికే ఇలాంటి చైల్డ్ ఫ్రెండ్లీ కేంద్రాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో సీడీపీఓ మెహరున్నీసా, సర్పంచ్ రుకియాభాను, ఎంపీటీసీ చెన్నమ్మ, సూపర్వైజర్ రమణ, అంగన్వాడీ టీచర్ అనంతమ్మ, పీఆర్ డీఈ హీర్యానాయక్, ఏఈ అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. -
బూజు దులిపేద్దాం
జడ్చర్ల : గత ప్రభుత్వాల పాలనలో గబ్బు పట్టిన విధానాల మబ్బు దులుపుతున్నాం. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించే దిశగా అనేక విధి విధానాలలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చంద్రగార్డెన్‌లో జరిగిన ఈద్‌మిలాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లీం సోదరులనుద్దేశంచి సుధీర్ఘ ప్రసంగం చేశారు.గత పాలకుల నిర్లక్షం,నిర్లిప్తత కారణంగా సమాజం వెనుకబాటుకు గురయ్యిందని ఆరోపించారు. కల్తీ విత్తనాలు,కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ మందులు, అంతా కల్తీమయంగా తయారై రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ మంచి ఆలోచనలతో మార్పు తీసుకువచ్చే విదంగా చర్యలు చేపట్టారని అన్నారు. కల్తీ విత్తనాలు, తదితర వాటిపై పీడీ యాక్టును అమలు చేస్తున్నారని, అదేవిదంగా గుడుంబా నియంత్రణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియల మార్పులు, శాంతిభద్రతల అమలు, తదితర అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. సెక్యులరిజానికి పెట్టింది పేరుగా ఉన్న మన దేశంలో తెలంగాణ ముందుందన్నారు. హిందూముస్లీంల ఐక్యత ఇక్కడ ఉన్న విదంగా మరెక్కడా లేదన్నారు. హైద్రాబాద్‌లో హిందూముస్లీంల ఐక్యతను నాడు మహాత్మాగాందీ ప్రశంసించారని గుర్తు చేశారు. ముస్లీం, క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, తదితర అనేక సంక్షేమ కార్యక్మాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకే ఏటా రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక అభవృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని,సీఎం కేసీఆర్‌కు తమ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల చేసిన సర్వేలు సైతం మళ్లీ టీఆర్ఎస్కే పట్టం కడుతారని వెళ్లడవుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్,జడ్పీటీసీ ప్రబాకర్‌రెడ్డి,వైస్‌ఎంపీపీ రాములు,పీసీఎస్ చైర్మెన్‌బాల్‌రెడ్డి,కోఆప్శన్ ఇమ్ము,మత పెద్దలు ఫీజ్‌ఉర్‌రహెమాన్, అజీజ్‌రహెమాన్, సుల్తాన్‌కీస్తీ, అబ్దల్‌కరీం, శేక్‌చాంద్, జాఫర్,యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి లక్ష మరణాలు
⇒ గాంధీలో రోజుకు 25–30 మంది మృతి: మంత్రి లక్ష్మారెడ్డి ⇒ చివరి దశలో వస్తుంటారు.. ⇒ సాధారణ మరణాలుగా పరిగణించాలని వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల మంది జన్మిస్తుండగా.. అదే సమయంలో 3 లక్షల మంది చని పోతున్నారని.. అందులో లక్ష మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసు పత్రిలో రోజుకు 25 నుంచి 30 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 20 నుంచి 25 మంది చనిపోతు న్నారని, ఇది ప్రత్యేకమైన విషయం కాదన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశోత్తరాల సమయంలో గీతారెడ్డి, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సీరియస్ కేసులు.. చివరి దశలో ప్రభుత్వాసుపత్రులకు ముఖ్యంగా ఉస్మా నియా, గాంధీ ఆసుపత్రులకు వస్తుంటాయని మంత్రి చెప్పారు. అందుకే మరణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని, ఇది సర్వసాధారణమన్న విష యాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. నీలోఫర్‌లో బాలింతల మరణాలపై కలెక్టర్ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,118 వైద్య సిబ్బంది పోస్టులను త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రం లో గర్భిణీల కోసం ఇప్పటికే 41 వాహనాలు నడు స్తున్నాయని, అదనంగా మరో 200 వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్వైన్ ఫ్లూతో కొన్ని మరణాలు సంభవించాయని.. వాటిల్లో అనేకం ఇతరత్రా అనారోగ్య కారణా లతో సంభవించాయన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి స్వైన్‌ఫ్లూ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే ఆయన నిమ్స్‌లో చేరలేదన్నారు. 12 ప్లేట్లెట్ సెపరేట్ మిషన్లను తాము కొనుగోలు చేశామని చెప్పారు. కాంగ్రె స్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 108 తీసు కొచ్చి పేదలకు వైద్య సేవలు అందించారని.. 104 సర్వీ సుతో ఉచితంగా మందులు అందజేశారన్నారు. 123పై కోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చారు: హరీశ్ 123 జీవోపై కాంగ్రెస్ పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంటే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు 10 నెలల్లో పూర్తి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భక్త రామదాసును 11 నెలల్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పట్టించుకోలేదని.. ఇప్పుడూ అంతేనన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను తాను దగ్గరుండి చేయిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. హరీశ్ స్పందిస్తూ.. ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది కాంగ్రెస్సే అన్నారు. ‘2013 చట్టం వచ్చాక దేశంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లలేదు.. అదో గుదిబండగా మారింది’ అని మంత్రి అన్నారు. 800 ఎకరాల భూసేకరణకు రైతులు అంగీకరించారని.. కానీ మన కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని.. 123 జీవోపై కోర్టుకెళ్లి స్టే తెచ్చారన్నారు. రైతు కేసు వేస్తే సరేనని.. కానీ భూమిలేని రైతులతోనూ కాంగ్రెస్ కేసులు వేయించిందని మండిపడ్డారు. పాసు పుస్తకాలు రద్దు చేయలేదు: మహమూద్ అలీ పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయలేదని.. వాటిని హై సెక్యురిటీతో పాస్‌పోర్టు తరహాలో మార్పు చేసి రైతులకిస్తామని జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానమిచ్చారు. పాసు పుస్తకాలు రద్దు చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. సభ్యుల సలహా మేరకు చిన్న కార్డుల తరహాలో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా, ‘రద్దు’ ప్రచారంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయని జీవన్‌రెడ్డి ప్రస్తావించారు. -
కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి : లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోలుకుంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నగరంలోని ఫిల్మ్‌నగర్ దుర్గాభవాని నగర్లో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. స్వైన్‌ఫ్లూ వచ్చిందని ఆందోళన చెందవద్దని, చికిత్స ద్వారా నయమవవుతుందని, దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే పల్స్ పోలియోకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
తెలంగాణ రాష్ట్రంపై డెంగీ పంజా
-
డెంగీ బెల్స్
► డెంగీ బెల్స్ ► రాష్ట్రానికి దోమ కాటు ► సోమవారం ఒక్కరోజే 67 కేసులు ► ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పరిస్థితి తీవ్రం ► ఇప్పటిదాకా 22 మంది మృతి ► 351 పాజిటివ్ కేసులు.. దేశంలోనే అత్యధికం ► మూడునెలలుగా జ్వరంతో అల్లాడుతున్న 15 గ్రామాలు ► ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 వేల మందికి డెంగీ నిర్ధారణ ► చేష్టలుడిగి చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ► డెంగీతో మరణించింది ఐదుగురేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా డెంగీ కేసులు నమోదవుతున్నా.. ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్క బోనకల్ మండలం లోనే 22 మందిని డెంగీ పొట్టనబెట్టుకుంది. డెంగీ ఏ స్థాయిలో విజృంభించిందంటే ఒక్క సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా 146 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 67 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. అందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 58 మంది ఉన్నారు. డెంగీ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోలేదు. బోనకల్ మండలంలో 22 మంది చనిపోయినా కేవలం ఐదుగురే చనిపోయారని చెబుతోంది. గత మూడు నెలలుగా ఈ మండలంలోని 15 గ్రామాలు డెంగీతో అల్లాడుతున్నాయి. బోనకల్ మండలంలో దేశంలోనే అత్యధికంగా 351 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 10 నెలల్లో 1,983 కేసులు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా కేసులు పెరిగాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారమే.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 1,983 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా మృతులు మాత్రం ఐదుగురేనని చెబుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22 మంది చనిపోయినా.. మృతుల సంఖ్యను తక్కువగా చూపడంపై విమర్శలు వస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో (జనవరి–అక్టోబర్ మధ్య) 2,284 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 894 మందికి డెంగీ సోకినట్లు తేలింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 3,072 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 377 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లాలో 204 మందికి డెంగీ ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 1118 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 825 కేసులు నమోదయ్యాయి. బోనకల్‌కు మంత్రి లక్ష్మారెడ్డి! రెండు మూడ్రోజుల్లో బోనకల్ మండలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించే అవకాశాలున్నాయని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. డెంగీపై మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌తోపాటు రావినూతల, గోవిందాపురం గ్రామాలకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. డాక్టర్లు, సిబ్బంది, సెల్ కౌంట్ మిషన్లను కూడా పంపుతామని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని స్ప్రేయర్లను బోనకల్‌కు పంపాలని ఆదేశించారు. వారానికి రెండుసార్లు బాధిత ఇళ్లల్లో స్ప్రే చేయాలన్నారు. సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఒక బృందాన్ని బోనకల్ పంపామన్నారు. గ్రామానికి ఒకటి చొప్పున 108, మూడు 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆ మండలంలో ఇంటింటికి జ్వరమే ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీతో రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మండలంలోని రావినూతలలో 8 మంది మృతి చెందగా.. 31 మంది డెంగీతో బాధపడుతున్నారు. మరో 56 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. జ్వరం లక్షణాలు కనపడితే జనం బెంబేలెత్తిపోతున్నారు. డెంగీ భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బోనకల్లో ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, అక్టోబర్‌లో 6,735 మందికి విష జ్వరాలు సోకాయి. మండలంలోని 21 గ్రామాల ప్రజలు ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్యం కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 790 డెంగీ కేసులు నమోదైతే.. ఈ మండలంలోనే సగం కేసులు నమోదయ్యాయి. మండలంలో డెంగీతో మరణంచిన 22 మందిలో 15 మంది వరకు 40 ఏళ్ల లోపు వారే ఉన్నారు. జ్వరాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు భయంతో గ్రామాలను వీడుతున్నారు. చేతికందిన కుమారుడిని కోల్పోయి.. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గుగులోతు రూప్లా కుమారుడు సైదులు(30) డెంగీతో అక్టోబర్ 14న మృతి చెందాడు. గత నెల 11న సైదులుకు జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ వద్ద తగ్గకపోవడంతో మరుసటిరోజు ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒక్కరోజు వైద్యం చేసిన తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డెంగీ జ్వరం వచ్చిందని, కిడ్నీ, లివర్‌పై ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. రూ.2.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ కుమారుడు దక్కలేదంటూ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. కూలీనాలీ చేసి కుమారుడిని ఎమ్మెస్సీ బీఈడీ చేయించాడు. ఆరునెలల కిందటే వివాహం చేశాడు. పెద్దదిక్కుని కబలించింది.. రావినూతల గ్రామానికి చెందిన అజ్మీరా రఘుపతి(65) గతనెల 19న డెంగీతో మృతి చెందాడు. ఈయనకు 17వ తేదీన జ్వరం రావడంతో మరుసటి రోజు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరంతోపాటు ప్లేట్లెట్లు పడిపోయాయి. వైద్యానికి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయన భార్య మస్రు కన్నీరు మున్నీరవుతోంది. జ్వరం వచ్చిన రెండు రోజులకే.. రావినూతలకు చెందిన పుచ్చకాయల లక్ష్మి (35)కి అక్టోబర్ 24న జ్వరం వచ్చింది. ఆమె భర్త జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తగ్గకపోవడంతో కోదాడలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. డెంగీ జ్వరం వచ్చిందని, ప్లేట్లెట్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో 26న లక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శక్తివంతమైన వైరస్ వల్లే..: డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం శక్తివంతమైన విరువెంట్ వైరస్ వల్లే బోనకల్ మండలంలో 22 మందికిపైగా మరణించారు. పారిశుద్ధ్య లోపం కూడా ప్రధాన కారణం. సాధారణ జ్వరంగా భావించి కొందరు స్థానిక వైద్యులను సంప్రదించారు. వాళ్లు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ప్లేట్లెట్లు తగ్గినా చివరి వరకు తెలియని పరిస్థితి నెలకొంది. మా అంచనా ప్రకారం 22 మంది కంటే ఎక్కువగానే చనిపోయి ఉంటారు. ==== జిల్లాల వారీగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు డెంగీ, మలేరియా కేసుల వివరాలు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లా డెంగీ మలేరియా ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆదిలాబాద్ 23 1,118 కరీంనగర్ 134 48 వరంగల్ 140 438 ఖమ్మం 894 825 మహబూబ్‌నగర్ 64 46 మెదక్ 19 66 నల్లగొండ 28 17 హైదరాబాద్ 377 138 రంగారెడ్డి 100 30 నిజామాబాద్ 204 32 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 1,983 2,758 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
సీజనల్ వ్యాదులతో అప్రమత్తం
అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సి. లక్ష్మారెడ్డి కోరారు. ఆయన సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి భవనం పరిస్థితిని పరిశీలించి, పాత భవనంలోని 1,2 అంతస్తుల్లోని వార్డులను, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. వార్డులలో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించి వారితో మాట్లాడారు. జహీరాబాద్‌కు చెందిన వెంకటనర్సింహ కిడ్నీలో రాళ్ళువచ్చాయని 45 రోజులుగా చికిత్స పొందుతున్నానని, రాత్రి వేళలో సెక్యూరిటీ సిబ్బంది లేని కారణంగా దొంగలు తిరుగుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒకరిద్దరు ముసుగులతో వచ్చి రాత్రి వేళ నిద్రించి వెళ్తున్నారన్నారు. రోగులకు భద్రత కరువైందని మంత్రికి ఫిర్యాదుచేశాడు. హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు కొరత ఉందని వారిని త్వరితగతిన నియమించాలని కోరుతూ నర్సులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సూపరిండెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... వైద్యశాఖ అన్ని పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక వైద్య క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రి భవనాన్ని ఎప్పటికప్పుడు ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందన్నారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు టీఎస్‌సీఎస్సీద్వారా 2118 పోస్టులకు త్వరలో నీటిపికేషన్ వెలువడనుందని అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ జీవీఎస్ మూర్తి, చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎంఓలు నజాఫీ, కవిత, రఫి, రాష్ట్ర వైద్యుల సంఘం అద్యక్షులు బొంగు రమేష్, నాగేందర్, ప్రవీణ్, అన్ని విభాగాల అదిపతులు, టిఆర్ఎస్ నాయకులు ఆర్వి మహేందర్, సంతోష్ గుప్త తదితరులు ఉన్నారు. నిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ పంజగుట్ట: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి సోమవారం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో నిమ్స్‌కు వచ్చిన ఆయన అరగంటపాటు అక్కడే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గం కార్యకర్తను పరామర్శించిన ఆయన పలువురు రోగులతో మాట్లాడి నిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశాడు. పలువురు రోగులు, సహాయకులు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని కోరగా వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, పలువురు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు. -
మంత్రి ఉన్నంతసేపే బెడ్షీట్లు..
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రంగు బెడ్షీట్ల తొలగింపు అంశంపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం విచారణ చేపట్టింది. వైద్యమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో నూతనంగా సమకూరిన మంచాలు, పరుపులు, రంగు బెట్‌షీట్లను శనివారం ప్రారంభించారు. కార్యక్రమం ముగిసి మంత్రి అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆర్థోపెడిక్ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బెడ్షీట్లు, దిండ్లను అక్కడి సిబ్బంది తొలగించారు. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, ఏడీలతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈసందర్భంగా సూపరింటెండెంట్ జేవీరెడ్డి మాట్లాడుతూ.. బెడ్షీట్లను తొలగించిన విషయం వాస్తమేనని, అయితే వార్డులో ఉన్న ఆరుగురు రోగుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఉన్న ఒక్కరినీ వేరే వార్డుకు తరలించాలని నిర్ణయించారని, ఈక్రమంలో డిశ్చార్జి అయిన ఒక రోగి దిండును తనతోపాటే తీసుకువెళ్లడాన్ని గమనించి సిబ్బంది అడ్డుకున్నారని, మిగిలినవి కూడా అపహరణకు గురవుతాయనే అనుమానంతో బెడ్షీట్లు, దిండ్లు తొలగించారని ప్రాధమిక విచారణలో వెల్లడైందని వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని త్రిసభ్య కమిటీని ఆదేశించామని, కమిటీ అందించే వివరాల మేరకు పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టులు 4,000
టీఎస్పీఎస్సీ ద్వారా 2,118 పోస్టుల భర్తీ: లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిలో కొత్త బెడ్షీట్లు, మంచాలు ప్రారంభించిన మంత్రి హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నాలుగు వేల వైద్యులు, సిబ్బంది పోస్టులు మంజూరు చేయడంతోపాటు ఖాళీగా ఉన్న 2,118 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నూతనంగా సమకూర్చిన మంచాలు, పరుపులు, బెడ్షీట్లను పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని, దీన్ని అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 వేల పడకలు ఉండగా, వాటిలో తుప్పు పట్టిన, పాడైన 12 వేల పడకలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సంపన్నులు, ప్రముఖులు కూడా వైద్యం పొందేలా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. ఉస్మానియాలో అత్యాధునిక వైద్యపరికరాలు, ఆధునిక హంగులతో ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీచింగ్ ఆస్పత్రుల్లో రెండు రంగుల (గులాబీ, తెలుపు) బెడ్షీట్లు, జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో రోజుకో రంగు చొప్పున ఏడు రంగుల బెడ్షీట్లు వినియోగిస్తామన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో ఏడు రంగుల దుప్పట్లను వాడాల్సి వస్తే ఒక్కో రంగు దుప్పట్లు రెండు జతలు అవసరమని, దాని ప్రకారం నిర్వహించడం కష్టమని భావించి ప్రస్తుతం రెండు రంగులకే పరిమితమయ్యామని లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వైద్యారోగ్యశాఖ నిర్వహించే టెండర్లలో ఎల్1 సిస్టం కరెక్టు కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోగ్య రంగం విషయంలో గత ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం 12 డయాలసిస్ సెంటర్లు ఉండగా, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో మరో 28 కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. -
ప్రతి జిల్లాలోనూ ఆయూష్ ఆస్పత్రులు
లాలాపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 20 పడకల ఆయూష్ హాస్పిటల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఆయూష్ వైద్యాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయూష్ వైద్య సేవలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయి నుంచే ఆయూష్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. గతంలో అల్లోపతి, హోమియోపతి, ఆయూష్ వేర్వేరు విభాగాలుగా ఉన్నందున నిరాదరణకు గురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా అన్ని రకాలైన వైద్య సేవలను ఒకే గొడుగు కిందికు తెస్తున్నామన్నారు. ప్రస్తుత ఆయూష్ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు నూతనంగా నిర్మించే హాస్పిటల్లలో ఆయూష్‌కు ప్రత్యేక స్థలం కేటాయించేలా, ఆహ్లదకరమైన వాతావరణం నెలకొల్పేలా వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామన్నారు. అనంతగిరిలో ఆయూష్ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయూష్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కమిషనర్ బుద్ధప్రకాష్, డాక్టర్ రమణి, లలితకుమారి, డా. కరుణాకర్‌రెడ్డి, నీరజారెడ్డి, మనోహర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణ ఎంసెట్‌పై తేలుస్తాం'
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌పై వస్తున్న ఫిర్యాదుల విషయంలో విచారణకు ఆదేశిస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి హామీ ఇచ్చారు. అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ఎంసెట్‌లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌లో మాత్రం వందల్లో ర్యాంకులు తెచ్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోచింగ్ సెంటర్లలో కూడా ప్రతిభ అంతతమాత్రమేనని తెలియడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆందోళనకు దిగారు. దీంతో అందరి అనుమానాలు నివృత్తి చేస్తామని లక్ష్మారెడ్డి చెప్పారు. -
కేన్సర్ ను తొలి దశలోనే గుర్తించాలి
♦ జిల్లా కేంద్రంలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ♦ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ♦ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ♦ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఖమ్మం/ఖమ్మం వైద్యవిభాగం : కేన్సర్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని, దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే చికిత్స సులభంగా చేయవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నగరంలోని మమత ఆస్పత్రి ఆవరణలో హరితహారం, ప్రభుత్వాస్పత్రిలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో గురువారం మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందన్నారు. పేదలకు ఇబ్బంది లేకుండా జిల్లా కేంద్రాల్లో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, డిజిటల్ ఎక్స్‌రే, కొత్త పడకల ఏర్పాటుతోపాటు సివిల్ పనులను పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతీ ఏటా విషజ్వరాలు, ఇతర కారణాలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిని మంత్రి లక్ష్మారెడ్డితోపాటు రెండు రోజులు పరిశీలించి.. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలంటే పోస్టులు భర్తీ చేయాలని మంత్రి లక్ష్మారెడ్డిని కోరారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రధానాస్పత్రిలో సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసి.. రూ.50లక్షల నిధులు కేటాయించిందన్నారు. ఖమ్మం ఆస్పత్రిని 450 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కవిత, మేయర్ పాపాలాల్, కలెక్టర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ మురళి, జిల్లా వైద్యాధికారి కొండల్రావు, డీసీహెచ్ అనందవాణి, సూపరింటెండెంట్ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. పలు విభాగాల పరిశీలన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లక్ష్మారెడ్డి డాక్టర్ కావటంతో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరీక్షించారు. అనంతరం ఆస్పత్రిలో మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని వారు పరిశీలించారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాలోగా కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను త్వరితగతిన కూల్చివేయాలన్నారు. మూడు రోజుల్లో ‘104’ తిరగాలి.. ఆస్పత్రి వెనుక భాగంలో మూలనపడి ఉన్న 104 వాహనాల వద్దకు వెళ్లిన మంత్రి లక్ష్మారెడ్డి.. అవి ఎందుకు తిరగట్లేదని డీఎంహెచ్ఓ కొండలరావును ప్రశ్నించారు. సగానికి పైగా వాహనాలు వాడకపోవడంతో మంత్రి అధికారులపై మండిపడ్డారు. అన్ని జిల్లాల్లో తిరుగుతున్నా.. ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా మూలనపడ్డ వాహనాలన్నీ రోడ్లపైకి రావాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో రూ.10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ఆయుష్ విభాగంలోకి వెళ్లి.. రోజూ ఎంతమంది వైద్యం చేయించుకుంటున్నారని అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి భద్రాచలం : సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. భద్రాచలంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల వివరాలు తెప్పించుకున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి ని ఆపటం ఎవరితరం కాదన్నారు. -
తెలంగాణ ఎంసెట్
- ఇంజనీరింగ్, ఆయుష్, వ్యవసాయ కోర్సులకే తెలంగాణ ఎంసెట్ - రద్దుకానున్న ప్రైవేట్ మెడికల్ ప్రవేశ పరీక్షలు - ప్రైవేటులోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లన్నీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశానికి సుప్రీంకోర్టు ‘నీట్’ తప్పనిసరి చేయడంతో ఈ నెల 15న నిర్వహించే ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్షపై నీలినీడలు అలుముకున్నాయి. వైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఇక ఉండదని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులంతా జూలైలో జరుగబోయే నీట్-2 ప్రవేశ పరీక్షకే సిద్ధం కాక తప్పదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒక్కసారికి ఎంసెట్‌కు అవకాశం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ద్వారానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లతోపాటు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు, 35 శాతం బీ కేటగిరీ సీట్లు, 15 శాతం ఎన్నారై కోటా సీట్లన్నీ భర్తీ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ మెడికల్ కాలేజీలు కూడా దీన్నే అనుసరించాల్సి ఉంటుంది. స్థానిక భాషలోనూ నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు సుప్రీం అవకాశం కల్పించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. అయితే ఆయుర్వేద, హోమియో, యునాని, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించాలనుకున్న ప్రభుత్వ ఎంసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేటు మెడికల్ ప్రత్యేక ప్రవేశ పరీక్షకు 10 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2,600 ఎంబీబీఎస్ సీట్లు.. 1,140 బీడీఎస్ సీట్లు తెలంగాణలో మొత్తం 17 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తోంది. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (725) ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తున్నారు. మరో 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీ యాజమాన్యాలే నేరుగా భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తమ ఆధ్వర్యంలోని బీ కేటగిరీ సీట్లను, ఎన్నారై (సీ కేటగగిరీ) సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పును శిరసా వహిస్తాం సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తాం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి. నీట్‌పై అవగాహన కల్పించేందుకు, సిలబస్ పట్ల స్పష్టత ఇచ్చేందుకు పేద విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అవసరమైతే నీట్‌పై పుస్తకాలను కూడా పంపిణీ చేస్తాం. - సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వారు ఎంసెట్ రాయాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. అయితే ఆయుష్ కోర్సులు, వ్యవసాయం దాని అనుబంధ కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్షనే రాయాల్సి ఉంటుంది. - డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ -
ఆరోగ్యశ్రీపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్షించారు. ట్రస్టు కార్యకలాపాలు, పథకం అమలు తీరు పరిశీలించారు. సోమవారం జరిగిన సమీక్షలో మంత్రి.. పేదలకు అందించాల్సిన వైద్య సౌకర్యాలు మెరుగు పరిచే ప్రతిపాదనలను పరిశీలించారు. ఆరోగ్య మిత్రల పనితీరు అధ్యయనం చేశారు. సిబ్బందిని పని ఆధారంగా కేటాయించాలని, పని తక్కువ ఉన్న వారిని, పనిభారం ఉన్న వారిని రేషనలైజ్ చేయాలన్నారు. సిబ్బందికి అందుతున్న అదనపు 30శాతం భత్యంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంటెన్సివ్ కేర్ సేవల్లో లోపం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అరచేతిలో ఆరోగ్య డేటా
► రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ త్వరలో ఉచిత వైద్య పరీక్షలు ► సమగ్ర ఆరోగ్య వివరాలతో స్మార్ట్ కార్డులు ► ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సలో సమస్యల్ని పరిష్కరిస్తాం ► వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: చాలా మందికి బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయన్న సంగతి తెలియనే తెలియదు! ప్రాథమిక స్థాయిలో రోగాలను గుర్తించకపోతే అవి ముదిరి నయం కాని స్థితికి చేరుకుంటాయి. ఒక్కోసారి చేయి దాటిపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి అందరికీ ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాదే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ప్రశ్న: ఆరోగ్య డేటా కార్డుల ఉద్దేశం ఏంటి? మంత్రి: అనేక వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవడం వల్ల చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇటీవల ఒకచోట నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 15 మందికి కేన్సర్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యాధి బారిన పడినవారు నిర్ఘాంతపోయారు. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వాటిని నయం చేయడానికి వీలుంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి ఆరోగ్యంపై వివరాలు సేకరించాలని నిర్ణయించాం. అందుకోసం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. బ్లడ్ గ్రూప్, లిఫిడ్ ప్రొఫైల్, గుండె, లివర్, కిడ్నీ ఇతరత్రా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలు సేకరిస్తాం. ఆ సమాచారాన్నంతా కంప్యూటరీకరించి ఆన్లైన్లో పెడతాం. ప్రతీ ఒక్కరికి ఒక ఆరోగ్య డేటా నంబర్ కేటాయిస్తాం. ఆ నంబర్‌తో ఏటీఎం కార్డు సైజులో ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డు జారీ చేస్తాం. ఏదైనా సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్తే డేటా కార్డుపై ఉన్న నంబర్‌తో ఆన్లైన్లో ఆ రోగి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. ప్రజలు కూడా తమ అనారోగ్య సమస్యలు తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్ర: అందరి ఆరోగ్య డేటా సేకరించడం సాధ్యమా? మంత్రి: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు డయాగ్నోస్టిక్ కేంద్రాలను నెలకొల్పుతాం. ఆయా కేంద్రాల్లో ప్రజలందరికీ ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య డేటా సేకరణకు నిర్ణీత తేదీలు ప్రకటించి ఆ ప్రకారం వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తాం. తర్వాత వారికి ఆరోగ్య డేటా కార్డులు అందజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్ర: 12 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందడం లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు? మంత్రి: త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడతాం. ఉద్యోగులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే కాకుండా ఆ స్థాయి లో మరో 24 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. కేవలం ఆ 12 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న అపోహలను ఉద్యోగులు విడనాడాలి. ప్ర: మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్య సేవలు అందడంలేదన్న విమర్శలున్నాయి కదా! మంత్రి: రాష్ట్రం మొత్తం అలా ఏమీలేదు. నిమ్స్‌లో ఈ మూడు నెలల్లోనే 6 వేల మందికి ఉచిత ఓపీ నిర్వహించాం. ఆ కాలంలో అక్కడ 600 శస్త్ర చికిత్సలు జరిగాయి. ఎక్కడైనా సమస్యలున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుతాం. ప్ర: వైద్యశాఖలో భర్తీ ప్రక్రియ ఎలా జరగబోతోంది? మంత్రి: వరంగల్ ఎంజీఎం, ఆరోగ్య వర్సిటీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో కొత్త ఉద్యోగాలు మంజూరయ్యాయి. ఇవిగాక ఇప్పటికే వైద్య శాఖలో పనిచేస్తున్న 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం. ప్ర: ఆసుపత్రుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. దీనిపై ఏమంటారు? మంత్రి: పాత ఔట్సోర్సింగ్ ఏజెన్సీలే ఇంకా కొనసాగుతుండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం సరిగ్గా లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితిని ఈ ఏడాది మెరుగుపర్చుతాం. అందుకు సూపరింటెండెంట్లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతను మేనేజ్మెంట్ నిపుణులకు అప్పగిస్తాం. -
గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి
మిడ్జిల్: గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా దోనూర్ గ్రామాన్ని మంత్రి లక్ష్మారెడ్డి దత్తత తీసుకున్నట్లు ఎంపిడిఓ తిర్పతయ్య తెలిపారు, మిడ్జిల్‌ను జెడ్పిటిసి హైమావతి,రాచాలపల్లిని ఎంపిపి దీప దత్తత తీసుకోగ మండలంలోని 30 గ్రామ పంచాయితిలకు ప్రత్యేకాధికారులను నియమించిన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఊర్కోండపేట్ గ్రామంలో ఎంపిడిఓ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్బంగా గ్రామస్థులకు గ్రామ జ్యోతి సందేశం చదివి వినిపించారు. అనంతరం గ్రామస్థుల చేత,విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ కష్ణగౌడ్ ,ఎంపిటిసి రాణి పాల్గోన్నారు. అలాగే మాధారం,బైరంపల్లి,వెలుగోమ్ముల ,కోత్తపల్లి గ్రామాలలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. -
ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన మంత్రి
కరీంనగర్: గోదావరి పుష్కరాలు ప్రభుత్వ అమాత్యులను ట్రాఫిక్ పోలీసులుగా మార్చాయి. ధర్మపురికి వెళ్లే దారిలో ట్రాఫిక్ నియంత్రించే కార్యక్రమంలో నిన్న మంత్రలు ఈటల రాజేందర్, హరీశ్ రావు, ఎమ్మెల్యే గంగుల కమాలకర్, భద్రాచలంలో తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీశ్ రెడ్డి పాల్గొనగా ఆదివారం కాళేశ్వరంలో అలాంటి బాధ్యతలనే మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల కారణంగా కాళేశ్వరం వెళ్లే దారిలో ట్రాఫిక్ కిక్కిరిసి ఉండటంతో దానిని క్లియర్ చేసే బాధ్యతలను మంత్రి లక్ష్మారెడ్డి తీసుకున్నారు. వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో అధికారులంతా రోడ్ల వెంటన డీజీల్, పెట్రోల్, మంచినీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా..100కి ఫోన్ చేయొచ్చని తెలిపారు. -
త్వరలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వరంగల్: వైద్య సంబం ధ నియూమకాల కోసం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల(ఎంజీఎం)ను ఆది వారం ఆయన సందర్శించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి బోధనా ఆస్పత్రుల అధికారులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ జరగలేదని, దీని వల్ల ఆయాఆస్పత్రుల్లో పెద్దఎత్తున సిబ్బంది కొరత ఉందన్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేసి ఖాళీల ను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉందని, దీన్ని పోగొట్టేందుకు కృషి చేయూలన్నారు. రాష్ట్ర ప్రభు త్వ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలని సూచించారు. -
మమ...ఇలా సందర్శించి.. అలా సమీక్షించారు
♦ వరాలివ్వని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ♦ చప్పగా సాగిన సమావేశం ♦ మంత్రి పర్యటనపై వైద్యవర్గాల్లో అసంతృప్తి నివేదికలు సేకరించడం... సమస్యలపై పవర్పారుుంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వంటి వాటికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏమైనా వరాలు కురిపిస్తారో... పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారోనని ఉద్యోగులు, సిబ్బంది సైతం వినతిపత్రాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యూరు. ఇలా ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎంజీఎం ఆస్ప్రతికి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి ఎటువంటి వరాలు ఇవ్వకుండానే వెనక్కి మళ్లడంతో అందరూ అసంతృప్తికి గురయ్యూరు. ఆస్పత్రిని పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి 30 నిమిషాల పాటు సందర్శించిన ఆనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశం సైతం చప్పగా సాగింది. సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ.. ప్రభుత్వా లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆదేశిస్తూ.. మంత్రి లక్ష్మారెడ్డి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో ైవైద్యసేవలతోపాటు ఏ రకమైన అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వైద్యవర్గాలు నిశ్చేష్టులయ్యూరుు. మొత్తానికి మంత్రి పర్యటన ఇలా సందర్శించారు.. అలా సమీక్షించారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. వైద్య సేవలపై ఆరా... మొదట మంత్రి లక్ష్మారెడ్డి ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని ఓపీ విభాగాన్ని, క్లినికల్ లాబారేటరీ, బర్న్స్ వార్డులను సందర్శించారు. అత్యవసర విభాగాలైన ఐఎంసీ, ఏఎంసీలోని రోగులను పరామర్శించారు. ఈ వార్డులో చికిత్స పొందుతున్న గర్నిపల్లికి చెందిన మమత, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీను, ఇబ్రహీంపట్నం మండలం ములరాంపూర్ గ్రామానికి చెందిన రాజగౌడ్‌ను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఐసీసీయూ (కార్డియాలజీ) విభాగంలో ఆర్ఐసీయూని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలోని అకాడమీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య విధానంలో సమూల మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవసరమైన సమస్యలను తెలపడంతో సలహాలు, సూచనలివ్వాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వా ఆస్పత్రులను దశల వారీగా మెరుగుపరుస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. పలు ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. ఎంజీఎం, సీకేఎం, కేఎంసీ ఆస్పత్రుల విద్యుత్, ఆస్తి పన్నుల బిల్లులు చెల్లింపు చేశామని, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ గతంలో కన్నా ఈ సారి వంద శాతం నిధులు పెంచి రూ.39 కోట్లు ఇచ్చామన్నారు. పీజీ విద్యార్థులకు ప్రతి నెల 5వ తేదీలోగా స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు సూపరింటెండెంట్ మనోహర్, ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ పలు అభివృద్ధి పనులతో పాటు సమస్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అదనపు విద్యుత్ అదనపు లోడ్ అవసరముందని, దానికి ప్రత్యేకమైన నిధులు కావాలన్నారు. 2013-14 నుంచి సర్జికల్ పద్దులో నిధుల కేటాయింపులు రావడం లేదని మంత్రికి వివరించారు. కాకతీయ మెడికల్ కళాశాల గురించి మంత్రికి ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ వివరించారు. ఫ్యాకల్టీలో లోటు 32 శాతం ఉందని, కేఎంసీకి అనుబంధంగా ఐదు ఆస్పత్రులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సీకేఎం, జీఎంహెచ్, టీబీ, రీజినల్ ఐ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాలను మంత్రికి సమర్పించారు. సమావేశంలో పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, డీఎంఈ పుట్ట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, ఆర్డీ నాగేశ్వర్రావు, సీకేఎం సూపరింటెండెంట్ సుధాకర్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ రాధ, ఆర్ఈహెచ్ సూపరింటెండెంగట్ పాండురంగ జాదవ్, టీబీ ఆస్పత్రి సూపరింటెడెంట్ కృష్ణ, మెడికల్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్రబాబు, కరుణాకర్‌రెడ్డి, రాజ్సిద్దార్థ్, కెఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వి. చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యులు పాల్గొన్నారు. -
వైద్యారోగ్యానికి రూ. 8 వేల కోట్లు?
- నేడు ఆర్థిక శాఖకు ప్రతిపాదన హైదరాబాద్: 2015-16 బడ్జెట్‌కు గానూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా ఉన్నతాధికారులు బుధవారం సమావేశమై రూ.8 వేల కోట్ల బడ్జెట్‌కు కసరత్తు పూర్తిచేశారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కు ఆ ప్రతిపాదనలను గురువారం సమర్పించనున్నారు. ఆరోగ్యశాఖ డెరైక్టరేట్‌కు రూ.1200 కోట్లు, వైద్యవిద్యా శాఖకు రూ.1700 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.500 కోట్లు, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.1330 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.420 కోట్లు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నిమ్స్, ఆయుష్ తదితర సంస్థలకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేశారు.