♦ వరాలివ్వని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
♦ చప్పగా సాగిన సమావేశం
♦ మంత్రి పర్యటనపై వైద్యవర్గాల్లో అసంతృప్తి
నివేదికలు సేకరించడం... సమస్యలపై పవర్‌పారుుంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వంటి వాటికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏమైనా వరాలు కురిపిస్తారో... పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారోనని ఉద్యోగులు, సిబ్బంది సైతం వినతిపత్రాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యూరు. ఇలా ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎంజీఎం ఆస్ప్రతికి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి ఎటువంటి వరాలు ఇవ్వకుండానే వెనక్కి మళ్లడంతో అందరూ అసంతృప్తికి గురయ్యూరు. ఆస్పత్రిని పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి 30 నిమిషాల పాటు సందర్శించిన ఆనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశం సైతం చప్పగా సాగింది.
సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ.. ప్రభుత్వా లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆదేశిస్తూ.. మంత్రి లక్ష్మారెడ్డి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో ైవైద్యసేవలతోపాటు ఏ రకమైన అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వైద్యవర్గాలు నిశ్చేష్టులయ్యూరుు. మొత్తానికి మంత్రి పర్యటన ఇలా సందర్శించారు.. అలా సమీక్షించారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
వైద్య సేవలపై ఆరా...
మొదట మంత్రి లక్ష్మారెడ్డి ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని ఓపీ విభాగాన్ని, క్లినికల్ లాబారేటరీ, బర్న్స్ వార్డులను సందర్శించారు. అత్యవసర విభాగాలైన ఐఎంసీ, ఏఎంసీలోని రోగులను పరామర్శించారు. ఈ వార్డులో చికిత్స పొందుతున్న గర్నిపల్లికి చెందిన మమత, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీను, ఇబ్రహీంపట్నం మండలం ములరాంపూర్ గ్రామానికి చెందిన రాజగౌడ్‌ను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఐసీసీయూ (కార్డియాలజీ) విభాగంలో ఆర్‌ఐసీయూని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలోని అకాడమీ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైద్య విధానంలో సమూల మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవసరమైన సమస్యలను తెలపడంతో సలహాలు, సూచనలివ్వాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వా ఆస్పత్రులను దశల వారీగా మెరుగుపరుస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. పలు ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. ఎంజీఎం, సీకేఎం, కేఎంసీ ఆస్పత్రుల విద్యుత్, ఆస్తి పన్నుల బిల్లులు చెల్లింపు చేశామని, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ గతంలో కన్నా ఈ సారి వంద శాతం నిధులు పెంచి రూ.39 కోట్లు ఇచ్చామన్నారు. పీజీ విద్యార్థులకు ప్రతి నెల 5వ తేదీలోగా స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు సూపరింటెండెంట్ మనోహర్, ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ పలు అభివృద్ధి పనులతో పాటు సమస్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అదనపు విద్యుత్ అదనపు లోడ్ అవసరముందని, దానికి ప్రత్యేకమైన నిధులు కావాలన్నారు. 2013-14 నుంచి సర్జికల్ పద్దులో నిధుల కేటాయింపులు రావడం లేదని మంత్రికి వివరించారు. కాకతీయ మెడికల్ కళాశాల గురించి మంత్రికి ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ వివరించారు. ఫ్యాకల్టీలో లోటు 32 శాతం ఉందని, కేఎంసీకి అనుబంధంగా ఐదు ఆస్పత్రులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం సీకేఎం, జీఎంహెచ్, టీబీ, రీజినల్ ఐ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాలను మంత్రికి సమర్పించారు. సమావేశంలో పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, డీఎంఈ పుట్ట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, ఆర్డీ నాగేశ్వర్‌రావు, సీకేఎం సూపరింటెండెంట్ సుధాకర్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ రాధ, ఆర్‌ఈహెచ్ సూపరింటెండెంగట్ పాండురంగ జాదవ్, టీబీ ఆస్పత్రి సూపరింటెడెంట్ కృష్ణ, మెడికల్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్రబాబు, కరుణాకర్‌రెడ్డి, రాజ్‌సిద్దార్థ్, కెఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వి. చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, వైద్యులు పాల్గొన్నారు.
మమ...ఇలా సందర్శించి.. అలా సమీక్షించారు
Published Mon, Apr 13 2015 2:16 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement