MGM Hospital
-
డాక్టర్ మృతి.. భార్య, ప్రియుడు స్కెచ్?
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. -
వరంగల్ ఎంజీఎం పవర్ కట్ పై కేటీఆర్ రియాక్షన్
-
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
హనుమకొండ: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హనుమకొండ, సాక్షి: జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన వాళ్లను వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లంతా ఏటూరునాగారంకు చెందిన ఒకే కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. దైవదర్శనం కోసం శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాల్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతులు మంతెన కాంతయ్య(72) మంతెన శంకర్(60) మంతెన భారత్(29) మంతెన చందన(16) చికిత్స పొందుతున్నవాళ్లు మంతెన రేణుక(60) మంతెన భార్గవ్(30) మంతెన శ్రీదేవి(50) -
విషాదానికి ముందు.. ఎంజీఎంలో చిన్నారి రాజు సరదా క్షణాలు
-
‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. -
వరంగల్ ఎంజీఎం.. పెద్దాసుపత్రిలో బయటపడ్డ నిర్లక్ష్యం
-
వరంగల్ ఎంజీఎం: స్ట్రెచర్ ఇవ్వలేదని భార్యను మోసుకెళ్లాడు
సాక్షి, వరంగల్: అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన వైరల్ అవుతోంది. వృద్ధురాలైన ఓ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. ఆపై కర్కశకంగా వ్యవహరించారు. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు ఆమె భర్త. అయితే పెద్దసారు(కన్సల్ట్ డాక్టర్) లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని ఆయన కోరగా.. సిబ్బంది అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మిని ఇలా ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీయడం, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేడయంతో వైరల్ అయ్యింది. గతంలో ఇదే ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పలు వ్యవహారాలు వెలుగులోకి వచ్చి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసే ఉంటుంది. అయినా పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ మాత్రం మెరుగుపడడం లేదన్న విమర్శ ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ‘‘ఎంజీఎంలో స్ట్రెచ్చర్ల కొరత లేదు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదు. ఎవరో కావాలని ఎంజీఎంను బద్నాం చేసేందుకే భుజాలపై పేషెంట్ ను తీసుకుపొమ్మని ఆ పెద్దాయనకు చెప్పి వీడియో ను వైరల్ చేశారు. వీడియో తీసి అతనిపై కేసు పెడతాం. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం అని తెలిపారాయన. అయితే.. ఆ పెద్దాయన మాత్రం ఎండలో తన భార్యను అలా వదిలేశారని, సిబ్బందిని స్ట్రెచర్‌తో రమ్మంటే రాలేదని, అందుకే తానే మోసుకొచ్చానని స్పష్టంగా చెబుతున్నారు. -
రోజురోజుకు పెరుగుతోన్న ఫ్లూ బాధితుల సంఖ్య
-
మెడికో ప్రీతి ఘటన.. హెచ్ఓడీపై బదిలీ వేటు.. పనిష్మెంటా? ప్రమోషనా?
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది. చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ.. -
ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
ప్రీతి ఆత్మహత్యయత్నంపై ప్రీతి ఫ్రెండ్స్ రియాక్షన్
-
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, పాములు
-
వరంగల్ : ఎంజీఎంలో పేషెంట్ల ఎదురుచూపులు (ఫొటోలు)
-
ఎలుకలు పట్టాలా.. వైద్యం చేయాలా
ఎంజీఎం: ‘ఎలుకలు పట్టమంటారా.. లేకపోతే రోగులకు చికిత్స చేయమంటారా. మేమే పనిచేయాలో చెప్పండి’.. అంటూ ఎంజీఎం వైద్యులు ఎలుకల బోన్లను పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీడీఏ) ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో నిజమైన బాధ్యులను వదిలేసి వైద్యులను అభద్రతాభావానికి గురిచేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ అధ్యక్షుడు రాజ్‌మోహన్, కార్యదర్శి హరిదేవ్, వైద్యులు పవన్, చంద్రబాను, అన్వర్‌మియా పాల్గొన్నారు. -
ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు?.. ఆ రోజు అసలు ఏం జరిగింది?
సాక్షి, వరంగల్/ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో ఎలుక ఘటన కేసులో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావును ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. వరంగల్ కలెక్టర్ గోపి అధ్యక్షతన ఎంజీఎం వైద్యులకు సంబంధం లేకుండానే అంతర్గత విచారణ వేగిరం చేసినట్టుగా తెలిసింది. ఎలుక కొరికినా.. ఎందుకు పట్టించుకోలేదు? భీమారానికి చెందిన శ్రీనివాస్ గత నెల 26న ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్(ఆర్ఐసీయూ)లో చికిత్స అందించారు. అదేరోజు శ్రీనివాస్‌ను ఎలుక కొరికింది. వైద్యులు, సిబ్బంది ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అక్కడి విభాగాధిపతి, రోగి బాగోగులు చూసుకునే స్టాఫ్‌నర్సులతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్‌ను బృందం విచారించినట్లు సమాచారం. మళ్లీ గురువారం అదే పేషెంట్‌ను ఎలుక కొరికే వరకు ఎందుకు పట్టించుకోలేదని, విధుల్లో అలసత్వంగా ఉన్నారని బృందం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంజీఎంను శుక్రవారం సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఇప్పటికే అంతర్గత సమావేశంలో ఆర్ఐసీయూ ఇన్చార్జ్, నర్సింగ్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేయడం చర్యలు తీసుకునేందుకు సంకేతమనే ఎంజీఎం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉండే ఆర్‌ఐసీయూలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగతా వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసే కాంట్రాక్టు సంస్థ ఏజిల్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెడతామని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించడంతో ఆ సంస్థపై చర్యలకు సంకేతాలిచ్చినట్లయ్యింది. ఇలా ఓ వైపు వైద్యులు, నర్సులు.. మరోవైపు కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటున్నారు. ఎలుకల కోసం వేట! ఎలుక కొరికిన ఘటనతో ఎంజీఎంకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో భారీ సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం ఉగాది అయినప్పటికీ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు వార్డులను శుభ్రం చేయడం కనిపించింది. మురుగు కాల్వల్లో నీరు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలుకల కోసం మరిన్ని బోనులు ఏర్పాటు చేశారు. ఆయా బోనుల్లో చిక్కిన కొన్ని ఎలుకలను దూరంగా విడిచివచ్చినట్లు సిబ్బంది తెలిపారు. -
‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
హసన్‌పర్తి: నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్‌పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. -
ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ కన్నుమూత
-
ఎంజీఎం ఘటన: ఎలుకల దాడిలో గాయపడ్డ బాధితుడి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చికిత్స పొందుతూ.. ఇవాళ వేకువ జామున కన్నుమూశాడు. శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతినడంతో రక్తస్రావం జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, చాలామంది ఎలుకల దాడికి గురయ్యారని పేషెంట్లు వాపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది. శ్రీనివాస్‌పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండె వైఫల్యంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు. -
నిర్లక్ష్యాన్ని సహించం
సాక్షి, వరంగల్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, దానిని ఇలాగే కొనసాగించేలా ఆస్పత్రుల నిర్వహణను సమర్థంగా చేపడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇదే సమయంలో ఆస్పత్రుల ప్రతిష్ట మసకబారే విధంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్ ఎంజీఎంలోని ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డితో కలసి ఆస్పత్రిని సందర్శించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలోని వివిధ వార్డులను సందర్శించి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగి శ్రీనివాస్‌ను ఎలుకలు కొరకడం దురదృష్టకరమని, ఇది ముమ్మాటికీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని అన్నారు. ‘సర్కారీ దవాఖానాల్లో సహజంగానే పేషెంట్ కేర్, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. రోగుల పట్ల నిర్లక్ష్యం కావాలని ఉండదు. అయినా ఇలాంటి ఘటన జరగడం విచారకరం. అందుకే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే విచారణ చేసి బాధ్యులుగా భావిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. ఆర్ఐసీయూ ఇన్చార్జి డాక్టర్ నాగార్జునరెడ్డిపై కూడా విచారణ జరుగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయి’అని ఆయన తెలిపారు. ఎంజీఎంలో పేషెంట్ కేర్‌తోపాటు పారిశుద్ధ్య పనులను చూస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని, ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి చెప్పారు. -
నర్సింగ్ విద్యార్థిని రవళి మృతి
సాక్షి, వరంగల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోహిణి నర్సింగ్ కళాశాల విద్యార్థిని కాందారపు రవళి(20) రెండు రోజులుగా రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన కాందారపు తిరుపతి, రజిత దంపతుల పెద్ద కూతురు కందారపు రవళి హంటర్‌రోడ్డులోని రోహిణి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఈనెల 7న రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు, యాజమాన్యం రోహిణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఎంజీఎంకు పంపించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. విచారణ అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల గోడు పట్టించుకోరా..? రవళి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు రోహిణి కళాశాల యాజమాన్యం తెలియజేయకుండా రవళి స్నేహితులు తెలియజేశారు. ఆ తరువాత రోహిణి ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో రవళిని చూడటానికి తల్లిదండ్రులకు అనుమతించారు. రవళి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చేరవేసిన తోటి విద్యార్థినులను తల్లిదండ్రులకు కలువనివ్వలేదు, ఆ విద్యార్థినులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడి అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి రవళి మృతిచెందిన విషయం కూడా యాజమాన్యం మృతదేహాన్ని ఎంజీఎం పంపడానికి అన్ని సిద్ధం చేసుకున్నాకే తెలియజేసినట్లు తెలిసింది. ఈ సంఘటనల నేపథ్యంలో రవళి మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ గోడును యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల ఎదుట విలపించినట్లు తెలిసింది. పోలీసులతో వాగ్వాదం.. నర్సింగ్ విద్యార్థిని రవళి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం పలు విద్యార్థి సంఘాల నేతలు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సుబేదారి పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు యాజమాన్యానికి బాసటగా నిలిచి మృతురాలి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. మృతదేహాన్ని అర్ధరాత్రి ఎంజీఎంకు ఎందుకు పంపించారని వారు ప్రశ్నించారు. గోపాల్పూర్ గ్రామ సర్పంచిని అడ్డుగా పెట్టుకుని యాజమాన్యం తల్లిదండ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ సంఘటనపై అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి రవళి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో విద్యార్థి సంఘాల నేతలు తిరపతియాదవ్, కన్నం సునిల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, వినోద్ లోక్‌నాయక్, ఎండీ పాషా, ఏకు ప్రవీణ్, నరేష్, దుప్పటి సుభాష్, రాకేష్ పాల్గొన్నారు. -
ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు..!
సాక్షి, వరంగల్: ‘ఎంజీఎంల మంచిగ సూత్తరట’ అని ఎవరో అంటూంటే విని వచ్చాడు భీంరావు. అతడిది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామం. 8:20కి బస్సు దిగాడు. త్వరత్వరగా వెళ్లి ఓపీ దగ్గర పేరు రాయించుకునేందుకు లైన్లో నిల్చున్నాడు. అప్పటికే తనకంటే ముందు ఓ పదిమంది లైన్లో ఉన్నారు. ఓ వైపు తీవ్రమైన కడుపునొప్పి. అరగంట దాటింది. ‘ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు’ అని అడిగాడు భీంరావు. ‘వస్తారు’ అని సమాధానమిచ్చింది నర్సు. అలా దాదాపు మరో గంట గడిచింది. సరిగ్గా పదింటికి వచ్చారు ఓపీ చిట్టీలు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు. కంప్యూటర్లు ఆన్ చేసి, అందులో పనిచేసే వాళ్లకు తెలిసిన వాళ్లకు, వెనుకవైపు కిటికీ నుంచి ఇంకా బాగా తెలిసిన వాళ్లకు.. ఇలా భీంరావు వంతు వచ్చే సరికి అరగంట పట్టింది. అప్పటికి క్యూలైన్ మరింత పెరిగింది. ఓపీ చిట్టీ అందుకొని డాక్టర్ రూమెక్కడమ్మా.. అని అడుగుకుంటూ పరిగెట్టాడు భీంరావు. ఇలా ఒక్క భీంరావు మాత్రమే కాదు. ఎంతోమంది నిత్యం ఓపీ చిట్టీల దగ్గర ఎదురుచూడాల్సిందే! నిత్యం వేలాది మంది ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అంత మంచి పేరున్న ఆస్పత్రిలో కొందరి కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది సిబ్బంది నెల రోజులుగా సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రతీ సోమ, మంగళ, బుధవారాల్లో రోగులు కొన్ని సందర్భాల్లో వైద్యులను కూడా కలవకుండానే వెనుదిరుగుతున్నారు. ఒకవేళ కలిసినా స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటే సమయం సరిపోక మరో రోజు తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు. లేదంటే తెలిసిన వారింట్లో, బంధువుల ఇంట్లో తలదాచుకొని తెల్లవారి వస్తున్నారు. అసలే మళ్లీ కరోనా వేరియంట్ రూపు మార్చుకుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే సమయానికి వైద్యున్ని కలిసే అవకాశం కూడా దొరకట్లేదు. రోగులకు ఇక్కట్లు.. రోగులకు సమయానుకూలంగా సేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనబడుతోంది. సోమవారం రూమ్ నంబర్ 3 (ఓపీ చిట్టిలు ఇచ్చే విభా గం) నుంచి అర కిలో మీటరు మేర రెండు క్యూ లైన్లు ఉండడాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. దీనికి కారణం ఏంటని వివరాలు ఆరా తీయడంతో కంప్యూటర్ అపరేటర్లు ఆలస్యంగా వస్తున్నారని తెలిసింది. దీంతో పాటు రోగులను పరీక్షించాల్సిన ప్రత్యేక డాక్టర్ల స్థానంలో చాలామంది పీజీ వైద్యులే ఉన్నారు. చాలా మంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లపై దృష్టి సారించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆసుపత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు, అటు వైద్యుల సమయపాలన లేమితో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిలబడలేక మరింత నడుంనొప్పి మామూనూరు క్యాంప్ సమీపంలోని జక్కలోది నుంచి ఆసుపత్రికి వచ్చా. గత సోమవారం వచ్చినప్పటికీ భారీ క్యూలైన్ ఉండడంతో నిల్చోలేక అవస్థలు పడ్డా. ఈ సోమవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. నడుం నొప్పి విపరీతంగా ఉండడంతో చూపించుకునేందుకు వచ్చా. ఇంకా నా చేతికి ఓపీ చిట్టి రాలేదు. క్యూలైన్ ఉండడంతో ఇంకా మరింత నడుంనొప్పి కలుగుతోంది. – వరమ్మ, జక్కలోది గ్రామం 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చా.. దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా. కీళ్ల నొప్పులు ఉండడంతో వైద్యుడితో పరీక్షించుకునేందుకు వచ్చా. ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నా అప్పటికే లైన్ పెద్దగా ఉంది. 8.30కు రావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లు రాకపోవడంతో గంటన్నరపాటు లైన్లోనే నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బాగా కాళ్లు గుంజినై. – బక్కయ్య, దంతాలపల్లి మండలం, బొడ్డలడ గ్రామం -
వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు
-
వరంగల్ ఎంజీఎం: భయంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
ఎంజీఎం: కోవిడ్ పాజిటివ్ బాధితుడతను. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆక్సిజన్ లెవల్స్ 66 శాతమే ఉన్నాయి. మనిషి కూడా మానసిక ఆందోళనతో కనిపించాడు. ఇలాంటి తరుణంలో ఆరు రోజులు డాక్టర్లు అతనికి మనోధైర్యం చెబుతూ చికిత్స అందించారు. దాంతో ఆక్సిజన్ లెవల్స్ 93 శాతానికి పెరిగాయి. ఇక రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడివి అవుతావని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా బాగవుతావని భరోసా ఇచ్చారు. అయినా అతనిలో మానసిక ఆందోళన తొలగిపోలేదు. తనకు ఏదో అయిందన్న భయంతో ఆస్పత్రి భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలకేంద్రానికి చెందిన రాయపురం లింగమూర్తి (34) ఈ నెల 24న కోవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. 66 ఉన్న ఆక్సిజన్ లెవల్స్ ఆరు రోజుల్లో 93కు పెరిగాయి. అయినా రెండు రోజులుగా అతను తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆస్పత్రి భవనం రెండో అంతస్తునుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందాడు. మరో రెండు రోజులు చికిత్స పొందితే అతను కోలుకుని ఇంటికి వెళ్లేవాడని ఎంజీఎం అధికారులు తెలిపారు. మనోధైర్యమే కరోనాకు సగం మందు అని పేర్కొన్నారు. మృతుడి తమ్ముడు ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండేళ్లలో మోడ్రన్ జైలును నిర్మిస్తాం: రాజీవ్ త్రివేది
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని సెంట్రల్ జైలుని మంగళవారం జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. కాగా గతంలో కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా సెంట్రల్ జైలు స్థానంలో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వరంగల్ సెంట్రల్ జైలును వేరే చోటికి తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నట్లు రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' ప్రస్తుతం ఈ జైలులో 956 మంది ఖైదీలు, 2,667 మంది సిబ్బంది ఉన్నారు. ఇవాళ మొత్తం 119 మంది ఖైదీలను తరలిస్తున్నారం. 15 రోజుల్లోగా ఖైదీల తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలును వేరొకచోట మోడ్రన్ జైల్‌గా నిర్మిస్తాం. కొత్త జైలు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్లలోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైలును మోడ్రన్ జైలుగా నిర్మాణం చేపడతాం. ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.'' అని రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. -
అమానుషం: చివరిలో ఉంది.. ఏం చికిత్స చేస్తాం?
ఎంజీఎం/వరంగల్:ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంది.. చూడండి సార్ అంటూ బాధితురాలి బంధువు ప్రాథేయపడినా కనికరించలేదు. ‘‘చివరి దశలో ఉంది. ఏం చికిత్స చేస్తాం’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయితే.. సకాలంలో వైద్యం అందక కరోనా బాధితురాలు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన లింగోజు ఉమ (60)కు కరోనా లక్షణాలు ఉండటంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి బాగోలేదు వెంటనే చికిత్స అందించాలని బాధితురాలి బంధువు రామకృష్ణ డ్యూటీ డాక్టర్లను ప్రాథేయపడ్డాడు. ‘చివరి దశలో ఉంది.. చేసేదేమీ లేదు’ అంటూ డ్యూటీ డాక్టర్లు అనడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయాన్ని రామకృష్ణ తనకు తెలిసిన వారితో ఎంజీఎం పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లే సరికి ఆమె తుదిశ్వాస విడిచింది. చదవండి: సుత్తితో మోది..పొలంలో కాల్చేసి.. -
ఎప్పుడొచ్చారు.. ఇప్పుడెలా ఉంది? : సీఎం కేసీఆర్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘ఏమ్మా బాగున్నవా.. ఆరోగ్యం ఎట్లుంది.. ఏ ఊరే పెద్దమనిషి.. ఎప్పుడొచ్చారు.. భోజనం మంచిగ పెడ్తున్నరా.. గోలీలు మంచిగ ఇస్తున్నరా..’’ అంటూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరామర్శిం చారు. పేషెంట్లు చికిత్స పొందుతున్న బెడ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, టైం ప్రకారం మందులు, గోలీలు ఇస్తున్నరా అని అడిగి తెలుసుకున్నారు. ‘‘డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటరు. ఆరోగ్యం మంచిగ కాగానే ఇంటికి పంపిస్తరు. ఏం ఫికర్ పడొద్దు. అండగా నేనున్నా..’’ అంటూ బాధితుల్లో మనో ధైర్యం నింపారు. కరోనా బాధితులు, ఇతర రోగులకు చికిత్సకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని.. అందరికీ మంచి చికిత్స అందించాలని వైద్యులు, ఇతర సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. వార్డులన్నీ కలియదిరిగి, బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. తర్వాత ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఇతర మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో మాట్లాడి.. వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవలను అభినందించారు. బాధితుడిని తేలిక పరుస్తూ.. సీఎం: మీదే ఊరు, పేరేంటిది పెద్దమనిషి? వెంకటాచారి: సార్.. వెంకటాచారి సార్... మట్టెవాడ సీఎం: ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడికీ వెంకటాచారి: పన్నెండు రోజులైతంది సారు... సీఎం:ఇప్పుడెలా ఉంది... వెంకటాచారి: మంచిగనే ఉన్నది సారు.. గోలీలు ఇస్తున్నరు... భోజనం పెడుతున్నరు సీఎం: మందులు వాడుతా ఉండూ.. తొందరగానే తగ్గుతుంది... (సీఎం కేసీఆర్ పరామర్శ అనంతరం ఆ వృద్ధుడు వెంకటాచారి ఆనందంతో ‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆర్ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేశారు.) సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడిన సీఎం.. ఎంజీఎం సందర్శన తర్వాత.. అక్కడికి సమీపంలో ఉన్న సెంట్రల్ జైలును కేసీఆర్ సందర్శిం చారు. బ్యారక్‌లు, ఓపెన్ జైలు, నర్సరీలలో కలియతిరి గారు. ఖైదీలతో మాట్లాడారు. ఏ నేరంపై వచ్చారు, ఏ ఊరు, కుటుంబ పరిస్థితి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు. అభ్యర్థనలను స్వీకరించారు. జైలు లోపల ఉన్న ఫినాయిల్, సోప్, స్టీల్ ఫర్నిచర్, ప్రింటింగ్ ప్రెస్, చేనేత వస్త్రాల తయారీ యూనిట్లను, ఖైదీలు తయారుచేస్తున్న శానిటైజర్, మాస్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులతో సీఎం మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిని పూర్తిగా మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చనున్నామని.. సెంట్రల్ జైలును మరోచోటికి తరలించి, ఈ ప్రదేశంలో అన్ని చికిత్సలు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నూతన జైలు నిర్మాణానికి ఎంత భూమి అవసర మని సీఎం అడగ్గా.. 130 ఎకరాల వరకు కావాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సైతం 130 ఎకరాల్లో ఉందని, వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు మహా పరివర్తన, ఉన్నతి తదితర కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఖైదీలకు ఉపాధి కల్పించే కర్మాగారాలు, తీవ్రవాదులను ఉంచే హైసెక్యూరిటీ బ్యారక్స్, ఓపెన్ జైలు వంటి వాటికోసం కలిపి కనీసం 100 ఎకరాలకుపైన భూమి అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు ధాన్యం సేకరణ వేగిరం చేయండి కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాను హెలికాప్టర్లో వస్తుండగా రోడ్లమీద వడ్ల కుప్పలు కనిపించాయని చెప్పారు. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో పడతారని, అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు ఉన్నారు. కఠినంగా లాక్డౌన్ అమలు ఆస్పత్రి, జైలు సందర్శన తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం పేరుపేరునా పలకరించి మాట్లాడారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటని అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీ, కలెక్టర్లపై ఉంది. ఉదయం సడలింపు ఇచ్చిన నాలుగు గంటలు మినహా.. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చెయ్యాలె. అలసత్వం వహించకూడదు. ఉదయం 10గంటల 10 నిమిషాల తర్వాత పాస్ హోల్డర్స్, అత్యవసర సేవల వారు తప్ప మరెవరూ రోడ్డు మీద కనిపించకుండా చర్యలు చేపట్టాలి. సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ సరిగా అమలు జరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచైనా కఠినంగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అమలు చేయిస్తున్నారని.. నగరాల్లో, పట్టణాల్లో మాత్రం పకడ్బందీగా అమలు కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఎంజీఎంలో యాదమ్మతో.. ధైర్యంగా ఉండు సీఎం కేసీఆర్: అమ్మా.. మీ పేరేంటి? యాదమ్మ: యాదమ్మ సార్ ఏ ఊరమ్మ... ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది రంగశాయిపేట.. ఇక్కడ్నే వరంగల్‌లో.. ఇప్పుడెలా ఉంది.. మంచిగనే ఉందిగదా! సార్ ఇప్పుడు మంచిగనే ఉంది.. పూర్తిగా మంచిగైతే ఇంటికి పోదామని సూత్తన్న భోజనం, గోలీలు మంచిగ ఇస్తున్నరా..? మంచిగనే ఇస్తున్నరు. తొందరగ నయమైతే బాగుండనిపిస్తుంది మీకేమీ కాదు.. ధైర్యంగా ఉండు.. అండగా నేనుంటా సార్.. మీరు చల్లగుండాలె.. కరోనాకు చికిత్స పొందుతున్న 68 ఏళ్ల వృద్ధురాలి వద్దకు కేసీఆర్ వెళ్లగానే ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ‘‘సార్ మిమ్మల్ని చూసి చాన్నాళ్లయింది. మీరిక్కడికి రావడం, మిమ్ములను చూడటం సంతోషంగా ఉందయ్యా. మీరు చల్లగా ఉండాలె..’’ అని సంతోషపడ్డారు. సీఎం పర్యటన సాగిందిలా.. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు, పలు ఇతర కార్యక్రమాల కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి వచ్చా రు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యా హ్నం 12.40 గంటలకు ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. డబుల్ మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించి 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలియదిరిగారు. ఐసీయూ, వార్డులను సందర్శించారు. కోవిడ్ బాధితులు, ఇతర పేషెంట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. తర్వాత సమీపంలోని సెంట్రల్ జైలును పరిశీలించా రు. ఖైదీలు, జైలు అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
Warangal: కరోనా బాధితులతో సీఎం కేసీఆర్
-
Telangana: కరోనా బాధితులతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరంగల్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు శుక్రవారం రోడ్డుమార్గాన వెళ్లారు. వరంగలోని ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ వార్డులను పరిశీలించారు. కరోనా వైరస్ బాధితులకు సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సీఎం మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ సందర్శించిన విషయం తెలిసిందే. నగరంలో 5 గంటలు.. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉమ్మడి వరంగల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర జిల్లాల్లో పర్యటించినా.. వరంగల్ నగరానికి చాలాకాలం తర్వాత వస్తున్నారు. సుమారు 5 గంటల పాటు వరంగల్‌లో ఉండనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రి, సెంట్రల్ జైలును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. కోవిడ్ వార్డులో బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆరు సెక్టార్లుగా భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు ఓరుగల్లుకు సీఎం కేసీఆర్..
-
నేడు ఓరుగల్లుకు సీఎం కేసీఆర్.. ఎంజీఎం ఆస్పత్రి పరిశీలన
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం అక్కడున్న రోగులతో వైద్యానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్.. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా హంటర్‌రోడ్‌లోని ఎంపీ కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. కొద్దిసేపు విరామం తర్వాత 11.20 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలు సందర్శనకు బయలుదేరుతారు. జైలు ఆవరణ, సౌకర్యాలు, ఖైదీల వసతులను పరిశీలించిన అనంతరం జైలు అధికారులు, ఖైదీలతో మాట్లాడతారని అధికారులు వెల్లడించారు. జైలు సందర్శన తర్వాత నేరుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని భోజనం చేసిన అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం కేసీఆర్ 2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేసుకుంటారు. వైద్యం పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆస్పత్రిలో సౌకర్యాలను పరిశీలించనున్నారు. ఉన్నత స్థాయి సమీక్ష..! ఎంజీఎంను పరిశీలించిన పిదప 3 గంటలకు కరోనా బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా నియంత్రణ చర్యలపై కీలకమైన ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. 4 గంటలకు తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. నగరంలో 5 గంటలు.. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉమ్మడి వరంగల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర జిల్లాల్లో పర్యటించినా.. వరంగల్ నగరానికి చాలాకాలం తర్వాత వస్తున్నారు. సుమారు 5 గంటల పాటు నగరంలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రి, సెంట్రల్ జైలును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ వార్డులో బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. కాగా సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆరు సెక్టార్లుగా భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు. చదవండి:మీకు అండగా నేనున్నా.. భయపడొద్దు: మంత్రి హరీశ్‌రావు -
ఎంజీఎం: ఒకరు కన్నుమూస్తేనే మరొకరికి బెడ్
వరంగల్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి. అలాంటి ఈ ఆస్పత్రిలో 800 పడకలతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. కోవిడ్ వార్డు లో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా మృతి చెందితే తప్ప కొత్త వారికి బెడ్ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ మహిళకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాగా, కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంకు తీసుకొచ్చారు. అక్కడి ఆర్ఎంఓ, సిబ్బందికి తమ సమస్య చెప్పినా వారెవరూ పట్టించుకోలేదు. పడకలు ఖాళీగా ఉన్నా, ఫ్లో మీటర్లు లేనందున ఆక్సిజన్ పెట్టలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆ మహిళ గంటల తరబడి వార్డు బయటే వేచి ఉన్నారు. ఎలాగైనా ఆక్సిజన్ పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని కోరుతున్న క్రమంలోనే, అప్పటికే చికిత్స పొందుతున్న ఓ బాధితుడు మృతి చెందాడు. దీంతో మళ్లీ సిబ్బందిని బతిమిలాడగా, అప్పుడు ఆ మహిళకు బెడ్‌ను కేటాయించి చికిత్స ప్రారంభించారు. చదవండి: ఇలా ఐతే.. వైద్యం ఎలా ? -
ఇలా ఐతే.. వైద్యం ఎలా ?
ఎంజీఎం/వరంగల్ : ఎన్నో ఆశలతో తమ ప్రాణాలు నిలుస్తాయనే భావనతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే వారికి నిరాశే మిగులుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నా వారికి పీపీఈ కిట్లు, మాస్క్‌లతో పాటు బాధితులకు రెమ్‌డిసివర్ ఇంజక్షన్లు సమకూర్చలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తద్వారా బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఎంజీఎంలోని కరోనా వార్డును బండి సంజయ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్ ధరించిన ఆయన వైద్యులతో కలిసి వార్డులో బాధితులతో మాట్లాడారు. చికిత్స, పౌష్టికాహారంపై ఆరా తీశాక సంజయ్ ఆస్పత్రి బయట విలేకరులతో మాట్లాడారు. బాధ కలుగుతోంది.. ఎంజీఎం ఆస్పత్రిని చూస్తే బాధ కలుగుతోందని.. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన కోవిడ్ వార్డులు సాధారణ వార్డులకంటే అధ్వాన్నంగా మారాయని సంజయ్ పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై భారం పడుతోందన్నారు. ఇప్పటికే డాక్టర్ శోభారాణి, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లకు సరైన వైద్యం అందక మృతి చెందారంటే మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వైద్యులు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించి ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చే శారు. కాగా, పీఎం కేర్స్ ఫండ్ నుంచి వంద వెంటిలేటర్లు వచ్చినా వాటిని ఎందుకు వినియోగించడం లేదో చెప్పాలన్నారు. సంజయ్ వెంట ఎంజీఎం సూ పరింటెండెంట్ నాగార్జునరెడ్డి, ఆర్ఎంఓ వెంకటరమణ, వైద్యులు, బీజేపీ నాయకులు ఉన్నారు. చదవండి: కేసీఆర్ కళ్లుమూసుకుని పరిపాలిస్తున్నారు: వైఎస్ షర్మిల -
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
ఎస్పీ బాలు ఆస్పత్రి బిల్లుపై వదంతులు
సాక్షి, చెన్నై : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు. కట్టుకథలు అల్లి, అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ చరణ్ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు. (ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్) మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్ ప్రెసిడెంట్ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు. (ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్) -
ఆసుపత్రి బిల్లులు త్వరలోనే వెల్లడిస్తాం
-
వాటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తాము: ఎస్పీ చరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది బాలుకు సరిగా వైద్యం అందించలేదని, అంతేకాకుండా మొత్తం బిల్లు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించమని ఆయన కుటుంబాన్ని వేధించినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. వాటిని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఖండించారు. సోషల్ మీడియాలో అయిదు నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం వైద్యానికి సంబంధించిన బిల్లులను త్వరలోనే వెల్లడిస్తానని, దాంతో అందరికి ఈ వదంతులపై ఒక అవగాహన వస్తుందని అన్నారు. ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఏం లేదని చరణ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై చరణ్ మాట్లాడుతూ, ‘అసలు ఇలాంటి విషయాన్ని ఎవరు సృష్టిస్తారో అర్థం కావట్లేదు. అలాంటి మాటలు ఎంతమందిని బాధపెడతాయో వాళ్లకు తెలియడం లేదు. ఇలాంటి ప్రచారం చేస్తోంది కచ్ఛితంగా బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కాదు. ఎందుకంటే నాన్న ఎప్పటికీ ఇలా చేయరు. ఆయన అభిమానులు కూడా ఇలా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. అలాగే ఇలా ప్రచారం చేసే వాళ్లని నేను కూడా క్షమిస్తున్నాను’ అని తెలిపారు. ఇక బాలసుబ్రహ్మణ్యం మరణించే సమయానికి ఆసుపత్రికి 1.85కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉందని, మొత్తం బిల్లు 3 కోట్ల పైనే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. బ్యాలెన్స్ డబ్బులు చెల్లిస్తే కాని మృతదేహాన్ని అప్పగించమని ఆసుపత్రి సిబ్బంది బాలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిందని ఫేక్‌న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈ విషయంలో బాలు కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వ జోక్యాన్ని కోరగా పళనిస్వామి ప్రభుత్వం స్పందించలేదని, తరువాత జాతీయ స్థాయిలో సంప్రదించగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలు మృతదేహాన్ని అప్పగించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎస్పీ చరణ్ ఖండించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి బిల్లుల వివరాలను వెల్లడిస్తానని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో చరణ్ పేర్కొన్నారు. -
దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్
సాక్షి, చెన్నై: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులకు సంబంధించి చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందనే వార్తల నేపథ్యంలో ఎస్పీ చరణ్ స్పందించారు. కొంత మంది కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్మెంట్కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అనారోగ్యం బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నపట్పికీ ఆరోగ్యం తిరగబెట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించింది. (చదవండి: పాట కోసం రథమే వేసుకొచ్చావ్!) -
ఆ వార్త ఎంతగానో కుంగదీసింది: అలీ
సాక్షి, హైదరాబాద్: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సినీనటుడు అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలీ కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీబీ మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కుటుంబ పెద్దను కోల్పోయా. ఆయన లేని లోటు పూడ్చలేనిది. బాలు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఎన్నో భాషల్లో వేలకొద్ది పాటలు పడే అవకాశం ఎస్పీబీకే దక్కింది. నేను బాబాయ్ అని పిలిచేవాడిని. నన్ను కన్నకొడుకులా ఆదరించారు. చరణ్‌తో సమానంగా నన్ను చూసుకునేవారు. బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తమరాయిపక్కంలోని బాలు ఫామ్‌హౌజ్‌లో ఆయన అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. బాలు అంత్యక్రియలను తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది. (చదవండి: బాలు నటించిన సినిమాలు) -
వెంటిలేటర్‌పై బాలు: వీడియో వైరల్
-
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు
-
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు
సాక్షి, చెన్నై : భారతీయ దిగ్గజ గాయకుల్లో ఒకరైన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. 17 భాషల్లో 41 వేల 230 పాటలు పాడిన బాలు తమను వదిలి వెళ్లాడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1966, డిసెంబర్ 15న ప్లేబ్యాక్ సింగర్‌గా తనన ప్రస్తానాన్ని ప్రారంభించిన బాలు.. వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలను అందుకుని అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రాణాంతక కరోనా బారినపడిన కోలుకున్నప్పటికీ.. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో గురువారం సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్నాహ్యం తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు చరణ్ ప్రకటించారు. (ఎస్పీ బాలు కన్నుమూత) ఎస్పీ బాలు మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన స్వగృహానికి బాలు భౌతిక కాయాన్ని తరలించారు. రాత్రి 9 గంటలకు భౌతిక కాయాన్ని స్వగృహం నుంచి ఫాంహౌస్‌కు తరలిస్తారని సమాచారం. రేపు ఉ.10:30 గంటలకు తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కడసారి చూపు కోసం అక్కడికి చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) -
జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా.. సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయననోట అలవోకగా జాలువారుతాయి. ఘంటసాల తరువాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు పొందిన ఏకైక గాయకుడు. హీరోల వాయిస్ తగినట్లు పాడడం ఆయన స్పెషల్. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. ఆయన మరణం టాలీవుడ్‌కే కాకుండా యావత్ భారత సినీ చిత్రపరిశ్రమకు లోటని చెప్పక తప్పదు. (ఎస్పీ బాలు కన్నుమూత) ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలుయే పెద్ద దిక్కయ్యారు. తన గాత్రంతో పాత్రలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడివారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. ముఖ్యంగా భక్తి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటావినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో అవార్డులు ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషన్ వరించింది. 1999లొ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. బాలు గురించి మరికొన్ని విషయాలు ► ఓ ఇంటర్వ్యూలో బాలు ఇళయరాజాను బెస్ట్ కంపోజర్‌గా పేర్కొన్నారు. కానీ అదే ఇళయరాజా తన పాటలు ఎవరు పాడినా దానికి ఇంత రాయల్టీ ఇవ్వాలని బాలు అబ్బాయి నిర్వహిస్తున్న సంస్థకు తాఖీదులు పంపారు. మిత్రుడికి లీగల్ నోటీస్ ఇవ్వడమేంటని ఆయన చాలా బాధపడ్డారు. ► బాలుకు అత్యంత ఇష్టమైన గాయకుడు మహమ్మద్ రఫీ. ► శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి గానూ మొదటి రెమ్యూనరేషన్ 300 రూపాయలు తీసుకున్నారు. ► ఒక్క శంకరాభరణం సినిమాకు పాడే విషయంలో మాత్రమే ప్రత్యేకంగా ప్రాక్టీసు చేశారు. ► గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 29 సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్రేకింగ్ : ఎస్పీ బాలు కన్నుమూత
-
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
సాక్షి, చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయంగా ధృవీకరించారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. ఇంజనీర్ కాబోయి సింగర్ అయ్యారు ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు చరణ్, పల్లవి ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. తమ్ముడి మీద ప్రేమతో నిర్మాతగా మారిన బాలు తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. తమ్ముడు కమల్ హాసన్‌కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిని 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేషన్ వంటి పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. తర్వాత పవిత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్, మిథునం వంటి పలు సినిమాల్లోనూ నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజారోగ్యం కోసం రూ.10వేల కోట్లయినా ఖర్చుపెట్టారా?
సాక్షి, సూర్యాపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో కనీసం రూ.10 వేల కోట్లయినా ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టారా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నిం చారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ బృందం వరంగల్ ఎంజీఎం, సూర్యాపేట ఆస్పత్రులను సందర్శించింది. ఈ సందర్భంగా కరోనా రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, వైద్య పోస్టులు ఖాళీ వివరాలు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అసలు సమస్యను పట్టించుకోకుండా వివిధ విభాగాలపై సమీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఆరేళ్లుగా గాడిదలను కాస్తున్నారా అని భట్టి నిలదీశారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్) ఈటల తప్పుకోవాలి ‘ఇంత పెద్ద ఆస్పత్రిలో డాక్టర్లు లేరు.. సదుపాయాలు లేవు. దీని సంగతి పట్టించుకోని నువ్వు ఒక మంత్రివా..? ఎర్రబెల్లివా.. ఎర్రపెల్లివా’అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి దయాకర్‌రావుపై ఫైర్ అయ్యారు . 2016లో కేంద్రం పీఎంఎస్ఎస్వై పథకం కింద నగరంలో రూ.150 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రి నిర్మిస్తే రాష్ట్ర వాటా కింద రూ.30 కోట్లు చెల్లించకుండా ఆస్పత్రిని నిరుపయోగంగా మార్చిన గొప్ప ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం శ్రద్ధ లేదని, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేయకుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు. భట్టి వెంట మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఆరోగ్య సలహానా... ట్వీట్ చెయ్!) -
మరింత మెరుగ్గా బాలు ఆరోగ్యం
సాక్షి, చెన్నై: కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటన్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన కోలుకుంటున్నారని..మనుషులను గుర్తుపడుతున్నారని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. (చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని) -
ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత మెరుగు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ శనివారం తన వీడియో సందేశంలో తెలిపారు. కరోనా వైరస్‌కు గురైన ఎస్పీ బాలు ఈనెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు శనివారం బులెటిన్ విడుదల చేయలేదు. -
థాంక్యూ.. ఇదొక శుభదినం: ఎస్పీ చరణ్
-
థాంక్యూ.. ఇదొక శుభదినం: ఎస్పీ చరణ్
సాక్షి, చెన్నై: కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వెల్లడించారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికి, బాలుకు ట్రీట్మెంట్ చేస్తున్న ఎంజీఎం వైద్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదొక శుభ దినమని, త్వరలోనే బాలు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్పీ చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని) ఇక అనేక భాషల్లో పాటలు పాడిన తన తండ్రికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న చరణ్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న ప్రతీ ఒక్కరికి అర్థమవడం కోసమే తాను ఆంగ్లంలో మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల క్రితం ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (చదవండి: నా ఆయుష్షు కూడా ఇచ్చి కాపాడాలి: నటి) -
నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం
చెన్నై: మొన్నటివరకు విషమంగా ఉన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుటపడుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే ఇప్పటికీ వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎక్మో సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఎస్పీ బాలు కరోనాను జయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు చరణ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. (నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే: ఎస్పీ చరణ్) చదవండి: ఎక్మో యంత్రం: ఆగే గుండెకు ఆయువు పోస్తుంది.. -
ఎస్పీ బాలు హెల్త్ బులిటన్ విడుదల
-
ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ బులిటెన్‌ను ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ ద్వారా ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలపారు. ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం యాజమాన్యం వెల్లడించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని -
ఎస్పీ బాలు ఆరోగ్యం: 'ఆనందాన్నిచ్చే విషయం'
చెన్నై: గాయకుడు, వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంచి ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. (బాలు కోసం ప్రార్థనలు) "నిన్నటి వరకు విషమంగా ఉన్న మా నాన్న ఆరోగ్యం నేడు నిలకడగా ఉంది. ఆయన కదులుతున్నారు, చేతులు ఆడిస్తూ థమ్సప్ సింబల్ చూపిస్తున్నారు. వైద్యులను గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాస్త శ్వాస సులువుగా తీసుకోగలుగుతున్నారు. అందరినీ గుర్తిస్తున్నారు. ఇప్పటికైతే మాట్లాడలేకపోతున్నాడు కానీ త్వరలోనే అది కూడా జరిగి తీరుతుంది. వైద్యులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందరి ప్రార్థనలు ఫలిస్తాయి. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉండటం ఆనందాన్నిచ్చే విషయం. మా తండ్రిపై, మా కుటుంబంపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యం మెరుగవడానికి సమయం పట్టొచ్చేమో కానీ తప్పకుండా కోలుకుంటారు" అని చరణ్ తెలిపారు. (నాకు కరోనా సోకింది: సింగర్ సునీత) -
ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
-
విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం
చెన్నై : కరోనా వైరస్ సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులు బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఎస్పీ బాలు ఆరోగ్యాన్ని నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు. ఇక సుమధుర గాయకులు ఎస్పీ బాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ప్రార్ధనలు చేశారు. ఇక ఎస్పీ బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, సంగీత దిగ్గజం ఇళయరాజా సహా పలువురు సెలబ్రిటీలు, గాయకులు, బాలు అభిమానులు కోరుతున్నారు. చిలుకూరులో ప్రత్యేక పూజలు రంగారెడ్డి జిల్లా: గాన గంధర్వుడు, భక్తుల అభిమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిలుకూరులో విశేష అర్చన, నరసింహ స్వామి స్తోత్ర పారాయణ సభక్తికంగా నిర్వహించినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. చదవండి : ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి -
అన్నయ్య కోలుకుంటున్నారు: ఎస్పీ శైలజ
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ బారినపడి చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ను తొలగించామని, మిగిలిన వైద్య సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు మంగళవారం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనను ఐసీయూ నుంచి రూమ్‌కు మార్చామని తెలిపారు. మరోవైపు తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని బాలు సోదరి, గాయని ఎస్పీ శైలజ చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ఆడియోను విడుదల చేశారు. (చదవండి : బాలు వార్డులో ఆయన పాటల ప్రసారం) ‘బాలు అన్నయ్య రోజు రోజుకీ బెటర్ అవుతున్నారు. డాక్టర్స్ ఆయన హెల్త్ డెవలప్మెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వెంటిలేషన్ తీసేశారు. ఎకో సిస్టమ్ మాత్రం అలాగే ఉంచారు. నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నారు. ప్రపంచమంతా అనయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. తప్పకుండా అన్నయ్య హ్యాపీగా బయటకు వస్తారు’ అని తెలిపారు. ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు ఎస్పీ బాలును వెంటిలేటర్ తొలగించి రూమ్‌కు తరలించారనేది అవాస్తవమని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఎస్పీ బాలు నిన్న ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆయన చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. త్వరలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటారని ఆశిస్తున్నామని చరణ్ పేర్కొన్నారు. -
కోలుకుంటున్న ఎస్పీ బాలు
-
వెంటిలేటర్‌పైనే ఎస్పీ బాలు
-
వెంటిలేటర్‌పైనే ఎస్పీ బాలు
సాక్షి, చెన్నై : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో గురువారం రాత్రి ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి : ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు) మరోవైపు బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా స్పందించారు. నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వదంతులను నమ్మొద్దు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని వైద్యులు చెప్పారు’అని చరణ్ పేర్కొన్నారు. మరోవైపు ఎస్పీ బాలు భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. -
కరోనా మృతదేహంపై అధికారుల నిర్లక్ష్యం
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనాతో మృతి చెందిన మహిళకు సంబంధించిన సమాచారం బంధువులకు ఇవ్వకుండానే అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన కుటంబసభ్యులకు మృతదేహం లేదని అధికారులు చెప్పారు. అంతేకాకుండా మృతదేహానికి అంత్యక్రియలు ఎక్కడ చేశారో కూడా తెలియజేయలేదు. దీంతో బంధువులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళ ఈ నెల13న ఎంజీఎం అస్పత్రిలో కరోనా చికిత్స పొందుతు మృతి చెందారు. (తెలంగాణలో 90వేలకు పైగా కరోనా కేసులు) -
కరోనా పేషెంట్ మృతి : డాక్టర్‌పై బంధువుల దాడి
సాక్షి, వరంగల్ : నగరంలో ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్ బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వార్డులోని అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
-
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ తన రాజీనామాను అంగీకరించాలని ఆయన డీఎంఈకి లేఖ రాశారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్ల రాజీనామాలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురై నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్రావు కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. (చిన్నారికి సరికొత్త జీవితం!) -
మానవత్వం వర్షార్పణం
ఎంజీఎం: కరోనా పుణ్యమా అని మానవత్వం మంటగలుస్తోంది. ఆస్పత్రి ఆవరణలో ఓ మృతదేహం గంటల తరబడి వర్షంలో తడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోని అమానవీయ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. హన్మకొండకి చెందిన ఏనబోతుల స్వరాజ్యలక్ష్మి (68)ని ఆమె బంధువులైన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతుండటంతో కోవిడ్ వార్డుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ పరీక్షిం చగా.. కోవిడ్ లక్షణాలు లేవని తేలడంతో క్యాజువాలిటీ విభాగానికి తరలించారు. చికి త్స పొందుతున్న క్రమంలో స్వరాజ్యలక్ష్మి పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని వైద్య సిబ్బంది క్యాజువాలిటీ ప్రాంగణం వరకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. కాగా, స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో స్వరాజ్యలక్ష్మి బం ధువులైన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి దూరంగా వెళ్లి.. కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. ఆ సమయంలో మృతదేహం కాజ్యు వాలిటీ వద్దే ఆరు బయట ఉండగా వర్షం మొదలైంది. వెంట వచ్చిన వారు దగ్గర లేక, సిబ్బంది పట్టించుకోక రెండు గంటలపాటు మృతదేహం వర్షంలో తడిసిపోయింది. చివరకు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తయ్యాక మృతదేహాన్ని తీసుకెళ్లారు. -
ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన
సాక్షి, వరంగల్ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహం దర్శనమిచ్చింది. కరోనా అనుమానంతో ఆమె బంధువులే ఆస్పతి ముందు స్ట్రెచర్‌పై మృతదేహాన్ని వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది. దాదాపు రెండు గంటల గడుస్తున్న మహిళ మృతదేహం క్యాజువాలిటీ ముందే ఉంది. వర్షంలో మృతదేహం తడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది గానీ, అటుగా వెళ్తున్నవారు గానీ ఎవరు పట్టించుకోవడం లేదు.(ప్రభుత్వాని ఇదే చివరి అవకాశం : హైకోర్టు) -
ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన
-
కరోనా పరీక్షలకు తీసుకెళ్తే ఖైదీ పరార్
సాక్షి, వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ పరారైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. హన్మకొండ సుబేదారికి చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షల నిమిత్తం జైలు అధికారులు ఖైసర్‌ను గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి.. కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఖైసర్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ అతడి కోసం గాలిస్తున్నారు. ఇక 14 చోరీలు చేసిన ఖైసర్ గత నెలలోనే పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. (మోసం చేశాడు.. న్యాయం చేయండి) -
పుట్టింటికి రా తల్లీ
ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సులు తమ కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లాలని అనుమతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్లో వారి ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు తప్పేలా లేవు. ముప్పై ఏళ్ల రేష్మ అనిష్ ముంబై ఎం.జి.ఎం హాస్పిటల్లో నర్సు. ఇప్పుడామెకు ఎనిమిదో నెల. కాన్పు కోసం తన పుట్టిల్లయిన కేరళలోని పతానంతిట్టతుకు మార్చి 27న ఆమె ప్రయాణం పెట్టుకుంది. ఉద్యోగంలో అనుమతుల చికాకు లేకుండా ఏకంగా ఆ ఉద్యోగానికి రాజీనామాయే చేసింది. అంతా సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఇప్పుడు తన పుట్టింట్లో అమ్మ ఆలనాపాలనలో ఉండాల్సింది. కాని లాక్డౌన్ వల్ల అంతా గందరగోళంగా మారింది. ‘నా పుట్టింటికి వెళ్లడానికి ఈ–పాస్ కోసం మహరాష్ట్ర డి.జి.పికి అప్లై చేశాను. కాని ఇప్పటి వరకు సమాధానం లేదు’ అని రేష్మ అంది. ముంబై నుంచి కేరళ చేరుకోవడానికి ఇప్పుడు ఆమె సొంత ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. ఎంత ఖర్చయినా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్లాలనుకుంటోంది. అయితే దీనికి కూడా చిక్కులొచ్చేలా ఉన్నాయి. మహారాష్ట్ర అంబులెన్సుకు ఎంత ఈ–పాస్ ఉన్నా ఇతర రాష్ట్రాలు లోనికి రానివ్వాలని లేదు. ముఖ్యంగా కర్నాటక ఇలాంటి అంబులెన్సులను కూడా ఆపేస్తోంది. ‘ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. పైగా అంబులెన్స్ డ్రైవర్ 14 రోజుల క్వారెంటైన్లో వెళ్లాల్సి రావచ్చు’ అని రేష్మ అంది. రేష్మ భర్త ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్లి అక్కడ లాక్డౌన్లో చిక్కుకుని ఉన్నాడు. ‘తలా ఒక చోట ఉన్నాం. ఎప్పుడు కలుస్తామో’ అని అతను అన్నాడు. బాంబే హాస్పిటల్లో పని చేస్తున్న అతిరదేవి కూడా కాన్పుకు కేరళలోని తన పుట్టిల్లు కొట్టాయంకు వెళ్లాల్సి ఉంది. అంబులెన్సు మాట్లాడితే 50 వేలు డిమాండ్ చేశారు. దానికీ సిద్ధపడినా పోలీసుల అనుమతి ఇంకా రాలేదు. మరో కేరళ నర్సు సమస్య గమనించదగ్గది. ఆమెకు మొదటి గర్భం నిలువలేదు. ఇప్పుడు వచ్చిన రెండో గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పుట్టింటికి వెళ్లడం ముఖ్యమని అనుకుంటోంది. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కాన్పు సమయం స్త్రీలకు కుటుంబం నుంచి ముఖ్యంగా పుట్టింటి నుంచి చాలా ఆలంబన అవసరమైన సమయం. ముంబైలో నర్సులుగా పని చేస్తూ ప్రస్తుతం గర్భవతులైన పదుల సంఖ్యలోని కేరళ స్త్రీలు తాము ఈ సమయంలో ఎక్కడ పుట్టింటికి చేరుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు. -
రోదనలతో మిన్నంటిన మార్చురీ..
సాక్షి, ఎంజీఎం: హన్మకొండ రాంనగర్లో యువకుడు షాహిద్ చేతిలో హత్యకు గురైన మునిగాల హారతి మృతదేహానికి శనివారం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎంజీఎం మార్చురీ వద్ద హారతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో చేరుకుని రోదించడం ప్రతిఒక్కరిని కలిచివేసింది. నిందితుడిని వెంటనే కాల్చి చంపేయాలి.. వెంటనే ఊరి తీయాలి అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ వేడుకున్నారు. బందోబస్తు... ఆందోళన హారతి మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా ఎంజీఎం మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ మహిళా, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగిస్తే తామే చూసుకుంటామని తెలిపారు. అప్పటికే మార్చురీ వద్ద భారీగా మొహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా చూశారు.నిర్వహించారు. షాహిద్‌ను కఠినంగా శిక్షించాల్సిందే... కాజీపేట: ప్రేమ పేరుతో యువతి ప్రాణాలను తీసిన యువకుడి విషయంలో ఆయన స్వస్థలమైన కాజీపేట విష్ణుపురి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న షాహిద్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో కాజీపేటలోని ఇంటికి తీసుకొచ్చి రక్తం మరకలతో ఉన్న దుస్తులు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో వచ్చిన పోలీసులు ఏమైనా గొడవ జరుగుతాయనే భావనతో 10 నిమిషాల లోపే ఇంటి నుంచి కావాల్సినవి తీసుకుని వెళ్లిపోయారు. కాగా, చదువుకునే సమయంలో బంధుమిత్రులు, పాటు కాలనీవాసులతో మంచిగా ఉండే షాహిద్ ఓ నిండు ప్రాణాన్ని తీశాడంటే నమ్మలేకపోతున్మామని ఈ సందర్భంగా స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలియగానే ఖంగుతిన్నాం... తమ కుమారుడు ప్రేమించిన యువతిని చంపి ఇంటికి వచ్చివెళ్లాడని తెలియగానే ఖంగు తిన్నామని షాహిద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడి ఉంటాడో అర్థం కావడం లేదని వాపోయారు. తన కొడుకు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. కాగా, ఘటన సమాచారం తెలియగానే షాహిద్ తల్లిదండ్రులు శుక్రవారం రాత్రే ఇళ్లు విడిచి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంతోనే హత్యలు.. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంతోనే మహిళల హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. మార్చురీ వద్ద హారతి కుటుంబసభ్యులను పరామర్శించి ఆమె మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు పరామర్శలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో నిందితులపై 21 రోజుల్లో చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మాదిరిగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, పుప్పాల రాజేందర్, మందాటి వినోద్, పాశికంటి రాజేంద్రప్రసాద్, కమల్, కనుకుంట్ల రంజిత్, నిర్మల, ఆడుప మహేష్, ముత్తినేని శ్రీనివాస్, రత్నాకర్, కృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు. పోలీసుల రక్షణలో నిందితుడి ఇల్లు.. మృతురాలి కుటుంబసభ్యులతో పాటు బంధువులు నిందితుడి ఇంటిపై దాడి చేయొచ్చనే భావనతో ముందు జాగ్రత్తగా షాహిద్ ఇంటి వద్ద సాయుధ పోలీసులను కాపాలాగా పెట్టారు. ఓ రక్షక్ వాహనం కూడా తీసుకొచ్చారు. చట్టపరంగా శిక్షపడేలా చర్యలు ఎంతో భవిష్యత్ ఉన్న యువతి హారతి హత్య కు గురవడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ఎంజీఎం మార్చురీలో ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలి సి హారతి మృతదేహాన్ని సందర్శించిన ఆమె మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ నిందితుడికి చట్టపరంగా శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల భద్రతపై ప్రభుత్వం, పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజల్లో చైతన్యం రావాలని,.. ఇదే సమయంలో ఎలా నిరోధించాలనే అంశాలపై ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారిస్తుందని చెప్పారు. చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఇప్పటికే నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సత్యవతి రాథోడ్ -
ఎంజీఎంలో నిలిచిపోయిన పోస్టుమార్టం సేవలు
సాక్షి, వరంగల్ : వైద్యుడు లేక ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం సేవలు నిలిచిపోయాయి. దీంతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సిన డెడ్‌బాడీలు నాలుగు ఉన్నాయి. నిబంధనల మేరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపు పోస్టుమార్టం చేయాల్సి ఉండగా, ఉదయం నుంచి డాక్టరు అందుబాటులో లేకుండా పోయారు. రేపు ఆదివారం కావడంతో పోస్టుమార్టం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డెడ్‌బాడీలకు అంత్యక్రియల కోసం మృతుల ఇళ్ల దగ్గర బంధవులు వేచి చూస్తున్నారు. -
పసి పాపలతో పరుగులు
అది వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి నవజాతశిశు సంరక్షణ కేంద్రం. అందులో 23 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం.. సమయం సరిగ్గా 7.50 గంటలవుతోంది. పిల్లల వార్డులోని ఏసీ నుంచి పొగలు వచ్చాయి. ఏమి జరిగిందని ఆలోచించే లోపే పొగలు గది మొత్తాన్ని కమ్ముకున్నాయి.. ఒక్కసారిగా భయంతో తల్లులు, అటెండెంట్లు పిల్లలను పొత్తిళ్లలో అదిమిపట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్న వెంటనే పెద్ద శబ్దంతో ఏసీ పేలిపోయి మంటలు ఎగిశాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స పొందుతున్న పసిగుడ్డులను చేతపట్టుకుని తల్లులు భయంతో పరుగులు తీయడం కలకలం రేపింది. నవజాత శిశువులు చికిత్స పొందుతున్న వార్డులోని ఏసీ నుంచి పొగలు రావడంతో తల్లులు తమ చిన్నారులను పట్టుకుని పరుగులు తీశా రు. వారు బయటకు వచ్చిన తర్వాత కొద్ది నిమిషా ల్లో ఏసీ పేలి వార్డులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వాహనంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం.. ఎంజీఎంలోని నవజాతశిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్ఎస్యూ)స్టెప్‌డౌన్ వార్డులో 23 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ నుంచి వచ్చిన పొగలు వార్డును కమ్మేస్తోంది. విషయాన్ని గమనించిన ఆ శిశువుల తల్లులకు ఏమి చేయాలో తోచలేదు. ఒక్కసారిగా తమ చిన్నారులను పొత్తిళ్లలో అదిమి పట్టుకుని ప్రాణభయంతో ఆస్పత్రి ప్రాంగణంలోకి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన సెక్యూరి టీ, వైద్యసిబ్బంది ఆస్పత్రిలో ఉన్న విలువైన పరికరాలను బయటకు తీసుకువచ్చే పనిలోపడ్డారు. ఇం తలోనే పొగలు వెలువడుతున్న ఏసీ పక్కనే ఉన్న ఆక్సిజన్ పైపు సైతం లీక్ కావడంతో ఒక్కసారిగా ఏసీ పేలిపోయి గదిలో పెద్ద ఎత్తున మంటలు వ్యా పించాయి. వైద్యసిబ్బంది అగ్నిమాపక అధికా రులకు సమాచారం అందించడగా ఫైరింజన్‌తో సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. చెట్ల కిందే శిశువులతో తల్లుల నిరీక్షణ.. ఈ ఘటనతో షాక్‌కు గురైన శిశువుల తల్లులు తమ పిల్లలతో ఆస్పత్రిలోని చెట్ల కింద నిరీక్షించా రు. వారిని వార్డుకు తరలించాల్సిన పరిపాలనాధికారులు గంట పాటు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకోలేదు. ఎంజీఎంలో ముగ్గురు ఆర్ఎంఓలతో పాటు, ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఘట న జరిగి గంట సమయం దాటినా అటువైపు అధి కారులెవరూ రాకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పిడియాట్రిక్ విభాగ వైద్యులు వచ్చి వారికి ధైర్యం చెబుతూ పక్క వార్డులోకి తరలించారు. మరోమారు మంటలంటూ పరుగులు.. ఏసీ పేలిన ఘటన అనంతరం వైద్యసిబ్బంది పరిపాలనాధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ చిన్నారులకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో 9.30 గంటలకు మరో ఏసీ నుంచి పొగలు వస్తున్నాయని ఎవరో చెప్పడంతో పక్క వార్డులో చికిత్స పొందుతున్న 100 చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఏం జరగులేదని చెప్పడంతో వారిని వార్డులకు తరలించి చిక్సిత అందించారు. మరమ్మతుకు నోచుకోనీ పరికరాలు.. ఎంజీఎం ఆస్పత్రి ప్రధాన వార్డులో కాలంచెల్లిన పరికరాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. మూడు, నాలుగు నెలల క్రితం ఏసీలకు మరమ్మతు చేసి పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేసినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, ఐఎంసీ, పోస్టు ఆపరేటివ్ వంటి విభాగాల్లో ఏప్పుడూ ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. అయినా మరమ్మతుల పేరుపై బిల్లులు మాత్రం చెల్లిస్తుండం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. 23 మంది చిన్నారులు సురక్షితం నవజాతశిశు సంరక్షణ వార్డులో చికిత్స పొందుతున్న 23 మంది చిన్నారులకు ఏలాంటి ప్రమాదం లేదని పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. వారిని వేరే వార్డులోకి తరలించి చికిత్సఅందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలోని రెండు నవజాతశిశు సంరక్షణ కేంద్రాల్లో 40 పకడలు మాత్రమే మంజూరు కాగా ప్రతి రోజు 80 నుంచి 100 మందికి పైగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నవజాతశిశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.– డాక్టర్ విజయ్‌కుమార్, పిడియాట్రిక్ విభాగాధిపతి ప్రాణభయంతో పరుగులు పెట్టాం.. మాది ఖమ్మం జిల్లా. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డ 13 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న ఏసీ నుంచి పొగలు రావడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టాం. బయటకు రాగానే ఏసీ పేలి మంటలు లేచాయి.– విజయలక్ష్మి, చిన్నారి తల్లి అదృష్టవశాత్తు బయటపడ్డాం.. ఏసీ నుంచి పొగలు రావడంతో చిన్నారులును ఎత్తుకుని తల్లులు బయటకు పరుగులు తీశారు. వార్మర్లను బయటకు తీసుకువస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీ పేలిపోయింది. ఆ సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. నాతో పాటు హసీనా, సుచరిత సిబ్బంది బయట ఉండడంతో ప్రాణపాయస్థితి నుంచి బయటపడ్డాం.– రమ్య, స్టాఫ్‌నర్సు మేయర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పరామర్శ ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మేయర్ నన్నపునేని నరేందర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చిక్తిత్స పొందుతున్న చిన్నారుల తల్లుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారివెంట స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, టీఆర్ఎస్ నాయకులు అల్లం నాగరాజు, ఆకారపు మోహన్ తదితరులు ఉన్నారు. నూతన ఎంసీహెచ్ బ్లాక్‌ను ఉపయోగంలోకి తేవాలి ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగానికి మంజూరైన పడకల కంటే అందులో చికిత్స పొందే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన మాత శిశు సంరక్షణ కేంద్ర భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి.– పరుశరాములు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ప్రభుత్వానిదే బాధ్యత ఎంజీఎం ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన ఏసీలను వాడడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఎంజీఎం అధికారులు రోగులకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు.– తిరుణహరిశేషు, టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ -
సుమన్ చరిత్ర బయటపెడతా: ఓదేలు
వరంగల్ అర్బన్: చెన్నూరు అసెంబ్లీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కేటాయించకపోవడంతో ఆయన అనుచరుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్‌పై మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమన్నారు. తన వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్‌పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు. సుమన్ జీవిత చరిత్రను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు బయట పెడతానని తెలిపారు. తనను మానసిక క్షోభకు గురిచేసేందుకే తనపై కుట్రలు చేస్తున్నారని వాపోయారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఎంజీఎంలో జూనియర్ డాక్టర్ వీరంగం
ఎంజీఎం : వరంగల్ మహాత్మాగాంధీ మోమోరియల్ ఆస్పత్రిలో పరిపాలనాధికారుల కొరత.. పట్టింపు లేని తనంతో పాలన రోజురోజు దిగజారుతుంది. రోగులు తమ సమస్యల ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. ఏకంగా ఓ జూనియర్ వైద్యురాలు రోగి బంధువుపై మండిపడుతూ నేను వైద్యం అందించనూ... ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో అని అక్కడ ఉన్న బాటిల్‌ను విసిరేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతటితో ఆగక మీపైన ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరించడంతో సదురు రోగి భయపడి ఆస్పత్రి నుంచి పారిపోయిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆ ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరి ఫోన్‌ను లాక్కుని జూనియర్ వైద్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.. చివరకు ఈ ఘటన సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో విషయం తెలుసుకున్న పలు సంఘాల నాయకులు రోగుల బంధుమిత్రులకు అండగా నిలిచి మట్టెవాడ పోలీస్‌స్టేషన్ వైద్యురాలిపై ఫిర్యాదు చేశారు. వీరంగం ఇలా.. వరంగల్ లేబర్ కాలనీ చెందిన నమిండ్ల సాగర్ క్రిమిసంహారక మందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 22న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటైన సాగర్ మొదట ఏఎంసీలో చికిత్స అందించిన వైద్యులు అనంతరం ఆరోగ్యశ్రీ వార్డుకు తరలించారు. క్రిమిసంహారక మందు తాగిన సమయంలో రోగి మానసిక పరిస్థితి సక్రమంగా ఉండని పక్షంలో రోగి వద్ద వారి బంధుమిత్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోగి వద్ద బంధుమిత్రులు ఉండడాన్ని సహించని వైద్యురాలు వారిపై దురుసుగా ప్రవర్తించడంతో వైద్యురాలికి, బంధుమిత్రుల మధ్య వివాదం నెలకొంది. ఎంజీఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళ రోగికి బంధుమిత్రులు కావడంతో ఆమె వైద్యురాలిని ప్రశ్నించింది.ఈ క్రమంలో వివాదం మరింత ముదిరింది. నీ ఫై ఫిర్యాదు చేస్తా.. నాకు హక్కు ఉందంటూ వైద్యురాలు ఊగిపోతూ నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అని స్వీపర్‌పై ఎంజీఎం పరిపాలనాధికారులకు ఫిర్యాదు చేసింది. అంతటి ఆగకుండా మీపై కూడా కేసులు పెడుతామని రోగి బంధుమిత్రులను భయబ్రాంతులకు గురిచేసింది. పారిపోయిన రోగి.. వైద్యం అందించే విషయంలో జూనియర్ వైద్యురాలికి, రోగి బంధుమిత్రులకు జరుగుతన్న విషయాన్ని గమనించిన సదరు రోగి భయబ్రాంతులకు గురయ్యాడు. తనకున్న సమస్యలతో సతమతమవుతుంటే.. మరో సారి వైద్యురాలు తమపై కేసు పెడతాననడంతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాత్రూమ్ వెళ్ళివస్తానని చెప్పి కనబడకుండా పారిపోయాడు . ఈ ఘటనతో రోగి బంధుమిత్రులు ఒక్కసారిగా మానసిక వేదను గురై రోదిస్తూ మట్టెవాడ పోలీసులను ఆశ్రయించారు. విలేకరి ఫోన్ లాక్కున్న వైద్యులు.. తమపై ఎంజీఎంలోని వైద్యులు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారనే సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అక్కడికి వెళ్లి జరిగిన ఘటనపై రోగి బంధ«మిత్రుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ వైద్యులు అక్కడికి చేరుకుని మీరు ఎంజీఎం ఆస్పత్రిలో మా ఘటనలను ఏలా చిత్రీకరిస్తున్నావు అంటూ దౌర్జన్యానికి దిగుతూ విలేకరి ఫోన్‌ను లాక్కున్నారు. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు, రోగిబంధుమిత్రులు జూనియర్ డాక్టర్ల తీరుపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మట్టెవాడ పోలీసుల సమక్షంలో ఫోన్ లాక్కోవడం తప్పేనని ఒప్పుకుంటూ ఫోన్‌ను అప్పగించారు. జూనియర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి ఎంజీఎం ఆస్పత్రిలో నమిండ్ల సాగర్‌పై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ డాక్టర్‌పై చట్టపరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు జన్ను భాస్కర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్, ఎమ్మార్పీఎస్ తూర్పు ఇంచార్జీ ఈర్లకుమార్ మాదిగలు డిమాండ్ చేశారు. వైద్యం అందించాలన్నందుకు ఉద్యోగం తీసేశారు... మా అల్లుడు సరైన వైద్యం అందించాలని వైద్యురాలిని అడిగినందుకు నాపై మండిపడడంతో పాటు నా ఉద్యోగం తీసేశారని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వీపర్ రజిత రోదిస్తూ పేర్కొంది. రెక్కాడితే కాని డొక్కడాని తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు వైద్యురాలు తమపై పరిపాలనాధికారులు ఫిర్యాదు చేసిందన్నారు.దీంతో ఎంజీఎం కాంట్రాక్టర్ ఖాజా తనను విధులకు రావొద్దంటూ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పారిపోయిన తన అల్లుడిని తమ వద్దకు చేర్చాలని పోలీసులను వేడుకుంది. –రజిత, ఆస్పత్రి స్వీపర్మట్టెవాడ -
వివాహితపై యాసిడ్ దాడి..
-
వివాహితపై యాసిడ్ దాడి
ఎంజీఎం (వరంగల్): భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో బుధవారం జరిగింది. వరంగల్‌కు చెందిన బోయిన మాధవి అలియాస్ మాధురికి డోర్నకల్‌కు చెందిన చంటికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ పాప జన్మించింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఏడాదిగా మాధురి వరంగల్‌లోని తన పుట్టింట్లోనే ఉంటోంది. కాగా ఆటోడ్రైవర్ చందు ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. వారం రోజుల క్రితం ఆమెపై అతడు దాడి చేయగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా బుధవారం రాత్రి ఆమెపై ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి వద్ద యాసిడ్ దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. స్థానికులు మాధురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఎంజీఎంలో కరెంట్ కట్
ఎంజీఎంలో నిలిచిన విద్యుత్ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలోని ఔట్‌పేషెంట్ బ్లాక్‌లో శుక్రవారం ఓపీ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ లేక ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షల వంటి నివేదికలు రాకపోవడంతో రోగులు వెనుదిరిగాల్సి వచ్చింది. ఆస్పత్రిలోని అత్యవసర వార్డులకు మాత్రమే జనరేటర్ సౌకర్యం ఉండగా.. నిత్యం వేలాది రోగులు చికిత్స పొందే ఓపీ బ్లాక్ ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. దీంతో ఔట్ పేషెంట్ రోగులు నరకయాతన అనుభవించారు.ఓపీ సమయంలో విద్యుత్ పలుమార్లు నిలిచిపోయినా.. పరిపాలనాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. -
శిశువు బతికున్నా.. చనిపోయిందన్నారు!
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల తీరుపై తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ ఎంజీఎం (వరంగల్): శిశువు బతికున్నా.. చనిపోయిందని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు చెప్పారని వరంగల్ అర్బన్ హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, స్వప్న దంపతులు, వారి బంధువులు ఆరోపించడం జిల్లాలో కలకలం రేపింది. స్వప్నకు మొదటి కాన్పు ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది. ఏడు నెలల గర్భవతిగా ఉండగానే ఆమె 450 గ్రాముల ఆడశిశువుకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యచికిత్స కోసం జూన్ నెల 30వ తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని ఇంక్యుబేటర్‌లో మూడు రోజులుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం శిశువును పరీక్షించి, మృతి చెందిందని వైద్యులు పేర్కొని ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తక్కువ బరువుతో శిశువు జన్మించడంతో ఇలా జరిగిందన్న ఆవేదనతో బంధువులు శిశువు మృతదేహాన్ని పెగడపల్లి తీసుకువెళ్లి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ సందర్భంగా శిశువులో కదలికలు కనిపించడంతో వారు తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఉలిక్కిపడిన వైద్యులు శిశువుకు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షించడంతో పాటు శిశువుకు ఆక్సీజన్ అందించి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, శిశువు మృతి చెందిందని వైద్యులు స్పష్టం చేశారు. -
ఎంజీఎం ఆస్పత్రిలో ఆమ్రపాలి పర్యటన
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని కలెక్టర్ ఆమ్రపాలి క్షుణ్నంగా పరిశీలించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె ఆస్పత్రి అంతా కలియదిరిగారు. అన్ని వార్డులను పరిశీలించి సమస్యలు, సౌకర్యాలపై అధికారులను, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సూపరింటెండెంట్ రమేష్, ఆర్ఎంవో ఉన్నారు. వెయ్యి పడకల ఈ ఆస్పత్రికి ఎంబీఏహెచ్ సర్టిఫికేషన్ సాధించటం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఆస్పత్రిలో దోభీఘాట్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులు వెచ్చించేందుకు నగర కమిషనర్‌తో మాట్లాడతామని చెప్పారు -
కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి!
- రక్తం కారుతున్న బట్టలతోనే.. కోర్టు మెట్లెక్కిన వైనం - కేసు నమోదు చేయాలని ఆదేశించిన జడ్జి కాశిబుగ్గ (వరంగల్): ఆ తండ్రి తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. కొంత తనవద్దే ఉంచుకున్నాడు. అరుుతే ఆ ఆస్తిని కూడా తమకే ఇవ్వాలంటూ కొడుకులు వేధిస్తుండగా.. భరించలేక కోర్టు మెట్లెక్కాడు. వరంగల్ 11వ డివిజన్ లేబర్‌కాలనీలో నివాసం ఉం టున్న పోశాల రమేష్‌కు రాజేశ్, రాజేంద్ర ఇద్దరు కుమారులు. వీరికి రమేశ్ నాలుగు భవనాలు, ఇతర ప్లాట్లను సమానంగా పంచి ఇచ్చాడు. జీవన భృతి కోసం ఓ టెంట్‌హౌస్‌ను నడిపించుకుంటున్నాడు. అరుుతే ఆ టెంట్‌హౌస్‌ను కూడా తమకే ఇవ్వాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారు. దీనికి రమేశ్ నిరాకరించడంతో మూడు రోజులుగా విపరీతంగా కొడుతున్నారు. దీంతో రమే్‌శ్ రెండు రోజుల క్రితం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పం దించలేదు. పోలీస్‌స్టేషన్ కు ఎందుకు వెళ్లావంటూ సోమవారం మళ్లీ కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక రక్తం కారుతున్న బట్టలతోనే ఐదవ మున్సిఫ్ కోర్టును ఆశ్రరుుంచాడు. దీంతో స్పందించిన జడ్జి బాధితుడిని వైద్యపరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. తన ఆస్తి ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చానని, ఇద్దరూ ఫైనాన్ ్స వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని, అరుునా తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నారని రమేశ్ వాపోయాడు. కొడుకులు కొట్టిన దెబ్బలతో తనకు చెవులు వినిపించడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన జడ్జి దీనిపై కేసు నమోదు చేయూల్సిందిగా పోలీసులను ఆదేశించారు. -
ఎంజీఎం కిటకిట
విష జ్వరాలతో పెద్దసంఖ్యలో దవాఖానలో చేరుతున్న రోగులు వేధిస్తున్న పడకల కొరత పడకేసిన వార్డుల నిర్వహణ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా భావించే ఎంజీఎం దవాఖాన సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేకపోతోంది. ఫలితంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 383 మంది మలేరియా, 67 మంది డెంగీ బారిన పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద ఈ అంచనా గణాంకాలను బట్టి ఏజెన్సీ ప్రాంతాలు సీజనల్ వ్యాధులతో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయనేది వాస్తవం. గత వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చోటుచేసుకుంటున్న వాతావారణ మార్పుల కారణంగా ప్రజలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ఇక జిల్లాలోనే పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలోనూ అదే విధమైన దుస్థితి తాండవిస్తోంది. ప్రధానంగా ఈ ఆస్పత్రిలో రోగులకు పడకల కొరత ప్రధాన సమస్యగా ఉంది. అదనపు వార్డులు, పడకలను సమకూర్చుకోవడంపై ఎంజీఎం వైద్యాధికారులు దృష్టిసారించడం లేదు. వారి తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా పిల్లల వార్డు.. ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రస్తుతం 350 మంది చిన్నారులు విషజ్వరాజలతో చికిత్స పొందుతున్నారు. వారిలో అధికులు ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. అయినా ఆయా ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం లేదు. దవాఖానలోని పిల్లల విభాగంలోని వార్డుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. 138 పడకలకుగానూ 346 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పడకల కొరత కారణంగా ఒకే పడకలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల వార్డులో ఏసీ పనిచేయకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. దీనికి తోడు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటంతో ఆయా వార్డులకు రోగుల బంధువుల తాకిడి బాగా పెరిగిపోయి సంత వాతావరణం కనిపిస్తోంది. ప్రైవేటు క్లినిక్‌లకు రోగులను తరలించకుంటూ.. ఎంజీఎంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు మధ్యాహ్న అయిందంటే చాలు కనిపించకుండా పోతున్నారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోగులు లోలోన కుమిలిపోతున్నారు. కొంతమంది డాక్టర్లు రోగులను తమ ప్రైవేటు క్లినిక్‌లకు తరలించుకొని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు పక్కా నిఘా ఉంచితే వివరాలన్నీ బట్టబయలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎంజీఎంలో వైద్యసేవలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఎంజీఎం ల్యాబ్‌కు నిలిచిన విద్యుత్
రోగుల నరకయాతన ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని కరెంట్ సమస్య వేధిస్తోంది. ఓపీ సమయం ఉదయం 9 నుంచి 12 గంటల సమయంలో విద్యుత్ నిలిచిపోతే రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఆస్పత్రికి ఓపీ సమయంలో వివిధ విభాగాల్లో వైద్యచికిత్సలు పొందేందుకు వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్యపరీక్షల నిమిత్తం పలు రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. శనివారం ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో పలు వార్డుల్లోని రోగులతోపా టు ఓపీలోని వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోగులకు రక్త పరీక్షలు నివేదికలు అందకపోవడంతో ఉన్న రోగంతోనే తిరు గు పయనమయ్యారు. దీనికి తోడు ఆది, సోమవారాలు సెలవు కావడంతో రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే ఆస్పత్రిలో విద్యుత్ కోత సమయాల్లో అత్యవసర వార్డులకు కల్పిస్తున్న జనరేటర్ సౌకర్యాన్ని ల్యాబ్‌లు సైతం కల్పిస్తే రోగులకు సేవలు మెరుగుపడుతాయని వైద్యులే పేర్కొంటున్నారు. ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై భారం ఎక్కువ పడడంతో సాంకేతిక సమస్య తెలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. -
ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్!
మానుకోట జిల్లాతో మోక్షం లభించే అవకాశం బ్లడ్‌బ్యాంక్, మెరుగైన వైద్యానికి మోక్షం మహబూబాబాద్ : మానుకోట ఏరియా ఆస్ప త్రి అప్‌గ్రేడ్ కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి మోక్షం లభించనుంది. ప్రస్తుతం 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలనే డిమాండ్ ఉండగా, జిల్లా ఏర్పాటుతో మరింత ఎక్కువ పడకలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిని 1999సంవత్సరంలో నిర్మిం చారు. వంద పడకల ఆస్పత్రే అయినప్పటికీ మానుకోట డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు నుంచి కూడా రోగు లు ఇక్కడికి వస్తుంటారు. రోజూ ఓపీలో 800 మంది నుంచి వెయ్యి మంది వరకు వైద్యులు చూస్తారు. వైద్యులు, సిబ్బంది సరిపడ సంఖ్య లో ఉన్నప్పటికీ బెడ్లు ఎక్కువగా లేవు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానుకోటలోని జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులకు పనిభారం పెరుగుతోంది. వైద్యుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. వా రికి ప్రైవేట్ ఆస్పత్రులు ఉండటం వల్ల కూడా విభేదాలు ఏర్పడి గ్రూపులుగా ఏర్పడ్డారు. అందుబాటులో ఉన్నతాధికారులు అయితే జిల్లా కాబోతున్న తరుణంలో డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు. బ్లడ్‌బ్యాంక్ అందుబాటులోకి వస్తుంది. అన్ని విభాగాలకు డాక్టర్లు వస్తా రు. ఫిజీషియన్, సివిల్ సర్జన్స్, తదితర వైద్యు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రి కూడా 500 పడకల ఆస్పత్రిగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాగా ఏర్పడిన తర్వాత ఏరియా ఆస్పత్రి అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంద ని, సిటీ స్కాన్ వంట సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని పలువురు అంటున్నా రు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ కోసం కొన్నేళ్లుగా ఆందోళనా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది. -
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం
ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధి డాక్టర్ అసితోష్ మహాపాత్ర వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం సందర్శన ఎంజీఎం : దేశవ్యాప్తంగా రోజుకు వేయ్యి మంది చిన్నారులు జన్మిస్తే అందులో 39 మంది చిన్నారులు నెల నిండక ముందే మృత్యువాతపడుతున్నారని, ఈ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా నేషనల్ నియోనాటాలజీ ఫోరం (ఎన్ఎన్ఎఫ్) ప్రయత్నిస్తున్నదని ఒరిస్సాకు చెందిన ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధి డాక్టర్ అసితోష్ మహాపాత్ర చెప్పారు. బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో శిశువులకు అందుతున్న వైద్యసేవలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్ఎన్ఎఫ్ అక్రిడిడేషన్ సర్టిపికేషన్ పొందడానికి నేషనల్ నియోనాటాలజీ ఫోరం నిర్దేశించిన కచ్చితమైన ప్రమాణాలలో వైద్యసేవలందించండంతో పాటు ప్రత్యేకమైన విధానాలు పాటించాలన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే ఆయాతో పాటు నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉండాలన్నారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది శిశువులకు అందిస్తున్న వైద్యసేవల విధానాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నమౌలిక సదుపాయాలు, వైద్యసిబ్బంది, వైద్యుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నివేదికను ఢిల్లీ బృందానికి సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి అక్రిడిడేషన్ సర్టిఫికెట్ లభిస్తే సేవలు మరింత మెరుగుపడే ఆవకాశం ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సర్టిఫికేషన్‌తో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు భవిష్యత్తులో డీఎం నియోనాటాలజీ వంటి ప్రత్యేక కోర్సులు వచ్చే ఆవకాశం లభిస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వైద్యవిద్య కళాశాలలో పరిధిలో ఉన్న ఏ ఆస్పత్రీ ఇంత వరకు ఈ సర్టిఫికేషన్ పొందలేదన్నారు. -
ఎంజీఎంలో మెడిసిన్స్ వ్యాపారంపై ఫిర్యాదు
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొనసాగుతున్న మందుల అక్రమ వ్యాపార విధానాలపై శుక్రవారం ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ అకున్ సబర్వాల్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని వినియోగదారుల మండలి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి తెలిపారు. ఎంజీఎంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో అధికారులు నిబంధనలు పాటించకుండా లోపాయికారి అవగాహనతో మందులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మందుల విక్రయ కమిటీతో సంబంధం లేకుండా స్థానిక ఉన్న సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు, అధికారులు ఏ మందులు కొనుగోలు చేయాలనేది నిర్ణయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు ఆస్పత్రిలో ఔషధ అవసరాలు సృష్టించి తమకు తెలిసిన ఏజెన్సీల ద్వారా కొటేషన్లు తీసుకుని లోపాయికారి మందులు కొనుగోళ్లు చేయడం జరుగుతుందన్నారు. ఎంజీఎంలోని స్టోర్స్ సిబ్బంది బినామీ ఏజెన్సీలు సృష్టించి ఆస్పత్రికి మందుల కొనుగోలు చేయడం చేసిన దందా నాసిరకం ప్రాలీడాక్సిన్ ఐడెడ్ యాంపిల్స్ ఘటనతో వెలుగు చూసిందన్నారు. అలాగే డైక్లోఫిన్ సోడియం మాత్రలు, అమ్మాక్సిలిన్ ఇంజక్షన్లు, పొటాషియం మాత్రలు, దగ్గు సిరఫ్‌లు నాసిరకంగా ఉన్నాయని ఔషధ నియంత్రణ అధికారులు హెచ్చరించడం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఔషధ నియంత్రణాధికారులు స్పందించి నాసిరకం మందులు సరఫరా చేస్తున్న ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలను గుర్తించి ఆయా మెడికల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మందుల్లో మాయాజాలం
నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు నాసిరకం ఇంజక్షన్ ఘటనతో బహిర్గతం బినామీ పేర్లతో ఎంజీఎం సిబ్బంది టెండర్లు రెండో రోజూ ఔషధ నియంత్రణాధికారుల తనిఖీలు ఎంజీఎం : మందుల కొనుగోలులో మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం) సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా మారి నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సరఫరా కోసం స్థానికంగా కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్ (క్రిమిసంహారక నియంత్రణ ఔషధం) నాసిరకమైందని తెలియడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఔషధ నియంత్రణాధికారులు మంగళవారం కూడా ఎంజీఎం ఆస్పత్రిలోని ఔషధాల విభాగంలో తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా కొనుగోలు చేసిన మరికొన్ని శాంపిల్స్‌ను సేకరించారు. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులను సరఫరా చేస్తుంటారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో మందుల లభ్యత లేనప్పుడు అత్యవసర బడ్జెట్ నిధులతో టెండర్ ప్రక్రియ ద్వారా స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు మందులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందులు అందుబాటులో లేనప్పుడు 804 రకాల ఔషధ కంపెనీల డ్రగ్స్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, స్టోర్స్ విభాగంలో తిష్ట వేసిన అధికారులు తమ అనుభవాన్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. క్రిమిసంహారక రసాయనాలు సేవించి వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి కోసం ప్రాలీ డాక్సైమ్ క్లోరైడ్ యాంపిల్స్‌ను వినియోగించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఎంజీఎం ఔషధ విభాగంలోని సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా స్థానికంగా లభ్యమయ్యే ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్‌ను కొనుగోలు చేశారు. సిబ్బంది ఇష్టప్రకారం కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్ నాసిరకమైనదని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ మందుల కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయం బయటికిరాకుండా ఔషధ విభాగం సిబ్బంది అన్ని రకాలుగా ప్రయత్నించారు. సెంట్రల్ డ్రగ్స్ నుంచే వీటిని కొనుగోలు చేసినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం అసలు విషయంలోకి వెలుగులోకి వచ్చింది. ఇదే రకంగా ఆస్పత్రి స్టోర్స్ విభాగం సిబ్బంది, కొందరు వైద్య సిబ్బంది తీరుతోనే ఇలా నాసిరకం మందులను ఎంజీఎంలో కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బినామీ పేర్లతో టెండర్లు ఎంజీఎం ఆస్పత్రికిSమందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలలో ఎక్కువగా ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు బినామీ పేర్లతోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ఎంజీఎం సిబ్బందిలో కొందరు.. టెండరు నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఏజెన్సీలను నమోదు చేసి మందుల సరఫరా కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు. లాభం ఎక్కువగా వచ్చే మందులను సరఫరా చేస్తున్నారు. ఇవి నాసిరకమైనవిగా నిర్ధారణ జరుగుతున్నాయి. దీంతో ఎంజీఎంకు వచ్చే పేద రోగుల ప్రాణాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆ ఇంజక్షన్ నాసిరకం
నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ ఎంజీఎం (వరంగల్): వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు తాగి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్‌గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్ఎల్ఐ 540ఎల్ బ్యాచ్‌కు చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్స్‌ను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వినియోగించకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి ఆదేశాలు జారీ చేశారు. వెలుగు చూసింది ఇలా.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యూంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, పరిపాలనాధికారుల ఆదేశాలతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రిలో శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా అయిన యాంపిల్స్ మాత్రమే చూపించి, స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్‌ను బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యూంపిల్స్లోనే ఫంగస్ వచ్చింది. ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యూంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది. -
ఎంజీఎంలో నాసిరకం ఇంజక్షన్
నిర్ధారించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్లోనే ఫంగస్ రాష్ట్ర వ్యాప్తంగా హిమాలయ కంపెనీ యాంపిల్స్ నిలిపివేయాలని ఆదేశం ఎంజీఎం (వరంగల్) :వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో మరో నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసింది. క్రిమి సంహారక మందు సేవించి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడే రోగులకు యాంటీడోస్‌గా అందించే హిమాలయ మేడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ నాసిరకంగా ఉందని ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. హెచ్ఎల్ఐ 540ఎల్ బ్యాచ్‌కు చెందిన ప్రాలీడాక్సైన్ ఐడెడ్ యాంపిల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో వాడకూడదని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ సురేంద్రనాథ్ సాయి అదేశాలు జారీ చేశారు. వెలుగు చూసింది ఇలా.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నాసిరకం ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్ నాసిరకంగా ఉందని వైద్య సిబ్బంది ఆదివారం గుర్తించి రోగులకు అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ నాసిరకం ఇంజక్షన్‌ను పరిపాలనాధికారుల ఆదేశాలతో బయటరానియకుండా జాగ్రత్త పడ్డారు. స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్ నాసిరకమైందని తెలియడంతో ఆస్పత్రిలో ఉన్న నిల్వలను బయటకు కానరాకుండా సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించారు. అయితే ఈ నాసిరకమైన యాంపిల్ను ఆస్పత్రి సిబ్బంది ఒకరు గుర్తించారు. అందులో ఫంగస్ ఉండడాన్ని చూసి రోగులకు ఇవ్వకుండా బయటపడేశారు . ఈ విషయం రోగుల ద్వారా బయటకు పొక్కింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని శాంపిల్స్ కోసం ప్రయత్నించగా నాసిరకం ఇంజక్షన్లు కనిపించకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి సరఫరా కాబడిన యాంపిల్స్‌ను మాత్రమే చూపించి స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్‌ను మాత్రం బయటకు రానీయలేదు. వాస్తవానికి స్థానికంగా కొనుగోలు చేసిన యాంపిల్స్లోనే ఫంగస్ వచ్చింది. సోమవారం ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు ఫంగస్ వచ్చిన యాంపిల్స్ ఫొటోలను డ్రగ్ అధికారులకు పంపించడంతో అసలు విషయం తెలిసింది. డ్రగ్ అధికారులు ఆరాతీయగా ఆస్పత్రి పరిపాలనాధికారులు ఏప్రిల్ మాసంలో కొనుగోలు చేసి నిల్వ ఉన్న ప్రాలీ డాక్సైమ్ ఐడెడ్ 45 యాంపిల్స్‌ను చూపించారు. ఈ ఆంపిల్స్ నాసిరకంగా ఉన్నట్టు గుర్తించి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పరీక్షల నిమిత్తం పంపించారు. దీంతో పాటు హియాలయ కంపెనీకి చెందిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన ఆంపిల్స్లోనే.. ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాబడిన ప్రాలీడాక్సైమ్ క్లోరైడ్ అనే యాంపిల్స్ సరిగానే ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఈ యాంపిల్స్ అందుబాటులో లేని సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పరిపాలనాధికారులు ఏప్రిల్‌లో నగరంలోని బాలాజీ సర్జికల్స్ అండ్మెడికల్ స్టోర్స్ నుంచి రెండు వేల ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ అనే ఇంజక్షన్లను కొనుగోలు చేశారు. ఈ యాంపిల్స్నే పార్టిక్యూలెట్ మాటర్(నులిపోగుల వలే,నాసిరకం) ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆస్పత్రిలో వివిధ వార్డుల్లో ఉన్న 45 యాంపిల్స్‌ను వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో స్థానికంగా కొనుగోలు చేస్తున్న మందుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు. ఎంజీఎంలో వెలుగుచూస్తున్న నాసిరకం ఔషధాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వరుసగా నాసిరకం ఔషధాలు వెలుగుచూస్తుండడంతో వైద్యసిబ్బందితో పాటు రోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రిలోని ఆనస్తీషియ విభాగంలో థయోపెంటోన్ సోడియం నాసిరకం ఇంజక్షన్ వెలుగుచూసి వారం రోజుల గడువక ముందే ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ అనే మరో యాంపిల్ను నాసిరకంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించి వాటి శాంపిల్స్‌ను పరీక్షలు నిమిత్తం రాష్ట్ర ఔషధ నియంత్రణ కేంద్రానికి పంపించారు. -
బోధనాసుపత్రుల పరిధిలోకి దవాఖానాలు
- పెలైట్ ప్రాజెక్ట్‌గా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎంపిక - వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : బోధనాసుపత్రుల పరిధి కి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పెలైట్ ప్రాజెక్టు కింద వరంగల్ ఎంజీఎం బోధనాసుపత్రిని ఎంపిక చేశారు. ఆసుపత్రికి 50 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులను దీని పరిధిలోకి తీసుకొస్తారు. ఇక్కడ అమలుతీరు ఆధారంగా రాష్ట్రంలోని ఇతర చోట్ల అమలుచేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులను వ్యవస్థీకరించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. బోధనాసుపత్రుల పరిధిలోకి సమీప ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావ డం వల్ల ఒకట్రెండు ఆసుపత్రుల మీద పడుతోన్న ఒత్తిడిని తగ్గిస్తారు. ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉండే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది. సమన్వయం ఇలా..: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి నాలుగైదు జిల్లాలకు వరంగల్ ఎంజీఎం అత్యాధునిక వైద్యాన్ని కల్పిస్తోంది. దీంతో ఆ ఆసుపత్రిపై అధిక భారం పడుతోంది. తాజా నిర్ణయం ప్రకారం ఎంజీఎం కిందకు ఆ జిల్లాలోని ఇత ర ఆసుపత్రులను తీసుకొస్తారు. ఎంజీఎంకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు, 35 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అలాగే వాటి పరిధిలో గణపురం, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్ర పీహెచ్‌సీలు కూడా ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో 31 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటన్నింటినీ ఎంజీఎం కిందకు తీసుకురావాలన్నదే సర్కారు ఉద్దేశం. అలా డీఎంహెచ్‌వో పరిధిలోని పీహెచ్‌సీలు, డీసీహెచ్ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంజీఎం లాంటి బోధనాసుపత్రులన్నీ సమన్వయం అవుతాయి. ఈ ముగ్గురు విభాగాల అధికారులు మొత్తం ఆసుపత్రుల పరిపాలనా వ్యవస్థను చూసేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల అన్ని ఆసుపత్రుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. స్థానికంగా నయం కాని రోగులు ఆపైన పీహెచ్‌సీకి, అక్కడా సాధ్యం కాకపోతే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వస్తారు. అక్కడా నయం కాకుంటే ఎంజీఎంకు వస్తారు. అలా కింది నుంచి పై వరకు రోగులను రిఫర్ చేస్తారు. దీంతో క్రమేణా రోగులు కూడా ఈ పద్ధతికి అలవాటు పడతారు. ఇలా చేయడం వల్ల పడకల కొరత, మందులు లేకపోవడం, వెంటిలేటర్లు దొరకకపోవడం వంటి సమస్యలకు బ్రేక్ పడుతుంది. -
గర్భంలోనే శిశువు మృతి
సవతి బాధితురాలు అనితకు అబార్షన్ హన్మకొండ చౌరస్తా: సవతితోపాటు ఆమె తరఫు బంధువులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన అనిత గర్భంలోనే శిశువు చనిపోయింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీతండాలో బానోత్ అనిత అనే వివాహితపై ఆమె సవతి తరఫు కుటుంబ సభ్యులు సోమవారం హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. వివస్త్రను చేసి ఒంటిపై కాల్చడం తో తీవ్రగాయాలతో బాధపడుతున్న అనితను మంగళవారం ఎంజీఎం ఆస్పత్రి నుంచి హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు. అనితను ఆరు నెలల గర్భిణిగా గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భస్థ పిండం మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అబార్షన్ తప్పనిసరి అని నిర్ణయించిన వైద్యులు అందుకోసం చికిత్స ప్రారంభించినట్లు జీఎంహెచ్ ఆర్ఎంవో సుదార్‌సింగ్ తెలిపారు. మరో రెండురోజులపాటు అనితకు వైద్యం అవసరమని వెల్లడించారు. ప్రస్తుతం అనిత ఆరోగ్యం బాగానే ఉందన్నారు. -
ఛిద్రమైన దేహాలు
శ్రుతి దేహంలో 6..విద్యాసాగర్ శరీరంలో 8 బుల్లెట్లు * శ్రుతి దేహంపై తీవ్రంగా కాలిన గాయాలు * పోస్టుమార్టం నివేదికలో వెల్లడి * విద్యాసాగర్ మర్మాయవాలపై గాయాలు ఉన్నాయన్న కుటుంబసభ్యులు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులు శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల మృతదేహాలకు బుధవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శ్రుతి దేహంలోకి ఆరు బుల్లెట్లు దిగాయి. వాటిలో ఛాతీలో రెండు, ఎడమ కాలుకు రెండు, చేతికి రెండు తూటాలు తగిలినట్లుగా గాయాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఆరు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్లాయని, మృతదేహంలో తూటాలు లభ్యం కాలేదని చెప్పారు. ఇక విద్యాసాగర్‌రెడ్డి మృతదేహంపై ఎనిమిది తూటా గాయాలున్నట్లు పౌరసంఘాల నేతలు, కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్టుమార్టం సందర్భంగా విద్యాసాగర్ దేహం నుంచి నాలుగు తూటాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు తూటాలు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. ‘‘చనిపోయినవారు నిజంగా అడవుల్లోనే ఎదురుపడితే వారి కాళ్లకు కచ్చితంగా బూట్లు ఉండాలి. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల కాళ్లకు బూట్లు లేవు. మహిళా నక్సలైట్లు తప్పనిసరిగా నెక్ టీషర్టులు వేసుకుంటారు. శ్రుతి శరీరంపై నెక్ టీషర్టు లేదు. శ్రుతి దేహంపై కాలిన గాయాలు ఉన్నాయి. యాసిడ్ పోయడం వల్లే ఇలా ఉన్నాయి..’’ అని పోస్టుమార్టం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలు, ఇతరులు ఆరోపించారు. కోర్టు ఆర్డర్ తెచ్చేలోపే.. పోలీసులు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారని, కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగలేదని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలకు వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతోపాటు విరసం నేతల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని కోరారు. ఈ మేరకు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేందుకు విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఆందోళనను పోలీసులు పరిగణనలోకి తీసుకోకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించారు. కిరాతకంగా చంపారు..! పోలీసులు అమానవీయంగా వ్యవహరించి శ్రుతి, విద్యాసాగర్‌లను పొట్టన పెట్టుకున్నారని విరసం నేతలు, మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం పూర్తరుున తర్వాత మృతదేహాలను వారి ఇళ్లకు తరలించారు. శ్రుతి శరీరంపై కాళ్లు, పొట్ట తదితర చోట్ల కాలిన గుర్తులున్నాయి. కుటుంబ సభ్యులు ఈ గాయాలను చూపిస్తూ... ‘‘యాసిడ్ పోసి అత్యంత కిరాతకంగా చిత్రహింసలకు గురిచే శారు. ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు..’’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. విద్యాసాగర్ మర్మావయవాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎవరు చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలున్నాయని చెప్పారు. ముగిసిన విద్యాసాగర్ అంత్యక్రియలు ధర్మసాగర్: విద్యాసాగర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో బుధవారం ముగిశాయి. విద్యాసాగర్ తల్లిదండ్రులు సుధాకర్ లలిత, సోదరి శ్వేత గుండెలవిసేలా రోదించారు. అంత్యక్రియలో గ్రామస్తులు, బంధువులు, వరవరరావు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను పాటించండి వరంగల్ లీగల్: ఎన్కౌంటర్ మృతదేహాలకు శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టుల మార్గదర్శకాలను అమలు పర్చాలని వరంగల్ జిల్లా మానవ హక్కుల కోర్టు మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టు శ్రుతి బంధువు దుర్గాప్రసాద్ ఈ కోర్టును ఆశ్రయించారు. శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నిపుణుడి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీనిని పరిశీలించిన కోర్టు.. ఆ మార్గదర్శకాలను పాటించాలని, వీడియో రికార్డింగులను ఈనెల 25లోగా నివేదికగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
పాము కాటుతో చిన్నారి మృతి
మహబూబాబాద్ రూరల్: పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. వరంగల్ జిల్లా మానుకోట మండలం సికింద్రాబాద్ తండాకు చెందిన ధర్మారపు సురేష్-సులోచన పెద్ద కుమార్తె మహాల క్ష్మి(4) గురువారం రాత్రి నానమ్మ పద్మ ఇంటికి వెళ్లింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కట్లపాము వచ్చి చిన్నారిని కాటువేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన మానుకోట ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మహాలక్ష్మి మృతిచెందింది. -
‘తుపాకీ’ కేసులో ఒకరి అరెస్టు
మరొకరి కోసం గాలింపు పోచమ్మమైదాన్ :ఎంజీఎం ఆసుపత్రిలోగన్ క లకలం రేపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకర్ల సమావేశంలో అరెస్టు వివరాలను వె ల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. నల్లబె ల్లిమండలం నారక్కపేటకు చెందిన అజ్మీర నాగరాజు డైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందు లు తలెత్తడంతో ఇద్దరి భార్యలను పోషించలేక డబ్బులు సంపాధించే సులువైన మార్గంగా తుపాకి చూపించి బెదిరించి డబ్బులు వసులు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మొదటి భార్యబంధువైన గాజులశంకర్తో కలిసి జార్ఖం డ్కు పనికోసం వెళ్లి పలు నేరాలకు పాల్పడ్డాడు. అక్కడ రూ. 12వేలకు నాటు తుపాకిని కొనుక్కొన్నాడు. బుధవారం అర్ధరాత్రి ఎంజీఎం ఆ సుపత్రిలో ఒంటరిగా ఉండే ప్రభుత్వ డాక్టర్‌ను గన్నుతో బెదిరించేందకు ప్రయత్నిస్తూ.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. సిబ్బం ది అతడిని తనిఖీచేసి, తుపాకీని స్వాధీనం చేసుకుని విచారించినట్లు, గాజుల శంకర్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నాగరాజును రిమాం డ్కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మట్టెవాడ సీఐ శివరామయ్య పాల్గొన్నారు. -
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం
-
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం
వరంగల్: దుండగులు తుపాకీతో కలకలం సృష్టించారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
ఇద్దరు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇంకో ఇద్దరి మహిళల కాళ్లు తొలగింపు వర్ధన్నపేట టౌన్ : పెళ్లి బృందాన్ని తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం వర్ధన్నపేట శివారు తిర్మలాయపెల్లి రోడ్డు వద్ద జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నారుు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి వీరస్వామి-ప్రమీల దంపతుల కూతురు రమ వివాహం రాయపర్తి మండలం కాట్రపెల్లికి చెందిన రాజుతో గురువారం ఉదయం ఇల్లందలో జరి గింది. శుక్రవారం వరుడి స్వగ్రామం కాట్రపెల్లి కి పెళ్లి కూతురు బంధువులు విందు కోసం ట్రాక్టర్లో బయలుదేరారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారి నుంచి తిర్మలాయపెల్లి క్రాస్ రోడ్డు దాటి కొద్ది దూరం పోయాక ట్రాక్టర్ అదు పు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లుకు చెం దిన ఎద్దు వెంకటేశ్వర్లు(45)(వధువు మేనమా మ) అక్కడికక్కడే మృతి చెందాడు, తీవ్రంగా గాయపడిన వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన భూమ రవీందర్, స్వరూప దంపతుల కుమారుడు జగదీష్(7) వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిలో సుంకరి యాకమ్మ, జెట్టబోయిన సుగుణమ్మ కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వైద్యులు తొలగించారు. చికిత్స పొందుతున్న రేణుక, సౌమ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన వారిలో ఎడ్ల రమేష్, ఎద్దు సాయికృష్ణ, యుద్దం జయమ్మ, ఎద్దు రజిత, నారబోయిన సుజాత, శాగ యాదమ్మ, ఇట్టె నాగలక్ష్మి, యాకర ఎలేంద్ర, యాకర ఉపేం ద్ర, గజ్జెల స్వరూపతో పాటు మరికొందరు ఉన్నారు. వర్ధన్నపేట పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా స్థానికులు చెబుతున్నారు. -
మమ...ఇలా సందర్శించి.. అలా సమీక్షించారు
♦ వరాలివ్వని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ♦ చప్పగా సాగిన సమావేశం ♦ మంత్రి పర్యటనపై వైద్యవర్గాల్లో అసంతృప్తి నివేదికలు సేకరించడం... సమస్యలపై పవర్పారుుంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వంటి వాటికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏమైనా వరాలు కురిపిస్తారో... పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారోనని ఉద్యోగులు, సిబ్బంది సైతం వినతిపత్రాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యూరు. ఇలా ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎంజీఎం ఆస్ప్రతికి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి ఎటువంటి వరాలు ఇవ్వకుండానే వెనక్కి మళ్లడంతో అందరూ అసంతృప్తికి గురయ్యూరు. ఆస్పత్రిని పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి 30 నిమిషాల పాటు సందర్శించిన ఆనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశం సైతం చప్పగా సాగింది. సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ.. ప్రభుత్వా లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని ఆదేశిస్తూ.. మంత్రి లక్ష్మారెడ్డి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో ైవైద్యసేవలతోపాటు ఏ రకమైన అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వైద్యవర్గాలు నిశ్చేష్టులయ్యూరుు. మొత్తానికి మంత్రి పర్యటన ఇలా సందర్శించారు.. అలా సమీక్షించారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. వైద్య సేవలపై ఆరా... మొదట మంత్రి లక్ష్మారెడ్డి ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని ఓపీ విభాగాన్ని, క్లినికల్ లాబారేటరీ, బర్న్స్ వార్డులను సందర్శించారు. అత్యవసర విభాగాలైన ఐఎంసీ, ఏఎంసీలోని రోగులను పరామర్శించారు. ఈ వార్డులో చికిత్స పొందుతున్న గర్నిపల్లికి చెందిన మమత, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీను, ఇబ్రహీంపట్నం మండలం ములరాంపూర్ గ్రామానికి చెందిన రాజగౌడ్‌ను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఐసీసీయూ (కార్డియాలజీ) విభాగంలో ఆర్ఐసీయూని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలోని అకాడమీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య విధానంలో సమూల మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవసరమైన సమస్యలను తెలపడంతో సలహాలు, సూచనలివ్వాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వా ఆస్పత్రులను దశల వారీగా మెరుగుపరుస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో సూపర్‌స్పెసాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. పలు ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. ఎంజీఎం, సీకేఎం, కేఎంసీ ఆస్పత్రుల విద్యుత్, ఆస్తి పన్నుల బిల్లులు చెల్లింపు చేశామని, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ గతంలో కన్నా ఈ సారి వంద శాతం నిధులు పెంచి రూ.39 కోట్లు ఇచ్చామన్నారు. పీజీ విద్యార్థులకు ప్రతి నెల 5వ తేదీలోగా స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు సూపరింటెండెంట్ మనోహర్, ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ పలు అభివృద్ధి పనులతో పాటు సమస్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆస్పత్రిలో అదనపు విద్యుత్ అదనపు లోడ్ అవసరముందని, దానికి ప్రత్యేకమైన నిధులు కావాలన్నారు. 2013-14 నుంచి సర్జికల్ పద్దులో నిధుల కేటాయింపులు రావడం లేదని మంత్రికి వివరించారు. కాకతీయ మెడికల్ కళాశాల గురించి మంత్రికి ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ వివరించారు. ఫ్యాకల్టీలో లోటు 32 శాతం ఉందని, కేఎంసీకి అనుబంధంగా ఐదు ఆస్పత్రులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సీకేఎం, జీఎంహెచ్, టీబీ, రీజినల్ ఐ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాలను మంత్రికి సమర్పించారు. సమావేశంలో పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, డీఎంఈ పుట్ట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, ఆర్డీ నాగేశ్వర్రావు, సీకేఎం సూపరింటెండెంట్ సుధాకర్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ రాధ, ఆర్ఈహెచ్ సూపరింటెండెంగట్ పాండురంగ జాదవ్, టీబీ ఆస్పత్రి సూపరింటెడెంట్ కృష్ణ, మెడికల్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్రబాబు, కరుణాకర్‌రెడ్డి, రాజ్సిద్దార్థ్, కెఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వి. చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు హేమంత్, శివకుమార్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు రెండు కేసులు స్వైన్‌ఫ్లూ పాజిటివ్
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం వరకు 9 ైస్వైన్ ప్లూ అనుమానిత కేసుల నమూనాలను హైదరాబాద్‌కు పంపించామని, ఇందులో రెండు కేసులు పాజిటివ్ అని తేలినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. నర్సంపేటకు చెం దిన ప్రవీణ్ కేసు జిల్లాలో ్టమొదటి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసు కాగా, ఆయన ఆరోగ్య పరి స్థితి మెరుగ్గానే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన రెండేళ్ల బా లుడు అంజా ఎంజీఎంలో చికిత్స పొం దుతూ మరణించాడని వెల్లడించారు. అంజా ఈ నెల 25న ఆస్పత్రిలో అడ్మిట్ అ య్యాడని, ఈ నెల 27న తెమడ నమూ నాలు సేకరించి హైదరాబాద్‌కు పం పిం చామన్నారు. ఈ క్రమంలోఅదేరోజు రాత్రి మృతి చెందాడని, బుధవారం రాత్రి నివే దికలందాయని వివరించారు. పెద్దమ్మ గడ్డ కు చెందిన తనూజ, కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన సరోజన, ఆత్మకూర్‌కు చెం దిన బి.స్వప్న, మొగుళ్లపల్లి రంగాపురానికి చెందిన వెంకటయ్య, ఆత్మకూరు మం డలం కొత్తపేటకు చెరందిన బుజ్జికి నెగిటివ్‌గా తేలిందన్నారు. రామగుండానికి చెం దిన బొక్క రమేశ్‌కు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందని వారు పేర్కొన్నారు. -
జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడ ?!
ఎంజీఎంలో అనుమానిత కేసు నమోదు ఎంజీఎం : జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడ కనిపించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అనుమానిత కేసు నమోదైనట్లు మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఆర్ఎంఓ హేమంత్ తెలిపారు. నర్సంపేటకు చెందిన 28 ఏళ్ల యువకుడు ప్రవీణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో ఎక్స్‌రే పరీక్షలకు పంపించారు. న్యూమోనియాగా తేలడంతో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుగా పరిగణించి ప్రత్యేక వార్డుకు తరలించారు. మైక్రోబయోలజీ సిబ్బంది స్వైన్‌ప్లూ పరీక్షలకు సంబంధించిన నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ప్రివెంట్ మెడిసిన్‌కు పంపించారు. ఈ నమూనాల ఫలితాలు శనివారం రానున్నట్లు ఆర్ఎంఓ తెలిపారు. -
కొరికేస్తున్న ‘చలి’
జిల్లాలో చలి పులి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనీస ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక ఇప్పటివరకు సుమారు నలుగురు మృతిచెందారు. కాగా, చిన్నారులు ‘ఆస్తమా’తో అవస్థలు పడుతున్నారు. అయితే చలి నుంచి రక్షణ పొందేందుకు కొద్ది పాటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ⇒జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు ⇒గజగజలాడుతున్న ప్రజలు ⇒మృత్యువాత పడుతున్న వృద్ధులు ⇒ఆస్తమా బారిన చిన్నారులు ⇒జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ఎంజీఎం : జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చలితీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకు కూడా చలి ప్రభావం ఉంటుండడంతో ప్రజలు బయటికి వచ్చేందు కు గజగజలాడుతున్నారు. వాతావారణంలో మార్పులు చోటుచేసుకుంటుండడంతో పెద్దలు, పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, చర్మ సంబంధిత వ్యాధులతో వారు సతమతమవుతున్నారు. ఆస్తమా బారిన చిన్నారులు... చలితీవ్రతో చిన్నారులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చలితో జిల్లాలోని ఆస్పత్రులకు రోజుకు ఇద్ద రు చొప్పున చిన్నారులు అస్తమాతో బాధపడుతూ వస్తున్న ట్లు డాక్టర్లు చెబుతున్నారు. జన సాంద్రత, మస్కిటో కాయిల్స్ వినియోగంతో పట్టణాల్లో నివసించే పిల్లల్లో ఎక్కువ మంది అస్తమా బారిన పడుతున్నారంటున్నారు. దీంతోపాటు దు మ్ము, ధూళి, ఘాటైన వాసనలు, ఐస్‌క్రీమ్ వంటి చల్లని పదార్థాల్లో ఉంటున్న వైరల్ ఇన్ఫెక్షన్తో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలు 15 శాతం, పట్ణణాల్లో 20 శాతం మంది అస్తమాతో బాధపడుతున్నారు. అస్తమా బారిన పడిన చిన్నారు ల్లో శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం(తెమడ) వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఫలితం గా న్యూమోనియా బారిన పడే అవకాశముంది. ఆస్తమాను గుర్తించడం ఇలా... తరుచూ దగ్గు, జలుబు, అయాసం, దగ్గుతో కఫం(తెమడ) కక్కడం, పిల్లికూతలు, చంటి పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడే లక్షణాలు ఆస్తమాలో ఉంటాయి. ఏడాది వయసులోపు ఉన్న పిల్లల్లో దగ్గు, కఫం, ఆయాసం, వైరల్ ఇన్ఫెక్షన్తో బ్రాంకోలైటిస్ రావచ్చు. రాత్రివేళ ఎక్కువగా దగ్గు రావడం, ఎక్కువ సేపు ఆటలు ఆడినా, పరిగెత్తినా దగ్గు, ఆయాసం రావడం వంటివి ఆస్తమా లక్షణాలే. ఆహార పదార్థాలతో కూడా ఆస్తమా.. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్ ్సతో కూడా అస్తమా వచ్చే అవకాశం ఉంది. బత్తాయి పండ్లు, ప్యాకింగ్ ఫుడ్స్, కృతిమ రం గులు, ఫ్రిజర్వెటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు అస్తమా వచ్చేందుకు కారణాలు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ⇒తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లులు మొదటి ఆరు నెలల వయస్సు వరకు బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. ⇒పిల్లలు ఉండే పరిసరాలను శుభ్రంగా, దుమ్ము, ధూళి లేకుండా చూడాలి. ⇒ఇంటిలో నేలను చీపురుతో కాకుండా తడిగుడ్డతో శుభ్రం చేస్తే మంచిది. ⇒కట్టెల పొయ్యి, దోమల నివారణకు వాడే కాయిల్స్, సాంబ్రాణి ధూపం ఆస్తమా ఉన్న వారికి దూరంగా ఉంచాలి. ⇒పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచకూడదు. నూలు కలిగి ఉన్న బొమ్మలను దూరంగా ఉంచాలి. ⇒పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు కవర్లు ఎప్పటికప్పుడు మార్చాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి... ఆస్తమా.. పెద్దగా భయపడాల్సిన జబ్బు కాదు. దాని ని సకాలంలో గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. ఆస్తమా తీవ్రంగా ఉంటే.. నెబ్యులైజేషన్ చికిత్సతో పా టు అవసరమైన సమయంలో ఇం జక్షన్లు తీసుకోవాలి. పెంపుడు జంతువులకు, దుమ్ము, ధూళికి పిల్లలను దూరంగా ఉంచాలి. -శేషుమాధవ్, పిడియాట్రీషన్ చలితో వచ్చే చర్మ వ్యాధులు... శీతాకాలంలో వచ్చే మార్పులతో చర్మం పొడిబారినట్లు అవుతుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి. జలుబు.. ఈ సీజన్లో చాలా మంది జలుబుతో బాధపడుతుంటా రు. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు సుమారు ఆరుగజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుం టుంది. జలుబు ప్రధానంగా దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడకపోవడంతో వస్తుంది. గొంతునొప్పి... చలికాలంలో చాలా మంది గొంతునొప్పితో బాధపడుతుంటారు. గొంతులో ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఏర్పడడంతో నొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీ యాలు, తేమగాలి పడకపోవడంతో టాన్సిలైటీస్, ఎడినాయిడ్స్, లెరింజైటీస్, పైరింజైటీస్ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.. జలుబు, గొంతునొప్పితో బాధపడేవారు ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస పండ్లు, ఖర్జూరాను ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఉదయం చలితీవ్రత తగ్గిన తర్వాత వాకింగ్ చేస్తే బాగుంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల పై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. అలాగే పొడిచర్మాన్ని మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్‌తో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. మిటమిన్ సీ ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇస్తే చర్మం పొడి ఆరిపోకుండా రక్షణ పొందుతుంది. - పావుశెట్టి శ్రీధర్, హోమియో ఫిజీషియన్ -
భార్యపై భర్త గొడ్డలితో దాడి, పరిస్థితి విషమం
వరంగల్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పరకాల మండలం కౌకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై విచక్షణ లేకుండా భార్యపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
జ్వరంతో విద్యార్థి మృతి
నర్సంపేట టౌన్ : జ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... పట్టణంలోని పోశవ్ము వీధికి చెందిర సెల్వోజు శ్రీనివాస్, పద్మ దంపతుల కువూరుడు అఖిల్(18) హన్మకొండలోని సీవీ రావున్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అతడికి తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వుృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వుృతుడి కుటుంబానికి టీఆర్ఎస్ నాయుకుడు రారుుడి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ రూ.4 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట నాయుకులు నారుుని నర్సయ్యు, ఎదరబోరుున రావుస్వామి, దండు రాజు, గోపాల్‌రావు, పసుల ఎల్లస్వామి, వూమిడాల బిక్షపతి, బోడ గోల్యానాయుక్, రాయురాకుల సారంగపాణి, కాట ప్రభాకర్, రాజు, బైరి వుురళీ, అనిల్, శ్రీనివాస్, భద్రు, సత్యం పాల్గొన్నారు. -
విద్యార్థిని చితకబాదిన హౌస్ మాస్టర్
- నీళ్ల కోసం నినాదాలు చేసినందుకు ప్రతాపం - ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు - విద్యార్థికి ఫిట్స్ ఉందన్న ఉపాధ్యాయులు - హౌస్ మాస్టర్ కొట్టారని చెబుతున్న తోటి విద్యార్థులు ములుగు/ఎంజీఎం : తాగునీటి కోసం విద్యార్థులు ఆందోళన చేయగా ఆగ్రహించిన హౌస్ మాస్టర్ ‘ఈ గొడవకు కారకుడివి నీవే’ అంటూ ఓ విద్యార్థిపై తన ప్రతాపం చూపాడు. తన కోపం చల్లారేలా అతడిని చితకబాదడంతో స్పృహ తప్పిపడిపోయాడు. ఈ ఘటన ములుగు మండలం జాకారం గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత విద్యా ర్థి, తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన పస్తం కనకలక్ష్మి కుమారుడు సంతోష్ జాకారం గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు టిఫిన్ చేసిన అనంతరం విద్యార్థులంతా ప్లేట్లు కడుక్కోవడానికి బోరింగ్ వద్దకు వెళ్లారు. అరుుతే నీళ్లు రాకపోవడంతో నిరాశ చెందిన సంతోష్ హాస్టల్లో సౌకర్యాలు సరిగాలేవని ప్రిన్సిపాల్ డౌన్‌డౌన్ అని నినాదాలు చేశాడు. దీంతో తోటి విద్యార్థులు కూడా అలాగే నినాదాలు చేశారు. ఇది గమనించిన పీఈటీ విద్యార్థుల వద్దకు చేరుకొని వారించాడు. దీంతో వారు గదుల్లోకి వెళ్లిపోయూరు. అంతలో నే తలనొప్పిగా ఉందని ఉదయం 9 గంటలకు సంతోష్ హాస్టల్ డాక్టర్ హైమత్ వద్దకు వెళ్లా డు. తిరిగి తరగతి గదికి వస్తుండగా హౌస్ మాస్టర్ వెంకట్‌రెడ్డి సంతోష్‌ను పట్టుకుని తల పై కొట్టాడు. దీంతో అతడు కిందపడిపోయా డు. ఆ తర్వాత నోట మాట రాలేదు. హాస్టల్ డాక్టర్ వచ్చి ప్రథమ చికిత్స చేశారు. ఫిట్స్‌గా భావించి చేతిలో తాళాలు పెట్టడంతోపాటు ముఖంపై నీళ్లు చల్లారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. గమనించిన ఉపాధ్యాయు లు అతడిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రి తరలించారు. కప్పిపుచ్చేందుకు యత్నం ఈ విషయమై ఉపాధ్యాయులను వివరణ కోరగా హౌస్‌మాస్టర్ సంతోష్‌ను కొట్టలేదని, మొదటి నుంచి సంతోష్ ఆరోగ్య పరిస్థితి వింతగా ఉంటుందని ఫిట్స్ కారణంగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇదే విషయాన్ని తోటివిద్యార్థులను అడగగా హౌస్ మాస్టర్ కొట్టడంతోనే సంతోష్ కళ్లు తిరిగి పడిపోయాడ ని మూకుమ్మడిగా సమాధానమిచ్చారు. వారు మాట్లాడుతుండగా ఉపాధ్యాయులు వారిని వారించడం గమనార్హం. -
రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి
ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి బస్వరాజు సారయ్య హామీ ఇచ్చారు. ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఆదివారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశం జరిగింది. 15 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించారు. 57 సంవత్సరాల క్రితం నిర్మించిన మెడిసిన్, సర్జరీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎంజీఎం క్యాజువాలిటీని 30 పడకల సామర్థ్యం ఉండేలా మెరుగు పరచాలని, 500 పడకలతో కూడిన హాస్టల్ సౌకర్యం కల్పించాలని, ఎంసీఐ నిబంధనల ప్రకారం అన్ని విభాగాల్లో మరో యూనిట్ పెంచాలని, ప్రభుత్వ పరంగా సిటీ, మెడల్ స్కానింగ్ సౌకర్యం కల్పించాలని, సూపర్‌స్పెషాలిటీ రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని, పీఆర్ఓ సిబ్బందిని కొనసాగించాలని, ట్రామా సెంటర్‌ను మంజూరు చేయించాలని, అదనంగా మరో 50 అద్దె గదులను రోగుల అందుబాటులోకి తేవాలనే అంశాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. యూజీసీ స్కేల్ తీసుకుంటున్న వైద్యులు నిబంధనల ప్రకారం పనిచేయాలని, డ్యూటీ డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి * 150 కోట్లు కేటాయించారని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్షలతో రెండు వెంటిలేటర్లను సైతం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. {పభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అన్ని వసతులు, డాక్టర్లు ఉన్నా ఆస్పత్రి నుంచి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై వైద్యులు వివరణ ఇస్తూ ఆస్పత్రిలో అన్ని సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా ఆర్థో కేసులను 108 సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆర్థో కేసులు ప్రభుత్వ ఆస్పత్రులకే అనుసంధానం చేస్తే తప్ప దీనికి తెరపడదని వారు తెలిపారు. వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరుకావడమేమిటని క్యాన్సర్ విభాగ హెచ్ఓడీ ఏవై.రావుపై రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మండిపడ్డారు. క్యాన్సర్ విభాగంలో 60 మంది రోగులు మాత్రమే ఉండడమేంటని ప్రశ్నించారు. ఆస్పత్రిలోని టెలిఫోన్ బూత్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ ముగిసినా సాయి ఫార్మసీ ప్రైవేట్ మెడికల్ షాపును ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రోగులకు అతి తక్కువ ధరలకు అందించే జీవనధార ఫార్మసీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎంజీ ఎం ఆస్పత్రి అభివృద్ధికి ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. హామీలను నెరవేర్చే బాధ్యత ఎంజీఎం వైద్యులపైనే ఉందని పేర్కొన్నారు. ఇప్పటి నుంచైనా క్రమం తప్పకుండా హెచ్‌డీఎస్ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఎంజీఎంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ, హెచ్‌డీఎస్ నిధులపై మూడు నెలలకోమారు ఆడి టింగ్ చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పీపీటీ భాగస్వామ్యంతో నెలకొల్పిన మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహణ తీరుపై ఎంజీఎం సిబ్బంది మండిపడ్డారు. ఔట్పేషంట్లకు ఇచ్చిన ప్రాధాన్యం ఇన్పేషంట్లకు ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని కోరారు. సమావేశంలో సూపరింటెం డెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్‌ధరక్, ఆర్‌ఎంఓలు నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీలు కరుణాకర్‌రెడ్డి, టీవీ.రావు, వి.చంద్రశేఖర్, శ్రీనివాస్, దొడ్డ రమేష్, శ్రీరాములు, ఏవై.రావు, హెచ్‌డీఎస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రజాప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధితోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు రూ. 400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తీర్మానించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి ఈనెల 22న వైద్యశాఖ మంత్రి కొండ్రు మురళి, డీఎంఈతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి సారయ్య, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. -
పెద్దాస్పత్రిలో అందని సేవలు
ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలో పేద రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వైద్య పరికరాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. సరైన సదుపాయాలు లేక సమస్యలతో కునారిల్లుతోంది. వీటికి పాలకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వం తోడుకావడంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వైద్య పరీక్షలకు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి రావడంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఏబీజీ పరీక్షలు ఆర్ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు, క్రిమిసంహారక మందు తాగిన వారికి ఎయిర్ ట్రియల్ బ్లడ్ గ్యాసెస్ (ఏబీజీ) పరీక్షలు అవసరం. ఎమర్జెన్సీ ల్యాబ్‌లో దీనికి సంబంధించిన వైద్య పరికరం ఉన్నప్పటికీ... మరమ్మతుకు నోచుకోక రెండు నెలలుగా మూలకుపడింది. ఈ పరీక్షకు ప్రైవేట్ సెంటర్లో సుమారు రూ.1,100 ఖర్చవుతుంది. బ్లడ్ టెస్ట్ బ్లడ్ సెల్ కౌంటర్లో రోగుల రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజీ, ఎర్ర, తెల్ల రక్త కణాలు, డిఫరెన్షియల్ కౌంట్, ప్లేట్ కౌంట్స్‌ను పరీక్షిస్తారు. కెమికల్స్ లేకపోవడంతో రెండు రోజులుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. రోజుకు 60 నుంచి 70 మంది వరకు రోగులు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రరుుస్తున్నారు. దీంతో ఒక్కొక్కరిపై రూ.200 భారం పడుతోంది. ఆర్ఏ, సీఆర్పీ... కీళ్లనొప్పులు, బ్లడ్ ఇన్ఫెక్షన్కు కారణాలు తెలుసుకునేందుకు ఆర్ఏ, సీఆర్పీ, ఏఎస్ఓ పరీక్షలు చేస్తారు. కెమికల్స్ లేక ఆరు నెలలుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పేద రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో సీఆర్పీ టెస్ట్‌కు రూ. 350, ఏఎస్‌ఓకు రూ.200, ఆర్‌ఏకు రూ.150 వెచ్చించాల్సి వస్తోంది. టూడీ ఎకో... ఛాతినొప్పితోపాటు గుండె నొప్పితో వచ్చే రోగులకు టూడీ ఎకో ద్వారా స్కానింగ్ చేసి సమస్య ఎక్కడుందో తెలుసుకుంటారు. ఎంజీఎంకు ఈ పరికరం 2003లోనే వచ్చింది. మరమ్మతుకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం అది మూలన పడింది. దీంతో టూడీ ఎకో పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ సెంటర్‌కే పరుగులు పెడుతున్నారు. ఈ పరీక్షలకు రూ.650 అవుతోంది. -
రూ 108 కే ఆక్సిజన్ సిలిండర్
ఎంజీఎం, న్యూస్‌లైన్: ఎంజీఎంలో ఆక్సిజన్ దందాకు తెరపడింది. గత ఆరేళ్ళుగా నిరాటంకంగా నడుస్తున్న దోపిడీ వ్యవస్థకు చెక్ పడింది. 2007 నుంచి తులసీ ఏజెన్సీ ద్వారా ఆస్పత్రికి రూ 385లకు సరఫరా చేస్తున్న సిలిండర్ ధర టెండర్లలో ప్రస్తుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంజీఎం సూపరింటెండ్, పరిపాలన అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించడంతో ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ ధర రూ108కి పడిపోయింది. దీంతో ఆస్పత్రికి రోజు సుమారు 100 సిలిం డర్లు అవసరమవుతుండగా ఒక్కొ సిలిండర్‌పై 277 చొప్పున రోజుకు సుమారు రూ 30 వేల మిగులు చొప్పులన నెలకు రూ 9 లక్షలు సంవత్సరానికి రూ కోటి ఆదా అవుతాయని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్ పేర్కొన్నారు. దోపిడీకి స్వస్తి ఆరేళ్ళుగా ఎంజీఎంలో కొనసాగుతున్న ఆక్సిజన్ అక్రమ దందాకు బుధవారంతో తెరపడింది. 2006 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు గత పరిపాలన అధికారులు వత్తాసు పలికి యథేచ్చగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 2006 నుంచి 2011 వరకు టెండర్ల పేరుతో ఈ ప్రక్రియ సాగగా.. తదనంతరం టెండర్ల ప్రక్రియకు కూడా స్వస్తి పలికారు. లిక్విడ్ ఆక్సిజన్ పేరుతో టెండర్లకు స్వస్తి ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు, మరణాలను తగ్గించేం దుకు 2011లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ అప్పటి సూపరిండెంట్‌ను మచ్చిక చేసుకుని ప్లాంట్ పూర్త య్యే వరకు టెండర్ల పిలవద్దని ఆదేశాలు జారీ చేయించారు. దీంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిన రూ 385లకే ఎంజీఎం ఆస్పత్రికి సిలిండర్లను సరఫరా చేశారు. నివ్వెరపోయిన అధికారులు.. ఎంజీఎంలో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ 108 కిపడిపోవడంతో అధికారులు నివ్వెర పోయారు. సిలిండర్ ఒక్కసారిగా రూ 385 నుంచి రూ 108కి అంగీకారం కుదిరిందనే విషయం చెబుతున్న తరుణంలో వాస్తవమేనా.. అని చర్చించుకోవడం ఎంజీఎంలో కనిపించింది. మొత్తానికి గత అధికారులు చేసిన తప్పిదానికి ప్రస్తుత అధికారులు నిక్కచిగా వ్యవహరించి ప్రభు త్వ ఖజానా గండికొట్టకుండా వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి వైద్యులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘వెంటిలేటర్’పై ఎంజీఎం!
ఎంజీఎం,న్యూస్‌లైన్: కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీ ఎం ఆస్పత్రి... సౌకర్యాలు, పరికరాల లేమీ, వైద్యుల కొరత వంటి కారణాలతో ‘యమ’జీఎంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సర్కారు అలసత్వం వెరసి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎంజీఎంలో వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. అత్యవసర సమయూల్లో కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు మూలకుపడ్డారుు. ఆర్ఐసీయూ వార్డులో ఉన్న పది వెంటిలేటర్లలో ఒకే ఒక్కటి పనిచేస్తుండడంతో వైద్యులు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలు కావడం, క్రిమిసంహారక మందు తాగిన బాధితులు, పాము, తేలు కాటు బారిన పడినవారు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వైద్యచికిత్సల కోసం నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి పదుల సంఖ్యలో వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నారుు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారికి వెంటనే వెంటిలేటర్ల ద్వారా కృతిమ శ్వాసను అందిస్తూ చికిత్స చేయూల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా వైద్యసేవలు పొందాలంటే రోజుకు సుమారు *20 వేలు చెల్లించాలి. ఇంత ఖరీదైన వైద్యం పొందలేని నిరుపేదలు ఎంజీఎంకు రాక తప్పదు. కానీ... ప్రస్తుతం ఒకే ఒక్క వెంటిలేటర్ పనిచేస్తుండడంతో అక్కడ రోగుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవక తప్పని పరిస్థితులు దాపురించారుు. ఏడాదిగా మరమ్మతులు లేవు ఎంజీఎం ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ వార్డులో చైన్నయ్ ట్రాన్స్హెల్త్ కేర్ కంపెనీ నుంచి *12 లక్షల విలువ చేసే తొమ్మిది వెంటిలేటర్లతోపాటు ఎస్బీహెచ్ బ్యాంక్ అందించిన ఒక వెంటిలేటర్ ఉంది. వీటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ట్రాన్స్ హెల్త్ కేర్ కంపెనీకి అప్పగించారు. ఇందుకోసం ఆ కంపెనీకి ఏటా * నాలుగు లక్షలు చెల్లించాలి. అరుుతే 2011-12కు సంబంధించిన బిల్లులను ఆ కంపెనీకి సకాలంలో చెల్లించలేదు. దీంతో సదరు కంపెనీ వారు గత ఏడాది మెరుుంటనెన్స్ అందించకుండా చేతులేత్తేశారు. మరమ్మతుకు నోచుకోకపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆర్ఐసీయూ వార్డులోని ఏడు వెంటిలేటర్లు మూలకుపడ్డాయి. మిగిలిన మూడు వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.... ప్రస్తుతం ఆ సంఖ్య ఒక్కటికి చేరింది. వారంలో అందుబాటులోకి తెస్తాం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వెంటిలేటర్ల మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వాస్పత్రులకు ప్రత్యేకంగా బయోమెడిక ల్ ఇంజినీర్‌ను నియమిస్తే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. వెంటిలేటర్లను మరమ్మతు చేసే ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడమే కారణం. ప్రస్తుతం వెంటిలేటర్లను వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. - నాగేశ్వర్రావు, ఆర్ఎంఓ