వెంటిలేటర్‌పై బాలు: వీడియో వైరల్‌ | Viral: SP Balu Physiotherapy On Ventilator Video Out on Social Media | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పై బాలు: వీడియో వైరల్‌

Published Fri, Sep 25 2020 4:36 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు బాలు. కొద్ది సేపటి తర్వాత అలసటతో ఆయన ఆపేశారు. 

వైద్యులు మళ్లీ చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు. కాగా, కరోనా వైరస్‌ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement