
చెన్నై: మొన్నటివరకు విషమంగా ఉన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుటపడుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే ఇప్పటికీ వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎక్మో సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఎస్పీ బాలు కరోనాను జయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు చరణ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. (నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే: ఎస్పీ చరణ్)
చదవండి: ఎక్మో యంత్రం: ఆగే గుండెకు ఆయువు పోస్తుంది..
Comments
Please login to add a commentAdd a comment