SP Balasubrahmanyam
-
‘పాటగా బతకనా మీ అందరి నోట..’ గానగంధర్వుడి జ్ఞాపకాల్లో (చిత్రాలు)
-
స్నేహం... బాలు చేవ్రాలు!
తెలుగు జాతి గర్వించదగిన గాన గంధర్వునిగా, బహుముఖ కళాపారీణునిగా బాలును ఎరగని వాళ్ళుండరు. ఆయన నేపథ్య గాయకునిగా, అద్వితీయునిగా రాణించిన కాలంలో సాటి గాయకుల కెవరికీ అవకాశాలు రాకుండా చేస్తున్నారని కొందరు అసూయాపరులు ఆరోపణలు చేసినా, ‘పాడుతా తీయగా’ కార్యక్రమ వీక్షకులను బాలు వ్యక్తిత్వం, హృదయ సంస్కారం ముగ్ధుల్ని చేశాయి. ఆయన అంతరంగం స్నేహ పారిజాతమని ఆ పరిమళాల్ని శ్వాసించి పరవశించిన ఆత్మీయ మిత్రులకు మాత్రమే తెలుసు. మాంగల్య బంధం కంటే స్నేహబంధం పటిష్టమైనదనీ, అది ఎప్పటికీ ఇగిరిపోని గంధం అనీ బాలు అభిప్రాయపడేవారు. స్నేహం చేసేముందు అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ, స్నేహం కుదిరిన తర్వాత మిత్రునిలో లోపాలు బయటపడినా వాటిని సరిదిద్దాలి కాని ఏకంగా ఆ బంధాన్ని తెంచుకోకూడదనీ బాలు స్నేహ ధర్మానికి భాష్యం చెప్పేవారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో స్నేహాన్ని ఒక పవిత్రబంధంగా, పారాయణ గ్రంథంగా పాటించిన మనస్వి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.బాలు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లనూ, చిన్న నాటి నేస్తాలనూ మర్చిపోలేదు. అందుకు ఆయన కృతజ్ఞతా పూర్వకంగా చేయి అందించిన బీవీ మురళి, ఎమ్ విఠల్‌రావు, వై కామేశ్వరరావు, శ్యామ్, డా‘‘ వై.దివాకర్ వంటి సహచరులు ప్రత్యక్ష సాక్షులు. 1964లో మద్రాసు ఆంధ్రా క్లబ్లో జరిగిన లలిత సంగీతం పాటల పోటీలో పాల్గొనడానికి బాలు ఇష్టపడకపోయినా... చెప్పకుండా ప్రవేశ రుసుము చెల్లించి బాలుకి ప్రథమ బహుమతి రావడానికీ, కోదండపాణి వంటి వారి దృష్టిలో పడటానికీ కారకుడు; 1966 డిసెంబరు 15వ తేదీన ‘విజయా గార్డెన్స్’లో తన మొట్టమొదటి సినిమా పాట రికార్డింగ్‌కు సైకిలు మీద తోడుగా వచ్చి ప్రోత్సహించిన తన రూమ్మేట్ బీవీ మురళిని కోదండపాణి ఆడియో లాబ్‌లో ఆడియో అసిస్టెంట్‌గా నియమించడమే కాకుండా ఎన్నో వేదికల మీద అతని సహాయాన్ని గుర్తు చేసుకునేవారు. రంగస్థలం మీద సహ నటులైన శ్యామ్‌ను స్టూడియో మేనేజర్ గానూ, వై. కామేశ్వరరావును ‘పాడతా తీయగా’లో అసిస్టెంట్ గానూ, కొన్ని చిత్రాలలో నటుడి గానూ అవకాశాలు కల్పించి వారి ఉపాధికి తోడ్పడ్డారు. విఠల్‌ను పీఏగా పెట్టుకోవడమే కాకుండా తన ఇంటికి దగ్గర్లో అతనికో ఇల్లు కట్టించడంతో పాటు అనేక విధాలుగా ఆదుకున్నారు. ‘ఈటీవీ’ వారి వార్షికోత్సవ సంగీత కార్యక్రమంలో తను మెచ్చిన రాంప్రసాద్‌ను ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి పరిశోధకునిగా చివరి వరకు కొనసాగించారు. బాలు స్నేహ ప్రీతి బాల్యమిత్రులకే పరిమితం కాలేదు. స్టూడియో నిర్మాణానికి సహకరించిన ప్రాణమిత్రుడు బిల్డర్ రాధాకృష్ణన్ ఆకస్మికంగా జూన్ 1వ తేదీన చనిపోతే ఆనాటి నుంచి బాలు తన పుట్టినరోజును (జూన్ 4వ తేదీ) అట్టహాసంగా జరుపుకోవడం మానేశారు. ఎమ్వీఎల్, వై. కామేశ్వరరావు వంటి ఆప్తమిత్రుల అవసాన దశలలో వారిని బతికించడానికి హాస్పిటల్స్‌కు సంబంధించిన మొత్తం ఖర్చులను భరించారు. ఎమ్వీఎల్ చనిపోయిన తరువాత కూడా అతని స్నేహ బృందాన్నీ, నూజివీడునూ మర్చిపోకుండా అనేక స్మారక కార్యక్రమాలకు హాజరయిన స్నేహశీలి, ఆత్మ బంధువు బాలు. 1990లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా పరిచయమైన ఈ వ్యాసకర్త సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సినిమా పాట చరిత్ర’ను అయాచితంగా, ఐచ్ఛికంగా స్పాన్సర్ చేసి ప్రచురించడమే కాకుండా దానికి విస్తృత ప్రాచుర్యాన్ని కలిగించారు బాలు. స్వల్ప పరిచయం స్నేహంగా మారడానికీ, ఈ వ్యాసకర్తకు సినీగేయ సాహిత్య పరిశోధకునిగా గుర్తింపు రావడానికీ బాలు సహృదయతే కారణం. నంది పురస్కారాల నందుకున్న వ్యాసకర్త రెండు సిద్ధాంత గ్రంథాలనూ స్పాన్సర్ చేసిన బాలు స్నేహ వాత్సల్యాన్ని ఈ రచయిత మర్చిపోలేడు. వెన్నెలకంటి ప్రతిభను గుర్తించి అతనిని సినీరంగంలో ప్రోత్సహించడం, డా‘‘ పీఎస్ గోపాలకృష్ణ రచనలు ‘మన ఘంటసాల’, తన జీవిత చరిత్ర ‘జీవన గానాలు’కు బాసటగా నిలవడం బాలు ఉత్తమాభిరుచికి నిదర్శనాలు. 1993 ఫిబ్రవరిలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఘంటసాల విగ్రహావిష్కరణ సందర్భంగా లక్షలు వెచ్చించి మద్రాసు చిత్ర పరిశ్రమలోని తన మిత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించి సత్కరించడం బాలు మైత్రీ యానంలో ఓ మైలురాయి. బాలుది బాలుడి మనస్తత్వం. ఆ విషయాన్ని ఘంటసాల విగ్రహావిష్కరణ సభలో అతని కన్నీళ్లు రుజువు చేశాయి. బాలు సంగీత సత్కార వేదికల మీద ఎన్నో సార్లు తన అంతిమ క్షణాల గురించి ప్రస్తావించేవారు. తనను నూరేళ్ల వరకు మృత్యువు సమీపించదనీ, మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలనీ, అప్పుడు కూడా తన మిత్రులు, అభిమానులు తనతో ఉండాలని కోరుకుంటున్నాననీ అనేవారు. పసి మనస్సును తలపించే ఆ మహోన్నత మూర్తి పుట్టినరోజున ఆయన ఆత్మకు అంజలి ఘటిద్దాం. అంతటి మహనీయుని సమకాలికులుగా పుట్టినందుకు, ఆయన స్నేహ సంపదను పంచుకున్నందుకు జన్మ ధన్యమైందని గర్విద్దాం. డా‘‘ పైడిపాల వ్యాసకర్త సినీగేయ పరిశోధకులు ‘ 99891 06162(నేడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి) -
రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) ఏం జరిగింది? గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు. రూ.కోటి డిమాండ్ ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్‌ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
ఎస్పీ బాలు గొంతు రీక్రియేట్.. మండిపడ్డ ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపాడు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపాడు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాన్న చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు' అని ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: ఇంటర్వ్యూ చేసింది.. ప్రేమలో పడింది.. త్వరలోనే ఏడడుగులు వేయనున్న హీరోయిన్ -
అందుకే మోహన్ బాబుకి నా మీద కోపం: బాలసుబ్రహ్మణ్యం
-
మహేష్ బాబు కి పాడేటప్పుడు జాగ్రత్తగా పాడాలి లేకపోతే..!
-
యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!
గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్‌లో నోవర్ హిల్ హైస్కూల్లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్ 'సోల్‌ఫుల్ ప్రెజెంట్' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్ టు ది లెజెండ్' కార్యక్రమం ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు. ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్ బోయన్‌పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల కొనియాడారు. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
అయినా నాకు దేవుడితో సమానం: నిత్యా మీనన్
-
నేను పాడొద్దు అంటూ ఇళయరాజా గారు నిషేధం చేశారు
-
ధర్మం చేయాలి అనుకుంటే ఈ పని చేయండి..!
-
నేను ఎపుడు మీ మధ్యలోనే ఉంటాను..నన్ను దూరం చేయకండి..!
-
ఎస్పీ బాలు వల్ల చాలా మోసపోయాను...కానీ..!
-
ఘంటసాల పై ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు
-
నా భార్యను నేను చాలా బాధపెట్టాను : S P బాలసుబ్రహ్మణ్యం
-
నన్ను ఘోరంగా అవమానించారు : S P బాలసుబ్రహ్మణ్యం
-
కృష్ణతో గొడవ : SP బాలసుబ్రహ్మణ్యం
-
నా చెల్లెలికి నా కొడుకుకి ఎందుకు సహాయం చేయాలి..!
-
ఓకే రోజులో 19 పాటలు పాడిన ఘనత నాది
-
మాతృ భాషను ఖూనీ చేయకండి.. !
-
సింగర్ సుశీల గారిని చాలా వేదన పెట్టాను.
-
నిన్న నిజం, నేడు జ్ఞాపకం.. ఆ అదృష్టం లేదు.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్) ఇవాళ లెజెండరీ సింగర్, దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సునీత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం ఆంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడ్ని ఈరోజుమాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25, 2020లో మరణించారు. (ఇది చదవండి: అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల
గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఘంటసాల, బాల సుబ్రమణ్యం లాంటి లెజెండరి సింగర్స్‌తో కలిసి ఎన్నో పాటలు పాడిని ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానల్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత లెజెండరి సింగర్ బాలుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. బాలుగారి మరణంతో మొత్తం చీకటి అయ్యిందని ఆమె వాపోయారు. ‘బాలు లాంటి గాయకుడు ఎవరు ఉండరు. ఇక రారు కూడా. ప్రస్తుతం ఉన్నవాళ్లు ఆయనలా పాడటానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆయన లేని లోటు ఎవరి తీర్చలేనిది. ఎంతో గొప్ప స్వరం ఆయనది. ఆయన పాటలు వింటుంటే ఇంకో పదేళ్లు బాలు గారు ఉండకూడదా అని దేవుడితో పోట్లాడుతుంటాను’ అన్నారు. ఆయన చనిపోయినప్పుడు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదని, తనని రానివ్వలేదన్నారు. మీకు వయసైపోయింది. కరోనా ఉంది రావద్దన్నారు.. ఇక ఏం చేయలేక టీవీల్లో చూసి ఏడ్చానంటూ ఆమె వాపోయారు. ‘అసలు ఏం లేదు సినిమా లోకమంతా చీకటి అయిపోయింది. అంత పైకి తీసుకువచ్చారు. ఆ క్యారెక్టర్ తగినట్లు పాట పాడటం అంటే సాధారణ విషయం కాదు . ఒక్క పాటలే కాదు డబ్బింగ్, డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అది చాలా గొప్పవరం’ అంటూ బాలుని గుర్తు చేసుకున్నారు. ఇక బాలుతో ఉన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఒకసారి మేం అమెరికా వెళ్లాం. అప్పుడు ఆయన కుర్రాడు. నిర్మాతలమో ఆయనతో పాట పాడించద్దు అంటారు. అలాంటి బాలు గారు ఇంగ్లీష్లు పాటలు. లతా మంగేష్కర్ వంటి గొప్ప గాయనీతో కలిసి పాడి స్టార్ సింగర్ అనిపించుకున్నారు. అందుకేనేమో ఆయన గొప్ప గాయకుడు అవుతాడని దేవుడు కుళ్లు కున్నట్లు ఉన్నాడు. ఆయన గాత్రం దేవుడు ఇచ్చిన వరం. ఆయన మరణంతో మొత్తం చీకట అయిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) -
బాలుకు ప్రేమతో.. 12 గంటలపాటు నాన్‌స్టాప్ సింగింగ్
తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. జూన్ 4వ తేది బాలుగారి జయంతి (పుట్టినరోజు). ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్ చేస్తున్నాం’’ అన్నారు. సినీ మ్యూజిషియన్స్యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘ 30ఏళ్ల చరిత్ర ఉన్న మా సినిమా మ్యూజిక్ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్ అవుదామనుకునేవారికి, మ్యూజిషియన్స్‌కి మా యూనియన్ తొలిమెట్టు. మా వద్ద సభ్యులై ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థతరపునుండి పూర్తి సహాయ,సహకారాలను అందచేస్తాము అని చెప్తున్నాము. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు బాలుగారు. దురదృష్టవశాత్తు ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్ 4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్ ప్రతినిధులుగా నేను, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే’’ అన్నారు. సి.యం.యు ట్రెజరర్ రమణ శీలం మాట్లాడుతూ–‘‘ తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని అనుకుంటున్నాం’’ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు మాట్లాడుతూ– ‘‘బాలుగారి టీమ్‌లో మ్యూజిషియన్‌గా దాదాపు 25ఏళ్లపాటు పనిచేశాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది’’ అన్నారు. ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ–‘‘ బాలుగారంటే మా జనరేషన్ సింగర్స్ అందరకీ ఇన్స్పిరేషన్. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. సింగర్ కౌసల్య మాట్లాడుతూ–‘‘మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. -
ఎస్పీ బాలు గాత్రమందించిన 'కర్మయోగి' చిత్రం పాటలు విడుదల
Karmayogi Movie Songs Sung By Late Sp Balu: తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పిన శ్రీ ధర్మవ్యాధుడు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కర్మ యోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర’. జీజే రాజా దర్శకత్వంలో విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి. మురళీధర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ఇది. భోగికార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ సినిమా పాటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జేసీ చంద్రయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ ఆవిష్కరించారు. ‘‘తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే మానవ సేవ దాగి ఉంది. మానవ సమాజం గురించి మనలోని అజ్ఞానాన్ని తెలియజేసే ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని కృష్ణమోహన్, జేసీ చంద్రయ్య అన్నారు. ‘‘ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు జీజే రాజా. ‘‘ఈ సినిమాను రామానాయుడుగారు తీయాల్సింది. కానీ ఆయన పరమపదించారు. కథ నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాను పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది’’ అన్నారు మురళీధర్. ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీతమందించారు. -
మరణాంతరం ‘గాన గంధర్వుడి’కి పద్మ విభూషణ్, అవార్డు తీసుకున్న ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డు దక్కగా.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డు అందుకున్నారు. చదవండి: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా... 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు అవార్డులను ప్రకటించారు. Delhi: Playback singer SP Balasubrahmanyam awarded the Padma Vibhushan award posthumously. His son receives the award. #PadmaAwards2021 pic.twitter.com/HlSQGYmpxv — ANI (@ANI) November 9, 2021 -
ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు: రజనీ కాంత్
దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబరు 4న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ పరిచయ పాటను రిలీజ్ చేశారు. రజనీ నటించిన ఈ పాటను ఎస్పీబీ పాడారు. ఈ సందర్భంగా ఆయన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘నలభైఅయిదేళ్లు నా గాత్రంలా జీవించారు ఎస్పీబీ గారు. నా ‘అన్నాత్తే’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటిస్తున్నప్పుడు నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని రజనీకాంత్ తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే 45 வருடங்கள் என் குரலாக வாழ்ந்த எஸ்பிபி அவர்கள் அண்ணாத்தே படத்தில் எனக்காகப் பாடிய பாடலின் படப்பிடிப்பின் போது, இதுதான் அவர் எனக்குப் பாடும் கடைசிப் பாடலாக இருக்கும் என்று நான் கனவில் கூட நினைக்கவில்லை. என் அன்பு எஸ்பிபி தன் இனிய குரலின் வழியாக என்றும் வாழ்ந்து கொண்டே இருப்பார். — Rajinikanth (@rajinikanth) October 4, 2021 -
Annaatthe: అక్టోబర్ 4న ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట
హీరో రజనీకాంత్, ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) కాంబినేషన్లో ఎన్నో హిట్ పాటలు శ్రోతలను అలరించాయి. వీరి కాంబినేషన్లో మరో పాట ‘అన్నాత్తే’ చిత్రం నుంచి ఈ నెల 4న శ్రోతల ముందుకు రానుంది. ‘‘రజనీ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అంటేనే స్పెషల్. ఈ పాటను ఎస్పీబీగారు పాడితే ఇంకా ప్రత్యేకం. ఎస్పీబీ వంటి లెజెండ్‌తో ఓ పాటను రికార్డు చేయడం నా లక్’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు ఇమ్మాన్. మరి.. ఎస్పీబీ పాటకు అన్నాత్తే ఆట ఏ రేంజ్లో ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నాన్నకి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్, దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు 2020 ఇచ్చి సత్కరించింది. దీని గురించి ఆయన తనయుడు గాయకుడు ఎస్పీ చరణ్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటాల్లోనే.. ‘సాక్షి యాజమాన్యం నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు ఇచ్చారు. ఇందుకు పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాం. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మా మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి మా కుటుంబసభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాన’ని తెలిపాడు. -
ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు
న్యూజెర్సీ: ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్మారకర్ధం ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ జూన్ 27న ఏర్పాటైంది. ఈ సంస్థతో పలు గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా అనేకమంది పాల్గొన్నారు. కాగా ఈ స్వచ్ఛంద సంస్థకు శ్రీనివాస్ గూడూరు ఛైర్మన్ గా, అధ్యక్షుడిగా భాస్కర్ గంటి, వైస్ చైర్ పర్సన్ గా రాజేశ్వరి బుర్రా, కార్యదర్శిగా లక్ష్మి మోపర్తి, కన్వీనర్ గా ప్రవీణ్ గూడూరు, సలహా సంఘం సభ్యుడిగా దాము గేదెల వ్యవహరించ నున్నారు. సంస్థ భవిష్యత్తు గాయనీ గాయకులకు పోటీలను నిర్వహించి ఎస్పీబీ పేరు తో అవార్డు ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటుపై ఎస్పీ శైలజ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పిన ఈ సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, అందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని సంస్థ ముఖ్య సలహాదారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ళ భరణి , వడ్డేపల్లి కృష్ణ, న్యూజెర్సీ కమిషనర్ ఆఫ్ యుటిలిటీస్ ఉపేంద్ర చివుకుల, లీడ్ ఇండియా యూఏస్ఏ ఛైర్మన్ హరి ఎప్పనపల్లీ, తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి, ఓం స్టూడియో అధినేత అశోక్ బుద్ది, రామాచారి, మాధవపెద్ది సురేష్ , తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ చెందిన ప్రముఖ గాయకులు మనో, సుమన్, మల్లికార్జున్, గోపిక పూర్ణిమ, పార్థు నేమాని , విజయ లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు. యూఎస్ఏ ఇతర దేశాల్లోని పలు తెలుగు సంఘాల నాయకులు, వేగేష్నా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వంశీరామరాజు, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ బాల ఇందూర్తి, టిఎఫ్ఏఎస్ ప్రెసిడెంట్ శ్రీదేవి జగర్లాముడి, జీఎస్‌కేఐ ప్రెసిడెంట్ మధు అన్నా, శ్రీవాస్ చిమట తదితరులు ప్రసంగించారు. ఎస్పీబీపై ప్రశంసలు కురిపించారు. బాలూ వ్యక్తిత్వం ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
-
అలా పిలిస్తే బాలుగారు కోప్పడ్డారు; చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి నేడు(జూన్ 04). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళులర్పిస్తున్నారు. బాలు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో బాలుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ ఓ సంఘటనను వివరించారు. ‘ఓ సందర్భంలో నేను ‘ఎస్పీ బాలు గారూ’ అని సంబోధిస్తే.. ఆయన ఎంతో బాధ పడ్డారు. ఎప్పుడూ నోరారా అన్నయ్య అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అంటూ చిరు కోపం ప్రదర్శించారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పడంతో, అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు’ అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన ఓ పాటను కూడా పొందుపరిచారు. ‘అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి.. వినమ్ర నివాళి ! ’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి ! #TearfulTributeToSPB #SPB75 #SPVasantha https://t.co/c1oEvrv4y1 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2021 చదవండి: ఆమె.. అతడు ఒక యుగళగీతం జీవితాన్ని ప్రేమించిన బాలుడు -
SP balasubrahmanyam: మైమరపించే గీతాలు
చిన్నప్పుడు సుశీల పాడిన పాటలు పాడి గుర్తింపు పొందారు బాలూ. గూడూరులో ఆయన ప్రతిభ గమనించి ‘సినిమాల్లో పాడు’ అని ప్రోత్సహించారు జానకి. కలిసి పాడి హిట్స్ ఇచ్చారు వాణి జయరాం. అన్నయ్యకు దీటుగా గొంతు సవరించుకున్నారు ఎస్.పి.శైలజ . ఒక రికార్డింగ్ థియేటర్లో బాలూతో బ్రేక్‌ఫాస్ట్–పాట, మరో థియేటర్లో లంచ్–పాట, మరో థియేటర్లో డిన్నర్ –పాట... ఇలా జీవితం గడిపారు చిత్ర. బాలు మరణించాక వస్తున్న తొలి జయంతి ఇది. జీవించి ఉంటే పుట్టిన్రోజు అనుండేవాళ్లం. ఎందరో మహిళా గాయనులతో పాటలు పాడి శ్రోతలను సేదదీర్చాడు ఆయన. ప్రతి గాయనితో కనీసం ఒక్కో యుగళగీతాన్ని తలుచుకునే సందర్భం ఇది. మావిచిగురు తినగానే (పి.సుశీల) ‘మావిచిగురు తినగానే కోవిల పలుకుతుందట.. కోవిల గొంతు వినగానే మావి– చిగురు తొడుగుతుందట’... తెలుగువారికి మావిచిగురుకి, కోయిలకి, కృష్ణశాస్త్రి కవిత్వానికి, సుశీల–బాలసుబ్రహ్మణ్యంల గొంతులకు ఉన్న అనుబంధం అవిభాజ్యం. ‘సీతామాలక్ష్మి’లో కె.వి.మహదేవన్ బాణీకట్టిన ఈ పాట రైల్వేస్టేషన్లో మొదలయ్యి పచ్చటి దారుల వెంట పరుగుతీస్తుంది. ‘బింకాలు బిడియాలు.. పొంకాలు.. పోడుములు’ అని సుశీల అంటే ‘ఏమో ఎవ్వరిదోగాని ఈ విరి గడసరి’ అని బాలూ అంటూ ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వు ఆయన సిగ్నేచర్. పాటల్లో ఆయన నవ్వుకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలివేణి ఆణిముత్యమా (ఎస్.జానకి) ‘స్వాతివాన లేతఎండలో... జాలి నవ్వు జాజిదండలో’ అని రాశారు వేటూరి. ఆ స్వాతివాన జానకి అయితే ఆ జాజిదండ బాలూ అయి ఉండవచ్చు. తెలుగు పాటల్లో ఇంత లోగొంతుకతో లాలిత్యంతో సున్నితంగా పాడిన మరొక పాట లేదు. ‘ముద్దమందారం’ సినిమా కోసం రమేశ్ నాయుడు స్వరకల్పనకు జానకి తో కలిసి బాలూ ఇచ్చిన ఆవిరి చిగురు... ఊపిరి కబురు కలకాలం నిలిచి ఉన్నాయి. ‘కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి నుదుటబొట్టు పెట్టనా... బొట్టుగా’ అని బాలూ అంటే దానికి జానకి ‘వద్దంటే ఒట్టుగా’ అని పరవశంగా చెప్పే జవాబు ఇక్కడ చదివితే తెలియవు. వినండి. ఎన్నెన్నో జన్మల బంధం (వాణీజయరాం) ఈ పాటలో పల్లవి, చరణాలు ఒకెత్తు. మొదటి చరణం తర్వాత వచ్చే ఆలాపనలు ఒకెత్తు. ‘హా’ అని బాలూ అంటే ‘హా’ అని వాణిజయరాం అంటే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆ..’ అని తీసే ఆలాపన అద్భుతం. బాలూ పాడిన ఉత్తమ పది డ్యూయెట్లు ఎవరు ఏవి ఎంచినా ఈ పాట ఉంటుంది. ‘నీవు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి చేరనా’ అని దాశరథి రాశారు. బాలూ–వాణి జయరాంల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అలా శ్రోతల హృదయజలధికి ఎప్పుడో చేరింది. మాటే మంత్రము (ఎస్పి.శైలజ) ‘నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే’ అని బాలూ పాడితే వెంటనే శైలజ ‘నేనే నీవుగా పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో’... అంటారు. ఏమి యుగళగీతం ఇది. ‘సీతాకోకచిలుక’కు వందల వర్ణాలు ఇచ్చిన యుగళగీతం. అన్నయ్య బాలూతో చెల్లెలు శైలజ ఎన్నో మంచి పాటలు పాడారు. కాని సంఖ్యా పరంగా చూస్తే పాడాల్సినన్ని పాడలేదు అనిపిస్తుంది. సొంత చెల్లెలైనా ఏనాడూ ఆమెను ప్రత్యేకంగా రికమండ్ చేయలేదు బాలూ. శైలజ తన ప్రతిభ తో రాణించారు. ‘పడమటి సంధ్యారాగం’లో ‘పిబరే రామరసం’, శుభసంకల్పంలో ‘సీతమ్మ అందాలూ’... ఈ అన్నాచెల్లెళ్లు కలిసి పంచిన తీపినిమ్మతొనలు ఎన్నని. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (ఎల్.ఆర్.ఈశ్వరి) ‘మరో చరిత్ర’లో ‘బలేబలే మగాడివోయ్’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరి, బాలూ కలిసి పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి దూకుడు ముందు నిలవడం తోటి గాయకులకు కష్టమే. కాని ఆమె సై అంటే బాలూ సై అనడం వీరిద్దరి పాటల్లో కనిపిస్తుంది. ‘సింహబలుడు’ కోసం వేటూరి రాయగా ఎం.ఎస్.విశ్వనాథన్ చేసిన ‘సన్నజాజులోయ్’ పెద్ద హిట్. ‘ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో’ అని అచ్చు ఎన్.టి.ఆర్ అన్నట్టే బాలూ అని మనల్ని మెస్మరైజ్ చేస్తారు ఈ పాటలో. పూసింది పూసింది పున్నాగ (చిత్ర) గాత్రాన్ని వెనక్కు నెట్టి బీట్‌ను ముందుకు తెచ్చిన 1990ల కాలంలో కీరవాణి రంగప్రవేశం చేసి మళ్లీ మాటను ముందుకు తెచ్చారు. ‘పూసింది పూసింది పున్నాగ’ అందుకు అతి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పచ్చటి చేలలో పిల్లగాలుల్లా మారడం ఈ పాటలో బాలూ, చిత్ర చేశారు. వేటూరి సాహిత్యం అందుకు తోడైంది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ వేదికయ్యింది. చిత్ర, బాలూ వేల పాటలు పాడారు. కాని ఈ పాట ఎప్పుడూ ప్రత్యేకమే. తెల్లచీరకు తకధిమి తపనలు (లతా) లతా మంగేశ్కర్ తెలుగులో బాలూతో పాడిన ఏకైక డ్యూయెట్. కె.రాఘవేంద్రరావు, ఇళయరాజాల వల్ల ఇది సాధ్యమైంది. లతాతో బాలూ హిందీలో ఎన్నో పాటలు పాడినా తెలుగులో ఇద్దరూ కలిసి పాడటం పాట ప్రియులకు పసందైన జ్ఞాపకంగా నిలిచింది. తెల్లచీరకు తపనలు వేటూరి తప్ప ఇంకెవరు రప్పించగలరు. వైశాఖం, కార్తీకం, ఆషాఢం, హేమంతం.. ఇవన్నీ ఈ పాట చరణాల్లో ఉంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాలే లతా మంగేష్కర్, బాలూ గళాలు కూడా. అందుకే ఆ అందం.. ఆ గంధం. ఓ వాలుజడా (సునీత) తెలుగువారికి వాలుజడ సత్యభామ కాలం నుంచి తెలుసు. దానిని ‘రాధాగోపాళం’లో పాటగా మలిచారు బాపురమణ. ‘అన్ని అందాలు స్త్రీలు ముందు ఉన్నా నువ్వొక్కదానివి వెనకెందుకున్నావు?’ అని కవి జొన్నవిత్తుల కొంటెగా వాలుజడను ప్రశ్నిస్తారు ఈ పాటలో. ఈ అచ్చతెనుగు పాటకు బాలూతో పాటు సునీత కాకుండా ఇంకెవరు గొంతు కలపగలరు. జీవితం సప్తసాగర గీతం (ఆశాభోంస్లే) ఈ పాటను ఆశా భోంస్లే మొదలెడతారు. మొదటి చరణం చివరలో బాలూ అందుకుంటారు. ‘హే... బ్రహ్మమానస గీతం.. మనిషి గీసిన చిత్రం.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట’... ఇలా పాడేవాళ్లు... ఇలా పాడగలిగినవాళ్లు ఎందరని? ‘చిన్నకృష్ణుడు’ కోసం ఆర్.డి. బర్మన్ చేసిన ఈ పాట వేటూరి మాటల్లో తాత్త్వికంగా ఉంటుంది. బాలూ, ఆశాభోంస్లే గొంతుల వల్ల లోతుగా ఉంటుంది. ‘జీవితం వెలుగు నీడల వేదం’ అని అంటారు వేటూరి. పాటకు ఒక వెలుగు బాలూ లేరు కదా. నీడగా ఆయన జ్ఞాపకమే ఉంది. జగదానందకారకా (శ్రేయా ఘోషాల్) బాలూ ఐదు దశాబ్దాలు పాడారు. పాతతరంతో ఎంత బాగా జోడీ కట్టారో కొత్తతరంలో కూడా అంతే దీటుగా గొంతు కలిపారు. శ్రేయా ఘోషాల్ దేశంలో ఒక ఉత్తమ యువ గాయని. కాని ఆమెతో ఈ డ్యూయెట్ లో బాలూ, శ్రేయా ఇళయరాజా గీతానికి ఎంత సౌందర్యం ఇచ్చారో... ఎలాంటి వాడని తోరణం కట్టారో... జొన్నవిత్తుల ఈ గీతం రాసి ప్రశంసనీయులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
SP Balasubrahmanyam: జీవితాన్ని ప్రేమించిన బాలుడు
ఆబాలగోపాలం ‘బాలు’ అని ముద్దుగా పిల్చుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వజ్రోత్సవ (75 సంవత్సరాల) జయంతి నేడు. ఆ మహామనీషి మన మధ్యలేని ప్రథమ జయంతి. బాలు ఒక సంగీత విశ్వవిద్యాలయమనీ, ఆయన సంగీత సాహిత్యాలను సమంగా ప్రేమించారనీ సర్వులకూ తెలుసు. ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమనీ, ఎదిగినకొద్దీ ఒదిగే వినయం ఆయన ఆభరణమనీ ‘పాడుతా తీయగా’ వీక్ష కులకు తెలుసు. ఆయన భాషాభిమానం విస్తృత సంగీత సాహిత్య పరిజ్ఞానం ఆ కార్యక్రమం ద్వారా వెల్లడయ్యాయి. వెరసి ఆదర్శ ప్రాయమైన వ్యక్తిత్వం గల ప్రతిభామూర్తిగా ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం పండిత పామర భేదం లేకుండా అందరికీ అభిమాన పాత్రులయ్యారు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అన్నారు ఒక పాటలో డాక్టర్ సి.నారాయణరెడ్డి. అలా తన పుట్టుక పరమార్థం తెలిసిన కారణజన్ముడు బాలు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలోను, రెండు మూడు ఇంటర్వ్యూలలోను బాలు జీవితంపట్ల తన ప్రేమను, సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నాకు కావలసినవన్నీ ఉన్నాయి. లగ్జరీస్ పట్ల కోరికలు లేవు. ఉండటానికి మంచి ఇల్లుంది. మంచి సంసారం ఉంది. బయటకు వెళ్తే నిల్చుని గౌరవించే మనుషులున్నారు. దేవుడు నాకిచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నాను. నాకిలాంటి జీవితం చివరి వరకు సాగాలనీ, నూరేళ్లూ నేను బతకాలనీ కోరుకుంటున్నాను. నాకు జన్మరాహిత్యం వద్దు. మళ్లీ జన్మ కావాలి. నేను మరుజన్మలో కూడా బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టి ఇలాగే గాయకుడినవ్వాలి. ఈ జన్మలో నేను చనిపోతే నిద్రలో చనిపోవాలి కానీ హాస్పిటల్‌కి వెళ్లకూడదు’ అంటూ జీవితంతో తన అనుబంధాన్ని, ఆశలను పునరుక్తం చేసేవారు. ఇప్పట్లో తన జోలికి చావురాదని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ‘శీతవేళ రానీయకు శిశిరానికి చోటీ యకు’ అని కృష్ణశాస్త్రి చెప్పినట్టు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లా సంగా నిత్యవసంతుడిలా ఉండేవారు. దురదృష్టవశాత్తు 2020 సెప్టెంబర్‌లో మృత్యువు కరోనా రూపంలో వచ్చి, దొంగదెబ్బ తీసి బాలును మనకు భౌతికంగా దూరం చేసినా– ఆయన నమ్మ కాన్ని మాత్రం వమ్ము చేయలేకపోయింది. కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువైన ఆయన మధుర స్మృతులను ఏ మహమ్మారీ చెరపలేకపోతోంది. ‘నా మాతృభాష సంగీతం’ అనే నినాదంతో 16 భాషల్లో సుమారు 40 వేల పాటల్ని ఆలపించి సంగీత ప్రపంచంలో శిఖ రాగ్రాన్ని అధిష్టించిన త్రివిక్రముడు బాలుడు. ‘స్నేహం చేసే ముందు అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. స్నేహం చేశాక మిత్రునిలో లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దాలి తప్ప, స్నేహాన్ని తెంచుకోకూడదు. అది దాంపత్య బంధం లాంటిది. కష్టమైనా నిష్టురమైనా భరించక తప్పదు’ అంటూ స్నేహాన్ని నిర్వచించి, నిజ జీవితంలో ఆచరించి చూపిన కర్మయోగి బాలు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పేర రికార్డింగ్ థియేటర్‌ను నెలకొల్పి, హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించి, జేసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దలపట్ల గౌర వాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారి బాలు. సీనియర్ గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణం. సంగీత దర్శకుడు సత్యం, హీరో కృష్ణ, ఇళయరాజా వంటి ప్రముఖులతో వచ్చిన వివాదాలను బాలు పరిష్కరించుకున్న తీరు, అతని సంస్కారానికి మచ్చుతునకలు. కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనీయని వితరణశీలి బాలు. తండ్రి పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించి క్రీడా వైద్య రంగాలకు చెందిన వారితో సహా ఎందరో విద్యార్థులకు ఆయన గుప్తదానాలు చేశారు. చివరిలో పిత్రార్జితమైన ఇంటిని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి ఉదారంగా ధారపోశారు. తన చరమదశలో ‘ఎస్పీబీ ఫ్యాన్స్ చారి టబుల్ ఫౌండేషన్’ ద్వారా కరోనా బాధితులను ఆదుకొన్న బాలు సేవా నిరతిని చూసి కరోనాకు కడుపు మండిందేమో అజాత శత్రువయిన ఆయననే కాటేసింది. ఎస్పీ బాలు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించిన ఆదర్శపుత్రుడు. హరికథా భాగవతార్ అయిన తండ్రి సాంబ మూర్తి కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్టించడమే కాకుండా ఆయన జీవిత చరిత్రను గ్రంథస్తం చేయించి ప్రచురించారు. తన సోదరి ఎస్పీ శైలజ, తనయుడు చరణ్ సినీ రంగంలో గాయనీ గాయకులుగా వారికి తగిన స్థాయిలో ఎదగకపోవడానికి తన క్రీనీడయే కారణమని మథనపడేవారు. ‘పాడుతా తీయగా’, ‘పాటశాల’ ద్వారా ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకు లను ప్రోత్సహించి కొందరిని వెండితెరకు కూడా పరిచయం చేసిన పెద్ద మనసుగల ఆచార్యుడు బాలు. ఆయన మరణాన్ని జయించిన యశఃకాయుడు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’లో రాసినట్టు– ‘జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అమృతంపు సోనను దోసిళ్లతో తాగి వచ్చినవాడు దుఃఖాన్నీ, చావునూ వెళ్లిపొమ్మన్న అమరుడు’ డాక్టర్ పైడిపాల సినీ గేయ సాహిత్య విమర్శకులు మొబైల్ : 99891 06162 చదవండి: SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం -
SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం
సినీ పరిశోధకునిగా, కళాసంస్థ నిర్వాహకుడిగా చాలా మంది సినీ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగే భాగ్యం, వాళ్ళ వ్యక్తిత్వాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగాయి. అయితే బాలు గారి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. పేరెన్నికగన్న గాయకుడిగా కీర్తి గడించినా ఎంతో ఒదిగి ఉండే తత్వం, స్థాయిలకు అతీతంగా అందరినీ గౌరవించే గుణం, నలుగురికీ సాయం చేసే దాతృత్వం, ఓర్పు, సహనంతో మెలగడం ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ‘సంగమం ఫౌండేషన్’ వ్యవస్థాపకుడిగా ఈ రెండు దశాబ్దాలలో నేను చేసిన అనేక కార్యక్రమాలలో బాలు గారు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల గారు కొన్నేళ్ళ క్రితం ‘పి.సుశీల ట్రస్ట్’ను నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా ఏటా ఒక సింగర్‌ని జాతీయ స్థాయి పురస్కారంతో గౌరవించాలని సంకల్పించారు. తొలి అవార్డును గాయని యస్. జానకి గారికి బహూకరించాలనుకున్నారు. అప్పుడు బాలు గారి కచేరీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. రవీంద్రభారతిలో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమం సాయంత్రం అనగా సౌండ్ సిస్టవ్‌ు చెక్ చేయడానికి ఉదయం పదకొండు గంటలకే బాలు గారు రవీంద్రభారతికి వచ్చారు. కొద్ది రోజుల ముందే లక్షలు ఖర్చుపెట్టి పెద్ద సౌండ్ సిస్టవ్‌ును రవీంద్రభారతి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ సిస్టవ్‌ును చెక్ చేసిన బాలు గారు నాదగ్గరకొచ్చి ‘సంజయ్ గారూ! సౌండ్ సిస్టమ్ ఓకే. కానీ కొత్త సౌండ్ సిస్టవ్‌ు కాబట్టి సౌండ్ ఆపరేటర్లకు ఆ సిస్టవ్‌ును ఆపరేట్ చేయడంలో ఇంకా పూర్తి పట్టు చిక్కినట్లులేదు. సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మేము, ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. రిస్క్ ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నా కచ్చేరీలన్నింటికీ రెగ్యులర్‌గా వాడే సౌండ్ సిస్టమ్‌నే పిలిపించుకుంటా’ అన్నారు. ‘అలాగే సర్’ అని, వారికి రెగ్యులర్‌గా వచ్చే సౌండ్ సిస్టమ్ వారినే పిలిపించి ఏర్పాట్లు చేశాం. అంతా బాగా జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలు గారి దగ్గర కెళ్ళి ‘సౌండ్ సిస్టమ్ వారికి పేమెంట్ ఎంత ఇవ్వాలి సార్’ అని అడిగాను. దానికి వారు ‘‘సంజయ్ గారూ! ‘రవీంద్రభారతి సౌండ్ సిస్టమే వాడతాంగా’ అని సౌండ్‌కు మీరు బడ్జెట్ వేసుకొని ఉండరు. సడెన్‌గా నేను వచ్చి ఆ సౌండ్ సిస్టమ్‌ను కాదని నాకు అలవాటున్న సౌండ్ సిస్టమ్‌ను తెప్పించుకుని దానికి మిమ్మల్ని పేమెంట్ ఇవ్వండని అడిగితే మీకెంత ఇబ్బంది! ఇప్పటికిప్పుడు మీరెక్కడి నుంచి తెస్తారు? ఏం ఫరవాలేదు. మీరేమీ ఇవ్వకండి, నేను చూసుకుంటా’’ అని చెప్పి వారే స్వయంగా వారి జేబులోంచి రూ. 15 వేలు తీసి సౌండ్ సిస్టమ్ వారికి ఇచ్చారు. నాకు నోట మాట లేదు. ఖర్చు పెట్టించేవారినే చూశా కానీ, ఏ సెలబ్రిటీ ఎదురు ఖర్చు పెట్టడం చూడలేదు. మరునాడు ఉదయం బాలు గారి హోటల్ రూమ్‌కి నేను, సుశీల గారు వెళ్ళాం. ‘బాలూ! నేను పాడమని అడగగానే వెంటనే ఒప్పుకుని పాడావు. ఇంత ఇమ్మని ఏమీ అడగకుండానే వచ్చి పాడావు. ఇపుడే ట్రస్ట్ ప్రారంభించాం. ఇది నీ స్థాయి రెమ్యూనరేషన్ కాకపోయినా అభిమానంతో ఇస్తున్నా ఈ యాభై వేలుంచు’ అన్నారు సుశీల. వెంటనే బాలు చిరుకోపాన్ని ప్రదరిస్తూ, ‘అమ్మా! మీ పాటలు వింటూ పెరిగినవాణ్ణి. మీ పక్కన పాడడంతోనే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. అలాంటి మీరు ఒక ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మా వంతు సహకారం అందించాలి గాని మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి! ఇంకెప్పుడూ ఇలా చేయకండి’ అని తన చేతికిచ్చిన డబ్బుల కవర్‌ను సుశీల గారికిచ్చేసి, ఆమె కాళ్ళకు నమస్కరించారు. అప్పట్లో ఉడుత సరోజిని అని సీనియర్ సినీ గాయనికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా సంస్థ తరఫున సన్మానించి, కొంత నగదు ఇచ్చాం. నెల ముందే బాలు గారిని సంప్రతించి, ఆహ్వానించాం. ‘అదే రోజు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది. రాలేను సారీ’ అన్నారు. సరోజిని గారి సన్మానం రోజున మా ఏర్పాట్ల హడావిడిలో మేముండగా సడెన్‌గా బాలు గారి నుండి ఫోన్. ‘‘కార్యక్రమం బాగా చేయండి. నేను రాలేకపోతున్నానని బాధగానే ఉంది. అయినా నా మిత్రుడు మురళితో ఓ పాతిక వేలు పంపిస్తున్నా. సరోజిని గారికి నా నమస్సులు తెలియజేసి ఆ మొత్తాన్ని వారికి అందజేయండి’’ అని కోరారు. ఎంతో బిజీగా ఉండే బాలుగారు, వారు రాలేకపోయినా, నెల తర్వాత జరిగే ప్రోగ్రావ్‌ు తేదీని గుర్తుపెట్టుకొని, తన సీనియర్ గాయని కోసం బాధ్యతగా పాతిక వేలు పంపడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయా. హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయా. ప్రముఖ సితార్ విద్వాంసులు జనార్దన్ మిట్టా అంటే బాలు గారికి ప్రత్యేకాభిమానం. తను పాడిన తొలి చిత్రం నుండి అనేక వేల చిత్రాలలోని పాటలకు సితార్ వాయించిన జనార్దన్ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదని బాలు గారి భావన. జనార్దన్ గారు పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో వారికో ఘన సన్మానం చేసి గౌరవించాలనుకున్నారు బాలు. ఆ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేయమన్నారు. అప్పుడే వరసగా మూడు ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాము. మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ అంటే స్పాన్సర్స్ కష్టమేమో అని తటపటాయిస్తూ వారికి విషయం చెప్పా. బాలు వెంటనే అప్పటికప్పుడు తనకు తెలిసిన వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి, స్పాన్సర్ చేయించారు. కార్యక్రమం ముందురోజు బాలుగారు నాకు ఫోన్ చేసి ‘‘ఏమండీ! జనార్దన్ గారు పెద్దవారు, వారిని మామూలుగా సత్కరించి వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే స్వర్ణకంకణం తొడిగి గౌరవిద్దామనుకుంటున్నా. చెన్నైలో పనుల ఒత్తిడిలో ఉన్నాను. కంకణం కొనే టైమ్ లేదు. ఏమీ అనుకోకుండా ఓ లక్ష రూపాయల్లో మంచి స్వర్ణకంకణం మీరు నా తరఫున షాపింగ్ చేయండి’’ అన్నారు. నా దగ్గరున్న డబ్బుతో స్వర్ణకంకణం కొన్నాను. కార్యక్రమం రోజు బాలు దంపతులు తమ ఖర్చులతోనే విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతికి రాగానే రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లాను. కారు దిగుతూనే స్వర్ణకంకణం కోసం నేను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు నా చేతిలో పెట్టేశారు. అంత పకడ్బందీగా ఉంటారు బాలు గారు. బాలు గారు అంత ఘనమైన సత్కారాన్ని తనకు చేయించడంతో సంతోషంలో సితార్ జనార్దన్ గారికి వేదికపైనే ఆనందభాష్పాలు రాలాయి. ఓ సాటి కళాకారుడిని ఇంత ఘనంగా గౌరవించే మనసు ఎంతమందికి ఉంటుంది! ఇలా ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా, బాలు గారి లాంటి వ్యక్తులు అరుదు. విశిష్ట వ్యక్తిత్వం వారి సొత్తు. అమరగాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో తన సొంత ఖర్చులతో నెలకొల్పారు బాలు. అలాగే, నెల్లూరులో తమ సొంత ఇంటిని వేద పాఠశాల నిమిత్తం కంచి కామకోటì పీఠానికి డొనేట్ చేశారు. మిత్రులెందరినో ఆపదలో ఆదుకున్నారు. లెక్కలేనన్ని గుప్తదానాలు చేశారు. 2020 ఫిబ్రవరిలో చెన్నైలో బాలు గారిని వారింట్లో కలిసినప్పుడు ‘త్వరలో హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు టైమ్ తీసుకుని మీ ఆఫీసు కొచ్చి తెలుగు సినిమాపై మీరు సేకరించిన కలెక్షన్స్ అన్నింటినీ తీరిగ్గా చూస్తా. ఏయన్నార్, యస్వీఆర్లపై మీరు వేసిన ఫోటో బయోగ్రఫీ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. ఆ తరహాలో నా మీద కూడా ఒక పుస్తకాన్ని ప్లాన్ చేయాలి. అది కూడా మీతో అప్పుడు చర్చిస్తాను’ అన్నారు. అవేమీ జరగకుండానే కరోనా మహమ్మారి బారిన పడి 2020 సెప్టెంబర్ 25న బాలు ఈ లోకాన్ని వీడారు. వారితో పాటే నిబద్ధత, సమర్థత, విధేయత, మంచితనం, మానవత్వం కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది. – సంజయ్ కిషోర్, ప్రముఖ సినీ పరిశోధకులు నేడు యస్పీబీ స్వరనీరాజనం యస్పీబీ 75వ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు. -
ఎస్పీ బాలుకి టాలీవుడ్ స్వరనీరాజనం, 12 గంటల పాటు..
గాన గంధర్వుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని పురస్కరించుకొని టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది. బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకి బాలు చేసిన సేవలను గుర్తు చేస్తూ టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అర్పించబోతోంది. జూన్ 4న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. -
ఎస్పీ బాలుకు పద్మాంజలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంను ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్’ వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె సహా మరో ఆరుగురు కూడా భారత ప్రభుత్వం ప్రకటించే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సైకత శిల్పి సుదర్శన్ సాహూ, ప్రధాని మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయి(అస్సాం), కేశూభాయి పటేల్(గుజరాత్), లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ గాయని కేఎస్ చిత్రలకు పద్మ భూషణ్ వరించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలున్నారు. విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం పొందారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. మాజీ గవర్నర్, దివంగత మృదుల సిన్హా, మాజీ కేంద్రమంత్రి బిజోయ చక్రవర్తిలకు పద్మ శ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మ పురస్కారాలు పొందిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి.. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక భారతరత్న రావాలి ‘పాడనా తీయగా కమ్మని ఒక పాట. పాటగా బ్రతకనా మీ అందరి నోటా...’అంటూ ‘వాసు’సినిమాలో పాడారు యస్పీ బాల సుబ్రహ్మణ్యం. గత ఏడాది చివర్లో కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆయన మరణించిన విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటగా మనతోనే ఎప్పుడూ ఉంటారు. సంగీత కళాకారుడిగా ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం యస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40 వేల పాటలు పాడారాయన. సుమారు 50 ఏళ్ల కాలాన్ని సినిమాలకు పాడటానికే అంకితం చేయడం విశేషం. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా యస్పీబీ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అందుకున్నారాయన. యస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని, ఆయన మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కూడా ఆ వాదనను సమర్థించాయి. సౌతిండియా నైటింగేల్ ‘బొంబాయి’సినిమాలో ‘కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే...’అంటూ పాడారు చిత్ర. చనిపోయే ముందు అందరూ తప్పక వినాల్సిన 100 పాటలు అంటూ బ్రిటీష్ మేగజీన్ ‘ది గార్డియన్’చేసిన 100 పాటల జాబితాలో ఈ పాట ఉంది. ఇలా గాయని చిత్ర పాడిన పాటలు భాషలకు అతీతంగా శ్రోతల్ని చేరుతూనే ఉన్నాయి. అందుకే ఆమెను సౌతిండియా నైటింగేల్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చిత్రకు పద్మ భూషణ్ ప్రకటించింది. గాయనిగా సుమారు 25 వేల పాటలు ఆలపించారు చిత్ర. 1979లో మలయాళ ప్రైవేట్ ఆల్బమ్‌తో గాయనిగా మారారు చిత్ర. 2005లో పద్మశ్రీ అందుకున్నారు. ‘సింధు భైరవి’అనే తమిళ అనువాద చిత్రంలో ‘పాడలేను పల్లవైనా..’పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో పల్లవులు. చరణాలు పాడుతూనే ఉన్నారామె. -
ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. ఈ ఏడాదంతా కరోనా, కరోనా, కరోనా అంతే.. మరో మాటకి తావు లేదు. వేరే చర్చకి ఆస్కారం లేదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూనే దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకుంటూనే సామాజిక, ఆర్థిక మార్పులకి అలవాటు పడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్‌తో కరోనా పీడ విరగడైపోతుందన్న ఉత్సాహంతో యావత్ భారతావని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి సిద్ధమైంది. ఉవ్వెత్తున ఉద్యమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకిన ఆగ్రహంతో మొదలైన ఈ ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కన్నెర్ర చేయడంతో ముగుస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఈ రెండు ఉద్యమాలు ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టంతో (సీఏఏ)అభద్రతా భావంలో పడిపోయిన మైనార్టీలు ఢిల్లీలో షహీన్‌బాగ్ వేదికగా కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారిపోయింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేటీకరణ జరుగుతుందని, కనీస మద్దతు ధరకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో రైతన్న నెలరోజులై ఆందోళనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. వామ్మో కరోనా కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఏడాదంతా కరోనా తప్ప మరే మాట వినిపించలేదు. చైనాలోని వూహాన్లో తొలి సారిగా బట్టబయలైన ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చిన ఒక విద్యార్థి ద్వారా జనవరి 30న భారత్‌లోని కేరళకి వచ్చింది. ఆ తర్వాత మార్చికల్లా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరుకి విస్తరించింది. దీంతో కేంద్రం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. సరిహద్దులన్నీ మూసివేసి కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి ఆ తర్వాత దశల వారీగా పాక్షికంగా లాక్‌డౌన్‌ని కొనసాగించిన∙కేంద్రం జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రపంచ దేశాల పట్టికలో కోటికి పైగా కేసులతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించిన భారత్‌ను డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రశంసించింది. బతుకు నడక 130 కోట్ల జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేకపోవడంతో కేంద్రం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో అతి పెద్ద మానవీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రం నిర్ణయం 4 కోట్ల మంది వలస కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడింది. పనులు లేకపోవడం, కరోనా మహమ్మారి ఎలాంటి ఆపద తీసుకువస్తుందోన్న ఆందోళనలతో వలస కార్మికులు చావైనా బతుకైనా సొంత గడ్డపైనేనని నిర్ణయించుకొని స్వగ్రామాలకు పయనమయ్యారు. కాళ్లు బొబ్బలెక్కేలా మైళ్లకి మైళ్లు నడిచారు. ఈ క్రమంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రమైన జీవితం కోసం వారు పడ్డ ఆరాటం, సాగించిన నడక మనసుని బరువెక్కించే దృశ్యంగా నిలిచింది. మూగబోయిన స్వరాలు కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 5న కరోనా సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మహమ్మారితో పోరాడి సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హిందూస్తానీ సంగీతంలో సుప్రసిద్ధులైన పండిట్ జస్రాజ్ 90 ఏళ్ల వయసులో గుండె పోటు రావడంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఈ ఇద్దరు సంగీత సామ్రాట్‌లను కోల్పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆలయాలకి భూమి పూజ శ్రీరాముడి భక్తుల కలలు ఫలించే అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటు కొత్త భవనానికి ఈ ఏడాది భూమి పూజ మహోత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడింది. 40కేజీల బరువున్న వెండి ఇటుకని శంకుస్థాపన కోసం వాడారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ ఉండడంతో 1,224 మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో ఈ భవనం నిర్మాణం జరుపుకుంటోంది. ఒక హత్య, మరో ఆత్మహత్య ఈ ఏడాది జరిగిన క్రైమ్ సీన్లో హాథ్రస్ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తదనంతరం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై జరిగిన విచారణ అంతే ప్రకంపనలు రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా బూల్హరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న వ్యవసాయ క్షేత్రానికి వెళితే అగ్రవర్ణానికి చెందినవారుగా అనుమానిస్తున్న కొందరు పశువుల్లా మారి గ్యాంగ్ రేప్ చేయడంతో తీవ్రగాయాలతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించకుండా 30 తెల్లవారుజామున 2.30 గంటలకు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో ఈ రేప్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన స్వగృహంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు బాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపేశాయి. బాలీవుడ్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన నెపోటిజంపై చర్చ మళ్లీ మొదలైంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ని మించిన మలుపులతో సాగిన ఈ ఉదంతం బాలీవుడ్ మాఫియా లింకుల్ని కూడా బయటకు లాగడంతో ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ తారలకే చుక్కలు కనిపించాయి. దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటి వారు ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి వచ్చింది. సరిహద్దుల్లో సై నాలుగు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యాలమారి చైనా నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాల్ని తోసి రాజని మన జవాన్లపై జూన్ 15 అర్ధరాత్రి దాడులకు దిగింది. మన సైన్యం కూడా గట్టిగా ఎదురుదాడికి దిగడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ ఘర్షణల్లో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా నుంచి జరిగిన ప్రాణ నష్టాన్ని ఆ దేశం ఇప్పటివరకు బయట పెట్టలేదు. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి వాస్తవాధీన రేఖలో జవాన్లకు అత్యద్భుమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణుల్ని మోహరించి భారత్ సైనిక రంగంలో తన సత్తా చాటుకుంది. అవీ.. ఇవీ.. ► నిర్భయ హత్యాచారం కేసులో ఆమె తల్లిదండ్రుల పన్నెండేళ్ల పోరాటం ఫలించింది. దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్‌లకు మార్చి 20న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ► మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లాలో ఏప్రిల్‌లో జరిగిన మూకదాడిలో ఇద్దరు సాధువులు సహా ముగ్గురు మరణించారు. యూపీలోని ఒక ఆలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మతం రంగు పులుముకోవడంతో బీజేపీ, శివసేన మాటల యుద్ధానికి దిగాయి. ► ఒకవైపు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతూ ఉంటే మేలో అంఫా తుఫాన్ ఈశాన్య భారతాన్ని కలవరపెట్టింది. బెంగాల్లో తుపాన్ ధాటికి 72 మంది ప్రాణాలు కోల్పోతే, లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగింది. ► ఐరాసభద్రతా మండలికి నాన్ పర్మెనెంట్ సభ్యదేశంగా భారత్ జూన్ 18న ఎన్నికైంది. వచ్చే జనవరి నుంచి కొత్త మండలిలో భారత్ చేరనుంది. ► ముంబైని పీఓకేతో పోల్చడం, రాష్ట్ర పోలీసుల్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, శివసేన సర్కార్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సెప్టెంబర్‌లో ఆమె నివాసాన్ని కూడా కూల్చివేయడానికి ముంబై నగరపాలక సంస్థ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కంగనాకు కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
సాక్షి, అమరావతి: నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. Great full to the #APgov and @ysjagan garu for this honor. https://t.co/qUvHsOP4ZM — S. P. Charan (@charanproducer) November 27, 2020 మైసూరు వర్సిటీలో ఎస్పీ బాలు అధ్యయన పీఠం మైసూరు: ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం పేరుతో మైసూరు విశ్వ విద్యాలయంలో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం వర్సిటీలో వీసీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధనలను, పాటలను భవిష్యత్ తరాలవారికి అందించేలా ఈ పీఠం నెలకొల్పుతున్నామని వీసీ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలను కేటాయిస్తామన్నారు -
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
ఆయన ఇకలేరంటే నమ్మలేకపోతున్నా
సాక్షి, చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త కోట్లాది మంది అభిమానులనే కాకుండా సినీ నటులను షాక్‌కు గురుచేసింది. తాజాగా నటి శోభన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎస్పీబీని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి తాను నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేశారు. 'ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేసేందుకు వెతుకుతుండగా ఆయన లేరనే విషయన్ని నమ్మలేకపోతున్నానని... అలాంటి వ్యక్తి స్థానాన్ని మరెవరూ పూడ్చలేరని' ఆమె భావోగ్వేదంతో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 25న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. చెన్నై శివారు ప్రాంతం తామరపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్ వద్ద అంతిమ కార్యక్రమం జరిగింది. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి) View this post on Instagram It is difficult to come to terms with his loss especially while I was searching for a song to post in his memory .. Nothing to be said other than we have lost an irreplaceable treasure . We acted together as well . He played a cop and me , a thief . 🙂Unassuming , jovial , pure and song centered was Spb sir . A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) on Oct 2, 2020 at 9:13pm PDT -
బాలు నుంచి ఎంతో నేర్చుకున్నా!
ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి ఎంతో నేర్చుకున్నానని గాయని చిత్ర పేర్కొన్నారు. ఎస్పీబీ గత నెల 25న మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం సినీ పరిశ్రమ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాప సభను నిర్వహించింది. నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నటులు విజయ్‌సేతుపతి, ప్రసన్న, వివేక్, జయరామ్, పార్థిబన్, దర్శకుడు శీనూస్వామి, గాయని చిత్ర, గాయకుడు మనో పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఆయన సాధించిన కీర్తి కెరటాలను శ్లాఘించారు. గాయని చిత్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చిత్ర పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాలేకపోయిన దర్శకుడు భారతీరాజా ఎస్పీబీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఒక వీడియా పంపించారు. అదేవిధంగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఒకసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడం తన దురదృష్టమని నటుడు విజయ్‌సేతుపతి వాపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్, గాయని శైలజ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారిని సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంతాప సభ నిర్వహించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను భారతరత్న అవార్డు ఇవ్వాలని లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎస్పీ చరణ్ అన్నారు. భారతరత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం అందగానే ఎంతో సంతోషించానని ‘సాక్షి’తో చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం హెల్త్‌కేర్ అస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని అన్నారు. వదంతులు నమ్మెద్దు బాలసుబ్రహ్మణ్యం వైద్యసేవలకు అయిన ఖర్చు గురించి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని ఎస్పీ చరణ్ అన్నారు. అటువంటి వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లు చెల్లించిన తర్వాతే తన తండ్రి భౌతిక కాయాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టినట్లు, తాము ఉపరాష్ట్రపతికి ఫోన్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ప్రతి వారం తాను కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చానని తెలిపారు. చివరి రోజున ఇంకా ఎంత బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉందని ఆస్పత్రి నిర్వాహకులను అడిగితే వారు ఏం చెల్లించవద్దు..ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండని చెప్పారన్నారు. వైద్య ఖర్చుల్లో కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు చరణ్ చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తాను ప్రభుత్వాన్ని సాయం కోరిన విషయం వాస్తవమేనని, ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించడమే అందుకు కారణమన్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శిని సంప్రదించగా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి చెబుతానన్నారని తెలిపారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: కమల్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతటా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ కమల్ హాసన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
బాలుకు భారత రత్న!
సాక్షి, అమరావతి: గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, బిస్మిల్లాఖాన్, భీంసేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లాంటి గొప్ప గాయకులు, సంగీత విద్యాంసులకు భారత రత్నను ఇచ్చి సత్కరించినట్లుగానే అసాధారణ ప్రతిభాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు. ► సంగీత సామ్రాజ్యంలో ఐదు దశాబ్దాల పాటు విశేష ప్రతిభ ప్రదర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వడం అత్యున్నత స్థాయి గుర్తింపు నిచ్చినట్లు అవుతుంది. ఆయనకు అదే అత్యున్నత నివాళి. ► నెల్లూరులో ఇలాంటి మహా గాయకుడు జన్మించడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఆయన అకాల మరణం అశేష అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అంతర్జాతీయంగా సంగీతాభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన విజయగాథ, సాధించిన ఘనత ఎల్లలు లేనివి. అసమానమైన ప్రతిభతో అసమాన స్థాయికి ఎదిగారు. ► తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎస్పీ 40 వేలకుపైగా పాటలు పాడారు. అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. ► తెలుగు సినిమాల్లో అత్యుత్తమ గాయకుడిగా 25 రాష్ట్ర స్థాయి నంది అవార్డులను సాధించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్ర అవార్డులను కూడా అనేకం గెల్చుకున్నారు. ► ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ దక్షిణాది ఉత్తమ గాయకుడుగా ఆరు అవార్డులు పొందారు. 2016లో భారత సినీ రంగ ప్రముఖుడుగా(ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనకు వెండి నెమలిని ప్రదానం చేశారు. ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ , 2011లో పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి గౌరవించింది. (థాంక్యూ సీఎం జగన్: కమల్ హాసన్) -
థాంక్యూ సీఎం జగన్: కమల్ హాసన్
చెనై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనపై విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారత రత్న ఇవ్వాలని కోరినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ట్విటర్లో పోస్టు చేశారు. ‘మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. సరైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ పేర్కొన్నారు. చదవండి : ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్ Thank you Honourable CM of Andhra Pradesh. @AndhraPradeshCM. The honour you seek for our brother Shri.S.P.Balasubramaniam is a sentiment which true fans of his voice will echo, not only in Tamilnadu but throughout the whole nation. pic.twitter.com/eSeC4MnR8p — Kamal Haasan (@ikamalhaasan) September 28, 2020 కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. బాలు మరణంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రీయులు కన్నీరు పెట్టారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం. (దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్) -
ఎస్పీ బాలు ఆస్పత్రి బిల్లుపై వదంతులు
సాక్షి, చెన్నై : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు. కట్టుకథలు అల్లి, అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ చరణ్ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు. (ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్) మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్ ప్రెసిడెంట్ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు. (ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్) -
ఆసుపత్రి బిల్లులు త్వరలోనే వెల్లడిస్తాం
-
ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో స్మారకమందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎస్పీబీ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వున్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు. (బాలన్నా...పాట పాడవా: అర్జున్) ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో ఆదివారం కుటుంబసభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చరణ్, తామరపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో ఎస్పీబీ స్మారక మందిరం నిర్మించనున్నట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారంలోపు మీడియాకు వివరిస్తామన్నారు. తండ్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వానికి, కలెక్టర్ మహేశ్వరి, పోలీసులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మారక మందిరం నిర్మాణానికి ముందే ఎస్పీబీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని ప్రజలు సందర్శించడానికి పోలీసులతో చర్చించిన తరువాత అనుమతిస్తామని వివరించారు. (గాయక నాయకా స్వరాభివందనం) -
వ్యవసాయ క్షేత్రంలో బాలు స్మారక మందిరం
సాక్షి, చెన్నై/కొత్తపేట: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన వ్యవసాయక్షేత్రంలో స్మారక మందిరం నిర్మిస్తామని ఎస్పీ చరణ్ వెల్లడించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చెన్నై సమీపంలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఖననం చేసిన విషయం తెలిసిందే. సమాధి వద్ద ఆదివారం సంప్రదాయ కార్యక్రమం ముగిసిన తర్వాత చరణ్ మీడియాతో మాట్లాడారు. గూగుల్‌లో సెర్చ్ చేసినా స్పష్టంగా కనబడే రీతిలో స్మారక మందిరం నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా తన తండ్రిపై ప్రజానీకం చూపిన అభిమానం మరువలేనిదన్నారు. ఎస్పీబీ ప్రజలందరి ఆస్తి అని వ్యాఖ్యానించారు. ప్రజలు వారి కుటుంబంలో ఒకరిని కోల్పోయినంతగా ఉద్వేగానికి లోనయ్యారన్నారని చెప్పారు. కాగా, బాలుకు నివాళులర్పించేందుకు అభిమానులు ఆదివారం వ్యవసాయక్షేత్రానికి తరలి వచ్చారు. ‘భారతరత్న’కు ప్రయత్నిస్తాం బాలుకు భారతరత్న తప్పనిసరిగా వస్తుందని ఆ అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారతరత్నకు ఎస్పీబీ అర్హుడు అని, అవార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. కాగా, ఎస్పీబీ ముందుగానే తన విగ్రహం రూపకల్పనకు శిల్పి రాజ్‌కుమార్‌ను సంప్రదించడం, ఆయన రూపొందించిన విగ్రహం ఫొటో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బాలు కోరికపైనే విగ్రహం బాలు విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న రాజ్‌కుమార్ జీవించి ఉండగానే తనను విగ్రహంలో చూసుకోవాలని బాలు అనుకున్నారని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తెలిపారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. ‘నెల్లూరులోని తన తండ్రి పాత విగ్రహం స్థానంలో నేను తయారు చేసిన విగ్రహాన్ని బాలు నెలకొల్పారు. ఆ విగ్రహం నమూనా పరిశీలన కోసం 2018 నవంబర్ 19న నా శిల్పశాలకు వచ్చారు. ఆ సందర్భంలో బాలుతో వచ్చిన వారు విగ్రహం చేయించుకోమని ఆయన్ని పట్టుబట్టారు. దీనికి ఆయన అంగీకరించి ఫొటోలు ఇచ్చారు. వాటి ఆధారంగా నమూనా విగ్రహం తయారు చేశాను. తదనంతరం ఆయన తల్లి విగ్రహం కూడా తయారు చేయమని నాకు చెప్పారు. ఆ విగ్రహం తయారీపై గతేడాది ఆగస్టులో ఫోన్లో వాకబు చేశారు’ అని రాజ్‌కుమార్ తెలిపారు. -
లెజెండ్స్
-
బాలుతో...
-
బాలన్నా...పాట పాడవా: అర్జున్
గాన దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అభిమానలోకం, ఆప్తులు, ప్రముఖుల కన్నీటి సంద్రం నడుమ శనివారం అంత్యక్రియలు జరిగాయి. తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో గానగంధర్వుడిని ఖననం చేశారు. తమ అభిమాన గాయకుడి కడచూపు కోసం అభిమానలోకం, ప్రముఖులు తరలిరావడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో పరిసరాలు మునిగాయి. సాక్షి, తిరువళ్లూరు: చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్పీబి శుక్రవారం అందర్నీ వీడి అనంతలోకాలకు పయనమయ్యారు. ఈ సమాచారం యావత్ సంగీత ప్రపంచాన్ని, అభిమానలోకాన్ని కన్నీటి సాగరంలో ముంచింది. ఆస్పత్రి నుంచి చెన్నై నుంగంబాక్కంలోని నివాసంలో ఆయన పారి్థవదేహాన్ని ఉంచారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం వద్ద వున్న ఎస్పీబీ గార్డెన్‌కు పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిమానులు, ఆప్తులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. గాన గంధర్వుడి కడచూపుకోసం అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి. ఎస్పీబీ అంతిమయాత్ర తరలివచ్చిన ప్రముఖులు.. ఎస్పీబీని కడసారి చూసుకునేందుకు భారీగా అభిమానులు ప్రముఖులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, తమిళనాడు ప్రభుత్వం తరఫున తమిళాభివృద్ధి, పురావస్తుశాఖా మంత్రి పాండ్యరాజన్, కలెక్టర్ మహేశ్వరి రవికుమార్, డీఐజీ చాముండేశ్వరీ, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, పీబీకే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మూర్తి, జెడ్పీ మాజీ చైర్మన్ రవిచంద్రన్‌తో పాటు పలువురు నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. (గాయక నాయకా స్వరాభివందనం) అలాగే, ప్రముఖ నటుడు విజయ్, అర్జున్, దర్శకుడు భారతీరాజా, అమీర్, రçహ్మాన్, సింగర్ మనో, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, హాస్యనటుడు మైల్స్వామి బుల్లితెర నటుడు కృష్ణన్, బోండామురుగన్, భారతీ, శ్రీరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఎస్పీబీతో 9వ తరగతి వరకు చదువుకున్న నగరి జెడ్పీ పాఠశాలకు చెందిన 50 మంది పూర్వపు విద్యార్థులు తరలి వచ్చి చిన్ననాటి మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే, విజయ్ హఠాత్తుగా అక్కడ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎస్పీబి భౌతికకాయానికి నివాళులర్పించిన విజయ్, ఆయన కుమారుడు చరణ్‌తో మట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. ప్రముఖులు అభిమానుల సందర్శనను 10.45 గంటలకు నిలిపి వేశారు. తర్వాత సమీప బంధువులు, కుటుంబీకుల్ని అనుమతించారు. ఎస్పీబీ తనయుడు చరణ్ సంప్రదాయబద్ధంగా ప్రక్రియల్ని ముగించారు. గంటపాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పారి్థవదేహనికి అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి. ఎస్పీ అరవిందన్ నేతృత్వంలో సాయుధదళ పోలీసులు ఎస్పీబీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈసమయంలో జోహార్ ఎస్పీబీ నినాదం మార్మోగింది. ఆయన పాటలను పాడుతూ ఊరేగింపు సాగింది. చివరకు పోలీసులు మూడు రౌండ్లతో 72 తూటాలను గాల్లో పేల్చి అంత్యక్రియల ప్రక్రియను ముగించారు. ఆయన పారి్థవదేహాన్ని అశ్రునయనాల నడుమ ఖననం చేశారు. కాగా, ఎస్పీబీ ఇంట్లో ఉన్న శివలింగంకు నిత్యం పూజలు చేసే వేద పండితుడు సుసర్ల సుబ్రమణ్య శాస్త్రి నేతృత్వంలోని ఐదుగురు పండితుల బృందం అంత్యక్రియల లాంఛనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రముఖుల ఉద్వేగం.. బాలన్నా...పాట పాడవా:కడ చూపుకోసం వచ్చిన సినీ నటుడు అర్జున్ ఎస్పీబీ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. బాలన్న.. తన చిత్రాల్లో ఎన్నో దేశభక్తి పాటలను పాడి విజయా న్ని అందించావని, ఇప్పుడు లేచి ఓ పాట పాడవా అంటూ అర్జున్ ఉద్వేగానికి లోనయ్యారు. భారతరత్న ఇవ్వాలి: ఎస్పీబీకి సినీ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన చరిత్రను చాటే రీతిలో కేంద్రం భారతరత్నతో గౌరవించాలని దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఎస్పీబీకి నివాళులర్పించే క్రమంలో భారతీ రాజా, గాయకుడు మనో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆడుకుందాం...లేచి రండి సార్: మిమ్మల్ని కలిసినప్పుడల్లా కాసేపు సరదాగా ఆడుకుందామా అని అడిగే తమరు దేవుడు ఆడిన ఆటలో అలసి శాశ్వత విశ్రాంతిలో ఉన్నారని, ఇప్పుడు లేచి రండి సార్..కాసేపు ఆడుకుందాం అని హాస్య నటుడు మైల్స్వామి విలపించారు. ఎంతో కష్టపడ్డారు: జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయాల్ని ఎస్పీబీ సొంతం చేసుకున్నారని నటి శ్రీరెడ్డి అన్నారు. సాధారణంగా తాను ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కానని, అయితే, ఎస్పీబీ ప్రత్యేకమైన లెజెండ్ అని, ఆయనపై ఉన్న అభిమానం, గౌరవం ఇక్కడకు తనను రప్పించిందని శ్రీరెడ్డి నివాళులర్పించారు. క్లాస్ టూ మాస్: క్లాస్ పాటల నుంచి మాస్ పాటల వరకు అన్నింటికి న్యాయం చేసిన ఘనత ఎస్పీబీది అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు. తాను సమకూర్చిన మొదటి సంగీతానికి పాటపాడాలని అభిమానిగా కోరితే, ఆ కోరికను మన్నించిన మహావ్యక్తి ఇకలేరన్నది నమ్మలేకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. -
గాయక నాయకా స్వరాభివందనం
సాక్షి ప్రతినిధి, చెన్నై : కోట్లాది మంది అభిమానులకు కన్నీటిని మిగిల్చి.. కానరాని లోకాలకు గాన గంధర్వుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. పాటలతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరమాంత్రికుడిని భూమాత తన గర్భంలో దాచుకుంది. అభిమానుల అశ్రునయనాలు, కుటుంబీకుల కన్నీటి ధారల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఎస్పీ బాలు పార్థివదేహాన్ని కమదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి తరలించారు. ఆ వాహనాన్ని వేలాది మంది అనుసరించారు. దారిపొడవునా అభిమాన సందోహం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పలు చోట్ల వాహనాన్ని నిలిపివేసి పూలవర్షం కురిపించారు. దీంతో గంటలో వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిన వాహనం మూడు గంటలు ఆలస్యంగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికే వేలాది మంది జనం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!) కన్నీటి పర్యంతమైన కుటుంబం వ్యవసాయ క్షేత్రంలో బాలు భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు శనివారం తెల్లవారుజాము 5 గంటల నుంచి అనుమతించారు. ఉదయం 7 గంటలకు అంతిమసంస్కారాలు ప్రారంభించారు. బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు, ఇతర బంధువులు పార్థివదేహానికి ప్రదక్షిణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో కుమారుడు చరణ్ పూర్తి చేశారు. ఎస్పీ బాలుతో కలిసి చదువుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ మహేశ్వరి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 24 మంది పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి నివాళులు అర్పించారు. బాలు భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం బాలసుబ్రహ్మణ్యానికి వీలు చిక్కినప్పుడల్లా తన వ్యవసాయక్షేత్రానికి వచ్చేవారు. ఈ ఫాం హౌస్‌లోని ప్రశాంత వాతావరణంలో కాలక్షేపం చేసేవారు. సుమారు 15 ఎకరాల్లోని ఈ వ్యవసాయక్షేత్రంలో పచ్చని చెట్లు, తోటల మధ్య గడిపేందుకు ఆయన ఇష్టపడేవారు. అంతేగాక ఈ వ్యవసాయక్షేత్రం చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎన్నో సహాయాలు చేసేవారు. బాలు మరణవార్త వినగానే అంతిమసంస్కారాలు ఎక్కడ చేయాలనే ఆలోచన వచ్చినపుడు.. ఆయన సన్నిహితులు ఈ వ్యవసాయక్షేత్రాన్ని సూచించారు. దీనికి కుటుంబీకులు కూడా అంగీకరించారు. ఎస్పీ చరణ్‌ను ఓదారుస్తున్న హీరో విజయ్ ఏపీ నుంచి మంత్రి అనిల్.. ఎస్పీబీ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ సంగీత దర్శకుడు ఇళయరాజా శనివారం రాత్రి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయ సన్నిధిలో మోక్ష దీపం వెలిగించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాలుకు నివాళులు అర్పించారు. అంతిమసంస్కారాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తమిళనాడు మంత్రి ఎం పాండియరాజన్, ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్, నటుడు అర్జున్, రెహమాన్, దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్ బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ చరణ్‌తో మాట్లాడుతున్న ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయంలో ఖననం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయానికి చెందిన వారు కావడంతో ఆయన పార్థివదేహాన్ని ఆ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. లింగదారుల వంశీకుల్లో స్త్రీ, పురుషులు విధిగా శివలింగాన్ని ధరించి ఉంటారు. ఎస్పీ బాలు ఇంటిలో శివలింగాలకు వేదపండితులు నిత్యం అభిషేకం చేస్తారు. లింగదారుల సంప్రదాయంలో వారు మరణిస్తే భౌతికకాయాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. అయితే బాలు పార్థివదేహం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల కూర్చోపెట్టడానికి వీలుకాక పడుకోబెట్టిన స్థితిలోనే ఖననం చేశారు. -
నేను...బాలు..కొన్ని జ్ఞాపకాలు
కైలాసంలో... శివతాండవం ఆగింది...! డమరుకం పేలింది...! రుద్రాక్ష రాలింది...! ఏకబిల్వమ్... శివార్పణం అయిపోయింది!! సింహపురిలో శివకేశవులిద్దరిమీదా హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాలు సమయంలో ఉంఛవృత్తి చేసి, పరమపవిత్రమైన జీవితం గడుపుకుంటున్న శ్రీపతి పండితారాధ్యుల సాంబ మూర్తి, శకుంతలగారి ఇంట బంగారు పంట... బాలు. · · · ఎస్.పి.బి... అనే బీజాక్షర సహిత పుంభావ సరస స్వర సరస్వతితో నా జ్ఞాపకాలు.... · · · తొలి పరిచయం... నిడదవోలులో.... జవ్వాది రామారావు గారి కళాసంస్థ.... మా ‘కొక్కొరొక్కో’ నాటిక వేసిన సందర్భంలో మాకు ప్రథమ బహుమతి వస్తే... ముఖ్య అతిథి అయిన బాలు గారు నన్ను, తల్లావజ్ఝల సుందరాన్ని కావలించుకుని ‘‘మీలాంటి వాళ్ళు ఉండాల్సింది హైదరాబాదులో కాదు.... అర్జెం టుగా మద్రాస్ రండి’’ అని ప్రోత్సహిం చిన సంస్కారి. · · · ‘కళాసాగర్’ నాటక పోటీల్లో; ప్రథమ బహుమతి మళ్ళీ ‘కొక్కొరొక్కో’కి వస్తే... ‘‘వీళ్ళు సామాన్యులు కాదు’’ అని... నేను, సుందరం స్టేజి ఎక్కి బహుమతి అందుకునే వరకూ ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించిన సహృదయుడు బాలు. · · · నా మొదటి చిత్రం ‘కంచు కవచం’ రికార్డింగ్.... నేను డైలాగ్స్ రాసిన సినిమా లో వేటూరి రచన, బాలు పాట .... అలా చూస్తూ ఉండిపోయా... నా కల పాటై బాలు నోట వినిపిస్తోంది. కాళ్ళకు దణ్ణం పెడితే; గుండెలకు హత్తుకుని... ఎత్తుకుని నెత్తినెట్టుకునే మనిషి! · · · తర్వాత.... వంశీ– ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్ని పాటలు... ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’, ‘చెట్టు కింద ప్లీడర్’లోని ‘చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్నెలేడి’...! ఎన్ని రికార్డింగ్ థియేటర్లలో పలకరింపుతో కలిసి బాతాఖానీలో.... టిఫిన్సో్ల. తమాషా ఏమిటంటే సింగర్లు తిండి, నీళ్ళ విషయంలో పరమ జాగ్రత్తగా ఉంటారు... బాలుకు అదేమీ లేదు. గుప్పెడు వక్కపొడి, ఎప్పుడైనా సిగరెట్, కుదిరితే తాంబూలం. గొంతును ఈశ్వరుడికి ఎల్.ఐ.సి చేసినట్టుండేవాడు. · · · నేను బాలు కలిసి కొన్ని సినిమాల్లో నటించే సమయాల్లో నా సాహిత్యం, ముఖ్యంగా ‘ఆటగదరా శివ’, ’శభాష్ రా శంకరా’ విని ముగ్ధుడైపోయేవాడు. ‘శభాష్ రా శంకరా’ సీడీని శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యానికి అంకితం ఇస్తూ... ‘భాషా శ్రీపతికి... పాటల పండితుడికి... సుబ్బరమైన బాలుడికి...’ అని చమత్కరిం చాను... · · · కొత్తగా రాసిన ‘శివ చిలకలు’ అనే శివతత్వాలను వినిపించి, వీటిని మీరు పాడాలి అంటే... కన్నీరు నిండిన కళ్ళతో, ‘వద్దు భరణి, వీటికి నీ గొంతే కరెక్ట్.... కొంచం ‘రా’ గా ఉంటే మంచిది.... శుభం భూయాత్‘ అన్నాడు. · · · నేను, జనార్దన మహర్షి అమీర్‌పేట్‌లో కొనుక్కున్న మొదటి 2 బెడ్ రూమ్ ఫ్లాట్ గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి, మాతో భోజనం చేసి, సరదాగా గడిపి వెళ్తే... మా బంధువులంతా అలా అవాక్కయి చూస్తూ ఉండిపోయారు... ‘బాలు మా ఇంట్లో అడుగు పెట్టేడంటే సాక్ష్యాత్తు ఆ సుభ్రహ్మణ్య స్వామే వచ్చినట్టు పొంగిపోయాం‘. · · · ఆస్ట్రేలియాలో ఉండే కోడూరి రామమూర్తి గారు బాలుకి, నాకు కామన్ ఫ్రెండ్. బాలు ‘భగవద్గిత’ పాడేరు... (ఈ సంగతి చాలా మందికి తెలీదు). సి. నారాయణ రెడ్డిగారు, మిగతా ప్రముఖులు ముఖ్య అతిధులుగా చాలా వైభవంగా ‘సత్య సాయి నిగమాగమంలో’ ఆవిష్కరణ జరిగింది... ఆ కార్యక్రమానికి నేనే యాంకర్ని. కానీ అదెందుకో పాపులర్ కాలేదు. బహుశా భగవద్గీతను ఘంటసాల మాష్టారుకి, బిల్వాష్టకాన్ని బాలుగారికి కేటాయించాడేమో ఆ పరమేశ్వరుడు. · · · నా 25 సంవత్సరాల సినీ యాత్రని ‘వెండి పండగ’ పేరుతో రవీంద్ర భారతిలో సంగం అకాడమీ సంజయ్ కిశోర్ నిర్వహిస్తే చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. చివరిగా బాలు అడక్కుండానే భక్త కన్నప్పలో పద్యాలు పాడి, ప్రేక్షకులంతా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చేలా చేసి తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. వెండిపండగ నాడు నాకదో బంగారు బహుమతి. · · · ఒకసారి చెన్నైలో బాలు గారి ఇంట్లో చరణ్ తియ్యబోయే ఒక ఆర్ట్ సినిమా గురించి చర్చించుకున్నాం. అక్కడే డిన్నర్ చేసి మీద దిగి వస్తుం డగా, కాలు జారి, నా బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. హైదరాబాద్ వచ్చాకా దాదాపుగా ప్రతిరోజా ఫోన్ చేసి ‘కాలు ఎలా ఉంది భరణి’ అని తగ్గేవరకూ పరామర్శిస్తూ ఉండేవాడు ఆయన. · · · మేమెప్పుడూ కలిసినా తరచూ వేటూరి వారి సాహిత్యంలో చమక్కుల్నీ, ఆ భాషా సౌందర్యాన్ని, భావ శబలతని తల్చుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ‘వేటూరి వంటి వారు వెయ్యేళ్ళకోసారి పుడతారేమో’ అని నేనంటే... ‘మా అందరి ఆయుష్షు పోసుకుని నువ్వు వెయ్యేళ్ళు బతకాలయ్యా సుందరయ్యా’ అని అంటుండేవాడు బాలు. మేము నీ విషయంలో అదే కోరుకున్నాంగా... కానీ ఏది? దెబ్బకొట్టేశావుగా బాలు! · · · ఇక ‘మిథునం’ సినిమా అనుకున్నప్పుడు మొదట అప్పదాసు వేషం నేను వేద్దామని అనుకుని, చాలా మంది హీరోయిన్లు అంటే హిందీ రేఖ... సుహాసిని... రాధిక... వై. విజయ... శైలజ (బాలు గారి చెల్లి), మృణాళిని (రచయిత్రి) ఇలా చాలామందిని అనుకున్నాకా... లక్ష్మి గారు, బాలు ఫిక్స్ అయ్యారు. బాలు గారికి కథ వినిపిస్తే బావుందని మెచ్చుకుని ‘ఔను, నువ్వూ నటుడివే కదయ్యా! ఇంత మంచి పాత్ర నువ్వే వెయ్యచ్చుగా’ అన్నాడు. అప్పుడు నేనన్నాను ‘స్వామీ నేనే రాసి, నేనే వేసి, నేనే తీస్తే, చివరికి నేనే చూసుకోవాల్సొస్తుందేమో’ అంటే నవ్వేసి చాలా తక్కువ పారితోషికం తీసుకొని అప్పదాసు పాత్రకి జీవం పోశాడు. · · · ‘మిథునం’ నిర్మాత ముయిద ఆనందరావు గారి ఊరు వావిలవలసలో షూటింగ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మూడు నెలల ముందు నుంచే అక్కడికి వెళ్ళి, ఆ పాడుబడ్డ పెంకుటింటిని సరిచేసి, అక్కడ నేను చెప్పిన అన్ని మొక్కలనీ పెంచి... సర్వాంగ సుందరంగా, పరమ సహజంగా తీర్చిదిద్దాడు. బాలుగారు లొకేషన్ చూడగానే వాళ్ళావిడ సావిత్రి గారితో ‘మనం రిటైర్ అయ్యాకా ఇలాంటి పర్ణశాలలో ఉండాలోయి’ అన్నాడు. ఏది బాలూ? ఆవిడ సావిత్రే ... నువ్వే పేద్ద సత్యవంతుడివి.... మాట తప్పావు!!! · · · రోజూ మధ్యాహ్నం బ్రేక్ చెప్పగానే తోటలో ఒక బెండకాయని కొరుక్కు తింటూ ఉండేవాడు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని ముచ్చట పడుతూ ఉండేవాడు. బాలుని సంతోషపెడదామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టి వండిస్తే సాయంత్రం ఆయన నవ్వుతూ, ‘నువ్వు ప్రేమ చేత అన్నీ వండించేవు గానీ, నేను రెండు గరిటెల కన్నా ఎక్కువ తినకూడదయ్యా.... బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాగా’ అన్నాడు. నేను ఎంత బాధపడ్డానో! కడుపునిండా అన్నం పెట్టేమన్న తృప్తి కూడా లేకుండా పోయింది అప్పదాసూ!! · · · బాలు, లక్ష్మి గార్లిద్దరూ పొద్దున్నే 8 గంటలకు వచ్చేసేవారు లొకేషన్‌కి. ఒంటిగంటకు బ్రేక్. మళ్ళీ 3 గంటలకే షూటింగ్. 6 గంటలకి పేక్ అప్. క్లైమాక్స్ మాత్రం ఒకటి, రెండు రోజులు అర్ధరాత్రి వరకూ జరిగింది... ఇద్దరూ విసుక్కున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్ర ప్రసాద్‌ని బాలు కేకలేశాడు కూడా! సినిమా చూశాక, కెమెరామ్యాన్‌కి సభాముఖంగా సారీ చెప్పి కావలించుకున్నాడు. దట్ ఈజ్ బాలు! · · · షూటింగ్ చివరిరోజుల్లో ఒక సీన్ పొరపాటున డ్రెస్ మార్చి, మళ్ళీ తియ్యాల్సొచ్చింది. ఆయనకీ కోపం వచ్చి లొకేషన్లో అన్యాపదేశంగా అసిస్టెంట్ డైరెక్టర్లని కేకలేశాడు. తప్పెవరు చేసినా బాధ్యత దర్శకుడిగా నాదే కదా... నేను హర్ట్ అయ్యాను... రాత్రి కన్నీళ్ళు పెట్టుకున్నాను. రెండు రోజులు మేము మాట్లాడుకోలేదు. సినిమా అయిపోయింది. నేను ప్యాక్ అప్ చెప్పేశాను. ఆయన్ని సాగనంపడానికి ముభావంగా కార్ దగ్గరకొచ్చాను. ఆయన చొక్కా పట్టుకు లాగి, కావలించుకున్నారు. నేను గాఢంగా కావలించుకుని ఏడ్చేశాను. నన్ను సముదాయిస్తూ, ‘చాలా గొప్ప సినిమా తీశావు భరణీ! పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా తీశావు. నీకు అఖండమైన పేరొస్తుంది. నీతో పాటు నాకూనూ‘ అన్నాడు. కాళ్ళ మీద పడిపోతే లేవనెత్తి ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే నాకు ఆస్కార్ అవార్డు! · · · ఈ సినిమాలో టైటిల్ సాంగ్ బాలు గారితో కాకుండా జేసుదాస్ గారితో పాడించాడు వీణాపాణి. షూటింగ్ టైంలో ఆ సంగతి బాలుకి చెప్పలేదు. షూటింగ్ చివర రోజున వినిపిస్తే ‘నా కోసం మా అన్న పాడేడా!’ అని పరమానందపడిపోయాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత ఒకసారి నాతో ఇలా అన్నాడు ‘ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే ‘మిథునా’నికి ముందు, ‘మిథునా’నికి తరువాత’ అని... అంతకన్నా ఏ దర్శకుడికైనా ఏం ప్రశంస ఉంటుంది? శ్రీపతితో కలయిక... ఐశ్వర్యం. పండితారాధ్యుడితో పరిచయం... యోగం. బాలసుబ్రహ్మణ్యంతో స్నేహం... వ్యసనం... · · · ఇదీ కైలాసమే! కనకమహాసభ... ఐశ్వర్యానికి నిలయం... మొత్తం బంగారంతో మెరిసిపోతోంది. అంతెత్తు వెండి నంది తన ఉచ్ఛ్వాస, నిస్వాసాలతో బంగారు ఉయ్యాల ఊపుతోంది. ఆదిదంపతులిద్దరూ కూర్చున్నారు. ఒకవైపు అమ్మవారు...మరోవైపు అయ్యవారు. పార్వతీదేవి ఒళ్ళో నెల‘బాలుణ్ణి’ ఒద్దికగా బజ్జోపెట్టుకుని జోల పాడుతున్న హేల! చిరునవ్వుతో కన్నులరమూసిన పరమేశ్వరుడి లీల! వ్యాసకర్త : తనికెళ్ల భరణి, ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు -
అతడో...మాటల మంత్రశాల
పాటల నెలరేడు, పాటల చెలికాడు, పాటల విలుకాడు.. అసలు పాటల ‘కల’వాడు బాలుగారు. నిజానికి నిజమైన బాలుగారి జీవితం ఇప్పుడు ప్రారంభమైంది. భౌతిక రూపం అదృశ్యమై జ్ఞాపక రూపం దృశ్యమానమవడం మొదలైంది. బాలూ సర్ లైఫ్ స్టార్టెడ్ నౌ... బాలుగారి గానం విశ్వలీనమై విశ్వగానం మారింది. పాట ప్రేమికులారా వినపడుతుందా. కళ్లు తెరిస్తే బాలు విషాద అంతిమయాత్ర దృశ్యం. కళ్లు మూసుకుంటే బాలు విశ్వగానాలాపనా దృశ్యం. కారణజన్ముల మరణమంటే కళ్లముందు దీర్ఘ శయ్యపై పడుకోవడం కాదు. గుండె గుండెలో మేల్కోవడం... మరణ భవంతిలోకి పోవడంకాదు. జ్ఞాపకాల జనన స్రవంతిలోకి రావడం కదా మరణమంటే.. బాధోంకి బర్సాతే కాదూ యాదోంకి బారాత్ కూడా.. ఒక్కసారే కోట్ల హృదయాల్లో మేల్కోవడం ఒక్కడికి సాధ్యమవుతుందా. హంస ఎగిరిపోయాక కూడా ఈ ఒక్కడికే సాధ్యమైంది. డెబ్బె నాలుగేళ్ల జీవన మధురిమలో యాభై నాలుగేళ్ల సరిగమ. యాభై నాలుగేళ్ల పరిశ్రమంలో యాభై ఆరక్షరాల పరాక్రమం. ఒకేరోజు 21 కన్నడ పాటల రికార్డింగ్, 19 తమిళ పాటలు మరో రోజు హిందీలో 16 పాటలు పాడటం గాయకమాత్రులకు సాధ్యమా. గంధర్వ గాత్రుడికది సుసాధ్యమైంది. సులభసాధ్యమైంది. తొలి తొలి తొలకరి రోజుల్లోనే మహానటుడు, మహా నాయకుడు ఎంజీఆర్ బాలుగారితో పాడించటానికి మూడువారాలు నిరీక్షించడం జరుగుతుందా? జరిగి తీరింది బాలు గంధర్వుడికి. అది ఎంజీఆర్ సహృదయమైనా బాలుగారికి సాక్షాత్ సరస్వతీ ఆశీర్వాదం కదా. మహర్జాతకుడు. కఠోరదీక్షాపరుడు. సమయ నిబద్ధుడు, అనన్యసామాన్య ప్రతిభావం తుడు బాలు. ఆయనకే చెల్లింది. తన పూజా మందిరంలో తన పాటే ప్రార్ధన కావడం. తన అంతిమయాత్రలో తనను తనపాటే సాగనంపడం ఎవరికి జరిగింది? ఏ గుడికెళ్లినా తన పాటే నివాళిగా ఉంది. దాదాపు 11 భాషల్లో 37 వేల పైగా పాటలు పాడటం మధుర గేయాలు పాడేవేళ పాటల నెలరేడు, పాటల చెలికాడు.. రుధిర గేయాలు పాడేవేళ పాటల విలుకాడు. అగ్ని కురిపించినా.. అమృతం ఒలికించినా అశ్రుధార వర్షించినా ఆ శ్వేత మేఘం బాలు కంఠం. ‘చూడు పిన్నమ్మా’ అన్న గొంతు వేయి గొంతుకల విప్లవ శంఖమైంది. విశాల గగనంలో చంద మామ అన్న గళం అగ్నినేత్ర మహోగ్ర జ్వాలా నిగళమై నాకు జాతీయ పురస్కార మందించింది. పాటల విశ్వరూపమతడే. మాటల విశ్వవిద్యా లయమ తడే. పాట గురించి చెబుతున్నపుడు పాటల పాఠశాల అతడే. మాటల మానవ సంబంధాల గురించి చెబుతున్నపుడు మాటల మంత్రశాల అతడే... అమృతం ఆయన స్వరభాష. వినమృతం ఆయన శరీర భాష. కృతజ్ఞత ఆయన జీవన పర్యంత భాష. శబరిమలకు వెళ్లినప్పుడు తనను డోలీలో మోసుకెళ్లిన కూలీలకు పాదాభివందనం చేయడం. సభ జరిపే వారికి ‘నా పేరుకు ముందు డాక్టర్–పద్మ భూషణ్ గానగంధర్వ ఇలా విశేషణాలు పెట్టొద్దని లేఖ రాయడం. నేనోసారి పాడుతా తీయగాలో ఒక పక్షి జీవిత కాలంలో ఎప్పుడూ నేలపై కాలూనదు. అందుకే ఆ పక్షిని భారతీయ ధ్వజంగా భావించి భరద్వాజ పక్షి అంటా రని చెబితే చేతులు జోడించి ‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు తేజాగారూ’ అనడం. ఏ కృతజ్ఞత, వినమ్రతా విభాగం లోకి వస్తుందో.. బాలుగారిని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. వీలు కాలేదు. ఇప్పుడు అసలు వీలు కాదుగా. ఎన్నో నేర్చుకున్నాం తన నుండి. తెలుగు భాష– తెలుగు శ్వాస– తెలుగుపై ఆశ. తన ‘పాడుతా తీయగా’ పాఠశాల (పాటశాల)లో ఎన్ని కొత్త గొంతుకలు ప్రాణం పోసుకున్నాయి. పాఠాలు నేర్చు కున్నాయి. ఇంతవరకు ఏ గాయకుడిలా ‘ఆచార్య’ పాత్ర పోషించాడు. ఏ మైకెల్జాక్సన్, ఏ మహ్మద్రఫీలు చేయగలిగారు. ‘పాడుతా తీయగా’ తరతరాలకు చెరిగిపోని స్వర విశ్వవిద్యాలయంగా సుస్థిరం చేసి వెళ్లిపోయాడు. ఎక్కడికెళ్లాడు. తెలుగుభాషా భారతి ‘కంఠాభరణం’గా యాభైనాలుగు సంవత్సరాలు మెరసి ఇపుడు స్వర్గలోక భారతీ ముంజేతి కంకణంగా మారడానికి వెళ్లిపోయాడు. అక్కడ గంధర్వ బాలబాలికలకు సినారేను ముఖ్య అతిథిగా కూచోబెట్టి తెలుగు పాట నేర్పించడానికి ‘పాడుతా తెలుగు పాట తీయగా’ కార్యక్రమ నిర్వహణకు వెళ్లాడు. నారద తుంబురులకు కనువిందుగా వీనుల విందుగా అచ్చెరువుగా.. అల్విదా బాలుగారు. అక్కడ నిరంతరం మీ గాన అధ్యాపనం సాగించండి. ‘ఏ కరోనా’ ఢరోనాలు అక్కడ లేవు. ‘తెలుగు పాట గ్యారంటీ’... వ్యాసకర్త: సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత -
‘రోజా’ రికార్డింగ్ సమయంలో బాలు ఏమన్నారంటే..
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను ఇప్పటికీ ఎవరూ జీర్జించుకోలేకపోతున్నారు. ఇక నుంచి బాలు తమ మధ్య లేరు అనే వార్త అభిమానులు, సెలబ్రిటీల చేత కంటతడి పెట్టిస్తోంది. ఎస్పీబీకి సినీ పరిశ్రమలో అందరితోనూ ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ఆనాటి తరం నుంచి ఈ తరం వరకు ప్రతి ఒక్కరితోనూ ఏదో విధంగా అనుబంధం ఉంది. బాలుకు ప్రత్యేక అనుబంధం వ్యక్తుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరూ. ఎస్పీబీ చనిపోయారని తెలిసిన వెంటనే రెహమాన్ స్పందించారు. బాలసుబ్రహ్మణ్యం మరణంతో సంగీత పరిశ్రమలో వినాశనం చోటుచేసుకుందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు మనస్పూర్తిగా నివాళులు అర్పించారు. (మీ స్వరం అన్ని వేళలా తోడుగా ఉంది) సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ మేరకు బాలు గారితో ఉన్న బంధానికి సంబంధించిన ఓ వీడియోను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్చేశారు. రెహమాన్ తొలి సినిమా రోజా పాట రికార్డింగ్ సమయంలో ఎస్పీబీతో సంభాషించిన విషయాలను ఈ వీడియోలో వెల్లడించారు. ‘‘రోజా సినిమాలో ‘నా చెలి రోజావే’ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం స్టూడియోలోకి వచ్చారు. వచ్చి వెంటనే ఈ స్టూడియో ఓ సినిమా పాటను ఎలా కంపోజ్ చేయగలరు అని చెప్పారు. కానీ నేను నవ్వి అక్కడి నుంచి వచ్చాను. సినిమా విడుదలైన తర్వాత బాలు గారు ఇలా చెప్పారు. సంగీతాన్ని ఎక్కడైనా నిర్మించవచ్చని మీరు నిరూపించారు. అని రెహమాన్ వెల్లడించారు. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి) Celebrating #SPBalaSubramanyam's music, life and personality. 🌹https://t.co/7Gga4Ffflh — A.R.Rahman (@arrahman) September 26, 2020 అలాగే ‘కేవలం 15 నిమిషాల్లో పాట నేర్చుకొని 10 నిమిషాల్లో పాడేయగలరు. ఇలాంటి గాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు’. అని రెహమాన్ తెలిపారు. కాగా 1992 లో వచ్చిన రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా అరంగేట్రం చేశారు. బాలు-రెహమాన్ కలిసి పనిచేయడం ఇదే మొదటిది. రోజా సినిమా సమయానికి బాలసుబ్రహ్మణ్యం సంగీత పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనంతరం రెహమాన్ సంగీతంలో బాలు నుంచి అనేక పాటలు వచ్చాయి. అయితే శివాజీ సినిమా తర్వాత రెహమాన్ కోసం బాలు పాడిందేలేదు. ఇదిలా ఉండగా చెన్నై శివార్లలోని ఫామ్ హౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. (బాలును వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది) #ripspb ...Devastated pic.twitter.com/EO55pd648u — A.R.Rahman (@arrahman) September 25, 2020 -
వైరల్: అభిమానిని సర్ప్రైజ్ చేసిన బాలు
సాక్షి, చెన్నై: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం దివికేగారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి ఆయన పేరు సుపరిచితం. విదేశాల్లో ఉన్న అభిమానుల కోసం ఆయన ఎన్నో కచేరీలు చేసి అలరించారు. ప్రాంతమేదైనా తన వద్దకు వచ్చే అభిమానులను ప్రేమతో పలకరించడం ఆయన ప్రత్యేకత. అనుకోని అతిథిగా వెళ్లి కొన్నిసార్లు వారిని సంభ్రమాశ్చర్యంలోనూ ముంచెత్తుతారు. రేవతి అనే ట్విటర్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో బాలు స్వచ్ఛమైన మనసుని కళ్లకు కడుతోంది. ఆ వీడియోప్రకారం.. శ్రీలంకలో జరిగిన ఓ పేలుడు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి కంటి చూపు కోల్పోయారు. దాదాపు ఆరు మాసాలు ఆస్పత్రికే పరిమితమైన సమయంలో ఎస్పీబీ పాటలే తనకు సాంత్వన నిచ్చాయని, బాలుకు తాను వీరాభిమానిని అని అతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బాలు దైవంతో సమానమని, ఆయన్ని ఒక్కసారి కలుసుకుంటే జన్మ ధన్యమవుతుందని ఆకాక్షించారు. ఈ నేపథ్యంలో అతని ఫ్రెండ్స్ కొందరు బాలుకి విషయం చెప్పడంతో.. ఆయన కలిసేందుకు సరేనన్నారు. బాలు పాడిన తమిళపాటను ఆ అభిమాని హమ్ చేస్తున్న సమయంలో ఆయన వెళ్లి గొంతు కలిపారు. నా గొంతు కూడా బాలు గొంతులాగే ఉంటుందని బాలు కాసేపు ఆట పట్టించారు. తర్వాత.. ‘నా పేరు బాలు. ఎస్పీ బాలు. నేను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం’ అని చెప్పడంతో.. ఆ అభిమాని ఒకింత ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. ఊహించని ఘటనతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ‘నిన్ను కలుసుకునేందుకే వచ్చాను’అని బాలు చెప్పారు. (చదవండి: బాలు మృతికి సంతాపంగా నయన్ భావోద్వేగం) -
మీ స్వరం అన్ని వేళలా తోడుగా ఉంది
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతార బాలు మృతికి సంతాపం తెలిపారు. తమ జీవితాల్లో బాలు స్వరం తోడుగా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దైవిక స్వరం ఇక లేదు. అన్ని రుతువుల.. అన్ని కారణాల స్వరం మీది. మీరు ఇక లేరని నమ్మడం ఎంతో కష్టంగా ఉంది. మా జీవితాల్లోని ముఖ్యమైన క్షణాల్లో మీ స్వరం మాకు తోడుగా ఉంది. ప్రతి తరంలోని వారు తమ భావోద్వేగాలన్నింటిని కనెక్ట్ అయ్యి ఉండే ఏకైక గాత్రం మీది మాత్రమే. మమ్మల్ని ఆహ్లాదపరిచే.. సేద దీర్చే ఆ గాత్రం ఇక లేదని నమ్మడం కష్టంగా ఉంది’ అన్నారు నయనతార. (చదవండి: బాలుపై అభిమానంతో ‘బామా’) ‘మీరు మీ స్వరంతో మాతో శాశ్వతంగా ఉంటారు. మా కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి మీకు కన్నీటి వీడ్కోలు ఇస్తున్నాము. మీ కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను’ అన్నారు నయనతార. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. -
బిగ్‌బాస్ హౌస్‌లో ఎస్పీ బాలుకు నివాళి!
ఆయన గొంతు వింటే నెమళ్లు కూడా పరవశంతో పురివిప్పి నాట్యమాడుతాయి. స్వరం సవరించుకున్నారంటే శ్రోతలు చెవులు రిక్కిరించీ మరీ పాటల తోటలో ఊయలలూగుతారు. ఆయన గొంతు నుంచి జాలువారిన స్వరాలు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను ఉర్రూతలూగించాయి. ఆయనే.. గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించారన్న వార్త సినీ ప్రపంచాన్ని, అభిమానులను తీవ్ర విషాదంలోనికి నెట్టింది. కానీ బాలు ఇక లేరన్న విషయం బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు ఇప్పటివరకు తెలియనేలేదు. (‘అప్పదాసు’గా ఎప్పటికి జీవించి ఉంటావు..) దీంతో నేటి ఎపిసోడ్లో ఈ బాధాకరమైన విషయాన్ని తెలియజేసేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. నేటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లు అందరి చేతా బాలుకు నివాళులర్పించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎస్పీ బాలు చిత్రానికి నాగార్జున మనస్ఫూర్తిగా నమస్కరించారు. "ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని సరిగమలు కన్నీళ్లు పెట్టాయి. రాగాలన్నీ బాధపడ్డాయి. దాచుకో స్వామి.. దాచుకో, మా బాలును జాగ్రత్తగా దాచుకో" అంటూ నాగ్ ఉద్వేగభరితులయ్యారు. (బిగ్‌బాస్: గంగవ్వకు అతడిష్టం, ఆమె కష్టం) -
ఇక సెలవు
-
ఎస్పీ బాలుకు తుది వీడ్కోలు
-
ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి
సాక్షి, చెన్నై : తన గాన లహరితో భారతావనిని ఓలలాడించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళుల మధ్య ముగిశాయి. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు. దీంతో సొలసితి అంతట నీ శరణనే చొచ్చితిని అంటూ ఆయన ఇక శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!) తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్ విజయ్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి) -
బాలును వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణంపై గాయని పీ సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారి వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదంటూ సంతాపం ప్రకటించారు. మనందరి ఆప్తుడిని తీసుకుపోయి పెద్ద అగాధంలోకి తోసేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఃఖ సముద్రంలోముంచేసిందంటూ సుశీల కంట తడిపెట్టారు. ఎస్పీ బాలు మరణం వ్యక్తిగతంగా తనకు చాలా దెబ్బ అని అన్నారు. గుండె ధైర్యం తెచ్చుకుని, విషాదం నుంచి కోలుకోవాలని, అభిమానులకు సూచించారు. ఈ మేరకు సుశీలమ్మ ఒక వీడియోను విడుదల చేశారు. (ఒక శకం ముగిసింది!) మరోవైపు నేడు (శనివారం) మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దని తిరువళ్లూరు ఎస్పీ అరవింద్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు, ప్రముఖులు మినహా ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. అభిమానులు, నటులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫాంహౌజ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిసరాల్లో వాహనాలను కూడా అనుమతించేది లేదని ఎస్పీ అరవింద్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం ఉదయం తుది శ్వాస తీసుకున్న సంగతి తెలిసిందే. (బాలు స్వగ్రామంలో విషాదఛాయలు) ప్రఖ్యాత గాయనీమణి సుశీల తన సహచరుడు SPB మృతికి సంతాపం ప్రకటిస్తూ....! #RIPSPB pic.twitter.com/hRru8Q8Qwp — BARaju (@baraju_SuperHit) September 26, 2020 -
బాలు స్వగ్రామంలో విషాదఛాయలు
సాక్షి, పళ్లిపట్టు ( తమిళనాడు): బాలు మరణ వార్తతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ ముందు బుడిబుడి నడకలు వేసిన బాలుడు ఈ భూమిని వదిలి వెళ్లిపోయాడనే వాస్తవాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టు సమీపంలోని కోనేటంపేట గ్రామంలో 1946 జూన్ 4న తెలుగు బ్రాహ్మణ హరికథ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆరుగురు సంతానంలో ఎస్పీ సుబ్రహ్మణ్యం అగ్రజుడు. తన ప్రాథమిక విద్యను గ్రామానికి సమీపంలోని నగరిలో అభ్యసించారు. తన కీర్తిప్రతిష్టలతో కోనేటంపేటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఎస్పీ చివరగా 2017లో తన 71వ జన్మదిన వేడుకలను గ్రామస్తులతోనే జరుపుకున్నారు. స్వగ్రామమంటే ఎస్పీకి మహాప్రేమ. సమయం దొరికినప్పుడల్లా తను బాల్యంలో నివశించిన చిన్నపాటి ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఆ సమయంలో పాత మిత్రులను పేరు పేరున పలకరించేవారు. తన సొంత ఖర్చుతో గ్రామంలో తాగునీటి వసతి కల్పించారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో గ్రామానికి వస్తారని ఆశతో ఎదురుచూసిన గ్రామస్తులకు చివరి చూపు సైతం దూరం కావడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. (ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్) -
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. అనంతరం సాక్షితో మాట్లాడుతూ.. 'నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. (గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..) కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్‌హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్‌హౌస్‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బాలు మాతో 'పాటే'
సాక్షి, సిటీబ్యూరో : ఆయన లేకున్నా.. మాతో ‘పాటే’.. అంటోంది.. నగర కళా సాంస్కృతిక రంగం... గాన గంధర్వునితో తమజ్ఞాపకాలు తలచుకుని కన్నీరు మున్నీరవుతోంది. నగరంలో ఆయన అడుగుపెట్టని ఆడిటోరియం లేదు. ఆయనగళం వినిపించని వేదిక లేదు. ఆయన భుజం తట్టి ప్రోత్సహించనిసాంస్కృతిక సంస్థ లేదు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరనే వార్త తెలిసి ఎందరో సాంస్కృతిక రంగ ప్రముఖులు స్పందించారిలా.. తొలి సంగీత విభావరి మాతోనే.. గానగంధర్వులు బాల సుబ్రహ్మణ్యంతో హైదరాబాద్‌లో తొలి సంగీత విభావరి 1975లో మేమే నిర్వహించాం. అప్పట్లో రవీంద్రభారతిని సినిమా ప్రోగ్రామ్లకి ఇచ్చేవారు కాదు.. అందుకని లిబర్టీ దగ్గర లేడీ హైదరీ క్లబ్లో పెట్టాం. తర్వాత అఖిల భారత స్థాయిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల పోటీలు పెడితే జడ్జిగా మహదేవన్ హాజరయ్యారు. ఆ పోటీ విజేతలకు రవీంద్రభారతిలో బహుమతులిచ్చాం. ఒక వికలాంగుడికి బహుమతి ఇవ్వాల్సి వస్తే బాలు అతడ్ని ఎత్తుకుని బహుమతి ఇచ్చారు. అలాగే ఏ.ఎం. రాజా స్వర్ణకంకణం లలిత కళాతోరణంలో బాలుకు ఇచ్చాం. ఆ స్వర్ణ కంకణానికి డబ్బులు ఎంత అయిందని అడిగి తెలుసుకుని ఆ మొత్తాన్ని వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న వికలాంగ స్కూల్‌కి ఇచ్చేశారు. అలాగే మా దివ్యాంగుల ఆశ్రమానికి ఆయన ప్రధాన పోషకుడిగా కూడా మారారు. కళా సంస్థలకు నిధుల సేకరణ ప్రోగ్రామ్స్‌లో ఆయనెప్పుడూ రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదు. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద పెట్టిన మ్యూజిక్ అవార్డ్ బాలుకు ఇస్తే అందులో భాగంగా వచ్చిన రూ.లక్ష నగదును ఆయన తన పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి అందించారు. ఆ ట్రస్ట్ తరఫున పేద గాయనీ గాయకులకు ఆర్థిక చేయూత అందించేవారు. ఆయనకు ఒకసారి వీణ బహుమతిగా ఇస్తే ఎవరో నిరుపేద అమ్మాయి వీణ నేర్చుకునే సరదా ఉందంటే ఆ వీణ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చేశారు. ఇలాంటివెన్నో ఆయన కళా పోషణకు గుర్తులు. ఆయన లేకపోవడం కళా సంస్థలకు తీరని లోటు. ఎవరు పిలిచినా వీలున్నంత వరకూ హాజరయ్యేవారు. మా ఇద్దరిది 45 ఏళ్ల అనుబంధం. మా ఇళ్లకు వచ్చేవారు. భోజనం చేసేవారు. పిల్లల్ని ఆడించేవారు. ఏదేమైనా నగరంలోని కళాసంస్థలు ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్టే. – వంశీ రామరాజు మనసున్న పాట.. 20ఏళ్లుగా ఎస్పీబాలుతో పరిచయం ఉంది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. నా ప్రతి పుస్తకం తొలి పాఠకుడు ఆయనే. నా ఫొటోగ్రఫీలన్నీ నచ్చేవి ఆయనకి. బాల సుబ్రహ్మణ్యంను నాకు రచయిత వెన్నెకంటి పరిచయం చేశారు. సంగమం సంస్థ పెట్టాక వందల కార్యక్రమాల ద్వారా ఆయనకు మరింత దగ్గరయ్యా. ఆయనలో మంచి గాయకుడు మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి కూడా ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో తెలిసింది. ఓ సారి సురభి నాటక సమాజానికి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. దీని కోసం బాలు చేత ఒక పాట పాడించి అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ కింద రూ.50 వేలు ఇచ్చాం. ఆ కార్యక్రమానికి హాజరైన ఆయన సురభి వాళ్ల పేదరికం చూసి రూ.50 వేలు తిరిగిచ్చేశారు. అంతేకాదు మరో రూ.25 వేలు కూడా కలిపి వారికి ఇచ్చారు. ప్రముఖ గాయని జిక్కికి బ్రెస్ట్ కేన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేద్దామని ఆయన్ని రమ్మని పిలిస్తే రాలేకపోయారు. అలాగే ఉడత సరోజినికి సాయం కోసం కూడా ఓ కార్యక్రమం పెడితే కూడా ఏదో అర్జంటు పని వల్ల రాలేనని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఆ కార్యక్రమాల రోజు గుర్తు పెట్టుకుని మరీ రెండు కార్యక్రమాలకూ చెరో రూ.25 వేల చొప్పున పంపించారు. మరో సందర్భంలో గాయని పి.సుశీల ట్రస్ట్ పెట్టి తొలి జాతీయ అవార్డు తన పేరు మీద జానకికి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలు మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడితే రవీంద్రభారతిలో పొద్దున్నే వచ్చి సౌండ్ సిస్టమ్ చెక్ చేసుకున్నాడు. అది తనకు సరిగా లేదని తనకు అలవాటైన సౌండ్ సిస్టమ్‌కి మార్పించారు. అంతేకాదు ఆ సౌండ్ సిస్టమ్‌కి ఖర్చు కూడా తానే భరించారు. రెమ్యునరేషన్‌గా సుశీల రూ.50 వేలు ఇస్తే.. మంచి కార్యక్రమం.. నాకు రెమ్యునరేషన్ వద్దంటూ సున్నితంగా తిరిగిచ్చేశారు. 40ఏళ్ల పాటు వేల సినిమాలకు సితార్ ప్లే చేసిన మిట్టా జనార్దన్ అనే సితార విద్వాంసుడు బాలు తొలిపాట నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు. ఆ కళాకారుడికి ఎవరూ ఏమీ చేయడం లేదు.. గుర్తింపు లేదు అంటూ బాధపడిన బాలు నన్ను పిలిచి అతడి గురించి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టమన్నారు. అంతేకాదు స్పాన్సర్స్‌ని కూడా ఆయనే మాట్లాడి గతేడాది రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ చేసి మిట్టా జనార్దన్‌ని గ్రాండ్‌గా సన్మానించారు. ఏదో శాలువా కప్పి వదిలేయకుండా రూ.లక్ష పెట్టి స్వర్ణకంకణం స్వయంగా కొని తొడిగారు. అంత గొప్ప మానవత్వం ఉన్న మనిషిని కోల్పోవడం కళా.. సాంస్కృతిక రంగానికి తీరని లోటే. – సంజయ్ కిషోర్, సినీ పరిశోధకుడు, సంగమం సంస్థ నిర్వాహకులు ‘గాన గంధర్వ’ ఇచ్చే అదృష్టం దక్కింది.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరంటే వినడానికి చాలా బాధగా ఉంది. ఆయనతో ఉన్న 40 ఏళ్ల పరిచయంతో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కలిసి నిర్వహించడం నా అదృష్టం. బాలు స్ఫూర్తితో ఘంటసాల 24గంటలు కార్యక్రమం 95లో ప్రారంభించి ఇంకా రాష్ట్రం అంతా చేస్తూ వస్తున్నాం. బాలు జన్మస్థలం నాదీ నెల్లూరే. అక్కడ 24గంటల కార్యక్రమం పెట్టినప్పుడు సినారె చేతులమీదుగా ఘంటసాల సావిత్రమ్మ సమక్షంలో.. గాన గంధర్వ బిరుదు అధికారికంగా ఇచ్చాం. ఆయన తొలి పాట పాడి 45 ఏళ్లు అయిన సందర్భంగా 2011 డిసెంబరులో నగరంలోని లలిత కళాతోరణంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు సన్మానాలు వద్దు, టిక్కెట్లు వద్దు అలాగైతేనే వస్తా అన్నారు. అయితే 3గంటల పాటు మీరే పాటలు పాడాలి అని అడిగితే.. సరేనని 28 పాటలు పాడారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. 2014లో విశ్వనాథ్‌కు సన్మానం చేసిన సందర్భంగా బాలు ఆయనకు పాటలాభిషేకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11, 12 తేదీల్లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఘంటసాల 24 గంటల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం వెళ్లారు. అలా ఆయన పాల్గొన్న ఆఖరి ప్రోగ్రాం, ఆఖరి ప్రసంగం సైతం మాకే దక్కింది. స్నేహశీలి ఆయన. ఏమయ్యా రఘరామా అని ప్రేమగా పిలిచేవాడు.. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మాకు తొలుత గుర్తొచ్చే పేరు ఆయనదే. అలాంటి ప్రముఖుడ్ని కోల్పోవడం తీరని లోటు. – రఘురామ్, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ డాక్టరేట్‌తో సత్కరించిన తెలుగు వర్సిటీ నాంపల్లి: గాన గంధర్వుడు, పద్మభూషణ్, డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసింది. 1998లో విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో ఎస్పీ బాలుకు డిలిట్ పురస్కారంతో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. బాలు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల చూపిన ఆదరణ మరువలేనిదని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ అన్నారు. తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని అందంగా పలికి తెలుగు భాషా సంస్కృతికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించిన భాషా ప్రియులుగా, సినీ సంగీత రంగంలో అపారమైన ప్రతిభావంతులుగా నిలిచారని అన్నారు. వారి స్థానం భారతీయ భాషల చలన చిత్రరంగంలో అజరామరంగా కొనసాగుతుందని కీర్తించారు. ఎస్పీ బాలు మృతి పట్ల వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిణి ఆచార్యరెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.సత్తిరెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ జె.అజయ్‌చంద్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన పాటగా మనతో ఉంటారు.. నన్ను పాటల పోటీల్లో ప్రథముడిగా గుర్తించి ప్రోత్సహించారు. అలాంటి ఆయనతోనే నా మొదటి పాట పాడగలగడం, ఆయనతో అనేక చిత్రాల్లో ద్విగళ గీతాలు పాడే అదృష్టం నాకు కలిగింది. మేం స్థాపించిన స్వరమాధురి సంస్థను అనేక రకాలుగా ప్రోత్సహించారు. ఎప్పుడు పిలిచినా వచ్చేవారు. చిత్రపరిశ్రమలో నాకు అన్నగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ఉంటూ నా సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. నాకు గుండెకి సర్జరీ జరిగితే ఇంటికి వచ్చి ధైర్యాన్ని చెప్పారు. ఆయన కేవలం వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానూ మరచిపోలేని మహోన్నతుడు. ఆయన్ను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రలున్నంత వరకూ ఆయన పాట ఉంటుంది. – జి.ఆనంద్, గాయకులు, స్వరమాధురి సంస్థ -
ఒక గళం ఆగిపోయింది...
-
గంధర్వలోకాలకు బాలు..
-
ఊపిరితీస్తున్న సైటోకైన్స్ ఉప్పెన
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రతతో ఆసుపత్రుల్లో చేరేవారిలో కొందరు వెంటిలేటర్‌పైకి వెళ్తుంటారు. వారిలో కొందరు సాధారణస్థితికి చేరుకుంటారు. ఇక నేడో రేపో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించొచ్చని వైద్యులూ నిర్ధారణకు వస్తారు. కానీ, ఒక్కసారిగా తలెత్తే అనారోగ్య సమస్యలతో కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతుంటారు’ అని వైద్య నిపుణులు చెబుతున్నా రు. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలోనూ అలాగే జరిగిందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. కరోనా నుంచి కోలుకొని నెగెటివ్ వచ్చినా, ఎక్మో చికిత్స చేసినా అంతర్గత అవయవాలపై వైరస్ చేసిన దాడితో మృతిచెంది ఉంటారని వైద్యులు అంటున్నారు. కొందరిలో సైటోకైన్స్ ఉప్పెనలా ఉత్పత్తి కావడం వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమో నియా లేదా గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయంటున్నారు. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్ నుంచి మొదట్లో కోలుకున్నా తర్వాత సెకండరీ సైటోకైన్స్ ఉత్పత్తి అవుతాయి. కొందరిలో బాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తాయని చెబుతున్నారు. సైటోకైన్స్ స్ట్రోమ్ అంటే.. ఏదైనా వైరస్ శరీరంలో ప్రవేశించాక దాన్ని నియంత్రించేందుకు శరీరకణాల నుంచి సైటో కైన్స్ అనేవి ఏర్పడతాయి. కరోనాపైనా ఇవే పోరాడుతాయి. అంటే కరోనా నుంచి రక్షించడంలో సైటోకైన్స్దే ప్రధాన పాత్ర. అయితే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైన వారిలో శరీరం ఒక్కోసారి అతిగా స్పందిస్తుంది. దీంతో సైటోకైన్స్ అధికంగా శరీర కణాల నుంచి ఉత్పత్తవుతాయి. వైరస్ నుంచి రక్షించాల్సిన సైటోకైన్సే ఉప్పెనలా ఉత్పత్తి అయి ఇతర అవయవాలపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతిస్తాయి. దీన్నే సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్ అంటారు. అప్పుడు కోలుకున్నట్టే కనిపించినవారు హఠాత్తుగా కుప్పకూలుతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కోలుకున్నాక రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దీంతో గుండె, ఊపిరితిత్తుల్లో ఏదో ఒకటి తీవ్ర ప్రభావానికి గురవుతుందని వెల్లడిస్తున్నారు. ఎక్మో చికిత్స అంటే.. ఎస్పీ బాలుకు ఎక్మో చికిత్స చేశారు. దీనివల్లే ఆయన ఇన్నాళ్లు ఉండగలిగారు. ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబరేన్స్ ఆక్సిజనైజన్ (ఎక్మో) అనేది అత్యాధునిక వైద్య విధానం. కీలక గడియల్లో ఊపిరితిత్తుల పని, గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానమే ఇది.. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్స చేస్తారు. రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకొచ్చి, ఎక్మో అనే యంత్రంలో శుద్ధి చేసి, తిరిగి ఆ మంచి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించడమే దీని ప్రత్యేకత. దీంతో గుండె, ఊపిరితిత్తులు రెండింటికీ పూర్తి విశ్రాంతి చిక్కి అవి త్వరగా కోలుకుంటాయి. అయితే ఒక్కోసారి ఈ చికిత్స వల్ల రక్తస్రావం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇన్ఫెక్షన్లూ రావచ్చు. అలాగే రక్తాన్ని బయటే శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతింటాయి. సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్‌తో ముప్పు.. కొంతమందికి సెకండరీ సైటోకైన్స్ స్ట్రోమ్ వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, గుండెలో సమస్యలు వస్తాయి. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి బహుళ సమస్యలు వచ్చే ప్రమాదముంది. బాలసుబ్రహ్మణ్యానికి చివరి రెండు, మూడ్రోజుల్లో హై ఫీవర్ వచ్చినట్లు సమాచారం. దీంతో డ్యామేజీ జరిగి ఉండొచ్చు. – డాక్టర్ శేషగిరిరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వల్లే.. ఊబకాయం, వయసు మీద పడిన వారిలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువై ఆసుపత్రిపాలైతే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. పైగా ఎస్పీ బాలు ఎక్మో నుంచి బయటకు రాలేదు. అయినా ఈ పరిస్థితి వచ్చిందంటే ఊపిరితిత్తులు తీవ్రంగా డ్యామేజీ అయి ఉండాలి. – రాకేశ్ కలపాల, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆలస్యమైతే సమస్యే.. మొదట్లోనే ఆసుపత్రికి వచ్చినవారు రికవరీ అవుతున్నారు. ఆలస్యమైతేనే సమస్యలు వస్తున్నాయి. ఎస్పీ బాలు ఆసుపత్రికి వచ్చాక ఎక్మో చికిత్స వరకు వెళ్లారు. బ్లడ్ క్లాట్, ఊపిరితిత్తుల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. –డాక్టర్ రాజు, పల్మొనాలజిస్ట్, హైదరాబాద్ సైటోకైన్స్ స్ట్రోమ్ వల్లే.. సైటోకైన్స్ స్ట్రోమ్ వల్ల సమస్యలు వస్తాయి. దాంతో కిడ్నీ, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. బాలసుబ్రహ్మణ్యాన్ని ఎక్మో మెషీన్‌పై కూడా పెట్టారు. కొందరు వైరస్ నుంచి బయటపడినా ఇతర వ్యాధులకు గురవుతారు. రికవరీ అయినా కొందరిలో ఇలాంటివి అరుదుగా వస్తాయి. – కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ చనిపోయేవరకూ బాగానే ఉంటారు.. బాలు కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల ఆయనకు ఎక్మో చికిత్స చేశారు. కానీ ఎక్మోపై రికవరీ తక్కువ. సాధారణంగా చెప్పుకోవాలంటే కొందరి విషయంలో రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దీంతో కిడ్నీ, గుండె ఫెయిల్యూర్ అవుతుంది. కరోనా బాధితులు కొందరు చనిపోయే ముందు వరకు ఫోన్ మాట్లాడినవారున్నారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి -
నరుడి బతుకు నటన... ఈశ్వరుడి తలపు ఘటన
బాలూ ఇళయరాజాల స్నేహం ఈశ్వరుడి తలపు అనిపిస్తుంది. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి దర్శకుడు భారతీరాజా పూనికతో చెన్నై చేరుకున్న ఇళయరాజా అతని ఇద్దరు సోదరులు మొదట బాలూ ట్రూప్‌లోనే చేరారు. ఇళయరాజా బాలు దగ్గర గిటార్ వాయించేవారు. ఆ తర్వాత ఇళయరాజా ‘అన్నక్కిళి’తో సంగీత దర్శకుడుగా మారారు. బాలు–ఇళయరాజాల స్నేహం దాదాపు నలభై ఏళ్ల నాటిది. వారిరువురూ కలిసి గొప్ప పాటలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇచ్చారు. ‘నా ట్యూన్ వల్ల నువ్వు గొప్పవాడివయ్యావ్’ అని ఇళయరాజా అంటే ‘నీ ట్యూన్‌ను నేను పాడటం వల్లే నువ్వు పెద్దవాడివయ్యావ్’ అని బాలు సరదాగా అనుకునేవారు. బాలు–ఇళయరాజా కాంబినేషన్లో వందల పాటలు సంగీత ప్రియులకు స్ట్రెస్ బస్టర్స్‌గా మారాయి. ‘ఇలాగే ఇలాగే సరాగమారితే’ (వయసు పిలిచింది), ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ (మౌనగీతం), ‘ఈ లోకం అతి పచ్చన’ (వసంత కోకిల), సుమం ప్రతి సుమం సుమం (మహర్షి), కీరవాణి (అన్వేషణ), ఉరకలై గోదావరి (అభిలాష), ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ), ఆమని పాడవే హాయిగా (గీతాంజలి) ఎన్ని చెప్పినా మరొకటి మిగిలిపోయే పాట ఉంటుంది. ఇళయరాజా కోసం బాలు గొంతుకు స్ట్రయిన్ ఇస్తూ గీతాంజలిలో ‘నందికొండ వాగుల్లోనా’ పాడారు. ఆయనే మళ్లీ ‘ఇంద్రుడు చంద్రుడు’ కోసం ‘నచ్చిన ఫుడ్డు’ పాటకు గొంతు పోయేలా పాడి ఇబ్బంది పడ్డారు. అయినా ఇళయరాజా కోసం ఇదంతా ప్రేమగా చేసేవారు. ఇళయరాజా కంపోజ్ చేసిన ‘సాగర సంగమం’ పాటలు బాలూకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. అందులోని ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ పాట సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనది. వీరి మధ్యే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ల ఇంట్లో మాట్లాడింది బాలూనే. యస్పీబీ కుమారుడు యస్పీ చరణ్ నిర్మించే సినిమాలకు రాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుంటారు. రాజా మేనల్లుళ్లు వెంకట్ ప్రభు (దర్శకుడు), ప్రేమ్‌జీ అమరన్ (నటుడు–సంగీతదర్శకుడు) కూడా యస్పీ చరణ్‌తో తరచూ సినిమాలు చేస్తారు. ఇలాంటి అనుబంధంలో మనస్పర్థలు లేవా? అంటే ఉన్నాయి. ‘నా పాటలను నా అనుమతి లేకుండా వేదికల మీద పాడొద్దు. పాడితే రాయల్టీ చెల్లించాలి’ అని ఒక సందర్భంలో కోప్పడ్డా కొద్ది రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. బాలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వెంటనే ‘త్వరగా తిరిగిరా బాలూ’ అంటూ చెమర్చిన కళ్లతో ఓ వీడియో పంచుకున్నారు ఇళయరాజా. హీరో ఎవరైనా గొంతు బాలూదే(డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను డబ్బింగ్ ఆర్టిస్టుగా మార్చింది సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తి చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ‘మన్మథలీల’ (1976)లో కమలహాసన్‌కు డబ్బింగ్ చెబుతూ అందులోని ఒక బ్రాహ్మణుడి పాత్రకు బాలు గొంతు సూట్ అవుతుందని చెప్పించారు. ఆ తర్వాత ‘కల్యాణ రాముడు’ (1979) సినిమా నుంచి కమల్ హాసన్‌కు బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. దాదాపు తెలుగులో డబ్ అయిన అన్ని కమల్ సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. వసంత కోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్, గుణ, మైకేల్ మదన్కామరాజు, విచిత్రసోదరులు... ఇవన్నీ ముఖ్యమైనవి. ‘దశావతారం’లో పది కమల్ పాత్రలకు పది విధాలుగా కేవలం రెండున్నర రోజుల్లో డబ్బింగ్ ముగించారు బాలు. హీరో నరేశ్ ‘నాలుగు స్తంభాలాట’కు, హీరో జగపతిబాబు ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాకు బాలు డబ్బింగ్ చెప్పారు. కె.భాగ్యరాజాకు కూడా బాలు గొంతు బాగా సూట్ అయ్యేది. కె.భాగ్యరాజా తెలుగులో డబ్బింగ్ చేసిన ‘డార్లింగ్ డార్లింగ్’, ‘అమ్మాయిలు ప్రేమించండి’, ‘చిన్నరాజా’, ‘నేనూ మీవాడినే’ వంటి సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పి భాగ్యరాజాను తెలుగువారికి దగ్గర చేశారు. తమిళ నటుడు విసు నటించిన తెలుగు సినిమాలు ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు–ఇల్లాలు–పిల్లలు’ సినిమాల్లో విసుకు డబ్బింగ్ చెప్పారు. ‘రుద్రవీణ’లో జెమినీ గణేశన్‌కు చెప్పిన డబ్బింగ్ చాలా ప్రతిభావంతమైనది. ‘అన్నమయ్య’లో సుమన్ శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర ధరిస్తే బాలూయే డబ్బింగ్ చెప్పి ఆయనకు పేరు రావడానికి కారకులయ్యారు. బాలు తమిళంలో నాగార్జునకి, రజనీకాంత్‌కి, బాలకృష్ణకి డబ్బింగ్ చెప్పారు. అన్నింటికి మించి అటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం తెలుగులో డబ్ అయినప్పుడు గాంధీ పాత్రకు ఎంతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు బాలు. అందులో రకరకాల వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల ధ్వని స్వభావంతో చెప్పే తీరు ఔత్సాహికులకు పాఠం లాంటిది. దేశంలోని పది మంది గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టులను లెక్కిస్తే వారిలో బాలు తప్పక వస్తారు. చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు(మిమిక్రీ ఆర్టిస్ట్ బాలు) బాలు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌ను బట్టి, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి పాడి తాను పాడినట్టుగా కాకుండా పాత్ర పాడినట్టుగా అనిపించగలరు. దాసరి తీసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ (1977)లో నటుడు మాడా ‘పేడి’ పాత్ర ధరిస్తే ఆ పాట కోసం బాలూ ‘చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు’ పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. గతంలో కిశోర్ కుమార్ ‘హాఫ్టికెట్’ సినిమా కోసం స్త్రీ,పురుష గొంతుల్లో పాడారు. బాలు కూడా అలా గొంతు మార్చి తన ప్రతిభ చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్ తీసిన ‘మేడమ్’ సినిమా కోసం స్త్రీ వేషంలో ఉన్న రాజేంద్రప్రసాద్ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా మేల్ సింగర్ పూర్తి స్త్రీ గొంతుతో పూర్తి పాట పాడటం ఒక రికార్డ్. అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ‘ముత్యాలు వస్తావా’ పాట పెద్ద హిట్. ‘మనుషులంతా ఒక్కటే’ (1976) కోసం అల్లు రామలింగయ్య, రమాప్రభల మీద చిత్రీకరించిన పాట సినిమా హిట్ కావడానికి ఒక కారణమైంది. కొంచెం ముక్కుతో పాడి అచ్చు అల్లు పాడినట్టే అనిపించారు బాలు. కామెడీ నటులకు బాలు పాడిన పాటలు కూడా హిట్ అయ్యాయి. రాజబాబుకు ‘తాతా–మనవడు’ కోసం ‘సోమా మంగళ బుధ’ పాడారు బాలు. పద్మనాభంకు బాలు పాడిన ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’ (దేశోద్ధారకులు–1973) కూడా పెద్ద హిట్టే. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలో సుత్తి వేలుకు బాలూ పాడిన ‘తందనాన భళ తందనాన’ ఆ సమయంలో ఒక ఉద్వేగగీతంగా నిలిచింది. శుభలేఖ సుధాకర్‌కు ‘రెండు జళ్ల సీత’ కోసం బాలు పాడిన ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’ ఇప్పటికీ ఒక వినోద గీతమే. కామెడీ స్టార్ అలీకి పాడిన ‘చినుకు చినుకు అందెలలో’ (శుభలగ్నం) పెద్ద హిట్. బాలుఅనే శంఖంలో ఎన్నో తీర్థాలు. రాగాలు. రసాలు. అందులో హాస్యరసం కూడా తరించింది. సుశీలమ్మ – బాలు బాలసుబ్రహ్మణ్యం విజయంలో ఆయన వాటా ఎంత ఉందో ఆయనతో పాటు గొంతు కలిపిన సుశీలమ్మ వాటా కూడా అంత ఉంది. బాలూ కంటే ఎంతో సీనియర్ అయినప్పటికీ సుశీలమ్మ బాలూను ప్రోత్సహించారు. బాలు అంత హుషారుగా తనను తాను ఉత్సాహపరుచుకుని యుగళగీతాలు ఆలపించారు. వీరిద్దరి హిట్స్ లెక్కబెట్టే కొలది వస్తూనే ఉంటాయి. ‘మానసవీణ మధుగీతం’ (పంతులమ్మ), ‘ఝుమ్మందినాదం సయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), ‘ఇది పున్నమి వెన్నెల రేయి’ (ప్రేమ లేఖలు), ‘మావిచిగురు తినగానే’ (సీతామాలక్ష్మి), ‘గోరంత దీపం కొండంత వెలుగు’ (గోరంత దీపం), ‘శ్రీరస్తు శుభమస్తు’ (పెళ్లిపుస్తకం) లాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాల జోరు పెరిగి మాస్ సాంగ్స్ కావాలని నిర్మాతలు పట్టుబట్టినప్పుడు, దర్శకులు కోరినప్పుడు సుశీల బాలూతో కలిసి అలాంటి మాస్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చక్రవర్తి ఆమెను ఒప్పించి బాలూతోటి ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’ (డ్రైవర్ రాముడు) పాడించారు. అలాగే వీళ్లద్దరూ ‘వేటగాడు’లో ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ పాడారు. అక్కినేనికి బాలు పాడిన డ్యూయెట్స్‌లో ఎన్నో హుషారైనవి సుశీల పాడారు. వాటిలో ‘ఒక లైలా కోసం’ (రాముడు కాదు కృష్ణుడు), ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న’ (ప్రేమాభిషేకం), ‘తొంగి తొంగి చూడమాకు చందమామా’ (శ్రీరంగ నీతులు)..లాంటివి ఎన్నో ఉన్నాయి. కృష్ణకు ‘ఇదిగో తెల్ల చీర’ (ఊరికి మొనగాడు), శోభన్‌బాబుకు ‘వెల్లువచ్చి గోదారమ్మ’ (దేవత), చిరంజీవికి ‘గోరింట పూసింది’ (ఖైదీ) హిట్ పాటలకు లెక్క లేదు. సుశీల పాడిన ‘పాలకడలిపై శేషతల్పమున’ పాటను పాడి చిన్నప్పుడు పాటల పోటీలో ప్రైజులు తెచ్చుకున్నానని బాలు చాలాసార్లు చెప్పుకున్నారు. -
బాలుపై అభిమానంతో ‘బామా’
కావలి: ఎస్పీబీ అంటే కావలికి చెందిన బ్యాంకు ఉద్యోగి లేబాకుల సుధాకర్‌రెడ్డికి వల్లమానిన అభిమానం. తన అభిమాన గాయకుడి పేరుతో సాంస్కృతిక సేవా సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా వర్ధమాన గాయకులను వెలుగులోకి తీసుకురావాలని సుధాకర్‌రెడ్డి భావించారు. దీంతో ‘బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ’ (బామా) కావలిలో 2004లో పురుడుపోసుకుంది. ఈ సంస్థను బాలు ప్రారంభించారు. చెన్నైలో వైద్యుడిగా స్థిరపడ్డాక ‘కళాసాగర్’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించిన కావలికి చెందిన డాక్టర్ సీఎంకే రెడ్డితో కలసి సుధాకర్‌రెడ్డి.. బాలు వద్దకు వెళ్లి ‘బామా’ను నెలకొల్పడానికి ఒప్పించారు. ఏటా ఈ సంస్థ నిర్వహించే పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి యువతీ యువకులు పాల్గొంటారు. ఇక్కడి పోటీల్లో గెలిచినవాళ్లలో పలువురు సినీ నేపథ్యగాయకులుగా ఉన్నారు. 2013లో జరిగిన ‘బామా’ పదో వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ బాలు పాల్గొన్నారు. -
బాలు వాక్కు బ్రహ్మ వాక్కు!
సాక్షి, హైదరాబాద్: 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు బాలసుబ్రహ్మణ్యం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగిన సాంబమూర్తికి రెండో సంతానం బాలు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలు యుక్త వయసులోనే సంగీతంపట్ల ఆకర్షితుడయ్యారు. తల్లి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేస్తూనే పలు సంగీత పోటీల్లో పాల్గొన్నారు. 1964లో తన తొలి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాతో కలసి ఓ మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. నటుడిగానూ సక్సెస్ ►ఏ హీరోకి పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే బాలు పాటలు పాడారు. విజయవంతమైన గాయకుడు అనిపించుకున్న ఆయన నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1969లో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ►1990లో ‘కేలడి కన్మణి’సినిమా (తెలుగులో ‘ఓ పాపా లాలి’)లో లీడ్ రోల్ చేశారు. ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరోప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ► ‘దేవస్థానం’, ‘మిథునం’చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. బాలచందర్ తమిళ చిత్రం ‘మన్మధ లీలై’తెలుగు డబ్బింగ్ ‘మన్మధ లీల’తో డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. ►కమల్‌హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ వంటి నటులకు గాత్రదానం చేశారు. 1977లో వచ్చిన ‘కన్యా కుమారి’తో సంగీత దర్శకుడిగా మారారు. ►తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 46 సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా ‘యోధ’, ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’, ‘శుభ సంకల్పం’వంటి సినిమాలు నిర్మించారు. ‘హలో బ్రదర్’ను ఆయన బ్యానర్ ద్వారా తమిళంలోకి అనువదించి నాగార్జున పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పారు బాలు. అవార్డులు ►ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1979లో సంగీత ప్రధానంగా వచ్చిన ‘శంకరాభరణం’చిత్రానికిగాను ఆయన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు. ►ఆ తర్వాత 1981లో హిందీ చిత్రం ‘ఏక్ ధూజే కేలియే’, 1983లో ‘సాగర సంగమం’, 1988లో ‘రుద్రవీణ’, 1995లో కన్నడ చిత్రం ‘సంగీత సాగర గానగోయి పంచాక్షర గవై’, 1996లో తమిళ చిత్రం ‘మిన్సార కనవు’చిత్రాలకు జాతీయ అవార్డు అందుకున్నారు. 25 నంది అవార్డులు దక్కాయి. ►భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకుగాను 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’అవార్డు తీసుకున్నారు. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇంకా తమిళ, కన్నడ తదితర రంగాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. తొలి చిత్రం: మర్యాద రామన్న.. కోదండపాణి, పద్మనాభంతో బాలు బాలు కుటుంబం బాలుకు తన దగ్గరి బంధువైన సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పల్లవి, ఎస్.పి. చరణ్. పాటకు ముఖ్యం పల్లవి, చరణం. ఈ రెండూ కలిసొచ్చేట్లుగా తన సంతానానికి పేర్లు పెట్టారు. బాలు తనయుడు ఎస్.పి.చరణ్ గాయకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. బాలు సోదరి ఎస్.పి. శైలజ కూడా గాయని. ఆమె భర్త నటుడు శుభలేఖ సుధాకర్. ఎస్.పి. బాలు తల్లి శకుంతలమ్మ గత ఏడాది ఫిబ్రవరి 4న మరణించారు. కాగా, తండ్రి స్థాపించిన భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభకు బాలసుబ్రహ్మణ్యం శాశ్వత అధ్యక్షుడు. 16 భాషల్లో... సినీ నేపథ్య గాయకుడిగా ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న’(1966) చిత్రం ద్వారా పరిచయమయ్యారు బాలు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు ‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’అని పేరు పెట్టారు బాలు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ.. ఇలా సుమారు 16 భాషల్లో పాటలు పాడారు. వారాల అబ్బాయిగా విద్యాభ్యాసం శ్రీకాళహస్తి/నగరి (చిత్తూరు జిల్లా): అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉండే కోనేటమ్మపేట (ప్రస్తుతం తమిళనాడు)లో జన్మించిన బాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వారాల అబ్బాయిగా ఉండి విద్యాభ్యాసం చేశారు. తొలుత నగరి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండి పీసీఎన్ ప్రభుత్వ హైస్కూల్లో ఎనిమిదో తరగతి వరకూ చదివారు. అక్కడ రాధాపతి అయ్యవారు వద్ద విద్యాభ్యాసం చేశారు. తర్వాత రాధాపతి అయ్యవారు శ్రీకాళహస్తి పానుగంటి రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయనతో పాటే బాలు కూడా శ్రీకాళహస్తి వచ్చి.. 9, 10 తరగతులు, 1960లో ఎస్ఎస్ఎల్సీని పూర్తిచేశారు. రాధాపతి అయ్యవారు వద్ద వారాల అబ్బాయిగా ఉండి చదువుకునేవారు. తన గురువు అంటే బాలుకు ఎనలేని గౌరవం ఉండేది. శ్రీకాళహస్తికి బాలు తండ్రి శ్రీకాళహస్తిలో ఎస్పీ బాలు ఉండగా.. ఆయన తండ్రి ఎస్పీ సాంబమూర్తి కూడా అక్కడికి వచ్చి బొజ్జ కృష్ణదాసు సాయంతో హరికథ చెబుతూ, నాటకాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించేవారు. 1959లో రామదాసు నాటకాన్ని ప్రదర్శించగా.. అందులో బాలు రామదాసు కుమారునిగా అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. మొదటి పాట రికార్డు శ్రీకాళహస్తిలోనే.. శ్రీకాళహస్తిలో రాధాపతి అయ్యవారుతో పాటు జి.బాలసుబ్రహ్మణ్యం అనే సైన్స్ ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన చెన్నై నుంచి తెప్పించిన టేప్ రికార్డర్లో బాలు పాడిన పాట రికార్డు చేశారు. భక్తప్రహ్లాద పాటను అలా తొలిసారిగా రికార్డు చేశారు. తొలిసారిగా తాను సినిమాలో పాడిన పాట రికార్డును బాలు.. తన గురువులకు పంపి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరినీ బాలు తలచుకుంటూ ఉండేవారు. -
విశాఖతో విడదీయలేని అనుబంధం
సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, అప్పటినుండి విశాఖతో ఎనలేని అనుబంధం ఏర్పడింది. ► వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు బాలు హాజరై.. తన గళంతో విశాఖ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. ► స్టీల్‌ప్లాంట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన బాలు.. ‘‘విశాఖ నగరమున వెలసిన ఉక్కు కర్మాగారం, ప్రపంచ పటమున మెరిసిన దేవాలయ శిఖరం’’ అనే పాటని ఆలపించారు. ► 2016 జనవరి 2వ తేదీన సాగరతీరంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి బాలు హాజరై తన గానామృతంలో ప్రజల్ని ఓలలాడించారు. బాలు పాటకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు స్వరకళా సామ్రాట్ బిరుదుని ప్రదానం చేశారు. ► చివరిసారిగా 2019లో ఏయూ కాన్వొకేషన్ హాల్లో నిర్వహించిన ‘సామవేదం పదార్చన–ఎస్పీ బాలు స్వరార్చన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద కైలాసం ఆడియో సీడీని ఆవిష్కరించి.. భక్తి పాటలు ఆలపించారు. ► 2009 డిసెంబర్ 5న బాల సుబ్రహ్మణ్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. ► వీలుదొరికినప్పుడల్లా బాలు భీమిలిలోని ఆనందవనానికి వచ్చి.. సద్గురు కందుకూరి శివానందమూర్తి సన్నిధిలో గడిపేవారు. ► 2009, 2010, 2014లో కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. 2009లో ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని బాలు అందుకున్నారు. ► పాటకు ప్రాణం పోసిన ఎస్పీబీ మరణం.. సంగీతానికి తీరని లోటని పలువురు విశాఖ ప్రముఖులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
బాలు పూర్వీకులు ప్రకాశం జిల్లా వాసులు
ఒంగోలు మెట్రో/కందుకూరు రూరల్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన పూర్వీకులు ఇక్కడి కందుకూరు సమీపంలోని మాచవరం గ్రామానికి చెందినవారు. బాలు తండ్రి సాంబమూర్తి మాచవరం శివాలయంలో అర్చకత్వం చేస్తూ స్కందపురి మాధవ విలాస సభ సంస్థ ద్వారా హరికథలు చెబుతూ జీవనం సాగించినట్టు అక్కడి వారు పేర్కొంటున్నారు. బాల సుబ్రహ్మణ్యం పుట్టిన తర్వాత ఆ కుటుంబం నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. కాగా బాలు మేనత్త జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఉండేవారు. ఈ క్రమంలో బాలు అనేకసార్లు ఈతముక్కల, కొత్తపట్నం గ్రామాలకు వచ్చేవారు. సాంబమూర్తి కుటుంబం మాచవరంలో ఇల్లు అమ్మి వలస వెళ్లిన తర్వాత అప్పుడప్పుడు ఊరు వస్తూ ఉండేవారు. 25వ ఏట బాలసుబ్రహ్మణ్యం ఈ గ్రామానికి వచ్చి శివాలయం ఉత్సవాల్లో పాటలు పాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన అనేక సాంస్కృతిక, కళాసంస్థలు పలుమార్లు బాలును సత్కరించాయి. -
పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి...
గాన సీమకు రారాజు సింహాసనం దిగిపోయాడు. పగ్గాలు విడివడ్డ అశ్వాలకు మల్లే ఏడు స్వరాలు దిశను కోల్పోయి దిక్కులు చూస్తున్నాయి. పల్లవీ చరణాలను నింపుకున్న తెల్ల కాగితాలు చిరిగి ఛిద్రమవుతున్నాయి. అదిగో.. ఆ వంక తలలు మోదుకుంటున్న వాయిద్యాలు.. ఇదిగో.. ఈ పక్క బోరుమంటున్న హార్మోనియం మెట్లు.. ఇంతగా ఘనీభవించిన నిశ్శబ్దం ఎప్పుడూ చూళ్లేదు. ఇంతటి శోకరాగం ఎప్పుడూ వినలేదు. ‘పరవశాన శిరసూగంగా.. ధరకు జారెనా శివగంగా...’ ఏ అమృత వర్షమో కురిసి పాట కళ్లు తెరిస్తే బాగుండు. ఏ దైవనాదమో దిగివచ్చి పాటను మేల్కొలిపితే బాగుండు. ఏ ప్రార్థనా ఫలితమో వెళ్లి సంజీవనిని పెకలించుకు వస్తే బాగుండు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అను గాన గంధర్వుడా.. తెలుగునేల గన్న ప్రియపుత్రుడా.. సంగీత శిఖరమా.. లలిత కళాభాండమా.. తెలుగు వారి ఆకాశాన అనంతమైన నీ పాటలను తారలుగా గుచ్చి వెళ్లిపోయావా.. సెలవు ధన్యుడా.. సెలవు.. తెలుగు పాట నిన్ను సువర్ణ గండపెండేరంలా ధరించి సదా వెలుగుతూ ఉండనీ. సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 51 రోజులపాటు పోరాటం.. ఆగస్టు 5న కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలు ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇతర అనారోగ్య కార ణాలతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. ‘నాకు కరోనా సోకింది, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆందోళన, అభిమానాన్ని అర్థం చేసుకోగలను. పరామర్శించేందుకు దయచేసి ఫోన్ చేయకండి’అని ఆస్పత్రి నుంచి వాట్సాప్ వీడియో విడుదల చేశారు. పది రోజులు సాధారణ స్థితిలో ఉన్న తర్వాత ఆగస్టు 13న ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎక్మో సహాయంతో చికిత్స అందించారు. నెల రోజులుగా బెడ్‌పైనే ఉండడంతో నడుం కింది భాగం చలనం కోల్పోయింది. దీంతో ఫిజియోథెరపీ ప్రారంభించారు. ఫోన్ ద్వారా విదేశీ వైద్యుల సహకారం కూడా తీసుకున్నారు. ఫిజియో థెరపీకి ఆయన శరీరం సహకరించింది. దీంతో క్రమేపీ కోలుకున్నారు. కరోనా పరీక్షలో నెగెటివ్ రావడంతో అందరూ ఆనందించారు. ఊపిరితిత్తుల సమస్య నుంచి నాన్న తేరుకున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ నెల 7న మీడియాకు తెలిపారు. ఈ నెల 5న తన 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణి సావిత్రిని ఆస్పత్రికి పిలిపించుకుని కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. ఆస్పత్రిలో చేరి 50 రోజులు పూర్తయిన దశలో ఈ నెల 23న రాత్రి బాలు ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. బ్రెయిన్ హెమరేజ్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన కుటుంబీకులను వైద్యులు హడావిడిగా ఆస్పత్రికి పిలిపించారు. సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ఎస్పీ చరణ్ ప్రకటించారు. నేడు అంత్యక్రియలు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి నుంచి శుక్రవారం సాయంత్రం బాలు భౌతికకాయాన్ని స్వగృహానికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు, సహచరులు, మిత్రులు అప్పటికే బాలు ఇంటికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి బాలుకు కన్నీటి నివాళులర్పించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు చెన్నై రెడ్‌హిల్స్‌లో ఎస్పీబీకి చెందిన తామరైపాక్కం ఫాంహౌస్‌లో అంత్యక్రియలు జరపాలని తొలుత నిర్ణయించారు. అయితే బాలు ఇంటి వద్దకు చేరుకుంటున్న జన సందోహాన్ని చూసి ప్రభుత్వం కంగారు పడింది. భౌతిక దూరం, మాస్కుల ఆంక్షలను అమలు చేయలేని పరిస్థితి నెలకొనడంతో అందోళనకు గురైన ప్రభుత్వం బాలు పార్థివదేహాన్ని రాత్రికి రాత్రే ఆయన ఫాంహౌస్‌కు తరలించాలని మౌఖికంగా ఆదేశించింది. దీంతో శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక వాహనంలో ఫాంహౌస్‌కు తరలించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాలేను అని అన్నా.. తమిళనాడులో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఎస్పీ బాలు చెన్నై కమదార్ నగర్‌లోని తన స్వగృహంలో అన్ని జాగ్రత్తల మధ్య గడపడం అలవాటు చేసుకున్నారు. తన సినీ జీవిత ప్రస్తానంలో తారసపడిన ప్రముఖుల గురించి రోజుకో వీడియో బులెటిన్ విడుదల చేస్తూ కాలం వెళ్లదీశారు. ఇంతలో విధి వక్రించిందో ఏమో.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు టీవీ చానల్ నుంచి ఆయనకు కబురొచ్చింది. బాలు నేతృత్వంలో సాగే ఒక ధారావాహిక వీడియో షూట్‌కు హాజరు కావాలని ఆ కబురు సారాంశం. ఒకవైపు కరోనా వైరస్ ఉధృతి.. మరో వైపు లాక్డౌన్ ఆంక్షలు.. వెరసి ‘దయచేసీ ఏమీ అనుకోకండి.. రాలేను’అని ఆయన సున్నితంగా నిరాకరించారు. అయితే ఆ టీవీ చానల్ వారు ఒత్తిడి చేశారు. భార్య సావిత్రి, కుమారుడు చరణ్, వ్యక్తిగత కార్యదర్శిని వెంటబెట్టుకుని కారులో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ఆర్కెస్ట్రా ట్రూపులో సుమారు 23 మంది అప్పటికే కరోనా పాజిటివ్‌తో బాధ పడుతున్నట్లు సమాచారం. వీరితో మూడు రోజులపాటు కలిసి కార్యక్రమం పూర్తి చేశారు. తిరిగి చెన్నైకి చేరుకున్న కొద్దిరోజులకే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డా, కొద్ది రోజులకే ఆమె కోలుకున్నారు. పాటల రేడు సంగీత దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశం గొప్ప గాయకుల్లో ఒకరిని కోల్పోయింది. అసంఖ్యాక అభిమానులు పాటల రేడుగా పిలుచుకునే ఆయన గాత్రానికి పద్మభూషణ్‌తో సహా పలు జాతీయ అవార్డులు వచ్చాయి. ఎస్పీ కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. –రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గానామృతం పంచారు ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచీ చాలా పరిచయముంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమ్మోహిత స్వరం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయింది. దేశవ్యాప్తంగా సుపరిచితులు. సుమధురమైన ఆయన గాత్రం, శ్రావ్యమైన సంగీతం దశాబ్దాలపాటు శ్రోతలను సమ్మోహితులను చేశాయి. ఈ బాధాతప్త సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఓంశాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు దిగ్గజ గాయకుడు, సంగీతకారుడు, పద్మభూషణ్ బాలసుబ్రహ్మణ్యం మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. మధురమైన గాత్రం, అసమాన సంగీతంతో ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కుటుంబానికి నా సానుభూతి. ఓం శాంతి. –కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంగీత, కళా రంగాలకు తీరని నష్టం బాలు తన అసమానమైన పాండిత్యం, మనోహరమైన గానంతో వివిధ భాషల్లో 40,000 పాటలను పాడటం ద్వారా ఐదు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ భూమ్మీద సంగీతం ఉన్నంతవరకు ఆయన పాటలు, గానం ప్రజలకు జ్ఞాపకంగా నిలిచిపోతాయి. ఆయన మరణం దేశానికి, సంగీత రంగానికి తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి –గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన లేని లోటు పూడ్చలేనిది ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. –ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా –ఏపీ సీఎం వైఎస్ జగన్ ∙బాలు కుమారుడు చరణ్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆ స్వరం అజరామరం బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పలు భాషల్లో ఆయన పాటలు కోట్లాది మంది మనసులు చూరగొన్నాయి. ఆ స్వరం అజరామరం. ఎస్పీబీ ఆత్మకు శాంతి కలుగుగాక. – రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత శిఖర సమానుడు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో నిర్వివాదంగా శిఖరాగ్రానికి చేరారు బాలు. దేశానికి, సంగీతానికి ఆయన మరణం పూడ్చలేని లోటు. –మాజీ ప్రధాని దేవెగౌడ బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప ప్రజాదరణ పొందిన గాయకుడు. సంగీత దర్శకుడిగా, నటుడిగా రాణించారు. హిందీతో సహా పలు భాషల్లో 40 వేల పైచిలుకు పాటలు పాడారు. సంగీతాభిమానుల గుండెల్లో ఆయన పాటలు చిరకాలం నిలిచిపోతాయి. –బి.ఎస్.యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి అసమాన గాయకుడు సంగీత ప్రపంచానికి తీరనిలోటు. ఎస్పీబీని కేరళీయులు ఎప్పుడూ సొంతవాడిగానే చూశారు. మధురమైన పాటల రూపంలో ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనలో పదిలంగా ఉంటాయి. ఎస్పీబీ అసమాన గాయకుడు. –పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి భారత సంగీత ప్రపంచానికి ఎస్పీబీ దేవుడిచ్చిన వరం. బాలు పాడిన జయలలిత స్వాగత గీతం అన్నాడీఎంకే పార్టీ చరిత్రలో ఎప్పటికీ విడదీయరాని భాగంగా ఉండిపోతుంది. పలు భక్తి గీతాలతో అసంఖ్యాక భక్తుల హృదయాలను గెల్చుకున్నారు. –పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంలో ఒకరిని కోల్పోయాం నాతో పాటు కోట్లాది మంది అభిమానులు కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు భావిస్తున్నాం. పాటల రూపంలో ఆయన చిరంజీవిగా నిలిచిపోతారు. ఉరుకులపరుగులు ఈ ప్రపంచంలో ఎస్పీబీ పాటలు గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. –ఎం.కె.స్టాలిన్, డీఎంకే అధినేత దిగ్గజాన్ని కోల్పోయాం సంగీత సామ్రాజ్యపు దిగ్గజం ఇక లేరనే వార్త కలచివేసింది. బాలసుబ్రహ్మణ్యం అద్భుత గాత్రం తరతరాలకు నిలిచిపోతుంది. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంగీతానికి ఎల్లలు లేవు... గాయక ప్రపంచంలో బాలసుబ్రహ్మణ్యం ఓ అద్భుతం. ప్రాంతాలు, భాషలకు సంగీతం అతీతమని తన సుమధుర గాత్రంతో ఆయన నిరూపించారు. కాలం ఆయనను మనకు దూరం చేసి ఉండొచ్చు... కానీ పాట రూపంలో అమరత్వం పొందారు. – ఉద్ధవ్ థాక్రే, మçహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు జాతి ముద్దుబిడ్డ బాలు.. తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కళాకారులకు, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేశారు. – చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. బహు భాషల్లో వేలాది పాటలు పాడి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయ న మధురమైన పాటలు ఎప్పటికీ మోగుతూనే ఉంటాయి.అశ్రునయనాలతో నివాళితో పాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. –టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బాలు లేని లోటు పూడ్చలేనిది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ, సంగీత రంగానికి పుడ్చలేని లోటు. నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ భాషల్లో అనేక పాటలకు బాలు ప్రాణం పోశారు. బాలు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి –తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఎండీ అర్వింద్ కుమార్ -
ఒకే ఒక్కడు
ఎవరండీ ఈ బాల సుబ్రహ్మణ్యం? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కళ్ళ రిజర్వాయర్లకు రెప్పల గేట్లు ఎత్తించేసి కన్నీటి ప్రవాహాలను దూకిస్తున్న ఆ మనిషి ఎవరండీ? కొన్ని కోట్ల గొంతుకల్లో గుండెల్ని అడ్డం పడేసి గుండెకీ, గొంతుకకీ మధ్య కొట్లాట పెడుతున్న ఆ మహానుభావుడెవరండీ? ఇంట్లో కన్నతండ్రో, బాబాయో, అన్నయ్యో దాదాపు రెండు నెలలుగా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ, అలుపెరగని రీతిలో మృత్యువుతో పోరాడుతుంటే, ఇంట్లోవారు ఎంత తల్లడిల్లిపోతారో, ఎలా బిక్క చచ్చిపోతారో.. అలా ప్రతి ఇంటింటా ఒక ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించిన ఆ జీవన్మరణ పోరాట యోధుడెవరండీ? తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ.. అన్ని భాషల వారినీ కామన్ గా మూగభాషలో ఏడిపిస్తున్న ఆ సకల భాషా పారంగతుడెవరండీ? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్.. ఇలా అన్ని మతాల వారికి సమ్మతమై, తన ఆరోగ్యం కోసం సతమతమవుతూ సర్వమత ప్రార్థనలు చేయిస్తున్న ఆ సకల మానస చోరుడెవరండీ? ఇంతకీ ఎవరండీ ఈ బాల సుబ్రమణ్యం? లక్షలాదిమందిని ఏకతాటి మీద నడిస్తున్న జాతీయ నాయకుడా? కాదు... లక్షలాది గొంతుల్లో తన గానాన్ని పలికిస్తున్న జాతి గాయకుడు. లక్షలాది గుండెల్లోకి చొరబడి అరవై ఏళ్లుగా ఇంకెవరూ కబ్జా చెయ్యలేని గూడు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ చొరబాటుదారుడు ఇంకెవరూ? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే గానగంధర్వుడు. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు ఈ గంధర్వుడు గొంతులో అమృత భాండాన్ని దాచుకుని అవతరించాడు. పేరెంత పొడుగ్గా ఉన్నా ‘బాలు’ అనే రెండక్షరాల ముద్దు పేరుతో మన ఇంటి బాలుడైపోయాడు. దశాబ్దాలుగా తరగని తన గానామృతాన్ని పంచిపెడుతూనే వచ్చాడు. విభిన్న కథానాయకులకు వారి కంఠస్వరంతో ఒదిగిపోతూ తన పాటల్ని పొదిగాడు. కేవలం హీరోలకు మాత్రమే కాదు, హాస్య నటులకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా పాటలు పాడి తన ప్రతి భని నిరూపించుకున్నాడు. ఎన్నో పాత్రలకి గాత్రదానం చేసి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించాడు. ‘‘పాటలు పాడటమే కాదు, పాటలకి బాణీలు కట్టడం కూడా నాకు వచ్చు సుమా’’ అంటూ మన బాలు కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా చేసి తెలుగు ప్రజానీకానికి సూపర్ హిట్ గీతాలు అందించాడు. బాలు సంగీతంలో సవ్యసాచి మాత్రమే కాదు, త్రివిక్రముడిలా నటనా రంగంలో కూడా కాలు మోపి, తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించాడు. సకల కళా వల్లభుడిని అని నిరూపించుకున్నాడు. అమృతం తీపిగా ఉంటుందంటారు. బాలు గానం అమృతమైతే, వినయ విధేయతలతో కూడిన ఆయన వ్యక్తిత్వం తేనెలాంటిది. ఈ రెండూ మేళవిస్తే అదెంత మధురంగా ఉంటుందో బుల్లితెర మీద ఆయన కార్యక్రమాలు లోకానికి చాటి చెప్పాయి. మెడికల్ కాలేజీలు డాక్టర్లని తయారు చేస్తాయి. ఇంజనీరింగు కళాశాలలు ఇంజనీర్లని అందిస్తాయి. కానీ, మన బాలు అనే ఒక సంగీత విశ్వ విద్యాలయం కొన్ని వందల పసి గాత్రాలను లోకానికి పరిచయం చేసి భావి గాయకులుగా తీర్చిదిద్దింది. అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని అక్షరాలు దిద్దిన పసికూనలకి సంగీతంలో ఘ అంటే ఘంటసాల అనీ, సు అంటే సుశీల అనీ, జ అంటే జానకి అని కూడా నేర్పింది. త్యాగయ్య, అన్నమయ్య వంటి వాగ్గేయకారుల గీతాలపై మక్కువ పెంచి వాటి సారాన్ని తెలుసుకునేలా బోధించింది. తన పాటలతో మన మనసులను దోచుకున్న బాలు ఇలాంటి బుల్లితెర కార్యక్రమాలతో అమాంతం మన డ్రాయింగ్ రూములో తిష్ట వేసుకుని మన కుటుంబ సభ్యుడై పోయాడు. యువతరానికి అలనాటి కవుల సాహిత్యం గురించీ, అలనాటి మధుర గీతాల గురించీ ఒక ఉపాధ్యాయుడిలా బోధించిన బాలూకి రెండు చేతులూ ఎత్తి మొక్కడం తప్ప ఇంకేం చెయ్యగలం? మనం బాలు పాటలంటే చెవి కోసుకుంటాం. కానీ బాలు తెలుగు భాష అంటే రెండు చెవులూ కోసుకుంటాడు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో, ఏ పదాన్ని ఎక్కడ విరవాలో, ఎక్కడ ఒత్తులు పెట్టాలో ఆయనకి తెలిసినట్టు మరే గాయకుడికీ తెలియదంటే అతి శయోక్తి కాదు. మాతృభాష తెలుగు సరే, పొరుగు భాషలైన తమిళం, కన్నడం కూడా బాలుకి కరతలామలకం. తెలుగులో పోతన, వేమన పద్యాలూ, సుమతి శతకం కవుల నుంచి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, జాషువా, వేటూరి, సిరివెన్నెల.. ఒకరా, ఇద్దరా, కొన్ని డజన్లమంది కవులు, రచయితల సాహిత్యం ఆయనకి కంఠోపాఠం. అలాగే, తమిళంలో సుబ్రహ్మణ్య భారతి, కన్నదాసన్, వైరముత్తుల సాహిత్యం కూడా ఆయన నాలుక చివరి మీదే ఉంటుంది. సందర్భాన్నిబట్టి ప్రతి కవి గురించీ, వారి సాహిత్య మధురిమల గురించీ ఆయన విశ్లేషించి చెబుతుంటే చప్పట్లు కొట్టనివారెవరు? కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు, కొన్ని వేల ప్రైవేటు లలిత గీతాలు, భక్తి పాటలు కూడా బాలు ఆలాపించి రికార్డు సృష్టించాడు. వివిధ మతాలకు సంబంధించి బాలు పాడిన భక్తి గీతాలు కాలాతీతంగా నిలిచిపోతాయి. వైష్ణవాలయాలలో విష్ణు సహస్ర నామాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలాగో శివాలయాల్లో లింగాష్టకానికి బాలు తప్ప మరో చాయిస్ లేదు. ఇక బాలు పాడిన ఏసయ్య గీతాలు లేకుండా ఏ సువార్త కూటమి సభలూ జరగవు. ఆ విధంగా బాలు గళం అజరామరం. బాలు అంటే ఒక పరవశం. బాలు అంటే ఒక మంత్రజాలం. బాలు అంటే ఒక అద్భుతం. త్యాగరాజు ‘ఎందరో మహానుభావులు’ అంటూ కీర్తించాడు. కానీ, సంగీతాభిమానులు మాత్రం ‘ఒక్కడే మహానుభావుడు’ అని ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటారు. వ్యాసకర్త: మంగు రాజగోపాల్,సీనియర్ జర్నలిస్టు -
సెప్టెంబరు 25.. విషాదం!
సాక్షి, హైదరాబాద్: ‘‘మరణమనేది ఖాయమనీ... మిగిలెను కీర్తి కాయమనీ.. నీ బరువూ... నీ పరువూ... మోసేదీ... ఆ నలుగురూ...’’. జీవిత పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఈ పాటకు తన అద్భుత గాత్రంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం చూరగొన్న ఆ యశస్వి అందరినీ శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగా జన్మించి ఎస్పీ బాలుగా సుపరిచితులై, సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.(చదవండి: నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత) కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆగష్టు 5న ఆస్పత్రిలో చేరిన బాలు, సెప్టెంబరు 25న కన్నుమూశారు. దీంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ‘బాలు’ను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేగాక గతేడాది సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్లో చోటు చేసుకున్న మరో విషాదాన్ని తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేణుమాధవ్ ఈ లోకాన్ని వీడిన రోజు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని హాస్య నటుడుగా కళామతల్లికి తనవంతు సేవ చేసిన వేణుమాధవ్ 2019, సెప్టెంబరు 25న మరణించారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆయన సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. కాగా అంతకుముందు కొద్ది నెలల క్రితమే వేణు మాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కాగా నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్, 1997లో ‘సంప్రదాయం’ సినిమా ద్వారా సిల్కర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. ‘తొలిప్రేమ’ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కమెడియన్‌గా దూసుకుపోతూ, నవ్వులు పూయించిన ఆయనను, ‘లక్ష్మి’ సినిమాలో నటనకు గానూ నంది అవార్డు వరించింది. కాగా వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కూలీల కాళ్లు మొక్కిన ఎస్పీ బాలు!
సాక్షి, హైదరాబాద్: గాన దంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరమపదించినా పాటగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోయారు. తను పుట్టిందే గాత్రదానం చేయడానికని ఆయన నిరూపించారు. 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు ఆలపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ప్రపంచం నలుమూలలా ఉన్న అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేసిన వీడియో బాలు ఇతరులకిచ్చే గౌరవాన్ని, గొప్ప మనసును తెలియజేసిదిగా ఉంది. గతంలో ఓసారి శబరిమలకు వెళ్లిన సమయంలో కొండ ప్రాంతం కావడంతో బాలు ఎక్కువ దూరం నడవలేకపోయారు. దీంతో ఆయన్ను కొందరు కూలీలు డోలీలో ప్రధాన ఆలయం వరకు మోసుకెళ్లారు. అక్కడకు చేరుకోగానే తనను మోసుకొచ్చిన కూలీలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు వారి పాదాలకు నమస్కారం చేశారు. గుడిపాటి చంద్రారెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖరు పాట తెలుసా?) కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యాభై రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 🙏 బాలసుబ్రహ్మణ్యం గారు శబరిమల కు వచ్చినప్పుడు తనను డోలీలో మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టిన మహానుభావుడు🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/e6ip1MWbBI — 🌹CHANDRA REDDY GUDIPATI🌹 (@GsrcgsrReddy) September 25, 2020 (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం) -
ఎస్పీ బాలు మొదటి, చివరి పాట తెలుసా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సింగర్ అవ్వాలని అనుకోలేదు. కానీ గాయకుడిగా మారాక పాటనే ప్రాణంగా ప్రేమించాడు. నటన, నిర్మాణం, డబ్బింగ్ ఇలా ఎన్నింటిలోనూ రంగ ప్రవేశం చేశారు.. కానీ పాటల పల్లకితోనే చివరి వరకూ ప్రయాణం చేశారు. చావు అంచున ఉన్న చివరి క్షణాల్లోనూ పాడుతూ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవాలన్నది ఆయన చివరి కోరిక. మరి ఆయన పాడిన మొదటి పాట, ఆఖరు పాట ఏంటో తెలుసుకుందాం. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం ద్వారా ఎస్పీ బాలుకు తొలిసారి వెండితెరపై ఓ పాట పాడే అవకాశం లభించింది. (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) 1966లో విడుదలైన ఈ సినిమాకు ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు. నటుడు, నిర్మాత పద్మనాభం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో గాయని పి.సుశీలతో కలిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆలపించారు. చివరగా.. గత ఏడాది వచ్చిన 'పలాస 1978' సినిమాలో 'ఓ సొగసరి' అనే పాటను పలాస బేబీతో కలిసి పాడారు. లక్ష్మి భూపాల రాసిన ఈ పాటకు రఘు కుంచె సంగీతం అందించారు. బాలు తన కెరీర్లో 16 భాషల్లో 40 వేల పై చిలుకు పాటలు పాడి, అత్యధిక పాటలు పాడిన సింగర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. (చదవండి: పాట కోసమే ఆయన పుట్టారు..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎస్పీ బాలు భౌతికకాయం తరలింపు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. రేపు (శనివారం) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వరస్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్‌కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది. గాన గంధ్వరుడి ప్రతిమ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శిల్పి రాజకుమార్ వడయార్ శిల్పశాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రూపుదిద్దుకుంటోంది. గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఈ ప్రతిమకు ప్రాణం పోశారు. రాజకుమార్ వడయార్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి పేరు సంపాదించారు. ఎంజీఆర్, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. ఇలా జరగడం బాధ కలిగించింది: కైకాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీపరిశ్రమకు తీరని లోటని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఎస్పీ బాలు నేపథ్య గాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్న సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.