
సాక్షి, హైదరాబాద్ : మహమ్మారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు వైరస్ సోకగా, తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అందరి అశీస్సులతో తొందరలోనే కోలుకుంటానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. (జానకమ్మ క్షేమంగా ఉన్నారు)
Comments
Please login to add a commentAdd a comment