సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్)
ఏం జరిగింది?
గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు.
రూ.కోటి డిమాండ్
ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్‌ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)
Comments
Please login to add a commentAdd a comment