Keeda Cola Movie
-
రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) ఏం జరిగింది? గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు. రూ.కోటి డిమాండ్ ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్‌ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
ఎస్పీ బాలు గొంతు రీక్రియేట్.. మండిపడ్డ ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపాడు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపాడు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాన్న చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు' అని ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: ఇంటర్వ్యూ చేసింది.. ప్రేమలో పడింది.. త్వరలోనే ఏడడుగులు వేయనున్న హీరోయిన్ -
దీపావళి మనసుని హత్తుకుంటుంది
‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. ‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు. -
కీడా కోల, మా ఊరి పొలిమేర 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు భలే క్లిక్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మ్యాడ్ మూవీ జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. శుక్రవారం (నవంబర్ 3న) రిలీజైన కీడా కోలా సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ కామెడీ మూవీని దర్శకనటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగానే కాకుండా కీడా కోలాలో ముఖ్యపాత్రలోనూ నటించాడు. ఈ చిత్రానికి తొలిరోజు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కీడాకోలా తొలి రోజు రూ. 6.03 కోట్లు రాబట్టింది. శని, ఆది వారాల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ 3న సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజైంది. 2021 డిసెంబర్లో ఓటీటీలో రిలీజైన పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్యే ఈ సీక్వెల్ బాధ్యలు భుజాన వేసుకున్నాడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిచ్చిన ఈ మూవీ తొలి రోజు రూ.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కీడా కోల, మా ఊరి పొలిమేర 2 సినిమాలు వీకెండ్లో ఏ మేర కలెక్షన్స్ రాబడతాయో చూడాలి! A BLOCKBUSTER OPENING for the #BlockbusterKeedaaCola 🥁 6.03crs worldwide gross Day 1 Book your tickets now for #KeedaaColahttps://t.co/YynaYuDRr2@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @JeevanKumar459 @IamVishnuOi @RavindraVijay1 pic.twitter.com/ZmMDGxpdKu — Suresh Productions (@SureshProdns) November 4, 2023 Blockbuster Opening - Day 1 World Wide Gross 3 Cr + #Polimera2 💥🎊 pic.twitter.com/58wZCfzO5H — Hanu (@HanuNews) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
‘కీడా కోలా’ మూవీ రివ్యూ
టైటిల్: కీడా కోలా నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, జీవన్ కుమార్, తరుణ్ భాస్కర్, విష్ణు, రవీంద్ర విజయ్ తదితరులు నిర్మాతలు: కె.వివేక్ సుదాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గబాటి దర్శకత్వం: తరుణ్ భాస్కర్ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్ ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ విడుదల తేది: నవంబర్ 3, 2023 కథేంటంటే.. వాస్తు(చైతన్య రావు)కి నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పెరెంట్స్ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్)ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో కీడాకోలా(శీతల పానీయం)బాటిల్లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్‌కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తాడు. మరోవైపు వీధి రౌడీ జీవన్(జీవన్ కుమార్) తనకు జరిగిన అవమానంతో.. ఎలాగైన కార్పోరేటర్ కావాలనుకుంటారు. 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్)తో తన కోరిక ఏంటో చెబుతాడు.దాని కోసం రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని భావించి.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి? కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? ఈ రెండు గ్యాంగులతో ఆ కంపెనీ యజమాని(రవీంద్ర విజయ్) కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? చివరకు చేసిందేంటి? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘కీడా కోలా’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తరుణ్ భాస్కర్ గత సినిమాలు(పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది) చూస్తే.. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. అలాంటి పాత్రల్ని, కొన్ని సన్నివేశాలను నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తి భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్‌ని పక్కకి పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇదొక రోటీన్ క్రైమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టిన మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు కానీ..నవ్వించే సీన్లకు కొదవ ఉండదు. వాస్తు, లంచం పాత్రలని పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వెంటనే జీవన్ గ్యాంగ్‌ని పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగుల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీని మొదట్లోనే ఇచ్చాడు. ఆ ఏరియా కార్పోరేటర్ జీవన్ పోస్టర్ని డిజైన్ చేసిన సీన్‌తో నవ్వులు ప్రారంభం అవుతాయి. నాయుడి పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్ అంటూ నాయుడు పాత్ర పండించే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కకి పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ని ముగించేశాడు. ఇక సెకండాఫ్‌లో కథనం ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయితే పార్ట్ పార్టులుగా వచ్చే సీన్లు నవ్విస్తాయి. కీడా కోలా యాడ్‌లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ లాగినట్లు అనిపిస్తుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య వచ్చే ‘ సరెండర్ ’ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. షూటర్స్ లోపాలు, బొమ్మతో నాయుడు ప్రేమాయణం.. ఇవన్నీ ఆకట్టుకున్నా.. చెప్పుకోదగ్గ కథ లేదనే వెలితిమాత్రం ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తరుణ్ భాస్కర్లో మంచి నటుడు ఉన్నాడు. గతంలో పలు చిత్రాల్లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఇందులో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. నాయుడు పాత్రలో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పైకి నవ్విస్తూనే..అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చే పాత్ర తనది. వాస్తు పాత్ర కోసం చైతన్య రావు పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకి రాగ్ మయూర్ న్యాయం చేశాడు. ‘మ్యాడ్’ఫేమ్ విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మానందం పాత్ర వీల్ ఛైర్‌కే పరిమితం అయినా.. సందర్భానుసారం నవ్విస్తుంది. జీవన్ కుమార్, రవీంద్ర విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక తరుణ్ గత సినిమాల మాదిరే కీడా కోలా కూడా సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉంది. ఏజే అరోన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. పాటలు కథలో భాగంగా అలా వచ్చిపోతాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి.. సెన్సార్ వాళ్లకు పని తగ్గించాడు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా నిడివి(రెండు గంటలు)తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కీడా కోలా’ ప్రీ రిలీజ్ వేడుకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
మమ్మల్ని కలిపింది అదే.. త్వరలో మా కాంబోలో సినిమా!
‘‘నేను, దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా వేర్వేరు చోట్ల పెరిగాం. మా నేపథ్యాలు వేరు.. మమ్మల్ని సినిమా కలిపింది. ‘పెళ్ళి చూపులు’తో నన్ను హీరోగా పరిచయం చేశాడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’తో కొందరు కొత్తవాళ్లకు కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’లోనూ ప్రతిభ ఉన్న కొత్తవాళ్లు కనిపిస్తున్నారు. తరుణ్‌కి తనపై, తన కథలపై చాలా నమ్మకం. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను. ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం తను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. రానా సమర్పణలో కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీనాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘తరుణ్ భాస్కర్‌పై ఉన్న నమ్మకంతో చెబుతున్నా.. ‘కీడా కోలా’ మజా ఇస్తుంది. తర్వలో మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది’’ అన్నారు. సీనియర్ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘డైరెక్టర్ జంధ్యాలగారి సినిమాలు చేస్తున్నప్పుడు వినోదం ఎంత హాయిగా పండిందో మళ్లీ ‘కీడా కోలా’కి అలాంటి అనుభూతి కలిగింది’’ అన్నారు. ‘‘నా ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల విడుదలప్పుడు చిన్న భయం ఉండేది. ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు థియేటర్ బయటే తిరిగేవాడిని. ‘కీడా కోలా’ విషయంలో ఆ భయం లేదు’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘రెండు గంటల ΄ాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు నిర్మాతలు సాయికృష్ణ గద్వాల్, శ్రీ΄ాద్. -
‘వాస్తు’ కోసం బాగా ప్రాక్టీస్ చేశా! : చైతన్యా రావు
చైతన్యా రావు, బ్రహ్మానందం, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రానా సమర్పణలో కె. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఓ కీల్ రోల్ చేసిన చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో టూరెట్ సిండ్రోమ్ (నత్తిగా మాట్లాడటం, మాట్లాడుతున్నప్పడు మధ్యలో ఆగడం)తో ఇబ్బందిపడే వాస్తు పాత్ర చేశాను. మనకు ఓ సమస్య ఉన్నప్పటికీ, అందరిలానే మాములు జీవితం గడపొచ్చనేది నా పాత్రలో ఉన్న సందేశం. యూ ట్యూబ్ వీడియోలు, హాలీవుడ్ సినిమాలు చూసి వాస్తు పాత్రకు ప్రాక్టీస్ చేసుకుని ఆడిషన్‌కు వెళ్లాను’’ అని అన్నారు. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్‌లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్‌లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్‌గారితో సురేష్ ప్రొడక్షన్స్‌లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్
పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్‌తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7 — Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023 -
ఆ రోజు కీడా కోలా
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్ -
తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం
అతడు థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'కీడా కోలా' సినిమాతో బిజీగా ఉన్నాడు. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులోనూ కీలకపాత్రలో నటించాడు. ఇప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. నటుడు హరికాంత్.. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు. అలా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో వచ్చాడు. ప్రస్తుతం 'కీడా కోలా'లో ఓ పాత్ర చేస్తున్నాడు. టీజర్ లో అతడికి సంబంధించిన షాట్ మీరు చూడొచ్చు. శనివారం ఉదయం అతడికి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్ఓ ఒకరు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటున్నారు. A hardworking theater artist turned actor (Keeda Cola & other films) 33-year old Harikanth passed away today in the early hours due to cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/6FbP9sjwwE — Vamsi Kaka (@vamsikaka) July 1, 2023 (ఇదీ చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?)