కీడా కోల‌, మా ఊరి పొలిమేర 2.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే? | Keedaa Cola Movie And Maa Oori Polimera 2 Movie Box Office Collection Day 1 - Sakshi
Sakshi News home page

కీడా కోల‌, మా ఊరి పొలిమేర 2.. ఏ సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్స్ అంటే?

Published Sat, Nov 4 2023 8:03 PM | Last Updated on Sat, Nov 4 2023 10:37 PM

Keedaa Cola, Maa Oori Polimera 2 Movie First Day Collection - Sakshi

ఈ మ‌ధ్య కాలంలో కామెడీ సినిమాలు భ‌లే క్లిక్ అవుతున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన మ్యాడ్ మూవీ జ‌నాల‌ను పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వించింది. శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 3న‌) రిలీజైన కీడా కోలా సినిమా కూడా అదే కోవ‌లోకి వ‌స్తుంది. ఈ కామెడీ మూవీని ద‌ర్శ‌కన‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా త‌ర్వాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

ద‌ర్శ‌కుడిగానే కాకుండా కీడా కోలాలో ముఖ్య‌పాత్ర‌లోనూ న‌టించాడు. ఈ చిత్రానికి తొలిరోజు భారీగా వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కీడాకోలా తొలి రోజు రూ. 6.03 కోట్లు రాబ‌ట్టింది. శ‌ని, ఆది వారాల్లో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు న‌వంబ‌ర్ 3న స‌త్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజైంది. 2021 డిసెంబ‌ర్‌లో ఓటీటీలో రిలీజైన పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్‌గా తెర‌కెక్కింది.

తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డాక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్‌యే ఈ సీక్వెల్ బాధ్య‌లు భుజాన వేసుకున్నాడు భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిచ్చిన‌ ఈ మూవీ తొలి రోజు రూ.3 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కీడా కోల, మా ఊరి పొలిమేర 2 సినిమాలు వీకెండ్‌లో ఏ మేర క‌లెక్ష‌న్స్ రాబ‌డ‌తాయో చూడాలి!

చ‌ద‌వండి: శోభ సేఫ్‌, తేజ ఎలిమినేట్‌.. చేసిన పాపం ఊరికే పోతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement