Maa Oori Polimera- 2
-
'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!
గత కొన్నేళ్ల కాలంలో హారర్ స్టోరీల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా 'పొలిమేర'. అంచనాల్లేకుండా రిలీజై అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇదివరకే రెండు భాగాలు రాగా.. రీసెంట్‌గానే మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగానే పార్ట్ 2 నిర్మించిన నిర్మాత మూడో భాగాన్ని తీస్తున్న నిర్మాతపై పోలీస్ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ )తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెప్ట్‌తో తీసిన 'మా ఊరి పొలిమేర' సినిమా.. 2021లో నేరుగా ఓటీటీలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. దీంతో రెండో భాగాన్ని గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయి. రెండో భాగానికి గౌరి కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా, నందిపాటి వంశీ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. నిర్మించింది తానే కాబట్టి వచ్చిన లాభాల్లో షేర్ కావాలని అడుగుతుంటే.. చంపేస్తానని తనని వంశీ బెదిరిస్తున్నాడని కృష్ణప్రసాద్ తాజాగా హైదారాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 'పొలిమేర 2 మూవీ రిలీజ్ తర్వాత రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ ఇప్పటివరకు నాకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదు. నా షేర్ నాకు కావాలని డిమాండ్ చేస్తూ తనని కలిశాను. కానీ నన్ను చంపేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు' అని నిర్మాత కృష్ణ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య లాంచ్ అయిన మూడో భాగానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది వంశీనే కావడం ఇక్కడ ట్విస్ట్!(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్) -
Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ హీరోయిన్‌కి అరుదైన పురస్కారం
-
ఎన్నికల బరిలో టాలీవుడ్ నటి.. నామినేషన్ దాఖలు
టాలీవుడ్ నటి దాసరి సాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆమె నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న దాసరి సాహితి.. హీరోయిన్గా కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. అదే సినిమా సీక్వెల్లో సత్యం రాజేష్‌ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అవకాశాలు రావాలే గానీ తన సత్తా ఏంటో చూపించే టాలెంట్ ఈ బ్యూటీలో ఉంది.తాజాగా దాసరి సాహితి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేశారు.అయితే, చేవేళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తున్న సమయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్‌కు సాహితి నామినేషన్ సమర్పించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
చిరంజీవితో సినిమానా..? నా వల్ల కాదబ్బా: డైరెక్టర్
కరోనా సమయంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఓటీటీలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా 'మా ఊరి పొలిమేర'. దీంతో దీని సీక్వెల్ 'పొలిమేర-2'ను భారీ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. నవంబర్ 3న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించగా.. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. పొలిమేర-2 చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని చాలా మంది డైరెక్టర్లకు కోరిక ఉంటుంది. ఆ అవకాశం వస్తే అదొక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు.. కానీ ఆ ఇంటర్వ్యూలో అనిల్ విశ్వనాథ్‌కు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఛాన్స్ వస్తే చిరంజీవితో సినిమా చేస్తారా? అని. అందుకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.. మెగాస్టార్‌తో సినిమా నా వల్ల కాదు 'నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని.. నన్ను మించిన అభిమాని ఆయనకు మరోకరు ఉండరేమో.. ఆయనంటే నాకు చెప్పలేనంత అభిమానం. నేను డైరెక్ట్ చేసిన సినిమాను చిరంజీవి గారు చూసి.. బాగుంది అని నన్ను అభినందిస్తే చాలు.. ఆ మాటతోనే సినిమాలు తీయడం ఆపేస్తాను. అదొక నాకు అచీవ్మెంట్. నాకు ఈ గౌరవం దక్కితే చాలు. ఏ అవార్డులు, రివార్డులు వద్దు. భవిష్యత్‌లో పొలిమేరకు మించిన సినిమా తప్పకుండా తీస్తాను. అప్పుడు నన్ను చిరంజీవి గారు గ్యారెంటీగా పిలిపించుకుని అభినందిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. కానీ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే.. నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే..? డైరెక్టర్ అనేవాడు షూటింగ్ సమయంలో ఏదీ బాగుందో..? లేదో.. ? చెప్పాలి. కానీ చిరంజీవి గారి విషయంలో ఏది చేసినా నాకు నచ్చుతుంది. అలాంటప్పుడు కెమెరా ముందు ఆయన యాక్టింగ్‌ని చూసి నేను జడ్జ్ చేయలేను. కాబట్టి ఆయన అవకాశం ఇచ్చినా.. నేను చేయలేనని చెబుతాను. నాకు గ్యాంగ్‌లీడర్ సినిమా అంటే చాలా ఇష్టం.. ఇప్పటి వరకు ఆ సినిమాను 70 సార్లు చూశాను.' అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు. -
పొలిమేర సినిమాలో ఉన్న గుడి ఎక్కడ ఉంది..? అసలు చరిత్ర ఇదే!
‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా పొలిమేర-2 విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పార్ట్-1లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా ఇది. పార్ట్-2లో అన్నీ రివీల్ చేస్తాడు దర్శకుడు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. లింక్ ఉందని.. అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక చక్కట కథాంశంతో దర్శకుడు చూపించాడు. సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు.. కానీ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది. మాధవరాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం . అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేది. దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో రాధేశ్యామ్,సైరా నరసింహారెడ్డి, ఇండియన్-2,మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. గుడి చరిత్ర ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు సూచిస్తుంది. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ (లార్డ్ కృష్ణుడు) దేవుడికి నమస్కరించి, దేవుడికి మాల ( తోమాల ) సమర్పించారని వీటిలో పేర్కొంది. ఆ గుడిలో నిధులు ఉన్నాయా..? మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్ ఉందని గుడికి లాక్ చేసి ఉంచుతారు. టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని.. మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి. -
‘మా ఊరిపొలిమేర 2’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పొలిమేర 3 ట్విస్టులు మీ ఊహకు అందదు
-
ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!) -
కీడా కోల, మా ఊరి పొలిమేర 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు భలే క్లిక్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మ్యాడ్ మూవీ జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. శుక్రవారం (నవంబర్ 3న) రిలీజైన కీడా కోలా సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ కామెడీ మూవీని దర్శకనటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగానే కాకుండా కీడా కోలాలో ముఖ్యపాత్రలోనూ నటించాడు. ఈ చిత్రానికి తొలిరోజు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కీడాకోలా తొలి రోజు రూ. 6.03 కోట్లు రాబట్టింది. శని, ఆది వారాల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ 3న సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజైంది. 2021 డిసెంబర్లో ఓటీటీలో రిలీజైన పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్యే ఈ సీక్వెల్ బాధ్యలు భుజాన వేసుకున్నాడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిచ్చిన ఈ మూవీ తొలి రోజు రూ.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కీడా కోల, మా ఊరి పొలిమేర 2 సినిమాలు వీకెండ్లో ఏ మేర కలెక్షన్స్ రాబడతాయో చూడాలి! A BLOCKBUSTER OPENING for the #BlockbusterKeedaaCola 🥁 6.03crs worldwide gross Day 1 Book your tickets now for #KeedaaColahttps://t.co/YynaYuDRr2@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @JeevanKumar459 @IamVishnuOi @RavindraVijay1 pic.twitter.com/ZmMDGxpdKu — Suresh Productions (@SureshProdns) November 4, 2023 Blockbuster Opening - Day 1 World Wide Gross 3 Cr + #Polimera2 💥🎊 pic.twitter.com/58wZCfzO5H — Hanu (@HanuNews) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
‘మా ఊరి పొలిమేర 2’ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
Kamakshi Bhaskarla: పొలిమేర-2 హీరోయిన్ ‘కామాక్షి భాస్కర్ల’ (ఫోటోలు)
-
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ రివ్యూ
టైటిల్: మా ఊరి పొలిమెర2 నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు నిర్మాతలు: గౌరీ కృష్ణ దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి ఎడిటింగ్ : శ్రీ వర విడుదల తేది: నవంబర్ 3, 2023 రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ.. ఊహించని విజయం సాధించడమే కాకుండా..సీక్వెల్‌పై ఆసక్తిని పెంచింది. అందుకే ‘మా ఊరి పొలిమేర 2’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సీక్వెల్‌ని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ని నిర్వహించారు. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 3)థియేటర్స్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘మా ఊరి పొలిమెర’ మూవీ క్లైమాక్స్‌లో కొమురయ్య అలియాస్ కొమిరి(సత్యం రాజేశ్) బతికి ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అతను చేతబడి చేసి చంపిన గర్భవతి కవిత(రమ్య) కూడా బతికున్నట్లు, కొమిరితో కలిసి వెళ్లినట్లు చూపిస్తూ ముగించారు. అక్కడ నుంచి పార్ట్ 2 కథ ప్రారంభం అవుతుంది. చేతబడి చేస్తూ ఊరి సర్పంచ్, అతని కూతురు చావులను కారణమైన కొమురయ్యను పట్టుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు, కానిస్టేబుల్ జంగయ్య(బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. జంగయ్య మిస్సింగ్ కేసు కొత్తగా వచ్చిన ఎస్సై(రాకేందు మౌళి) చేతికి వెళ్తుంది. అతను కొమురయ్య భార్య లక్ష్మీ(కామాక్షి భాస్కర్ల), స్నేహితుడు బలిజ(గెటప్ శ్రీను)లను అనుమానిస్తాడు. ఓ సారి శబరి వెళ్లిన బలిజకు కొమిరి కనిపిస్తాడు. అతన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని బలిజకు వివరిస్తాడు కొమురయ్య. అసలు కొమురయ్య ఎందుకు కేరళ వెళ్లాడు? చనిపోయిన రమ్య మళ్లీ ఎలా బతికొచ్చింది? బలిజ భార్య రాముల(సాహితి దాసరి) ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఆ ఊరిలో ఉన్న గుడి వందేళ్ల కిత్రం ఎందుకు మూసేశారు? ఆ గుడికి కొమిరి చేతబడులకు ఉన్న సంబంధం ఏంటి? అన్న కోసం వెళ్లిన జంగయ్య ఎలా మిస్ అయ్యాడు? భర్త కొమురయ్య గురించి లక్ష్మీ తెలుసుకున్న నిజాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘మా ఊరి పొలిమేర 2’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్(చేతబడి) అంశాన్ని జోడించి తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ అందరిని భయపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ అంటే.. అంతకు మించిన ట్విస్టులు, భయపెట్టే సీన్స్ ఉంటాయని అంత భావించారు. కానీ అలాంటి అంచనాలతో వెళ్లిన ఆడియన్స్‌ని ‘మా ఊరి పొలిమేర 2’ అంతగా ఆకట్టుకోదు. మొదటి భాగానికి వచ్చిన హైప్ వల్ల దర్శకుడిపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించింది. ఆడియన్స్‌కి ఊహించని ట్విస్టులు ఇవ్వాలనుకొని కథ, కథనంపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చేతబడి సీన్స్ బాగున్నప్పటికీ.. పార్ట్ 1లోలాగా కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలనుకొనే..టిస్టులను రాసుకున్నాడు కానీ అవి కథకు ఏ మేరకు అవసరమనేది పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం కారణంగా..ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఏర్పడుతుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా.. పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే. పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2ని ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి.. కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. కొమురయ్య, బలిజ కలిశాక వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. అసలు కవిత ఎలా బతికొచ్చింది? ఎందుకు చేతబడి చేయాల్సి వచ్చింది? అతని కలలోకి ఊర్లో ఉన్న గుడి రహస్యాలు ఎందుకు వస్తున్నాయి? అనే సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. గుడిలో కొమురయ్య చేసే పూజకు సంబంధించిన సీన్ భయపెడుతుంది. పార్ట్ వన్‌లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే.. ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. దీంతో కథ కాస్త ‘కార్తికేయ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. పార్ట్ 1లో లాగే పార్ట్ 2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి.. వాటిని సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశాడు. ఎవరెలా చేశారంటే.. కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ ఒదిగిపోయాడు. పార్ట్ 1లో నటించిన అనుభవం ఉంది కాబట్టి.. ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేర నటించాడు. అయితే పార్ట్ 1తో పోలిస్తే.. ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువ. బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది
‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
'Maa Oori Polimera 2': ‘మా ఊరి పొలిమేర -2’ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అలా చేస్తే నన్ను చేతబడుల దర్శకుడు అంటారు: 'పొలిమేర 2' డైరెక్టర్
'మాఊరి పొలిమేర' సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న డా.అనిల్ విశ్వనాథ్.. ఇప్పుడు దానికి సీక్వెల్‌తో రాబోతున్నారు. 'మా ఊరి పొలిమేర 2' నవంబరు 3న థియేటర్లలోకి రానుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు ఇందులో లీడ్ రోల్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ అనిల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) కథ రాసుకున్నప్పుడే కచ్చితంగా సీక్వెల్ చేద్డామని అనుకున్నాం. పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప 'కార్తికేయ' సినిమాకు మా దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్‌లు వుంటాయి. అలానే పొలిమేర 3 కూడా ఉంటుంది. దీనికి కథ సిద్ధంగా ఉంది. అయితే మూడో పార్ట్ కంటే మరో సినిమా చేస్తాను. లేదంటే నన్ను చేతబడుల దర్శకుడు అంటారేమో! (నవ్వుతూ) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) -
పొలిమేర 3 ఉంటుంది
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల, ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను పంపిణీదారుడు వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన వేడుకకు అతిథులుగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత ‘బన్నీ’ వాసు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ తరహా సినిమాలను థియేటర్స్‌లో చూస్తే ఆడియన్స్ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. ‘‘పొలిమేర 1’ మాదిరి ‘పొలిమేర 2’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘ఫస్ట్ పార్ట్ చూడనివారికి కూడా ‘పొలిమేర 2’ స్క్రీన్‌ప్లే అర్థం అవుతుంది. ‘పొలిమేర 3’ కూడా ఉంటుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘పొలిమేర’కు మించి ‘పొలిమేర 2’ ఉంటుంది. సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. -
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు
'మా ఊరి పొలిమేర' కరోనా సమయంలో హాట్‌స్టార్ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేంద్ మౌళి, బాలాదిత్య తదితరులు నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. భారీ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బన్నీవాసు, హీరో కార్తికేయ హాజరయ్యారు. వారందరి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్షుద్రపూజల చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. మొదటి భాగంలో భారీ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు 'మా ఊరి పొలిమేర 2' సీక్వెల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు పెట్టారో ట్రైలర్లోనే తెలిసిపోతుంది. నవంబర్ 3న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈసారి మాత్రం ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లే చూడాలి. ఆ తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారు. -
Maa Oori Polimera 2 : కవిత ఎలా బతికొచ్చిందో తెలిసేది ఆ రోజే!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోన సమయంలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ని చిత్రబృందం వెల్లడించింది. ‘మా పూరి పొలిమేర-2’ ఈ సారి డైరెక్ట్‌గా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. కవిత ఎలా బతికొచ్చింది? మొదటి భాగంలో కొమిరి(సత్యం రాజేశ్)..గర్భిణి కవిత(రమ్య) బంధువుల చెతిలో దెబ్బలు తిని, ఆమె చితిలోనే పడి చనిపోయినట్లు చూపించారు. అయితే చితిలో పడి చనిపోయింది కొమిరి కాదని ఆయన తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) గుర్తిస్తాడు. క్లైమాక్స్‌లో కొమిరి కేరళలో ఉన్నట్లు చూపించారు.అంతేకాదు చనిపోయిన కవిత కూడా బతికే ఉన్నట్లు, కొమిరితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ.. శుభం కార్డు వేశారు. అసలు చనిపోయిన గర్భిణి ఎలా బతికొచ్చింది? అనేది తెలియాలంటే నవంబర్ 2 థియేటర్స్‌లో ‘పొలిమేర-2’చూడాల్సిందే. అంచనాలకు తగ్గట్టే సీక్వెల్ మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత గౌరికృష్ణ అన్నారు. `గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించాం. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది’అని దర్శకుడు విశ్వనాథ్ అన్నారు.